
హెచ్‌ఎండీ గ్లోబల్ కి చెందిన నోకియా బ్రాండ్ స్పెయిన్ లోని బార్సిలోనాలో జరుగుతోన్న ఎండబ్ల్యూసీ 2023 ఈవెంట్ లో Nokia G22, Nokia C32, Nokia C22 ఫోన్లను లాంచ్ చేసింది. ఈ ఫోన్లు 3 రోజుల బ్యాటరీ లైఫ్, బెటర్ ఇమేజింగ్ క్వాలిటీస్ తో వచ్చాయి. Nokia G22 హైలీ రిపెయిరబుల్ డివైజ్ అని కంపెనీ చెబుతోంది. మరోవైపు Nokia C32 ఉత్తమమైన ఇమేజింగ్ సిస్టమ్ కలిగిన సీ-సిరీస్ ఫోన్ అని సమాచారం. ఇకపోతే Nokia C22 స్మార్ట్ ఫోన్ మంచి బిల్డ్ క్వాలిటీతో వచ్చిందని నోకియా చెబుతోంది.
Nokia G22, C32, C22 ధర, లభ్యత
Nokia C22 రెండు ర్యామ్ వేరియంట్స్ లో లభిస్తుంది. అవి: 2జిబి+64జిబి, 3జిబి+64జిబి. ధరలు 129 యూరోలు (సుమారు రూ.11,310) తో ప్రారంభమవుతాయి. Nokia C22 మిడ్నైట్ బ్లాక్, స్యాండ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
Nokia C32 డివైజ్ 3జిబి + 64జిబి మరియు 4జిబి + 128జిబి వేరియంట్స్ లో లభించనుంది. ఈ ఫోన్ ధరలు 129 యూరోలు (రూ.12,187) తో ప్రారంభమవుతుంది. చార్కోల్, ఆటమ్న్ గ్రీన్, బీచ్ పింక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
Nokia G22 స్మార్ట్ ఫోన్ మీటియోర్ గ్రే, లగూన్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ 4జిబి+64జిబి మరియు 4జిబి+128జిబి వేరియంట్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ ధర రూ.179 యూరోలు (రూ.15,694) తో ప్రారంభమవుతుంది.
Nokia G22, C32, C22 స్పెసిఫికేషన్స్
Nokia C22 స్మార్ట్ ఫోన్ ఐపీ52 స్ప్లాష్ అండ్ డస్ట్ ప్రొటెక్షన్, టఫెండ్ 2.5డీ డిస్ప్లే గ్లాస్, రిజిడ్ మెటల్ చాసిస్, పాలీకార్బొనేట్ యూనిబాడీ డిజైన్ తో దృఢమైన నిర్మాణంతో వచ్చింది. ఈ డివైజ్ లో యూనిఎస్ఓసీ 9863ఏ1 ప్రాసెసర్ వాడారు. ఈ ఫోన్ 3జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ తో వచ్చింది. మెమొరీని 256జిబి వరకు పెంచుకోవచ్చు.
ఈ డివైజ్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 10 వాట్ చార్జింగ్, 6.5-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 13ఎంపి డ్యూయల్ కెమెరా, 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఈ డివైజ్ 4జీ ఎల్టీఈ, డ్యూయల్ సిమ్, వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.
Nokia C32 50ఎంపి మెయిన్ కెమెరాతో వచ్చింది. ఈ ఫోన్ ఇప్పటి వరకు వచ్చిన సీ-సిరీస్ డివైజెస్ లో ఉత్తమమైనదని కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్ లో మెయిన్ కెమెరాతో పాటు 2ఎంపి మ్యాక్రో సెన్సర్ ఉంటుంది. ఇంకా సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఈ డివైజ్ 4జిబి ర్యామ్ వేరియంట్ లో లభిస్తుంది. మిగతా ఫీచర్లు Nokia C22 మాదిరే ఉంటాయి.
Nokia G22 స్మార్ట్ ఫోన్ లో యూనిఎస్ఓసీ టీ606 చిప్సెట్ ను వాడారు. ఈ ఫోన్ 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ తో లాంచైంది. ఈ డివైజ్ లో 6.5-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఉన్నాయి. ఈ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి.
ఈ డివైజ్ నోకియా కంపెనీ ప్రకారం, అత్యధిక రిపెయిరింగ్ సంభావ్యతను కలిగి ఉందని తెలుస్తోంది. ఐఫిక్సిట్ తో నోకియా జట్టు కట్టి మాన్యువల్స్, పార్ట్స్ ని రోలౌట్ చేయబోతోంది. Nokia G22 లో ఫింగర్ ప్రింట్ స్కానర్, 5050 ఎంఏహెచ్ బ్యాటరీ, 20 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై పని చేస్తుంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.











