Motorola Razr 50 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 09 Sep 2024 10:48:51 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Motorola Razr 50: మీడియాటెక్ డైమెన్సిటీ 7300ఎక్స్ చిప్సెట్‌తో భారత్‌లో లాంచైన మోటోరోలా ఫ్లిప్ ఫోన్ https://www.91mobiles.com/telugu/motorola-razr-50-launched-in-india-with-mediatek-dimensity-7300x-chipset/ https://www.91mobiles.com/telugu/motorola-razr-50-launched-in-india-with-mediatek-dimensity-7300x-chipset/#respond Mon, 09 Sep 2024 10:48:51 +0000 https://www.91mobiles.com/telugu/?p=13391 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola నేడు భారతీయ మార్కెట్ లో ఒక ఫోల్డబుల్ ఫోన్ లాంచ్ చేసింది. Motorola Razr 50 పేరుతో ఈ ఫోన్ విడుదలైంది. రెండు స్క్రీన్స్‌ను ఈ ఫోన్ లో అందించారు. మెయిన్ డిస్ప్లే సైజ్ 6.9-ఇంచులు ఉండగా, బ్యాక్ ప్యానెల్ పై ఇచ్చిన సెకండరీ డిస్ప్లే సైజ్ 3.63-ఇంచులు ఉంది. ఫోన్ చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంది. ఓసారి రేజర్ 50 ఫ్లిప్ ఫోన్ ధర, సేల్ వివరాలు మరియు […]

The post Motorola Razr 50: మీడియాటెక్ డైమెన్సిటీ 7300ఎక్స్ చిప్సెట్‌తో భారత్‌లో లాంచైన మోటోరోలా ఫ్లిప్ ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో Motorola Razr 50 విడుదల
  • 6.9-ఇంచ్ పీఓఎల్‌ఈడీ మెయిన్ స్క్రీన్
  • 3.63-ఇంచ్ ఓఎల్ఈడీ సెకండరీ స్క్రీన్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola నేడు భారతీయ మార్కెట్ లో ఒక ఫోల్డబుల్ ఫోన్ లాంచ్ చేసింది. Motorola Razr 50 పేరుతో ఈ ఫోన్ విడుదలైంది. రెండు స్క్రీన్స్‌ను ఈ ఫోన్ లో అందించారు. మెయిన్ డిస్ప్లే సైజ్ 6.9-ఇంచులు ఉండగా, బ్యాక్ ప్యానెల్ పై ఇచ్చిన సెకండరీ డిస్ప్లే సైజ్ 3.63-ఇంచులు ఉంది. ఫోన్ చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంది. ఓసారి రేజర్ 50 ఫ్లిప్ ఫోన్ ధర, సేల్ వివరాలు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Motorola Razr 50 ధర, సేల్ వివరాలు

Motorola Razr 50 సింగిల్ స్టోరేజీ వేరియంట్ లో లాంచ్ అయ్యింది. దాని ధర ఎంతుందో తెలుసుకుందాం.

Motorola Razr 50 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.64,999 గా పెట్టారు.

సెప్టెంబర్ 20వ తేదీ నుంచి అమెజాన్ ద్వారా సేల్ మొదలవుతుంది. సెప్టెంబర్ 10వ తేదీ నుంచి ప్రీ-ఆర్డర్లు ప్రారంభమవుతాయి.

కోలా గ్రే, బీచ్ శాండ్, స్పిర్ట్జ్ ఆరెంజ్ కలర్ ఆప్షన్స్ లో Motorola Razr 50 లభిస్తుంది.

పండుగ ఆఫర్ లో భాగంగా రూ.5,000 డిస్కౌంట్, రూ.10,000 బ్యాంక్ డిస్కౌంట్ అందుబాటులో ఉన్నాయి. ఇంకా 18 నెలల కాలపరిమితితో నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. నెలకు రూ.2,778 చెల్లించాల్సి ఉంటుంది.

3 నెలల గూగుల్ జెమినీ అడ్వాన్స్డ్ సబ్‌స్క్రిప్షన్ పై 2టిబి క్లౌడ్ స్టోరేజీని పొందవచ్చు.

