Motorola Razr 2023 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 06 Apr 2023 11:44:36 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 టీడీఆర్ఏ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించిన Motorola Razr Plus 2023 https://www.91mobiles.com/telugu/motorola-razr-plus-2023-appears-on-tdra-and-rel-certification-websites/ Thu, 06 Apr 2023 11:44:36 +0000 https://www.91mobiles.com/telugu/?p=5782 మోటోరోలా సంస్థ త్వరలోనే Motorola Razr+ 2023 డివైజ్ ని లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ డివైజ్ త్వరలోనే చైనాలో ఎంట్రీ ఇవ్వనుంది. చైనీస్ సర్టిఫికేషన్ వెబ్ సైట్ CQC పై ఈ డివైజ్ కనిపించడంతో అక్కడ లాంచ్ కన్ఫర్మ్ అయ్యింది. లిస్టింగ్ ద్వారా ఫోన్ బ్యాటరీ కెపాసిటీ, ఫాస్ట్ చార్జింగ్ కేపబులిటీ రివీల్ అయ్యాయి. ఇప్పుడు ఈ ఫోన్ టీడీఆర్ఏ సర్టిఫికేషన్ మరియు కెనడియన్ ఆర్ఈఎల్ సర్టిఫికేషన్ వెబ్ సైట్స్ పై కనిపించింది. […]

The post టీడీఆర్ఏ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించిన Motorola Razr Plus 2023 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • వివిధ మార్కెట్స్ లో Razr+ 2023 పేరుతో రానున్న Moto Razr 40 Ultra
  • ఎన్నో సర్టిఫికేషన్ సైట్స్ పై కనిపించిన రెండు డివైజెస్
  • 30 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో లాంచ్ కానున్న Motorola Razr Plus

మోటోరోలా సంస్థ త్వరలోనే Motorola Razr+ 2023 డివైజ్ ని లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ డివైజ్ త్వరలోనే చైనాలో ఎంట్రీ ఇవ్వనుంది. చైనీస్ సర్టిఫికేషన్ వెబ్ సైట్ CQC పై ఈ డివైజ్ కనిపించడంతో అక్కడ లాంచ్ కన్ఫర్మ్ అయ్యింది. లిస్టింగ్ ద్వారా ఫోన్ బ్యాటరీ కెపాసిటీ, ఫాస్ట్ చార్జింగ్ కేపబులిటీ రివీల్ అయ్యాయి. ఇప్పుడు ఈ ఫోన్ టీడీఆర్ఏ సర్టిఫికేషన్ మరియు కెనడియన్ ఆర్ఈఎల్ సర్టిఫికేషన్ వెబ్ సైట్స్ పై కనిపించింది. దీంతో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి.

Motorola Razr+ 2023: TDRA మరియు REL సర్టిఫికేషన్స్

  • TDRA మరియు REL వెబ్ సైట్స్ పై Motorola XT2321 మోడల్ నంబర్ తో లిస్ట్ అయిన డివైజ్
  • లిస్టింగ్స్ ద్వారా రివీలైన బ్యాటరీ మరియు చార్జింగ్ స్పీడ్ వివరాలు

పైన టీడీఆర్ఏ మరియు ఆర్ఈఎల్ సర్టిఫికేషన్స్ ఇమేజెస్ లో కనిపిస్తోన్న విధంగా Motorola Razr+ 2023, Motorola Razr 40 Ultra డివైజెస్ ఒకే మోడల్ నంబర్ (Motorola XT2321-3 మరియు Motorola XT2321-1) ని కలిగి ఉన్నాయి. దీంతో రెండు ఫోన్లు వేర్వేరు పేర్లతో లాంచ్ కానున్నాయని అర్థమవుతోంది. అయితే ఇదేమంత సమస్య కాదు. స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో ఇది కొన్నేళ్ళుగా జరుగుతోన్న విషయమే.

సర్టిఫికేషన్ లిస్ట్ లో డివైజ్ కి సంబంధించిన ఇతర వివరాలు రివీల్ కాలేదు. Motorola Razr+ 2023 డివైజ్ CQC (Motorola XT2321-2) వెబ్ సైట్ పై కూడా కనిపించింది. దీని ద్వారా ఈ ఫోన్ 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 3640 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుందని సమాచారం.

