Nokia G22 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 09 Mar 2023 09:24:25 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 ఎండబ్ల్యూసీ 2023: 90హెర్ట్జ్ డిస్ప్లే, 50ఎంపి కెమెరాతో లాంచైన Nokia C22, C32, G22 https://www.91mobiles.com/telugu/nokia-c22-nokia-c32-nokia-g22-launched-mwc-2023-barcelona-price-specs/ Sun, 26 Feb 2023 17:15:31 +0000 https://www.91mobiles.com/telugu/?p=5101 హెచ్‌ఎండీ గ్లోబల్ కి చెందిన నోకియా బ్రాండ్ స్పెయిన్ లోని బార్సిలోనాలో జరుగుతోన్న ఎండబ్ల్యూసీ 2023 ఈవెంట్ లో Nokia G22, Nokia C32, Nokia C22 ఫోన్లను లాంచ్ చేసింది. ఈ ఫోన్లు 3 రోజుల బ్యాటరీ లైఫ్, బెటర్ ఇమేజింగ్ క్వాలిటీస్ తో వచ్చాయి. Nokia G22 హైలీ రిపెయిరబుల్ డివైజ్ అని కంపెనీ చెబుతోంది. మరోవైపు Nokia C32 ఉత్తమమైన ఇమేజింగ్ సిస్టమ్ కలిగిన సీ-సిరీస్ ఫోన్ అని సమాచారం. ఇకపోతే Nokia […]

The post ఎండబ్ల్యూసీ 2023: 90హెర్ట్జ్ డిస్ప్లే, 50ఎంపి కెమెరాతో లాంచైన Nokia C22, C32, G22 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గ్లోబల్ గా Nokia C22, Nokia C32, Nokia G22 ఫోన్లను లాంచ్ చేసిన నోకియా కంపెనీ
  • మంచి బిల్డ్ క్వాలిటీతో వచ్చిన Nokia C22, మోస్ట్ అడ్వాన్స్డ్ ఇమేజింగ్ సిస్టమ్ తో వచ్చిన Nokia C32
  • హై-రిపెయిరబులిటీ తో వచ్చిన Nokia G22, ఐఫిక్సిట్ టూల్స్ తో రిపెయిర్ చేయదగిన Nokia G22

హెచ్‌ఎండీ గ్లోబల్ కి చెందిన నోకియా బ్రాండ్ స్పెయిన్ లోని బార్సిలోనాలో జరుగుతోన్న ఎండబ్ల్యూసీ 2023 ఈవెంట్ లో Nokia G22, Nokia C32, Nokia C22 ఫోన్లను లాంచ్ చేసింది. ఈ ఫోన్లు 3 రోజుల బ్యాటరీ లైఫ్, బెటర్ ఇమేజింగ్ క్వాలిటీస్ తో వచ్చాయి. Nokia G22 హైలీ రిపెయిరబుల్ డివైజ్ అని కంపెనీ చెబుతోంది. మరోవైపు Nokia C32 ఉత్తమమైన ఇమేజింగ్ సిస్టమ్ కలిగిన సీ-సిరీస్ ఫోన్ అని సమాచారం. ఇకపోతే Nokia C22 స్మార్ట్ ఫోన్ మంచి బిల్డ్ క్వాలిటీతో వచ్చిందని నోకియా చెబుతోంది.

Nokia G22, C32, C22 ధర, లభ్యత

Nokia C22 రెండు ర్యామ్ వేరియంట్స్ లో లభిస్తుంది. అవి: 2జిబి+64జిబి, 3జిబి+64జిబి. ధరలు 129 యూరోలు (సుమారు రూ.11,310) తో ప్రారంభమవుతాయి. Nokia C22 మిడ్నైట్ బ్లాక్, స్యాండ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Nokia C32 డివైజ్ 3జిబి + 64జిబి మరియు 4జిబి + 128జిబి వేరియంట్స్ లో లభించనుంది. ఈ ఫోన్ ధరలు 129 యూరోలు (రూ.12,187) తో ప్రారంభమవుతుంది. చార్కోల్, ఆటమ్న్ గ్రీన్, బీచ్ పింక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Nokia G22 స్మార్ట్ ఫోన్ మీటియోర్ గ్రే, లగూన్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ 4జిబి+64జిబి మరియు 4జిబి+128జిబి వేరియంట్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ ధర రూ.179 యూరోలు (రూ.15,694) తో ప్రారంభమవుతుంది.

