
ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Motorola త్వరలో రేజర్ 50 సిరీస్ లో Motorola Razr 50 అనే ఫ్లిప్ ఫోన్ లాంచ్ చేయనుంది. ఇదివరకే ఈ సిరీస్ లో Motorola Razr 50 Ultra ఫోల్డబుల్ ఫోన్ లాంచ్ అయ్యింది. ఇప్పుడు Motorola Razr 50 ను లాంచ్ చేసేందుకు మోటోరోలా సిద్ధమవుతోంది. తాజాగా రేజర్ 50 యొక్క ఇండియా టీజర్ విడుదల అయ్యింది.
Motorola Razr 50 ఇండియా లాంచ్ ఖరారు
Motorola Razr 50 స్మార్ట్‌ఫోన్ యొక్క లాంచ్ టీజర్‌ను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X పై మోటోరోలా షేర్ చేసింది. టీజర్ లో కమింగ్ సూన్ అని పేర్కొనబడి ఉంది.
ప్రస్తుతం ఈ ఫోన్ యొక్క లాంచ్ తేదీని కంపెనీ వెల్లడించలేదు. కానీ, భారత్ లో ఈ డివైజ్ ఈ నెలలో లేదా వచ్చే నెల మొదటి వారంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
భారతీయ యూజర్లకు భారీ ఎక్స్‌టర్నల్ డిస్ప్లే అందించబోతున్నట్లు కంపెనీ తన టీజర్ పోస్ట్ లో పేర్కొంది.
ఇక డిజైన్ విషయానికి వస్తే, Motorola Razr 50 స్మార్ట్‌ఫోన్ చైనా మోడల్ మాదిరే ఉంది. భారీ కవర్ డిస్ప్లే, డ్యూయల్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి.
Keep a look out for the latest smartphone with a massive external display. We bet you’re going to love this 😉#ComingSoon #MotorolaRazr50 #FliplessDoMore pic.twitter.com/A0GZmIALVV
— Motorola India (@motorolaindia) August 19, 2024
Motorola Razr 50 స్పెసిఫికేషన్స్ (చైనా)
డిస్ప్లే: Motorola Razr 50 లో 6.9-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, అమోలెడ్ ఎల్టీపీవో ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3000 నిల్స్ పీక్ బ్రైట్నెస్, 3.6 ఇంచెస్ సెకండరీ డిస్ప్లే, 1056*1066 పిక్సెల్స్ రెజుల్యూషన్, గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ ఉన్నాయి.
ప్రాసెసర్: Motorola Razr 50 లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300ఎక్స్ చిప్సెట్ వాడారు.
ర్యామ్, స్టోరేజీ: Motorola Razr 50 డివైజ్ 12జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 512జిబి వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఉన్నాయి.
కెమెరా: Motorola Razr 50 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
బ్యాటరీ, చార్జింగ్: Motorola Razr 50 లో పవర్ బ్యాకప్ కోసం 4200 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 30 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
కనెక్టివిటీ: Motorola Razr 50 లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, వై-ఫై, బ్లూటూత్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
ఇతర ఫీచర్లు: Motorola Razr 50 డివైజ్ ఐపీఎక్స్8 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో వచ్చింది.











