Nagarjuna Akkineni - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 08 Nov 2022 13:44:20 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Netflix లో దూసుకెళ్తోన్న నాగార్జున నటించిన ‘The Ghost’ https://www.91mobiles.com/telugu/the-ghost-starring-nagarjuna-trending-number-1-on-netflix-india/ Tue, 08 Nov 2022 13:44:20 +0000 https://www.91mobiles.com/telugu/?p=3315 హైలైట్స్ Netflix లో దూసుకెళ్తోన్న ‘ది ఘోస్ట్’ ప్రధాన పాత్రలు పోషించిన నాగార్జున, సోనాల్ చౌహన్. ముఖ్య పాత్రల్లో కనిపించిన గుల్ పనాగ్, అనికా సురేంద్రన్ తెలుగు, హిందీ, తమిళ భాషల్లో అందుబాటులో ఉన్న ‘ది ఘోస్ట్’ కింగ్ నాగార్జున ప్రధాన పాత్రలో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ‘ది ఘోస్ట్’ చిత్రం రూపొందింది. ఇటీవలె థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రానికి యాక్షన్ లవర్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఓవరాల్ రేస్ లో నెగ్గలేకపోయింది. […]

The post Netflix లో దూసుకెళ్తోన్న నాగార్జున నటించిన ‘The Ghost’ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • Netflix లో దూసుకెళ్తోన్న ‘ది ఘోస్ట్’
  • ప్రధాన పాత్రలు పోషించిన నాగార్జున, సోనాల్ చౌహన్. ముఖ్య పాత్రల్లో కనిపించిన గుల్ పనాగ్, అనికా సురేంద్రన్
  • తెలుగు, హిందీ, తమిళ భాషల్లో అందుబాటులో ఉన్న ‘ది ఘోస్ట్’

కింగ్ నాగార్జున ప్రధాన పాత్రలో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ‘ది ఘోస్ట్’ చిత్రం రూపొందింది. ఇటీవలె థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రానికి యాక్షన్ లవర్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఓవరాల్ రేస్ లో నెగ్గలేకపోయింది. అయితేనేం, వెంటనే ఓటీటీ ఎంట్రీ ఇచ్చిన ది ఘోస్ట్ తన సత్తా చూపిస్తోంది. త్రిల్లింగ్ యాక్షన్, ఎమోషనల్ కంటెంట్ తో ఈ చిత్రం తెరకెక్కింది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్ట్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై శరత్ మరార్, సునీల్ నారంగ్, రామ్మోహన్ రావు పుస్కూరు ఈ చిత్రాన్ని నిర్మించారు.

Netflix లో ప్రసారమవుతోన్న The Ghost

థియెట్రికల్ రన్ ని ముగించుకున్న ‘ది ఘోస్ట్’ ఓటీటీ లో ప్రదర్శితమవుతోంది. నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్ర డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో కూడా అందుబాటులో ఉంది. నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో టాప్ 1, టాప్ 2 ప్లేసెస్ లో ఈ చిత్రం ట్రెండ్ అవుతోంది. జనాలను ఈ చిత్రంలోని యాక్షన్ అమితంగా ఆకట్టుకుందని అర్థమవుతోంది. నాగార్జున నటన, ఎమోషన్, యాక్షన్ కొరియోగ్రఫీ, రిచ్‌నెస్ ఈ చిత్రానికి ప్రధాన బలాలు. చిత్రకథ సాధారణమైనదే అయినప్పటికీ, యాక్షన్ సీక్వెన్స్ ని జనాలు ఎంజాయ్ చేస్తారు.

ది ఘోస్ట్ చిత్రానికి భరత్ సౌరభ్ సంగీతం సమకూర్చారు. వీరు అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. సినిమాను నేపథ్య సంగీతం ఒక లెవెల్ పైకి తీసుకెళ్ళింది. ఖడ్గంతో నాగార్జున విలన్స్ ని మట్టుబెట్టే సన్నివేశాలు, చేజింగ్ సీన్స్ ఆకట్టుకుంటాయి. దుబాయ్ లో మొదలయ్యే సినిమా తర్వాత ఊటీ కి చేరుతుంది. ఊటీలో చిత్రీకరణ బాగుంది.

