Motorola Razr 50 Ultra 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 26 Jun 2024 08:42:32 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Motorola: చైనాలో లాంచైన Razr 50, Razr 50 Ultra https://www.91mobiles.com/telugu/motorola-razr-50-razr-50-ultra-launched-in-china/ https://www.91mobiles.com/telugu/motorola-razr-50-razr-50-ultra-launched-in-china/#respond Wed, 26 Jun 2024 08:42:32 +0000 https://www.91mobiles.com/telugu/?p=12225 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola తన హోమ్ మార్కెట్ చైనాలో Motorola Razr 50 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Motorola Razr 50 మరియు Motorola Razr 50 Ultra అనే మోడల్స్ విడుదలయ్యాయి. ఈ ఫోన్లలో 6.9-ఇంచ్ ఫోల్డబుల్ ఎల్టీపీవో పీఓఎల్ఈడీ డిస్ప్లే, 165 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 12జిబి ర్యామ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఓసారి ఈ డివైజెస్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ధర వివరాలు తెలుసుకుందాం. Motorola […]

The post Motorola: చైనాలో లాంచైన Razr 50, Razr 50 Ultra first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చైనాలో Motorola Razr 50 సిరీస్ లాంచ్
  • ఎల్టీపీవో పీఓఎల్ఈడీ డిస్ప్లే
  • 165 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola తన హోమ్ మార్కెట్ చైనాలో Motorola Razr 50 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Motorola Razr 50 మరియు Motorola Razr 50 Ultra అనే మోడల్స్ విడుదలయ్యాయి. ఈ ఫోన్లలో 6.9-ఇంచ్ ఫోల్డబుల్ ఎల్టీపీవో పీఓఎల్ఈడీ డిస్ప్లే, 165 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 12జిబి ర్యామ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఓసారి ఈ డివైజెస్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ధర వివరాలు తెలుసుకుందాం.

Motorola Razr 50, Motorola Razr 50 Ultra ధరలు

Motorola Razr 50 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర 3699 యువాన్లు (సుమారు రూ.42,500) గా నిర్ణయించారు.

Motorola Razr 50 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ వేరియంట్ ధరను 3999 యువాన్లు (సుమారు రూ.45,945) గా పెట్టారు.

Motorola Razr 50 Ultra 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర 5699 యువాన్లు (సుమారు రూ.65,470) గా పెట్టారు. 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ వేరియంట్ ధరను 6199 యువాన్లు (సుమారు రూ.71,220) గా నిర్ణియంచారు.

Motorola Razr 50 స్మార్ట్‌ఫోన్ మూన్ వెల్వెట్ బ్లాక్, ఎలిఫెంట్ గ్రే మరియు ప్యాషన్ ఆరెంజ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Motorola Razr 50 Ultra డివైజ్ వింటేజ్ డెనిమ్, మోడర్న్ గ్రీన్ మరియు సాఫ్ట్ పీచ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Motorola Razr 50 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Motorola Razr 50 లో 6.9-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ (2640*1080 పిక్సెల్స్) స్క్రీన్, పీఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 10-బిట్ హెచ్డీఆర్ 10+ సపోర్ట్, 120% డీసీఐ-పీ3 కలర్ గ్యామట్, 2600 నిట్స్ పీక్ బ్రైట్నెస్, డాల్బీ విజన్, 3.6-ఇంచ్ (1066*1056 పిక్సెల్స్) క్విక్‌వ్యూ పీఓఎల్ఈడీ ఔటర్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 100% డీసీఐ-పీ3 కలర్ గ్యామట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ఉన్నాయి.

చిప్సెట్: Motorola Razr 50 డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300X ప్రాసెసర్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ615 ఎంసీ2 జీపీయూ వాడారు.

ర్యామ్, స్టోరేజీ: Motorola Razr 50 డివైజ్ 8జిబి/12జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జిబి/512జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఉన్నాయి.

కెమెరా: Motorola Razr 50 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: Motorola Razr 50 లో పవర్ బ్యాకప్ కోసం 4200 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ టర్బోపవర్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 15 వాట్ వైర్లెస్ చార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Motorola Razr 50 లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ వొల్టీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.4 ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Motorola Razr 50 లో స్టీరియో స్పీకర్స్, ఐపీఎక్స్8 రేటింగ్, డాల్బీ అట్మాస్, సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

Motorola Razr 50 Ultra స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Motorola Razr 50 Ultra లో 6.9-ఇంచ్ ఫ్లెక్స్ వ్యూ ఫుల్ హెచ్డీ+ (2640*1080 పిక్సెల్స్) స్క్రీన్, పీఓఎల్ఈడీ ఎల్టీపీవో ప్యానెల్, 165 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 10-బిట్ హెచ్డీఆర్ 10+, 100% డీసీఐ-పీ3 కలర్ గ్యామట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, డాల్బీ విజన్ ఉన్నాయి. ఇంకా ఈ ఫోన్ లో 4-ఇంచ్ (1272*1080 పిక్సెల్స్) క్విక్‌వ్యూ పీఓఎల్ఈడీ ఎల్టీపీవో డిస్ప్లే, 165 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 100% డీసీఐ-పీ3 కలర్ గ్యామట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ఉన్నాయి.

