నాగార్జున నటించిన The Ghost మూవీ OTT అప్డేట్

హైలైట్స్

  • స్ట్రీమింగ్ పార్ట్నర్ ని ఖరారు చేసుకున్న The Ghost మూవీ
  • నవంబర్ 2 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో ప్రసారం కానున్న చిత్రం
  • ప్రధాన పాత్రల్లో నటించిన నాగార్జున, సోనాల్ చౌహన్, గుల పనాగ్, అనికా సురేంద్రన్

కింగ్ నాగార్జున నటించిన యాక్షన్ త్రిల్లర్ ది ఘోస్ట్ ఇటీవలె ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రైలర్ తోనే ఈ సినిమా ఆడియన్స్ లో మాంచి బజ్ క్రియేట్ చేసింది. అయితే విడుదల తర్వాత ఈ చిత్రం ఆశించిన ఫలితాన్ని అందుకోలేక పోయింది. సినిమాను సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయకపోవడంతో బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయితే యాక్షన్ లవర్స్ కి మాత్రం ఈ చిత్రం నచ్చే విధంగా ఉంది. ఏదేమైనా కాసులు కురిస్తేనే సినిమా హిట్టైనట్లు కదా. ఆ లెక్కన చూస్తే ఈ చిత్రం నిరాశనే మిగిల్చింది. ఈ చిత్రంలో నాగార్జున ప్రధాన పాత్రధారి. ఆయన సరసన సోనాల్ చౌహన్ నటించింది. గరుడ వేగ ఫేమ్ ప్రవీణ్ సత్తారు ఈ చిత్రానికి దర్శకుడు.

తాజాగా ది ఘోస్ట్ చిత్రం ఓటీటీ భాగస్వామిని ఖరారు చేసుకుంది. ఓటీటీ దిగ్గజం Netflix ఈ చిత్ర డిజిటల్ హక్కులను కైవసం చేసుకుంది. నవంబర్ 2 నుంచి ది ఘోస్ట్ చిత్రం నెట్‌ఫ్లిక్స్ లో ప్రసారం కానుంది. థియేటర్లలో సినిమా బాగా ఆడలేదు కానీ, యాక్షన్ సీక్వెన్సెస్ తెరకెక్కించిన విధానం, స్టైలిష్ గా వాటిని ప్రజెంట్ చేసిన తీరుకి సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి. సినిమా కథకు బ్లాక్ బస్టర్ అయ్యే సత్తా ఉంది కానీ, దర్శకుడు తన ఆలోచనలను ప్రజెంట్ చేయడంలో తడబడినట్లు పలువురు అభిప్రాయపడ్డారు.

ది ఘోస్ట్ చిత్రంలో నాగార్జున, సోనాల్ చౌహన్ కాకుండా, ఇంకా గుల్ పనాగ్, అనికా సురేంద్రన్, మనీశ్ చౌదరి, రవి వర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, బిలాల్ హొస్సేన్ ముఖ్య పాత్రలు పోషించారు. తొలుత కథానాయిక పాత్రకి కాజల్ అగర్వాల్ ని అనుకున్నారు. కానీ ప్రెగ్నెన్సీ కారణంగా కాజల్ డేట్స్ సర్దుబాటు చేయకపోవడంతో ఆ అవకాశం సోనాల్ కి దక్కింది.

సోనాలి రంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ & నార్త్ స్టార్ ఎంటర్టెయిన్మెంట్ బ్యానర్స్ పై ‘ది ఘోస్ట్’ చిత్రాన్ని సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ నిర్మించారు. ఈ చిత్రానికి భరత్-సౌరభ్ మరియు మార్క్ కే రాబిన్ సంగీతం అందించారు. మార్క్ కే రాబిన్ ది ఘోస్ట్ కి నేపథ్య సంగీతం సమకూర్చారు. ముకేశ్ జి ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్ గా చేశారు.

చిత్ర కథ:

ఈ చిత్ర కథ ఇంటర్‌పోల్ ఫీల్డ్ ఏజెంట్ విక్రమ్ చుట్టూ తిరుగుతుంది. ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కుమారుడిని రక్షించే మిషన్ పై ఉంటాడు విక్రమ్. యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూస్, గత జ్ఞాపకాలు పీడ కలల్లా వెంటాడుతున్నప్పటికీ, విక్రమ్ ఈ మిషన్ ని ఎంచుకుంటాడు. అయితే తర్వాత మరింత ఇబ్బందికర పరిస్థితుల్లోకి వెళ్తాడు విక్రమ్.

ఇక అటు తర్వాత జరిగిన వరుస సంఘటనలు ఎటువంటి మలుపులకు దారి తీశాయి, అలాగే తన సమస్యలతో పోరాడటంతో పాటు, మరోవైపు అండర్ వరల్డ్ ని ఎలా ఎదుర్కున్నాడనేది చిత్ర మిగతా కథ.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

Previous articleOxygenOS 13 Beta అప్డేట్ పొందే OnePlus ఫోన్స్ ఇవే
Next articleభారత్ లో లాంచ్ అయిన Nothing Ear (Stick) ట్రూ వైర్లెస్ ఇయర్ బడ్స్
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.