Motorola Razr 50 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Motorola Razr 50 లో 6.9-ఇంచ్ పీఓఎల్ఈడీ స్క్రీన్, ఫుల్‌హెచ్డీ+ అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్10+, 3000 నిట్స్ పీబక్ బ్రైట్నెస్, 3.63-ఇంచ్ ఓఎల్ఈడీ ఫుల్‌హెచ్డీ+ ఓఎల్ఈడీ కవర్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్10, 1700 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ ఉన్నాయి.

ప్రాసెసర్: Motorola Razr 50 లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300ఎక్స్ చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ615 ఎంసీ2 జీపీయూ వినియోగించారు.

మెమొరీ: Motorola Razr 50 డివైజ్ 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, ర్యామ్ బూస్ట్ 3.0 ఫీచర్ తో వచ్చింది. మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ లేదు.

కెమెరా: Motorola Razr 50 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఇచ్చారు. ఇందులో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్/మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్పీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: Motorola Razr 50 లో పవర్ బ్యాకప్ కోసం 4200 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Motorola Razr 50 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అయ్యింది. 3 ఏళ్ళు ఓఎస్ అప్డేట్స్, 4 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్‌కి లభిస్తాయి.

ఇతర ఫీచర్లు: Motorola Razr 50 డివైజ్ ఐపీఎక్స్8 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్, డ్యూయల్ స్టీరియో స్పీకర్ సెటప్, డాల్బీ అట్మాస్, బ్లూటూత్ 5.4, సైడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post Motorola Razr 50: మీడియాటెక్ డైమెన్సిటీ 7300ఎక్స్ చిప్సెట్‌తో భారత్‌లో లాంచైన మోటోరోలా ఫ్లిప్ ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/motorola-razr-50-launched-in-india-with-mediatek-dimensity-7300x-chipset/feed/ 0
Motorola Razr 50 ఫ్లిప్ ఫోన్ ఇండియా లాంచ్ ఖరారు, టీజర్ విడుదల https://www.91mobiles.com/telugu/motorola-razr-50-india-launch-teaser-confirmed/ https://www.91mobiles.com/telugu/motorola-razr-50-india-launch-teaser-confirmed/#respond Tue, 20 Aug 2024 06:27:39 +0000 https://www.91mobiles.com/telugu/?p=13056 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Motorola త్వరలో రేజర్ 50 సిరీస్ లో Motorola Razr 50 అనే ఫ్లిప్ ఫోన్ లాంచ్ చేయనుంది. ఇదివరకే ఈ సిరీస్ లో Motorola Razr 50 Ultra ఫోల్డబుల్ ఫోన్ లాంచ్ అయ్యింది. ఇప్పుడు Motorola Razr 50 ను లాంచ్ చేసేందుకు మోటోరోలా సిద్ధమవుతోంది. తాజాగా రేజర్ 50 యొక్క ఇండియా టీజర్ విడుదల అయ్యింది. Motorola Razr 50 ఇండియా లాంచ్ ఖరారు Motorola Razr […]

The post Motorola Razr 50 ఫ్లిప్ ఫోన్ ఇండియా లాంచ్ ఖరారు, టీజర్ విడుదల first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Motorola Razr 50 లాంచ్
  • ఇండియా లాంచ్ టీజర్ విడుదల
  • 6.9-ఇంచ్ అమోలెడ్ ఎల్టీపీవో ప్యానెల్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Motorola త్వరలో రేజర్ 50 సిరీస్ లో Motorola Razr 50 అనే ఫ్లిప్ ఫోన్ లాంచ్ చేయనుంది. ఇదివరకే ఈ సిరీస్ లో Motorola Razr 50 Ultra ఫోల్డబుల్ ఫోన్ లాంచ్ అయ్యింది. ఇప్పుడు Motorola Razr 50 ను లాంచ్ చేసేందుకు మోటోరోలా సిద్ధమవుతోంది. తాజాగా రేజర్ 50 యొక్క ఇండియా టీజర్ విడుదల అయ్యింది.

Motorola Razr 50 ఇండియా లాంచ్ ఖరారు

Motorola Razr 50 స్మార్ట్‌ఫోన్ యొక్క లాంచ్ టీజర్‌ను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X పై మోటోరోలా షేర్ చేసింది. టీజర్ లో కమింగ్ సూన్ అని పేర్కొనబడి ఉంది.