Motorola Razr 40 Ultra ఎప్పుడు లాంచ్ కానుంది?

Motorola Razr 40 Ultra డివైజ్ పేరు తొలిసారిగా బయటకు వచ్చింది. అలాగే ఈ ఫోన్ యొక్క కొన్ని స్పెసిఫికేషన్స్ కూడా రివీల్ అయ్యాయి. 2023 రెండో త్రైమాసికంలో చైనాలో Motorola Razr+ 2023 ఫోన్ లాంచ్ కానుందని రూమర్లు వినిపిస్తున్నాయి.

Moto Razr 2022

Moto Razr 2022 డివైజ్ 2022 లో మార్కెట్ లోకి వచ్చింది. ఈ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ని ఉత్తమమైన ఫీచర్లతో కంపెనీ లాంచ్ చేసింది. క్వాల్కమ్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్, 50ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా, రెండు డిస్ప్లే లతో ఈ ఫోన్ లాంచైంది. ఈ స్మార్ట్ ఫోన్ 3500 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post టీడీఆర్ఏ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించిన Motorola Razr Plus 2023 first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన Motorola Razr (2023) లాంచ్ తేదీ https://www.91mobiles.com/telugu/motorola-razr-2023-launch-date-leaked-before-launch/ Fri, 24 Feb 2023 05:13:27 +0000 https://www.91mobiles.com/telugu/?p=5081 ఈ వారం ఆరంభంలో ప్రముఖ టిప్‌స్టర్ ఇవాన్ బ్లాస్ Motorola Razr (2023) కి సంబంధించిన డిజైన్ ని రివీల్ చేశారు. ఈ డివైజ్ Motorola Razr (2022) కి సక్సెసర్ గా వస్తోంది. తాజాగా ఇవాన్ నుంచి వచ్చిన కొత్త లీక్ ద్వారా Motorola Razr (2023) డివైజ్ లాంచ్ తేదీ బయటకు వచ్చింది. Samsung Galaxy Z Flip 5 కంటే ముందే Motorola Razr (2023) లాంచ్ కానుందని లీక్ ద్వారా స్పష్టమవుతోంది. […]

The post లీకైన Motorola Razr (2023) లాంచ్ తేదీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Samsung Galaxy Z Flip 5 కంటే ముందే లాంచ్ కానున్న Motorola Razr (2023)
  • జూన్ 1 న Motorola Razr (2023) లాంచ్ అయ్యే అవకాశం
  • Juno అనే కోడ్ నేమ్ ని కలిగి ఉన్న Motorola Razr (2023) డివైజ్

ఈ వారం ఆరంభంలో ప్రముఖ టిప్‌స్టర్ ఇవాన్ బ్లాస్ Motorola Razr (2023) కి సంబంధించిన డిజైన్ ని రివీల్ చేశారు. ఈ డివైజ్ Motorola Razr (2022) కి సక్సెసర్ గా వస్తోంది. తాజాగా ఇవాన్ నుంచి వచ్చిన కొత్త లీక్ ద్వారా Motorola Razr (2023) డివైజ్ లాంచ్ తేదీ బయటకు వచ్చింది. Samsung Galaxy Z Flip 5 కంటే ముందే Motorola Razr (2023) లాంచ్ కానుందని లీక్ ద్వారా స్పష్టమవుతోంది. ఇకపోతే Galaxy Z Flip 5 ఆగస్టులో లాంచ్ కానుందని సమాచారం.

జునో అనౌన్స్‌మెంట్ రివీల్ + ఈవెంట్ యాక్టివేషన్ లాంచ్ తేదీ జూన్ 1 గా నిర్ణయించబడింది. ఇక్కడ జునో (Juno) అంటే Motorola Razr (2023) యొక్క కోడ్ నేమ్. లాంచ్ కి ఇంకా కొన్ని నెలల సమయం ఉండటంతో ఈలోపు ఫోన్ కి సంబంధించిన టీజర్లు స్పెసిఫికేషన్స్ ని రివీల్ చేసే అవకాశం ఉంది.

