Nokia 3210 4G (2024) - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 11 Jun 2024 06:23:11 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Nokia 3210 4G: యూపీఐ సపోర్ట్‌తో భారత్‌లో లాంచైన నోకియా 3210 4జీ https://www.91mobiles.com/telugu/nokia-3210-4g-launched-in-india-with-upi-support/ Tue, 11 Jun 2024 06:23:11 +0000 https://www.91mobiles.com/telugu/?p=11993 ప్రముఖ మొబైల్ ఫోన్ బ్రాండ్ Nokia నుంచి తాజాగా ఒక కొత్త 4జీ ఫీచర్ ఫోన్ లాంచ్ అయ్యింది. Nokia 3210 4G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వచ్చింది. నోకియా బ్రాండ్ ఫోన్లకు ఒకప్పుడు ఉన్న క్రేజే వేరు. ప్రస్తుతం ఇంకా ఈ బ్రాండ్ ఫోన్లను కొంతమంది ఆదరిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్లు వాడే వారు సెకండరీ డివైజ్ గా నోకియా ఫీచర్ ఫోన్ తీసుకునేందుకు ఇష్టపడుతుంటారు. మరి, భారత్ లో లాంచైన Nokia 3210 4G […]

The post Nokia 3210 4G: యూపీఐ సపోర్ట్‌తో భారత్‌లో లాంచైన నోకియా 3210 4జీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో లాంచైన Nokia 3210 4G
  • యూపీఐ సపోర్ట్, 4జీ కనెక్టివిటీ
  • డివైజ్ ధర రూ.3,999

ప్రముఖ మొబైల్ ఫోన్ బ్రాండ్ Nokia నుంచి తాజాగా ఒక కొత్త 4జీ ఫీచర్ ఫోన్ లాంచ్ అయ్యింది. Nokia 3210 4G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వచ్చింది. నోకియా బ్రాండ్ ఫోన్లకు ఒకప్పుడు ఉన్న క్రేజే వేరు. ప్రస్తుతం ఇంకా ఈ బ్రాండ్ ఫోన్లను కొంతమంది ఆదరిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్లు వాడే వారు సెకండరీ డివైజ్ గా నోకియా ఫీచర్ ఫోన్ తీసుకునేందుకు ఇష్టపడుతుంటారు. మరి, భారత్ లో లాంచైన Nokia 3210 4G యొక్క ఫీచర్లు, స్పెసిఫికేషన్లు మరియు ధర వివరాలు తెలుసుకుందామా?

Nokia 3210 4G ధర, లభ్యత

Nokia 3210 4G స్మార్ట్‌ఫోన్ ధరను కంపెనీ రూ.3,999 గా నిర్ణయించింది. నేటి నుంచి ఈ ఫోన్ సేల్స్ మొదలయ్యాయి. Nokia 3210 4G డివైజ్ గ్రంజ్ బ్లాక్, స్కూబా బ్లూ మరియు వై2కే గోల్డ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. నోకియా అధికార వెబ్‌సైట్ మరియు ఈ-కామర్స్ సైట్ అమెజాన్ ద్వారా ఫోన్‌ని కొనుగోలు చేయవచ్చు.

Nokia 3210 4G ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

డిస్ప్లే: Nokia 3210 4G లో 2.4-ఇంచ్ స్క్రీన్, క్యూవీజీఏ పిక్సెల్ రెజుల్యూషన్, టీ9 కీ ప్యాడ్ ఉన్నాయి.

ప్రాసెసర్: Nokia 3210 4G డివైజ్ యూనిఎస్ఓసీ టీ107 ప్రాసెసర్ ను వాడారు. ఎస్30+ ఓఎస్ కస్టమ్ స్కిన్ పై ఫోన్ పని చేస్తుంది.

ర్యామ్, స్టోరేజీ: Nokia 3210 4G ఫీచర్ ఫోన్ 64ఎంబి ర్యామ్, 128జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 32జిబి వరకు మెమొరీని పెంచుకునే వీలుంది.

కెమెరా: Nokia 3210 4G లో 2 మెగా పిక్సెల్ రియర్ కెమెరా ఉంది. దీనికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది.

బ్యాటరీ: Nokia 3210 4G లో పవర్ బ్యాకప్ కోసం 1450 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఈ బ్యాటరీ 9.8 గంటల పాటు నిరవధిక టాక్ టైమ్ అందిస్తుంది.

కనెక్టివిటీ: Nokia 3210 4G లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్ 5.0, 3.5 ఎంఎం ఆడియో జాక్, 1 స్పీకర్, 1 మైక్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Nokia 3210 4G లో యూట్యూబ్ సపోర్ట్ ఉంది. అలాగే ఎంపీ3 ప్లేయర్, ఎఫ్ఎమ్ రేడియో ఉన్నాయి. ఇంకా క్లాసిక్ స్నేక్ గేమ్ ఈ ఫోన్ లో అందించారు. Nokia 3210 4G ఫోన్ ద్వారా యూపీఐ పేమెంట్స్ కూడా చేయవచ్చు.

The post Nokia 3210 4G: యూపీఐ సపోర్ట్‌తో భారత్‌లో లాంచైన నోకియా 3210 4జీ first appeared on 91Mobiles Telugu.