ఎవరెలా చేశారు?

కింగ్ నాగార్జున, ఈ చిత్రంలో విక్రమ్ అనే రా ఏజెంట్ పాత్రలో కనిపిస్తారు. తన అక్క, మేనకోడలిని కాపాడుకునేందుకు ఆయన అనుక్షణం పోరాడుతుంటారు. ఎమోషనల్ సన్నివేశాల్లో, యాక్షన్ సీన్స్ లో నాగ్ నటన అదరహో అనిపించింది. కథానాయిక సోనాల్ చౌహన్ కూడా చక్కటి పాత్రలో కనిపించింది. పోరాట సన్నివేశాల్లో సోనాల్ మెప్పించింది. మేనకోడలి పాత్రలో అనికా సురేంద్రన్ నేచురల్ గా కనిపించింది. నాగ్ అక్కగా నటించిన గుల్ పనాగ్ హుందాగా కనిపించారు.

సినిమాని ఎంజాయ్ చేయొచ్చా?

ది ఘోస్ట్ చిత్రం యాక్షన్ సినిమాలను ఇష్టపడే వారికి కచ్చితంగా నచ్చుతుంది. హింస కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఖడ్గాలతో ఫైట్స్ ఉండటం వల్లన రక్తపాతం ఎక్కువ కనిపిస్తుంది. కానీ, అది కూడా వెరైటీగానే ఉంటుంది. నాగార్జునకి ఆయన మేనకోడలికి మధ్య వచ్చే సన్నివేశాలు బాగుంటాయి. తన మేనకోడలిని క్రమశిక్షణలో పెట్టే క్రమంలో వచ్చే సీన్స్ ఆకట్టుకుంటాయి. ఓవరాల్ గా సినిమాను ఎంజాయ్ చేయవచ్చు. మరింకెందుకు ఆలస్యం మీరు గనుక ‘ది ఘోస్ట్’ ఇంకా చూడకపోతే వెంటనే నెట్‌ఫ్లిక్స్ ద్వారా చూసేయండి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Netflix లో దూసుకెళ్తోన్న నాగార్జున నటించిన ‘The Ghost’ first appeared on 91Mobiles Telugu.

]]>
నాగార్జున నటించిన The Ghost మూవీ OTT అప్డేట్ https://www.91mobiles.com/telugu/nagarjuna-the-ghost-movie-ott-update-premiere-on-netflix/ Wed, 26 Oct 2022 16:08:42 +0000 https://www.91mobiles.com/telugu/?p=3088 హైలైట్స్ స్ట్రీమింగ్ పార్ట్నర్ ని ఖరారు చేసుకున్న The Ghost మూవీ నవంబర్ 2 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో ప్రసారం కానున్న చిత్రం ప్రధాన పాత్రల్లో నటించిన నాగార్జున, సోనాల్ చౌహన్, గుల పనాగ్, అనికా సురేంద్రన్ కింగ్ నాగార్జున నటించిన యాక్షన్ త్రిల్లర్ ది ఘోస్ట్ ఇటీవలె ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రైలర్ తోనే ఈ సినిమా ఆడియన్స్ లో మాంచి బజ్ క్రియేట్ చేసింది. అయితే విడుదల తర్వాత ఈ చిత్రం ఆశించిన ఫలితాన్ని […]

The post నాగార్జున నటించిన The Ghost మూవీ OTT అప్డేట్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • స్ట్రీమింగ్ పార్ట్నర్ ని ఖరారు చేసుకున్న The Ghost మూవీ
  • నవంబర్ 2 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో ప్రసారం కానున్న చిత్రం
  • ప్రధాన పాత్రల్లో నటించిన నాగార్జున, సోనాల్ చౌహన్, గుల పనాగ్, అనికా సురేంద్రన్