Motorola Razr (2023) విశేషాలు

ప్రస్తుతానికి Motorola Razr (2023) కి సంబంధించిన కొన్ని వివరాలు మాత్రమే తెలిసాయి. ఈ డివైజ్ 144Hz రిఫ్రెష్ రేట్, స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో వస్తున్నట్లు స్పష్టమైంది. మోటోరోలా సంస్థ మరొక ఫ్లిప్ ఫోన్ పై కూడా పని చేస్తోంది. ఈ ఫోన్ కి Venus అనే కోడ్ నేమ్ ఇచ్చింది. ఈ డివైజ్ స్పెసిఫికేషన్స్ ప్రస్తుతానికి అందుబాటులో లేవు.

Motorola Razr (2022) విషయానికి వస్తే, ఇందులో 6.7-ఇంచ్ ఫోల్డబుల్ ఓఎల్ఈడీ డిస్ప్లే, పంచ్-హోల్ డిజైన్, కవర్ డిస్ప్లే వంటివి ఉన్నాయి. Motorola Razr (2023) డివైజ్ లో కవర్ డిస్ప్లే భారీ అప్‌గ్రేడ్ ని పొందనున్నట్లు తెలిసింది. ఇటీవలె లీకైన పిక్స్ కూడా ఆ విషయాన్ని స్పష్టం చేసాయి.

Motorola Razr (2023) డివైజ్ లో 3.5-ఇంచ్ భారీ కవర్ డిస్ప్లే ఉండనుందని సమాచారం. ఔటర్ స్క్రీన్ పై డ్యూయల్ కెమెరాలు, ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి. భద్రత కోసం సైడ్ ఫేసింగ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ని ఈ ఫోన్ లో అందించారు. Motorola Razr (2023) లో అండర్ డిస్ప్లే సెల్ఫీ కెమెరా ఉంటుందని లీకైన రెండర్ ఇమేజెస్ ద్వారా తెలిసింది. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. అండర్ డిస్ప్లే ఫ్రంట్ కెమెరా ఉంటుందా? లేదా ఫ్రంట్ కెమెరా బదులుగా రియర్ కెమెరానే ఫ్రంట్ కెమెరాలా కూడా వాడుకోవాలా? అనేద విషయాలు త్వరలోనే తెలియనున్నాయి.

Motorola Razr 2023 కి సంబంధించిన మిగతా స్పెసిఫికేషన్స్ ప్రస్తుతానికి తెలియలేదు. అయితే ఈ ఫోన్ క్వాల్కమ్ లేదా మీడియాటెక్ కంపెనీలకు చెందిన ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ని కలిగి ఉండనుందని చెప్పవచ్చు. త్వరలోనే ఈ ఫోల్డబుల్ ఫోన్ కి సంబంధించిన వివరాలను మోటోరోలా రివీల్ చేసే అవకాశం ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post లీకైన Motorola Razr (2023) లాంచ్ తేదీ first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన Motorola Razr 2023 రెండర్స్; అదిరిపోయిన లుక్ https://www.91mobiles.com/telugu/motorola-razr-2023-design-renders-leaked-before-launch/ Wed, 22 Feb 2023 07:13:46 +0000 https://www.91mobiles.com/telugu/?p=5044 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటోరోలా త్వరలో Motorola Razr 2023 మడతబెట్టే ఫోన్ ని లాంచ్ చేయనుంది. 2023 లోనే ఈ ఫోన్ మార్కెట్ లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు మోటోరోలా నుంచి Motorola Razr 2023 కి సంబంధించిన ఎటువంటి వివరాలు బయటకు రాలేదు. అయితే తాజాగా ఒక లీక్ ద్వారా Motorola Razr 2023 డివైజ్ డిజైన్ రెండర్స్ బయటకు వచ్చాయి. లీకైన Motorola Razr 2023 రెండర్స్ […]

The post లీకైన Motorola Razr 2023 రెండర్స్; అదిరిపోయిన లుక్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఈ ఏడాది లాంచ్ కానున్న Motorola Razr 2023 ఫోల్డబుల్ ఫోన్
  • లాంచ్ కి ముందు లీకైన Motorola Razr 2023 డిజైన్ రెండర్స్
  • గత మోడల్ తో పోల్చితే, భారీ కవర్ డిస్ప్లేతో వస్తోన్న Motorola Razr 2023

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటోరోలా త్వరలో Motorola Razr 2023 మడతబెట్టే ఫోన్ ని లాంచ్ చేయనుంది. 2023 లోనే ఈ ఫోన్ మార్కెట్ లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు మోటోరోలా నుంచి Motorola Razr 2023 కి సంబంధించిన ఎటువంటి వివరాలు బయటకు రాలేదు. అయితే తాజాగా ఒక లీక్ ద్వారా Motorola Razr 2023 డివైజ్ డిజైన్ రెండర్స్ బయటకు వచ్చాయి.