]]>
Nokia 3210 4G (2024): 25 ఏళ్ళ తర్వాత మళ్ళీ లాంచైన నోకియా ఫోన్ https://www.91mobiles.com/telugu/nokia-3210-4g-2024-launched-again-after-25-years/ Thu, 09 May 2024 08:00:47 +0000 https://www.91mobiles.com/telugu/?p=11434 Nokia మాతృ సంస్థ HMD కొన్ని రోజుల క్రితం తాము త్వరలో Nokia 3210 ని లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకుంది. Nokia 3210 2024 ఎడిషన్‌ని మార్కెట్ లోకి తీసుకొచ్చింది. అప్డేటెడ్ స్పెసిఫికేషన్స్, మోడర్న్ యాప్స్, క్లాసిక్ స్నేక్ గేమ్ తో ఈ ఫోన్ 25 ఏళ్ళ తర్వాత మళ్ళీ అరంగేట్రం చేసింది. దీంతో నోకియా 3210 అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఓసారి పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ధర వివరాలు […]

The post Nokia 3210 4G (2024): 25 ఏళ్ళ తర్వాత మళ్ళీ లాంచైన నోకియా ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Nokia 3210 2024 లాంచ్
  • క్లాసిక్ స్నేక్ గేమ్‌తో వచ్చిన ఫోన్
  • ఎఫ్ఎమ్ రేడియో, ఎంపీ3 ప్లేయర్

Nokia మాతృ సంస్థ HMD కొన్ని రోజుల క్రితం తాము త్వరలో Nokia 3210 ని లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకుంది. Nokia 3210 2024 ఎడిషన్‌ని మార్కెట్ లోకి తీసుకొచ్చింది. అప్డేటెడ్ స్పెసిఫికేషన్స్, మోడర్న్ యాప్స్, క్లాసిక్ స్నేక్ గేమ్ తో ఈ ఫోన్ 25 ఏళ్ళ తర్వాత మళ్ళీ అరంగేట్రం చేసింది. దీంతో నోకియా 3210 అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఓసారి పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ధర వివరాలు తెలుసుకుందాం.

Nokia 3210 (2024) ధర మరియు లభ్యత

Nokia 3210 (2024) స్మార్ట్‌ఫోన్ ఐరోపా మార్కెట్ లో 89 యూరోలతో లాంచ్ అయ్యింది. అంటే భారతీయ కరెన్సీలో దీన్ని రూ.7,990 గా చెప్పవచ్చు. ప్రస్తుతం జర్మనీ, స్పెయిన్ మరియు యూకే దేశాల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. వై2కే గోల్డ్, సుబా బ్లూ మరియు గ్రంజ్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. భారత్ లో Nokia 3210 2024 ఎడిషన్ ఎప్పుడు లాంచ్ అవుతుందో ఇంకా వెల్లడి కాలేదు.

Nokia 3210 (2024) స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Nokia 3210 డివైజ్ లో 2.4-ఇంచ్ టీఎఫ్‌టీ ఎల్సీడీ క్యూవీజీఏ కలర్ డిస్ప్లే ఉంటుంది. Nokia 3210 1999 మోడల్ 1.5-ఇంచ్ మోనోక్రోమ్ ప్యానెల్ తో వచ్చింది.

కెమెరా: Nokia 3210 2024 ఎడిషన్ లో బ్యాక్ ప్యానెల్ పై 2 మెగాపిక్సెల్ కెమెరా, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి.

ప్రాసెసర్: Nokia 3210 2024 డివైజ్ లో యూనిఎస్ఓసీ టీ107 చిప్సెట్ వాడారు.

సాఫ్ట్‌వేర్: Nokia 3210 2024 ఎడిషన్ ఎస్30+ ఆపరేటింగ్ సిస్టమ్ పై పని చేస్తుంది.

ర్యామ్, స్టోరేజీ: Nokia 3210 2024 ఎడిషన్ 64ఎంబి ర్యామ్, 128ఎంబి స్టోరేజీతో వచ్చింది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 32జిబి వరకు మెమొరీని పెంచుకోవచ్చు.

బ్యాటరీ: Nokia 3210 లో పవర్ బ్యాకప్ కోసం 1450 ఎంఏహెచ్ రిమ్యూవబుల్ బ్యాటరీ ఉంది. ఇది 9.8 గంటల వరకు టాక్ టైమ్ అందిస్తుంది.

కనెక్టివిటీ: Nokia 3210 2024 ఎడిషన్ లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్ 5.0, యూఎస్బీ-సీ పోర్ట్, ఎంపీ3 ప్లేయర్, ఒక స్పీకర్, ఒక మైక్, 3.5ఎంఎం ఆడియో జాక్, ఎఫ్ఎమ్ రేడియో ఉన్నాయి.

బరువు, చుట్టుకొలత: Nokia 3210 2024 డివైజ్ 122 మి.మీ పొడవు, 52 మి.మీ వెడల్పు, 13.14 మి.మీ మందం, 87.8 గ్రాముల బరువు ఉంటుంది.

యాప్స్: Nokia 3210 2024 డివైజ్ స్నేక్ గేమ్, యూట్యూబ్ షార్ట్స్, న్యూస్ అండ్ వెదర్ యాప్స్ కి సపోర్ట్ చేస్తుంది.

The post Nokia 3210 4G (2024): 25 ఏళ్ళ తర్వాత మళ్ళీ లాంచైన నోకియా ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>