కింగ్ నాగార్జున నటించిన యాక్షన్ త్రిల్లర్ ది ఘోస్ట్ ఇటీవలె ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రైలర్ తోనే ఈ సినిమా ఆడియన్స్ లో మాంచి బజ్ క్రియేట్ చేసింది. అయితే విడుదల తర్వాత ఈ చిత్రం ఆశించిన ఫలితాన్ని అందుకోలేక పోయింది. సినిమాను సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయకపోవడంతో బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయితే యాక్షన్ లవర్స్ కి మాత్రం ఈ చిత్రం నచ్చే విధంగా ఉంది. ఏదేమైనా కాసులు కురిస్తేనే సినిమా హిట్టైనట్లు కదా. ఆ లెక్కన చూస్తే ఈ చిత్రం నిరాశనే మిగిల్చింది. ఈ చిత్రంలో నాగార్జున ప్రధాన పాత్రధారి. ఆయన సరసన సోనాల్ చౌహన్ నటించింది. గరుడ వేగ ఫేమ్ ప్రవీణ్ సత్తారు ఈ చిత్రానికి దర్శకుడు.

తాజాగా ది ఘోస్ట్ చిత్రం ఓటీటీ భాగస్వామిని ఖరారు చేసుకుంది. ఓటీటీ దిగ్గజం Netflix ఈ చిత్ర డిజిటల్ హక్కులను కైవసం చేసుకుంది. నవంబర్ 2 నుంచి ది ఘోస్ట్ చిత్రం నెట్‌ఫ్లిక్స్ లో ప్రసారం కానుంది. థియేటర్లలో సినిమా బాగా ఆడలేదు కానీ, యాక్షన్ సీక్వెన్సెస్ తెరకెక్కించిన విధానం, స్టైలిష్ గా వాటిని ప్రజెంట్ చేసిన తీరుకి సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి. సినిమా కథకు బ్లాక్ బస్టర్ అయ్యే సత్తా ఉంది కానీ, దర్శకుడు తన ఆలోచనలను ప్రజెంట్ చేయడంలో తడబడినట్లు పలువురు అభిప్రాయపడ్డారు.

ది ఘోస్ట్ చిత్రంలో నాగార్జున, సోనాల్ చౌహన్ కాకుండా, ఇంకా గుల్ పనాగ్, అనికా సురేంద్రన్, మనీశ్ చౌదరి, రవి వర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, బిలాల్ హొస్సేన్ ముఖ్య పాత్రలు పోషించారు. తొలుత కథానాయిక పాత్రకి కాజల్ అగర్వాల్ ని అనుకున్నారు. కానీ ప్రెగ్నెన్సీ కారణంగా కాజల్ డేట్స్ సర్దుబాటు చేయకపోవడంతో ఆ అవకాశం సోనాల్ కి దక్కింది.

సోనాలి రంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ & నార్త్ స్టార్ ఎంటర్టెయిన్మెంట్ బ్యానర్స్ పై ‘ది ఘోస్ట్’ చిత్రాన్ని సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ నిర్మించారు. ఈ చిత్రానికి భరత్-సౌరభ్ మరియు మార్క్ కే రాబిన్ సంగీతం అందించారు. మార్క్ కే రాబిన్ ది ఘోస్ట్ కి నేపథ్య సంగీతం సమకూర్చారు. ముకేశ్ జి ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్ గా చేశారు.

చిత్ర కథ:

ఈ చిత్ర కథ ఇంటర్‌పోల్ ఫీల్డ్ ఏజెంట్ విక్రమ్ చుట్టూ తిరుగుతుంది. ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కుమారుడిని రక్షించే మిషన్ పై ఉంటాడు విక్రమ్. యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూస్, గత జ్ఞాపకాలు పీడ కలల్లా వెంటాడుతున్నప్పటికీ, విక్రమ్ ఈ మిషన్ ని ఎంచుకుంటాడు. అయితే తర్వాత మరింత ఇబ్బందికర పరిస్థితుల్లోకి వెళ్తాడు విక్రమ్.

ఇక అటు తర్వాత జరిగిన వరుస సంఘటనలు ఎటువంటి మలుపులకు దారి తీశాయి, అలాగే తన సమస్యలతో పోరాడటంతో పాటు, మరోవైపు అండర్ వరల్డ్ ని ఎలా ఎదుర్కున్నాడనేది చిత్ర మిగతా కథ.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post నాగార్జున నటించిన The Ghost మూవీ OTT అప్డేట్ first appeared on 91Mobiles Telugu.

]]>