
మోటోరోలా సంస్థ త్వరలోనే Motorola Razr+ 2023 డివైజ్ ని లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ డివైజ్ త్వరలోనే చైనాలో ఎంట్రీ ఇవ్వనుంది. చైనీస్ సర్టిఫికేషన్ వెబ్ సైట్ CQC పై ఈ డివైజ్ కనిపించడంతో అక్కడ లాంచ్ కన్ఫర్మ్ అయ్యింది. లిస్టింగ్ ద్వారా ఫోన్ బ్యాటరీ కెపాసిటీ, ఫాస్ట్ చార్జింగ్ కేపబులిటీ రివీల్ అయ్యాయి. ఇప్పుడు ఈ ఫోన్ టీడీఆర్ఏ సర్టిఫికేషన్ మరియు కెనడియన్ ఆర్ఈఎల్ సర్టిఫికేషన్ వెబ్ సైట్స్ పై కనిపించింది. దీంతో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి.
Motorola Razr+ 2023: TDRA మరియు REL సర్టిఫికేషన్స్
- TDRA మరియు REL వెబ్ సైట్స్ పై Motorola XT2321 మోడల్ నంబర్ తో లిస్ట్ అయిన డివైజ్
- లిస్టింగ్స్ ద్వారా రివీలైన బ్యాటరీ మరియు చార్జింగ్ స్పీడ్ వివరాలు
పైన టీడీఆర్ఏ మరియు ఆర్ఈఎల్ సర్టిఫికేషన్స్ ఇమేజెస్ లో కనిపిస్తోన్న విధంగా Motorola Razr+ 2023, Motorola Razr 40 Ultra డివైజెస్ ఒకే మోడల్ నంబర్ (Motorola XT2321-3 మరియు Motorola XT2321-1) ని కలిగి ఉన్నాయి. దీంతో రెండు ఫోన్లు వేర్వేరు పేర్లతో లాంచ్ కానున్నాయని అర్థమవుతోంది. అయితే ఇదేమంత సమస్య కాదు. స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో ఇది కొన్నేళ్ళుగా జరుగుతోన్న విషయమే.
సర్టిఫికేషన్ లిస్ట్ లో డివైజ్ కి సంబంధించిన ఇతర వివరాలు రివీల్ కాలేదు. Motorola Razr+ 2023 డివైజ్ CQC (Motorola XT2321-2) వెబ్ సైట్ పై కూడా కనిపించింది. దీని ద్వారా ఈ ఫోన్ 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 3640 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుందని సమాచారం.
Motorola Razr 40 Ultra ఎప్పుడు లాంచ్ కానుంది?
Motorola Razr 40 Ultra డివైజ్ పేరు తొలిసారిగా బయటకు వచ్చింది. అలాగే ఈ ఫోన్ యొక్క కొన్ని స్పెసిఫికేషన్స్ కూడా రివీల్ అయ్యాయి. 2023 రెండో త్రైమాసికంలో చైనాలో Motorola Razr+ 2023 ఫోన్ లాంచ్ కానుందని రూమర్లు వినిపిస్తున్నాయి.
Moto Razr 2022
Moto Razr 2022 డివైజ్ 2022 లో మార్కెట్ లోకి వచ్చింది. ఈ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ని ఉత్తమమైన ఫీచర్లతో కంపెనీ లాంచ్ చేసింది. క్వాల్కమ్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్, 50ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా, రెండు డిస్ప్లే లతో ఈ ఫోన్ లాంచైంది. ఈ స్మార్ట్ ఫోన్ 3500 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.