లీకైన Motorola Razr 2023 రెండర్స్ ని బట్టి ఫోన్ భారీ కవర్ డిస్ప్లేతో వస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ ఫోన్ లో అండర్-డిస్ప్లే సెల్ఫీ కెమెరా ఉండే అవకాశం ఉంది. ఈ అండర్-డిస్ప్లే సెల్ఫీ కెమెరా పై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

డిజైన్ రెండర్స్ ద్వారా లీకైన Motorola Razr 2023 ఫస్ట్ లుక్

 

పైన కనిపిస్తోన్న లీకైన రెండర్ ఇమేజెస్ ని ప్రముఖ టిప్ స్టర్ ఇవాన్ బ్లాస్ పోస్ట్ చేశాడు. Motorola Razr 2023 ఈ పిక్స్ లో మాదిరి ఉండనుంది. కవర్ డిస్ప్లే ని చూస్తుంటే, దాదాపుగా ఫోన్ రియర్ ప్యానెల్ ని ఆక్రమించినట్లు అనిపిస్తోంది. ఈ ఫోన్ లో డ్యూయల్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి.

కవర్ డిస్ప్లే యొక్క కచ్చితమైన సైజ్ ఇంకా తెలియదు. కానీ, 3.26-ఇంచ్ వరకు ఉండొచ్చని అంచనా వేయవచ్చు. OPPO Find N2 Flip లో కూడా ఇలాంటిదే ఉంటుంది.

ఇప్పుడు మెయిన్ డిస్ప్లే గురించి తెలుసుకుందాం. Motorola Razr 2023 లో సెల్ఫీ కెమెరి కటౌట్ కనిపించడం లేదు. అంటే ఈ ఫోన్ అండర్-డిస్ప్లే ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుందని అనుకోవచ్చు. లేదంటే అస్సలు ఫ్రంట్ కెమెరానే ఉండకపోవచ్చు. అంటే ఔటర్ డిస్ప్లే పై ఉండే మెయిన్ కెమెరానే సెల్ఫీ కెమెరా మాదిరి పని చేస్తుంది.

ఇలా ఔటర్ డిస్ప్లే పై ఉండే మెయిన్ కెమెరాను ఫ్రంట్ కెమెరా లాగా వాడుకోవడం వల్లన ఇన్నర్ డిస్ప్లే పై హోల్ లేకుండా పూర్తి డిస్ప్లే అనుభూతిని పొందవచ్చు. దీంతో మరింత ఇమ్మర్సివ్ ఎక్స్‌పీరియన్స్ యూజర్ కి లభిస్తుంది. చాలామంది తమ ఫోన్ డిస్ప్లే పై ఎటువంటి హోల్ లేదా నాచ్ ఉండటాన్ని ఇష్టపడరు. దీని వల్లన వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్ దెబ్బతింటుంది. మరి దీనికి మోటోరోలా రేజర్ రూపంలో సొల్యూషన్ తీసుకొస్తుందేమో చూడాలి.

Motorola Razr 2023 కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ప్రస్తుతానికి తెలియలేదు. అయితే ఈ ఫోన్ క్వాల్కమ్ లేదా మీడియాటెక్ కంపెనీలకు చెందిన ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ని కలిగి ఉండనుందని చెప్పవచ్చు. త్వరలోనే ఈ ఫోల్డబుల్ ఫోన్ కి సంబంధించిన వివరాలను మోటోరోలా రివీల్ చేసే అవకాశం ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post లీకైన Motorola Razr 2023 రెండర్స్; అదిరిపోయిన లుక్ first appeared on 91Mobiles Telugu.

]]>