ప్రస్తుతం ఈ ఫోన్ యొక్క లాంచ్ తేదీని కంపెనీ వెల్లడించలేదు. కానీ, భారత్ లో ఈ డివైజ్ ఈ నెలలో లేదా వచ్చే నెల మొదటి వారంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

భారతీయ యూజర్లకు భారీ ఎక్స్‌టర్నల్ డిస్ప్లే అందించబోతున్నట్లు కంపెనీ తన టీజర్ పోస్ట్ లో పేర్కొంది.

ఇక డిజైన్ విషయానికి వస్తే, Motorola Razr 50 స్మార్ట్‌ఫోన్ చైనా మోడల్ మాదిరే ఉంది. భారీ కవర్ డిస్ప్లే, డ్యూయల్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి.

Motorola Razr 50 స్పెసిఫికేషన్స్ (చైనా)

డిస్ప్లే: Motorola Razr 50 లో 6.9-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, అమోలెడ్ ఎల్టీపీవో ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3000 నిల్స్ పీక్ బ్రైట్నెస్, 3.6 ఇంచెస్ సెకండరీ డిస్ప్లే, 1056*1066 పిక్సెల్స్ రెజుల్యూషన్, గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ ఉన్నాయి.

ప్రాసెసర్: Motorola Razr 50 లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300ఎక్స్ చిప్సెట్ వాడారు.

ర్యామ్, స్టోరేజీ: Motorola Razr 50 డివైజ్ 12జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 512జిబి వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఉన్నాయి.

కెమెరా: Motorola Razr 50 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ, చార్జింగ్: Motorola Razr 50 లో పవర్ బ్యాకప్ కోసం 4200 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 30 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Motorola Razr 50 లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, వై-ఫై, బ్లూటూత్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Motorola Razr 50 డివైజ్ ఐపీఎక్స్8 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో వచ్చింది.

The post Motorola Razr 50 ఫ్లిప్ ఫోన్ ఇండియా లాంచ్ ఖరారు, టీజర్ విడుదల first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/motorola-razr-50-india-launch-teaser-confirmed/feed/ 0
Motorola: చైనాలో లాంచైన Razr 50, Razr 50 Ultra https://www.91mobiles.com/telugu/motorola-razr-50-razr-50-ultra-launched-in-china/ https://www.91mobiles.com/telugu/motorola-razr-50-razr-50-ultra-launched-in-china/#respond Wed, 26 Jun 2024 08:42:32 +0000 https://www.91mobiles.com/telugu/?p=12225 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola తన హోమ్ మార్కెట్ చైనాలో Motorola Razr 50 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Motorola Razr 50 మరియు Motorola Razr 50 Ultra అనే మోడల్స్ విడుదలయ్యాయి. ఈ ఫోన్లలో 6.9-ఇంచ్ ఫోల్డబుల్ ఎల్టీపీవో పీఓఎల్ఈడీ డిస్ప్లే, 165 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 12జిబి ర్యామ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఓసారి ఈ డివైజెస్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ధర వివరాలు తెలుసుకుందాం. Motorola […]

The post Motorola: చైనాలో లాంచైన Razr 50, Razr 50 Ultra first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చైనాలో Motorola Razr 50 సిరీస్ లాంచ్
  • ఎల్టీపీవో పీఓఎల్ఈడీ డిస్ప్లే
  • 165 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola తన హోమ్ మార్కెట్ చైనాలో Motorola Razr 50 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Motorola Razr 50 మరియు Motorola Razr 50 Ultra అనే మోడల్స్ విడుదలయ్యాయి. ఈ ఫోన్లలో 6.9-ఇంచ్ ఫోల్డబుల్ ఎల్టీపీవో పీఓఎల్ఈడీ డిస్ప్లే, 165 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 12జిబి ర్యామ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఓసారి ఈ డివైజెస్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ధర వివరాలు తెలుసుకుందాం.

Motorola Razr 50, Motorola Razr 50 Ultra ధరలు

Motorola Razr 50 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర 3699 యువాన్లు (సుమారు రూ.42,500) గా నిర్ణయించారు.

Motorola Razr 50 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ వేరియంట్ ధరను 3999 యువాన్లు (సుమారు రూ.45,945) గా పెట్టారు.

Motorola Razr 50 Ultra 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర 5699 యువాన్లు (సుమారు రూ.65,470) గా పెట్టారు. 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ వేరియంట్ ధరను 6199 యువాన్లు (సుమారు రూ.71,220) గా నిర్ణియంచారు.

