సెప్టెంబర్ 6న భారత్‌లో లాంచ్ కానున్న Moto G54 5G; రివీలైన ధర!

Highlights

  • సెప్టెంబర్ మొదటివారంలో లాంచ్ కానున్న 2 మోటోరోలా ఫోన్స్
  • 1 వ తేదీన లాంచ్ అవుతోన్న Moto G84 5G
  • 6 వ తేదీన లాంచ్ కానున్న Moto G54 5G

సెప్టెంబర్ మొదటి వారం మోటోరోలా అభిమానులకు అద్భుతంగా ఉండబోతోంది. Moto G84 5G రేపు అంటే సెప్టెంబర్ 1న భారతదేశంలో లాంచ్ అవుతోంది. మరో కొత్త మొబైల్ Moto G54 5G సెప్టెంబర్ 6న భారతదేశంలో లాంచ్ కానుందని తాజాగా వార్తలు వచ్చాయి. ఇటీవల, ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క అన్ని వివరాలు మోటోరోలా ఇండియా యొక్క అధికారిక వెబ్‌సైట్ ద్వారా బయటకు వచ్చాయి. ఈ రోజు Moto G54 5G ధర రిలయన్స్ డిజిటల్ ద్వారా వెల్లడైంది.

Moto G54 5G ధర (లీక్)

Moto G54 5G ఫోన్ రిలయన్స్ ఆన్‌లైన్ డిజిటల్ స్టోర్‌లో జాబితా చేయబడింది. ఇక్కడ ఫోన్ యొక్క ర్యామ్ వేరియంట్లు మరియు ధర గురించి సమాచారం వెల్లడైంది. Moto G54 5G రెండు వేరియంట్లలో అమ్మకానికి అందుబాటులో ఉంటుందని లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది. దీని 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ. 14,999 మరియు 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ధర రూ. 18,999 గా ఉన్నాయి. విశేషమేమిటంటే, రిలయన్స్ డిజిటల్ యొక్క ఈ జాబితాను మొదట గిజ్మోచైనా గుర్తించింది. అది ఇప్పుడు తీసివేయబడింది.

Moto G54 5G స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Moto G54 5G స్మార్ట్ ఫోన్ లో 20:9 యాస్పెక్ట్ రేషియో, 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, పంచ్-హోల్ కటౌట్, ఎల్సీడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • చిప్సెట్: Moto G54 5G డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7020 ఆక్టా-కోర్ ప్రాసెసర్ వాడనున్నారు. గ్రాఫిక్స్ కోసం ఐఎంజీ బీఎక్స్ఎమ్-8-256 జీపీయూ వినియోగిస్తున్నారు.
  • ర్యామ్, స్టోరేజీ: Moto G54 5G డివైజ్ 128జిబి స్టోరేజీ, 8జిబి ర్యామ్ మరియు 256జిబి స్టోరేజీ, 12జిబి ర్యామ్ వేరియంట్స్ లో లాంచ్ కానుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని 1టిబి వరకు పెంచుకోవచ్చు.
  • ఓఎస్: Moto G54 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 14 అప్డేట్ రెడీ ఫోన్. ఇంకా 3 ఏళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్ కూడా ఈ ఫోన్ కి వస్తాయి.
  • కెమెరా: Moto G54 5G డివైజ్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ సెన్సర్, 8ఎంపి మ్యాక్రో + డెప్త్ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించనున్నారు.
  • బ్యాటరీ: Moto G54 5G డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది టర్బోచార్జ్ టెక్నాలజీతో వస్తోంది. పూర్తిగా చార్జ్ అయ్యేందుకు కేవలం కొన్ని నిమిషాల సమయం పడుతుందని కంపెనీ చెబుతోంది.
  • ఇతర ఫీచర్లు: Moto G54 5G డివైజ్ 14 5జీ బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ఐపీ52 రేటింగ్, 3.5ఎంఎం ఆడియో జాక్, ఎఫ్ఎమ్ రేడియో, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ వంటి ఫీచర్లతో వస్తోంది.
Previous articleBSNL Plans: రూ.300 లోపు బెస్ట్ బీఎస్ఎన్ఎల్ ప్లాన్స్
Next articleలాంచ్‌కి ముందు లీకైన Moto G84 5G ధర
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.