No Charger - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 13 Jul 2022 17:21:25 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Nothing Phone (1) ధర, స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/nothing-phone-1-india-launch-price-specifications-unboxing-no-charger-provided/ Wed, 13 Jul 2022 08:19:20 +0000 https://www.91mobiles.com/telugu/?p=933 హైలైట్స్: * Nothing Phone (1) ఛార్జర్ తో రావడం లేదు. * ఫోన్ కొనేవారు ఛార్జర్ ని వేరుగా కొనుక్కోవాల్సి ఉంటుంది. * 45W నథింగ్ పవర్ ఛార్జర్ ని రూ.2,500 కి కొనవచ్చు. ఇక ప్రీ-ఆర్డర్ కస్టమర్స్ కేవలం రూ.1,500 కి ఈ ఛార్జర్ ని పొందవచ్చు. అత్యంత హైప్ నడుమ నథింగ్ ఫోన్ (1) గత రాత్రి లాంచ్ అయ్యింది. నథింగ్ కంపెనీ నుంచి విడుదలైన తొలి స్మార్ట్ ఫోన్ ఇదే. వన్ […]

The post Nothing Phone (1) ధర, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

* Nothing Phone (1) ఛార్జర్ తో రావడం లేదు.

* ఫోన్ కొనేవారు ఛార్జర్ ని వేరుగా కొనుక్కోవాల్సి ఉంటుంది.

* 45W నథింగ్ పవర్ ఛార్జర్ ని రూ.2,500 కి కొనవచ్చు. ఇక ప్రీ-ఆర్డర్ కస్టమర్స్ కేవలం రూ.1,500 కి ఈ ఛార్జర్ ని పొందవచ్చు.

అత్యంత హైప్ నడుమ నథింగ్ ఫోన్ (1) గత రాత్రి లాంచ్ అయ్యింది. నథింగ్ కంపెనీ నుంచి విడుదలైన తొలి స్మార్ట్ ఫోన్ ఇదే. వన్ ప్లస్ సహ వ్యవస్థాపకుడైన కార్ల్ పే యొక్క ఆలోచనకు రూపం ఈ నథింగ్ ఫోన్ (1). ప్రీ-రిలీజ్ బజ్ తో ఈ ఫోన్ పై ఎక్కడలేని హైప్ ఏర్పడింది. ఎక్కడ చూసిన నథింగ్ ఫోన్ (1) గురించే జపించారు. ఔత్సాహికులు ఫోన్ ఎప్పుడు లాంచ్ అవుతుందా అని ఎదురు చూశారు. ఫోన్ బ్యాక్ ప్యానెల్ పై గ్లైఫ్ ఎల్ఈడీ లైట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇది ఫోన్ అమ్ముడయ్యేందుకు పెద్ద ప్లస్ పాయింట్ అవుతోంది.

ఫోన్ లాంచ్ తర్వాత అందరి మైండ్ లో ఒకే ప్రశ్న ఉత్పన్నమైంది. అదేంటంటే, నథింగ్ ఫోన్ (1) ఛార్జర్ తో వస్తుందా లేదా అని? అయితే ఆ సమాధానం మా వద్ద ఉంది. పదండి వివరాలు చూద్దాం.

Nothing Phone (1): బాక్స్ లో ఛార్జర్ ఉందా?

నథింగ్ ఫోన్ (1) ఛార్జర్ తో రావడం లేదు. యూజర్లు వేరుగా ఓ ఛార్జర్ ను కొనాల్సి ఉంటుంది. నథింగ్ పవర్ 45 వాట్ ఛార్జర్ ధర రూ.2,500. ప్రీ-ఆర్డర్ కస్టమర్లు ఛార్జర్ ని రూ.1,500 కే పొందవచ్చు.

ఇక బాక్స్ కంటెంట్స్ విషయానికి వస్తే, నథింగ్ ఫోన్ (1), యూజర్ మాన్యువల్, సిమ్ ఎజెక్టర్ పిన్, యూఎస్బీ-సీ టూ టైప్-సీ కేబుల్ ఉన్నాయి. బాక్స్ రీసైక్ల్డ్ మెటీరియల్స్ తో తయారు చేయబడిందని, ఫోన్ కూడా రీసైక్ల్డ్ అల్యూమినియమ్ మరియు ప్లాస్టిక్ కంపోనెంట్స్ తో తయారు కాబడిందని నథింగ్ వ్యవస్థాపకుడు కార్ల్ పే తెలిపాడు.

భారత్ లో Nothing Phone (1) ధర

8జిబి+128జిబి మోడల్ నథింగ్ ఫోన్ (1) ధర రూ.32,999 గా నిర్ణయించారు. 8జిబి+256జిబి మోడల్ ధర రూ.35,999 గా ఉంది. ఇక 12జిబి+256జిబి టాప్ వేరియంట్ ధర రూ.38,999. ఇంట్రడక్టరీ ఆఫర్ క్రింద నథింగ్ కంపెనీ ఫోన్ పై రూ.1,000 డిస్కౌంట్ ఇస్తోంది. ఇక హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే రూ.2,000 ఇన్ స్టంట్ డిస్కౌంట్ ను ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తోంది.

Nothing Phone (1) స్పెసిఫికేషన్స్

నథింగ్ ఫోన్ (1) లో 6.55 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 10-బిట్ హెచ్డీఆర్, 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 2400*1080 పిక్సెల్ రెజుల్యూషన్, 402పీపీఐ, 1200 నిట్స పీక్ బ్రైట్నెస్, సెల్ఫీ షూటర్ కోసం పంచ్ హోల్ కటౌట్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 778+జి చిప్సెట్, 12జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ, ఆండ్రాయిడ్ 12 ఆధారిత నథింగ్ ఓఎస్ స్కిన్, వంటి ఫీచర్లున్నాయి.

ఇక కెమెరాల విషయానికి వస్తే, నథింగ్ ఫోన్ (1) లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో ఒకటి 50ఎంపి సోనీ ఐఎంఎక్స్766 ప్రైమరీ సెన్సర్ (ఎఫ్/1.88 అపెర్చర్, ఓఐఎస్, ఈఐఎస్) కాగా, రెండోది 50ఎంపి శాంసంగ్ జెఎన్1 సెన్సర్ (ఎఫ్/2.2) అల్ట్రా-వైడ్ లెన్స్. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపు 16ఎంపి సోనీ ఐఎంఎక్స్471 సెన్సర్ ని అమర్చారు.

నథింగ్ ఫోన్ (1) లో 4,500ఎంఏహెచ్ బ్యాటరీ, 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 15వాట్ క్యూఐ వైర్లెస్ ఛార్జింగ్, 5వాట్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, ఐపీ53 రేటింగ్, 5జీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.2, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైపీ-సీ పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

The post Nothing Phone (1) ధర, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>