Nokia 3210 4G (2024): 25 ఏళ్ళ తర్వాత మళ్ళీ లాంచైన నోకియా ఫోన్

Highlights

  • Nokia 3210 2024 లాంచ్
  • క్లాసిక్ స్నేక్ గేమ్‌తో వచ్చిన ఫోన్
  • ఎఫ్ఎమ్ రేడియో, ఎంపీ3 ప్లేయర్

Nokia మాతృ సంస్థ HMD కొన్ని రోజుల క్రితం తాము త్వరలో Nokia 3210 ని లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకుంది. Nokia 3210 2024 ఎడిషన్‌ని మార్కెట్ లోకి తీసుకొచ్చింది. అప్డేటెడ్ స్పెసిఫికేషన్స్, మోడర్న్ యాప్స్, క్లాసిక్ స్నేక్ గేమ్ తో ఈ ఫోన్ 25 ఏళ్ళ తర్వాత మళ్ళీ అరంగేట్రం చేసింది. దీంతో నోకియా 3210 అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఓసారి పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ధర వివరాలు తెలుసుకుందాం.

Nokia 3210 (2024) ధర మరియు లభ్యత

Nokia 3210 (2024) స్మార్ట్‌ఫోన్ ఐరోపా మార్కెట్ లో 89 యూరోలతో లాంచ్ అయ్యింది. అంటే భారతీయ కరెన్సీలో దీన్ని రూ.7,990 గా చెప్పవచ్చు. ప్రస్తుతం జర్మనీ, స్పెయిన్ మరియు యూకే దేశాల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. వై2కే గోల్డ్, సుబా బ్లూ మరియు గ్రంజ్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. భారత్ లో Nokia 3210 2024 ఎడిషన్ ఎప్పుడు లాంచ్ అవుతుందో ఇంకా వెల్లడి కాలేదు.

Nokia 3210 (2024) స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Nokia 3210 డివైజ్ లో 2.4-ఇంచ్ టీఎఫ్‌టీ ఎల్సీడీ క్యూవీజీఏ కలర్ డిస్ప్లే ఉంటుంది. Nokia 3210 1999 మోడల్ 1.5-ఇంచ్ మోనోక్రోమ్ ప్యానెల్ తో వచ్చింది.

కెమెరా: Nokia 3210 2024 ఎడిషన్ లో బ్యాక్ ప్యానెల్ పై 2 మెగాపిక్సెల్ కెమెరా, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి.

ప్రాసెసర్: Nokia 3210 2024 డివైజ్ లో యూనిఎస్ఓసీ టీ107 చిప్సెట్ వాడారు.

సాఫ్ట్‌వేర్: Nokia 3210 2024 ఎడిషన్ ఎస్30+ ఆపరేటింగ్ సిస్టమ్ పై పని చేస్తుంది.

ర్యామ్, స్టోరేజీ: Nokia 3210 2024 ఎడిషన్ 64ఎంబి ర్యామ్, 128ఎంబి స్టోరేజీతో వచ్చింది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 32జిబి వరకు మెమొరీని పెంచుకోవచ్చు.

బ్యాటరీ: Nokia 3210 లో పవర్ బ్యాకప్ కోసం 1450 ఎంఏహెచ్ రిమ్యూవబుల్ బ్యాటరీ ఉంది. ఇది 9.8 గంటల వరకు టాక్ టైమ్ అందిస్తుంది.

కనెక్టివిటీ: Nokia 3210 2024 ఎడిషన్ లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్ 5.0, యూఎస్బీ-సీ పోర్ట్, ఎంపీ3 ప్లేయర్, ఒక స్పీకర్, ఒక మైక్, 3.5ఎంఎం ఆడియో జాక్, ఎఫ్ఎమ్ రేడియో ఉన్నాయి.

బరువు, చుట్టుకొలత: Nokia 3210 2024 డివైజ్ 122 మి.మీ పొడవు, 52 మి.మీ వెడల్పు, 13.14 మి.మీ మందం, 87.8 గ్రాముల బరువు ఉంటుంది.

యాప్స్: Nokia 3210 2024 డివైజ్ స్నేక్ గేమ్, యూట్యూబ్ షార్ట్స్, న్యూస్ అండ్ వెదర్ యాప్స్ కి సపోర్ట్ చేస్తుంది.