చిప్సెట్: Motorola Razr 50 Ultra లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ ఉంది. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైన ప్రాసెసర్. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 735 జీపీయూ వాడారు.

కెమెరా: Motorola Razr 50 Ultra లో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 50ఎంపి 2ఎక్స్ టెలీఫోటో ఓఐఎస్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: Motorola Razr 50 Ultra లో పవర్ బ్యాకప్ కోసం 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 44 వాట్ టర్బోపవర్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 15 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Motorola Razr 50 Ultra స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత మైయూఐ 7.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కనెక్టివిటీ: Motorola Razr 50 Ultra లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ వొల్టీ, వై-ఫై 6ఈ, బ్లూటూత్ 5.3 వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Motorola Razr 50 Ultra లో స్టీరియో స్పీకర్స్, డాల్బీ అట్మాస్, ఐపీఎక్స్8 రేటింగ్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post Motorola: చైనాలో లాంచైన Razr 50, Razr 50 Ultra first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/motorola-razr-50-razr-50-ultra-launched-in-china/feed/ 0
Motorola Razr 50 Ultra: TENAA సర్టిఫికేషన్ పొందిన రేజర్ 50 అల్ట్రా https://www.91mobiles.com/telugu/motorola-razr-50-ultra-received-tenaa-certification/ Thu, 30 May 2024 05:57:31 +0000 https://www.91mobiles.com/telugu/?p=11799 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Motorola త్వరలో రేజర్ సిరీస్ ను లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Motorola Razr 50 మరియు Motorola Razr 50 Ultra అనే మోడల్స్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. అఫీషియల్ లాంచ్‌కి ముందు Motorola Razr 50 Ultra డివైజ్ చైనాకు చెందిన సర్టిఫికేషన్ వెబ్‌సైట్ TENAA పై లిస్ట్ అయ్యింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం పదండి. Motorola Razr 50 Ultra టీఈఎన్ఏఏ లిస్టింగ్ […]

The post Motorola Razr 50 Ultra: TENAA సర్టిఫికేషన్ పొందిన రేజర్ 50 అల్ట్రా first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Motorola Razr 50 Ultra లాంచ్
  • టీఈఎన్ఏఏ‌పై లిస్టైన డివైజ్
  • 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Motorola త్వరలో రేజర్ సిరీస్ ను లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Motorola Razr 50 మరియు Motorola Razr 50 Ultra అనే మోడల్స్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. అఫీషియల్ లాంచ్‌కి ముందు Motorola Razr 50 Ultra డివైజ్ చైనాకు చెందిన సర్టిఫికేషన్ వెబ్‌సైట్ TENAA పై లిస్ట్ అయ్యింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం పదండి.

Motorola Razr 50 Ultra టీఈఎన్ఏఏ లిస్టింగ్

Motorola Razr 50 Ultra డివైజ్ టీఈఎన్ఏఏ సర్టిఫికేషన్ డేటాబేస్‌పై 4-ఇంచ్ కవర్ డిస్ప్లే, ఓఎల్ఈడీ ప్యానెల్, 1272*1080 పిక్సెల్ రెజుల్యూషన్, 6.9-ఇంచ్ ఓఎల్ఈడీ ఫోల్డింగ్ డిస్ప్లే, 1080*2640 పిక్సెల్స్ రెజుల్యూషన్ తో లిస్ట్ అయ్యింది.

టీఈఎన్ఏఏ లిస్టింగ్ పై Motorola Razr 50 Ultra డివైజ్ ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో లిస్ట్ అయ్యింది. ఈ చిప్ హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 3.0GHz. అయితే ప్రాసెసర్ పేరు తెలియలేదు. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్ ఇందులో ఉంటుందని రూమర్లు వినిపిస్తున్నాయి.

టెనా లిస్టింగ్ పై రేజర్ 50 అల్ట్రా డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ తో కనిపించింది. ఇందులో రెండు 50ఎంపి సెన్సర్స్ ఉంటాయి. ఫోల్డింగ్ డిస్ప్లే పై 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఈ ఫోల్డబుల్ ఫోన్ లో 3830 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.

Motorola Razr 50 Ultra డివైజ్ లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. ఈ ఫోన్ 8జిబి, 12జిబి, 18జిబి ర్యామ్ వేరియంట్స్ లో లభించనుంది. అలాగే 128జిబి/256జిబి/512జిబి/1టిబి స్టోరేజీని ఈ ఫోన్ ఆఫర్ చేస్తుందని సమాచారం.

గతంలో Motorola Razr 50 Ultra 3సీ సర్టిఫికేషన్ పై లిస్ట్ అయ్యింది. ఈ లిస్టింగ్ ద్వారా 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ రివీల్ అయ్యింది. ఇకపోతే భారత్ కు చెందిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కూడా లిస్ట్ అయ్యింది.