Nokia G22, C32, C22 స్పెసిఫికేషన్స్

Nokia C22 స్మార్ట్ ఫోన్ ఐపీ52 స్ప్లాష్ అండ్ డస్ట్ ప్రొటెక్షన్, టఫెండ్ 2.5డీ డిస్ప్లే గ్లాస్, రిజిడ్ మెటల్ చాసిస్, పాలీకార్బొనేట్ యూనిబాడీ డిజైన్ తో దృఢమైన నిర్మాణంతో వచ్చింది. ఈ డివైజ్ లో యూనిఎస్ఓసీ 9863ఏ1 ప్రాసెసర్ వాడారు. ఈ ఫోన్ 3జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ తో వచ్చింది. మెమొరీని 256జిబి వరకు పెంచుకోవచ్చు.

ఈ డివైజ్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 10 వాట్ చార్జింగ్, 6.5-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 13ఎంపి డ్యూయల్ కెమెరా, 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఈ డివైజ్ 4జీ ఎల్టీఈ, డ్యూయల్ సిమ్, వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.

Nokia C32 50ఎంపి మెయిన్ కెమెరాతో వచ్చింది. ఈ ఫోన్ ఇప్పటి వరకు వచ్చిన సీ-సిరీస్ డివైజెస్ లో ఉత్తమమైనదని కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్ లో మెయిన్ కెమెరాతో పాటు 2ఎంపి మ్యాక్రో సెన్సర్ ఉంటుంది. ఇంకా సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఈ డివైజ్ 4జిబి ర్యామ్ వేరియంట్ లో లభిస్తుంది. మిగతా ఫీచర్లు Nokia C22 మాదిరే ఉంటాయి.

Nokia G22 స్మార్ట్ ఫోన్ లో యూనిఎస్ఓసీ టీ606 చిప్సెట్ ను వాడారు. ఈ ఫోన్ 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ తో లాంచైంది. ఈ డివైజ్ లో 6.5-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఉన్నాయి. ఈ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి.

ఈ డివైజ్ నోకియా కంపెనీ ప్రకారం, అత్యధిక రిపెయిరింగ్ సంభావ్యతను కలిగి ఉందని తెలుస్తోంది. ఐఫిక్సిట్ తో నోకియా జట్టు కట్టి మాన్యువల్స్, పార్ట్స్ ని రోలౌట్ చేయబోతోంది. Nokia G22 లో ఫింగర్ ప్రింట్ స్కానర్, 5050 ఎంఏహెచ్ బ్యాటరీ, 20 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై పని చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post ఎండబ్ల్యూసీ 2023: 90హెర్ట్జ్ డిస్ప్లే, 50ఎంపి కెమెరాతో లాంచైన Nokia C22, C32, G22 first appeared on 91Mobiles Telugu.

]]>
4GB ర్యామ్, UniSoc T606 చిప్సెట్‌తో వస్తోన్న Nokia G22 https://www.91mobiles.com/telugu/nokia-g22-spotted-geekbench-listing-key-specifications/ Sun, 12 Feb 2023 13:08:04 +0000 https://www.91mobiles.com/telugu/?p=4883 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ నోకియా త్వరలోనే జీ-సిరీస్ లో Nokia G22 అనే కొత్త ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ డివైజ్ బెంచ్ మార్కింగ్ సైట్ Geekbench పై కనిపించింది. త్వరలో లాంచ్ కాబోయే Nokia G22 ఫోన్ 4జిబి ర్యామ్, యూనిసాక్ ప్రాసెసర్ తో లాంచ్ కానుందని సమాచారం. Nokia G22 స్మార్ట్ ఫోన్ గతేడాది లాంచైన Nokia G21 కి సక్సెసర్ గా వస్తోంది. ఇక Nokia G21 […]

