Motorola Razr 50 Ultra: TENAA సర్టిఫికేషన్ పొందిన రేజర్ 50 అల్ట్రా

Highlights

  • త్వరలో Motorola Razr 50 Ultra లాంచ్
  • టీఈఎన్ఏఏ‌పై లిస్టైన డివైజ్
  • 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Motorola త్వరలో రేజర్ సిరీస్ ను లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Motorola Razr 50 మరియు Motorola Razr 50 Ultra అనే మోడల్స్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. అఫీషియల్ లాంచ్‌కి ముందు Motorola Razr 50 Ultra డివైజ్ చైనాకు చెందిన సర్టిఫికేషన్ వెబ్‌సైట్ TENAA పై లిస్ట్ అయ్యింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం పదండి.

Motorola Razr 50 Ultra టీఈఎన్ఏఏ లిస్టింగ్

Motorola Razr 50 Ultra డివైజ్ టీఈఎన్ఏఏ సర్టిఫికేషన్ డేటాబేస్‌పై 4-ఇంచ్ కవర్ డిస్ప్లే, ఓఎల్ఈడీ ప్యానెల్, 1272*1080 పిక్సెల్ రెజుల్యూషన్, 6.9-ఇంచ్ ఓఎల్ఈడీ ఫోల్డింగ్ డిస్ప్లే, 1080*2640 పిక్సెల్స్ రెజుల్యూషన్ తో లిస్ట్ అయ్యింది.

టీఈఎన్ఏఏ లిస్టింగ్ పై Motorola Razr 50 Ultra డివైజ్ ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో లిస్ట్ అయ్యింది. ఈ చిప్ హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 3.0GHz. అయితే ప్రాసెసర్ పేరు తెలియలేదు. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్ ఇందులో ఉంటుందని రూమర్లు వినిపిస్తున్నాయి.

టెనా లిస్టింగ్ పై రేజర్ 50 అల్ట్రా డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ తో కనిపించింది. ఇందులో రెండు 50ఎంపి సెన్సర్స్ ఉంటాయి. ఫోల్డింగ్ డిస్ప్లే పై 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఈ ఫోల్డబుల్ ఫోన్ లో 3830 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.

Motorola Razr 50 Ultra డివైజ్ లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. ఈ ఫోన్ 8జిబి, 12జిబి, 18జిబి ర్యామ్ వేరియంట్స్ లో లభించనుంది. అలాగే 128జిబి/256జిబి/512జిబి/1టిబి స్టోరేజీని ఈ ఫోన్ ఆఫర్ చేస్తుందని సమాచారం.

గతంలో Motorola Razr 50 Ultra 3సీ సర్టిఫికేషన్ పై లిస్ట్ అయ్యింది. ఈ లిస్టింగ్ ద్వారా 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ రివీల్ అయ్యింది. ఇకపోతే భారత్ కు చెందిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కూడా లిస్ట్ అయ్యింది.