Motorola Razr 50 స్మార్ట్‌ఫోన్ మూన్ వెల్వెట్ బ్లాక్, ఎలిఫెంట్ గ్రే మరియు ప్యాషన్ ఆరెంజ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Motorola Razr 50 Ultra డివైజ్ వింటేజ్ డెనిమ్, మోడర్న్ గ్రీన్ మరియు సాఫ్ట్ పీచ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Motorola Razr 50 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Motorola Razr 50 లో 6.9-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ (2640*1080 పిక్సెల్స్) స్క్రీన్, పీఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 10-బిట్ హెచ్డీఆర్ 10+ సపోర్ట్, 120% డీసీఐ-పీ3 కలర్ గ్యామట్, 2600 నిట్స్ పీక్ బ్రైట్నెస్, డాల్బీ విజన్, 3.6-ఇంచ్ (1066*1056 పిక్సెల్స్) క్విక్‌వ్యూ పీఓఎల్ఈడీ ఔటర్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 100% డీసీఐ-పీ3 కలర్ గ్యామట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ఉన్నాయి.

చిప్సెట్: Motorola Razr 50 డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300X ప్రాసెసర్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ615 ఎంసీ2 జీపీయూ వాడారు.

ర్యామ్, స్టోరేజీ: Motorola Razr 50 డివైజ్ 8జిబి/12జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జిబి/512జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఉన్నాయి.

కెమెరా: Motorola Razr 50 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: Motorola Razr 50 లో పవర్ బ్యాకప్ కోసం 4200 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ టర్బోపవర్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 15 వాట్ వైర్లెస్ చార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Motorola Razr 50 లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ వొల్టీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.4 ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Motorola Razr 50 లో స్టీరియో స్పీకర్స్, ఐపీఎక్స్8 రేటింగ్, డాల్బీ అట్మాస్, సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

Motorola Razr 50 Ultra స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Motorola Razr 50 Ultra లో 6.9-ఇంచ్ ఫ్లెక్స్ వ్యూ ఫుల్ హెచ్డీ+ (2640*1080 పిక్సెల్స్) స్క్రీన్, పీఓఎల్ఈడీ ఎల్టీపీవో ప్యానెల్, 165 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 10-బిట్ హెచ్డీఆర్ 10+, 100% డీసీఐ-పీ3 కలర్ గ్యామట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, డాల్బీ విజన్ ఉన్నాయి. ఇంకా ఈ ఫోన్ లో 4-ఇంచ్ (1272*1080 పిక్సెల్స్) క్విక్‌వ్యూ పీఓఎల్ఈడీ ఎల్టీపీవో డిస్ప్లే, 165 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 100% డీసీఐ-పీ3 కలర్ గ్యామట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ఉన్నాయి.

చిప్సెట్: Motorola Razr 50 Ultra లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ ఉంది. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైన ప్రాసెసర్. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 735 జీపీయూ వాడారు.

కెమెరా: Motorola Razr 50 Ultra లో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 50ఎంపి 2ఎక్స్ టెలీఫోటో ఓఐఎస్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: Motorola Razr 50 Ultra లో పవర్ బ్యాకప్ కోసం 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 44 వాట్ టర్బోపవర్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 15 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Motorola Razr 50 Ultra స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత మైయూఐ 7.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కనెక్టివిటీ: Motorola Razr 50 Ultra లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ వొల్టీ, వై-ఫై 6ఈ, బ్లూటూత్ 5.3 వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Motorola Razr 50 Ultra లో స్టీరియో స్పీకర్స్, డాల్బీ అట్మాస్, ఐపీఎక్స్8 రేటింగ్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post Motorola: చైనాలో లాంచైన Razr 50, Razr 50 Ultra first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/motorola-razr-50-razr-50-ultra-launched-in-china/feed/ 0
Motorola Razr 50: డైమెన్సిటీ చిప్‌తో గీక్‌బెంచ్‌పై కనిపించిన మోటో రేజర్ 50 https://www.91mobiles.com/telugu/motorola-razr-50-geekbench-mediatek-dimensity-chipset/ Wed, 29 May 2024 06:27:19 +0000 https://www.91mobiles.com/telugu/?p=11776 Motorola సంస్థ త్వరలో తన కొత్త తరం ఫ్లిప్ ఫోన్లను లాంచ్ చేయబోతోంది. చైనాతో పాటు గ్లోబల్ మార్కెట్స్ లో ఈ డివైజెస్ అడుగు పెట్టనున్నాయి. తాజాగా, Motorola Razr 50 స్మార్ట్‌ఫోన్ బెంచ్‌మార్కింగ్ సైట్ గీక్‌బెంచ్ పై కనిపించింది. దీంతో డివైజ్ యొక్క బెంచ్ మార్క్ స్కోర్స్, కొన్ని ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలను తెలుసుకుందాం పదండి. Motorola Razr 50 గీక్‌బెంచ్ లిస్టింగ్ గీక్‌బెంచ్ డేటాబేస్ ద్వారా మోటోరోలా నుంచి […]