The post 4GB ర్యామ్, UniSoc T606 చిప్సెట్‌తో వస్తోన్న Nokia G22 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఆక్టాకోర్ 1.8 గిగాహెర్ట్జ్ UniSoc T606 ప్రాసెసర్ తో వస్తోన్న Nokia G22
  • ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై పని చేయనున్న Nokia G22 స్మార్ట్ ఫోన్
  • 6.5-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తోన్న Nokia G22 డివైజ్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ నోకియా త్వరలోనే జీ-సిరీస్ లో Nokia G22 అనే కొత్త ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ డివైజ్ బెంచ్ మార్కింగ్ సైట్ Geekbench పై కనిపించింది. త్వరలో లాంచ్ కాబోయే Nokia G22 ఫోన్ 4జిబి ర్యామ్, యూనిసాక్ ప్రాసెసర్ తో లాంచ్ కానుందని సమాచారం.

Nokia G22 స్మార్ట్ ఫోన్ గతేడాది లాంచైన Nokia G21 కి సక్సెసర్ గా వస్తోంది. ఇక Nokia G21 డివైజ్ 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, రూ.12,999 ధరతో లాంచైంది. ఇక రాబోవు Nokia G22 స్మార్ట్ ఫోన్ లాంచ్ తేదీ ఇంకా ఖరారు కావాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ గీక్ బెంచ్ లిస్టింగ్ ద్వారా బయటకు వచ్చాయి. అవేంటో తెలుసుకుందాం పదండి.

Nokia G22 గీక్‌బెంచ్ స్కోర్

Nokia G22 స్మార్ట్ ఫోన్ సింగిల్ కోర్ టెస్ట్ లో 308 పాయింట్లు నమోదు చేసింది. మల్టీ-కోర్ టెస్ట్ లో 1094 పాయింట్లు సాధించింది. స్పెసిఫికేషన్స్ ని బట్టి చూస్తే, ఈ రేటింగ్స్ లో-కాస్ట్ స్మార్ట్ ఫోన్ కి మంచివేనని చెప్పవచ్చు.

Nokia G22 స్పెసిఫికేషన్స్

Nokia G22 స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇంకా పూర్తిగా తెలియవు. అయితే గీక్ బెంచ్ లిస్టింగ్ ద్వారా MySmartPrice వెబ్ సైట్ Nokia G22 యొక్క స్పెసిఫికేషన్స్ ని తన కథనంలో ప్రచురించింది. ఆ రిపోర్ట్ ప్రకారం, Nokia G22 డివైజ్ ఆక్టాకోర్ 1.8 గిగాహెర్ట్జ్ UniSoc T606 ప్రాసెసర్, మాలి-జీ57 జీపీయూ ని కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ 4జిబి ర్యామ్ తో వస్తోంది. సాఫ్ట్ వేర్ విషయానికి వస్తే, Nokia G22 డివైజ్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత స్టాక్ ఆండ్రాయిడ్ యూఐ పై పని చేస్తుంది.

ఇదిలా ఉండగా, గతేడాది లాంచైన Nokia G21 స్మార్ట్ ఫోన్ 6.5-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వచ్చింది. ఈ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్, 2ఎంపి డెప్త్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

Nokia G22 స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5,050 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో 3.5 ఎంఎం ఆడియో జాక్ ఉంటుంది. ఈ ఫోన్ లో భద్రత కోసం ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చారు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 4GB ర్యామ్, UniSoc T606 చిప్సెట్‌తో వస్తోన్న Nokia G22 first appeared on 91Mobiles Telugu.

]]>