The post Motorola Razr 50 Ultra: TENAA సర్టిఫికేషన్ పొందిన రేజర్ 50 అల్ట్రా first appeared on 91Mobiles Telugu.

]]>
Motorola: లీకైన Razr 50 5G, Razr 50 Ultra 5G డిజైన్, స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/motorola-razr-50-5g-razr-50-ultra-5g-design-specs-leaked/ Mon, 20 May 2024 06:13:15 +0000 https://www.91mobiles.com/telugu/?p=11615 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola నుంచి త్వరలో ఫోల్డబుల్ సిరీస్ Razr 50 లాంచ్ కానుంది. ఈ లైనప్ లో Motorola Razr 50 5G మరియు Motorola Razr 50 Ultra 5G ఫోల్డబుల్ ఫోన్లు మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. తాజాగా ఈ డివైజెస్ యొక్క రెండర్స్ 91mobiles కి అందాయి. దీంతో వీటి డిజైన్ మరియు ప్రధాన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. Motorola Razr 50 5G, Razr 50 Ultra 5G […]

The post Motorola: లీకైన Razr 50 5G, Razr 50 Ultra 5G డిజైన్, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో మోటో రేజర్ 50, 50 అల్ట్రా లాంచ్
  • లీకైన డిజైన్, స్పెసిఫికేషన్స్
  • కలర్స్: పీచ్ ఫజ్, గ్రీన్, బ్లూ

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola నుంచి త్వరలో ఫోల్డబుల్ సిరీస్ Razr 50 లాంచ్ కానుంది. ఈ లైనప్ లో Motorola Razr 50 5G మరియు Motorola Razr 50 Ultra 5G ఫోల్డబుల్ ఫోన్లు మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. తాజాగా ఈ డివైజెస్ యొక్క రెండర్స్ 91mobiles కి అందాయి. దీంతో వీటి డిజైన్ మరియు ప్రధాన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి.

Motorola Razr 50 5G, Razr 50 Ultra 5G రెండర్స్ (లీక్)

ప్రముఖ లీక్‌స్టర్ సుదాన్శు అంభోరే నుంచి 91మొబైల్స్ కి Motorola Razr 50 5G సిరీస్ యొక్క రెండర్స్ మరియు స్పెసిఫికేషన్స్ అందాయి.

రెండర్స్ ప్రకారం, రేజర్ 50 5జీ ఫోన్ గ్రే మరియు ఖాకీ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది. మరోవైపు రేజర్ 50 అల్ట్రా ఫోన్ పీచ్ ఫజ్, గ్రీన్ మరియు బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

రెండు ఫోన్ల యొక్క కవర్ స్క్రీన్ ని గమనిస్తే, కెమెరా లెన్సెస్ కోసం సెపరేట్ కటౌట్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కేవలం కెమెరా రింగ్స్ మాత్రమే ఉండగా, వాటి చుట్టూ ఏ విధమైన అమరిక లేదు.

అల్ట్రా మోడల్ లో కవర్ స్క్రీన్ భారీగా ఉంది. అలాగే బెజెల్స్ కూడా సన్నగా ఉన్నాయి.

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, రేజర్ 50 లో మెయిన్ స్క్రీన్ సన్నని బెజెల్స్ కలిగి ఉంది.

Motorola Razr 50 5G, Razr 50 Ultra 5G స్పెసిఫికేషన్స్ (లీక్)

Motorola Razr 50 5G

మెయిన్ డిస్ప్లే: 6.9-ఇంచ్ పీఓఎల్ఈడీ స్క్రీన్, 1080*2640 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఎస్‌జీఎస్ లో బ్లూ లైట్ సర్టిఫికేషన్, ఎస్‌జీఎస్ లో మోషన్ బ్లర్ సర్టిఫికేషన్.

కవర్ డిస్ప్లే: 3.63 ఇంచ్ పీఓఎల్ఈడీ కవర్ డిస్ప్లే

కవర్ స్క్రీన్ కెమెరాలు: Motorola Razr 50 5G కవర్ స్క్రీన్ పై 50ఎంపి + 13ఎంపి కెమెరాలు ఉన్నాయి.

మెయిన్ స్క్రీన్ కెమెరా: Motorola Razr 50 5G మెయిన్ స్క్రీన్ పై 32 మెగా పిక్సెల్ కెమెరా ఇచ్చారు.

సాఫ్ట్‌వేర్: Motorola Razr 50 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ కానుంది.

ప్రాసెసర్: Motorola Razr 50 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300ఎక్స్ చిప్సెట్ ఉంటుంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.5GHz.

మెమొరీ: Motorola Razr 50 5G లో 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ఉంటాయి. ఇతర మెమొరీ ఆప్షన్స్ కూడా ఉండవచ్చు.

బ్యాటరీ: Motorola Razr 50 5G లో 4200 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది ఫాస్ట్ చార్జింగ్ కేపబులిటీతో వస్తుంది. ఇంకా కెపాసిటీ ఎంతో తెలియదు.

The post Motorola: లీకైన Razr 50 5G, Razr 50 Ultra 5G డిజైన్, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>