The post Motorola Razr 50: డైమెన్సిటీ చిప్‌తో గీక్‌బెంచ్‌పై కనిపించిన మోటో రేజర్ 50 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Motorola Razr 50 లాంచ్
  • గీక్‌బెంచ్ పై లిస్టైన డివైజ్
  • 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్

Motorola సంస్థ త్వరలో తన కొత్త తరం ఫ్లిప్ ఫోన్లను లాంచ్ చేయబోతోంది. చైనాతో పాటు గ్లోబల్ మార్కెట్స్ లో ఈ డివైజెస్ అడుగు పెట్టనున్నాయి. తాజాగా, Motorola Razr 50 స్మార్ట్‌ఫోన్ బెంచ్‌మార్కింగ్ సైట్ గీక్‌బెంచ్ పై కనిపించింది. దీంతో డివైజ్ యొక్క బెంచ్ మార్క్ స్కోర్స్, కొన్ని ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలను తెలుసుకుందాం పదండి.

Motorola Razr 50 గీక్‌బెంచ్ లిస్టింగ్

గీక్‌బెంచ్ డేటాబేస్ ద్వారా మోటోరోలా నుంచి రాబోవు తదుపరి ఫ్లిప్ ఫోన్ యొక్క పేరు కన్ఫర్మ్ అయ్యింది. Motorola Razr 50 సింగిల్-కోర్ టెస్ట్ లో 1033 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 2751 పాయింట్లు స్కోర్ చేసింది. ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ మరియు 6జిబి ర్యామ్ తో గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది.

Motorola Razr 50 గీక్‌బెంచ్ పై ఆక్టా-కోర్ ప్రాసెసర్ తో లిస్ట్ అయ్యింది. ఇది aito అనే కోడ్‌నేమ్ కలిగి ఉంది. దీని బేస్ ఫ్రీక్వెన్సీ 2.0GHz గా ఉంది. అలాగే మాలి జీ615 ఎంసీ2 జీపీయూ గ్రాఫిక్స్ తో ఈ ఫోన్ రానున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300X చిప్సెట్ తో లాంచ్ కానుందని సమాచారం.

Motorola Razr 50 స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే: Motorola Razr 50 లో 6.9-ఇంచ్ ఓఎల్ఈడీ స్క్రీన్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 1056*1066 పిక్సెల్స్ రెజుల్యూషన్ గల 3.6-ఇంచ్ ఓఎల్ఈడీ కవర్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

కెమెరా: Motorola Razr 50 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 13ఎంపి సెకండరీ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ: Motorola Razr 50 లో పవర్ బ్యాకప్ కోసం 3,950 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ టర్బోపవర్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Motorola Razr 50 లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, వై-ఫై, బ్లూటూత్ వంటి ఆప్షన్స్ ఉంటాయి.

The post Motorola Razr 50: డైమెన్సిటీ చిప్‌తో గీక్‌బెంచ్‌పై కనిపించిన మోటో రేజర్ 50 first appeared on 91Mobiles Telugu.

]]>
Motorola: లీకైన Razr 50 5G, Razr 50 Ultra 5G డిజైన్, స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/motorola-razr-50-5g-razr-50-ultra-5g-design-specs-leaked/ Mon, 20 May 2024 06:13:15 +0000 https://www.91mobiles.com/telugu/?p=11615 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola నుంచి త్వరలో ఫోల్డబుల్ సిరీస్ Razr 50 లాంచ్ కానుంది. ఈ లైనప్ లో Motorola Razr 50 5G మరియు Motorola Razr 50 Ultra 5G ఫోల్డబుల్ ఫోన్లు మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. తాజాగా ఈ డివైజెస్ యొక్క రెండర్స్ 91mobiles కి అందాయి. దీంతో వీటి డిజైన్ మరియు ప్రధాన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. Motorola Razr 50 5G, Razr 50 Ultra 5G […]

The post Motorola: లీకైన Razr 50 5G, Razr 50 Ultra 5G డిజైన్, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో మోటో రేజర్ 50, 50 అల్ట్రా లాంచ్
  • లీకైన డిజైన్, స్పెసిఫికేషన్స్
  • కలర్స్: పీచ్ ఫజ్, గ్రీన్, బ్లూ

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola నుంచి త్వరలో ఫోల్డబుల్ సిరీస్ Razr 50 లాంచ్ కానుంది. ఈ లైనప్ లో Motorola Razr 50 5G మరియు Motorola Razr 50 Ultra 5G ఫోల్డబుల్ ఫోన్లు మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. తాజాగా ఈ డివైజెస్ యొక్క రెండర్స్ 91mobiles కి అందాయి. దీంతో వీటి డిజైన్ మరియు ప్రధాన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి.

Motorola Razr 50 5G, Razr 50 Ultra 5G రెండర్స్ (లీక్)

ప్రముఖ లీక్‌స్టర్ సుదాన్శు అంభోరే నుంచి 91మొబైల్స్ కి Motorola Razr 50 5G సిరీస్ యొక్క రెండర్స్ మరియు స్పెసిఫికేషన్స్ అందాయి.

రెండర్స్ ప్రకారం, రేజర్ 50 5జీ ఫోన్ గ్రే మరియు ఖాకీ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది. మరోవైపు రేజర్ 50 అల్ట్రా ఫోన్ పీచ్ ఫజ్, గ్రీన్ మరియు బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

రెండు ఫోన్ల యొక్క కవర్ స్క్రీన్ ని గమనిస్తే, కెమెరా లెన్సెస్ కోసం సెపరేట్ కటౌట్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కేవలం కెమెరా రింగ్స్ మాత్రమే ఉండగా, వాటి చుట్టూ ఏ విధమైన అమరిక లేదు.

అల్ట్రా మోడల్ లో కవర్ స్క్రీన్ భారీగా ఉంది. అలాగే బెజెల్స్ కూడా సన్నగా ఉన్నాయి.

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, రేజర్ 50 లో మెయిన్ స్క్రీన్ సన్నని బెజెల్స్ కలిగి ఉంది.

Motorola Razr 50 5G, Razr 50 Ultra 5G స్పెసిఫికేషన్స్ (లీక్)

Motorola Razr 50 5G

మెయిన్ డిస్ప్లే: 6.9-ఇంచ్ పీఓఎల్ఈడీ స్క్రీన్, 1080*2640 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఎస్‌జీఎస్ లో బ్లూ లైట్ సర్టిఫికేషన్, ఎస్‌జీఎస్ లో మోషన్ బ్లర్ సర్టిఫికేషన్.

కవర్ డిస్ప్లే: 3.63 ఇంచ్ పీఓఎల్ఈడీ కవర్ డిస్ప్లే

కవర్ స్క్రీన్ కెమెరాలు: Motorola Razr 50 5G కవర్ స్క్రీన్ పై 50ఎంపి + 13ఎంపి కెమెరాలు ఉన్నాయి.

మెయిన్ స్క్రీన్ కెమెరా: Motorola Razr 50 5G మెయిన్ స్క్రీన్ పై 32 మెగా పిక్సెల్ కెమెరా ఇచ్చారు.

సాఫ్ట్‌వేర్: Motorola Razr 50 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ కానుంది.

ప్రాసెసర్: Motorola Razr 50 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300ఎక్స్ చిప్సెట్ ఉంటుంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.5GHz.

మెమొరీ: Motorola Razr 50 5G లో 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ఉంటాయి. ఇతర మెమొరీ ఆప్షన్స్ కూడా ఉండవచ్చు.

బ్యాటరీ: Motorola Razr 50 5G లో 4200 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది ఫాస్ట్ చార్జింగ్ కేపబులిటీతో వస్తుంది. ఇంకా కెపాసిటీ ఎంతో తెలియదు.

The post Motorola: లీకైన Razr 50 5G, Razr 50 Ultra 5G డిజైన్, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>