Nokia G60 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 08 Nov 2022 05:56:40 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 ఫస్ట్ సేల్: 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో వచ్చిన Nokia G60 5G https://www.91mobiles.com/telugu/nokia-g60-5g-first-sale-india-price-specs/ Tue, 08 Nov 2022 05:29:04 +0000 https://www.91mobiles.com/telugu/?p=3296 హైలైట్స్ ఇటీవలె భారత్ లో లాంచ్ అయిన Nokia G60 5G నేటి నుంచి Nokia G60 5G స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ ప్రారంభం 120 హెర్ట్జ్ డిస్ప్లే, 50 ఎంపి కెమెరా, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్ ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ నోకియా ఇటీవలె భారత్ లో Nokia G60 5G అనే మరొక జీ-సిరీస్ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. నేటి నుంచి ఈ ఫోన్ […]

The post ఫస్ట్ సేల్: 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో వచ్చిన Nokia G60 5G first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • ఇటీవలె భారత్ లో లాంచ్ అయిన Nokia G60 5G
  • నేటి నుంచి Nokia G60 5G స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ ప్రారంభం
  • 120 హెర్ట్జ్ డిస్ప్లే, 50 ఎంపి కెమెరా, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ నోకియా ఇటీవలె భారత్ లో Nokia G60 5G అనే మరొక జీ-సిరీస్ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. నేటి నుంచి ఈ ఫోన్ సేల్స్ మొదలవుతున్నాయి. Nokia G60 5G కంపెనీ యొక్క అత్యంత పర్యావరణహిత జీ-సిరీస్ స్మార్ట్ ఫోన్ గా నిలిచింది. దీన్ని 100 శాతం రీసైకిల్ చేసిన పాలికార్బొనేట్ బ్యాక్ మరియు 60 శాతం రీసైకిల్ చేయబడిన పాలికార్బొనేట్ ఫ్రేమ్ తో తయారు చేశారు. Nokia G60 5G పై నోకియా రెండేళ్ళ వ్యారంటీని కూడా అందిస్తోంది.

Nokia G60 5G స్మార్ట్ ఫోన్ 120Hz ఎల్సీడీ ప్యానెల్, 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా కలిగి ఉంది. ఈ ఫోన్ లో Snapdragon 695 ప్రాసెసర్, 4500mAh బ్యాటరీ ఉన్నాయి. ఈ డివైజ్ స్టాక్ ఆండ్రాియడ్ పై నడుస్తుంది. అలాగే 3 ఏళ్ళ పాటు అప్డేట్స్ ఇవ్వనున్నట్లు కంపెనీ హామీ ఇచ్చింది. ఓసారి Nokia G60 5G యొక్క భారత మార్కెట్ ధర, స్పెసిఫికేషన్స్, ఫీచర్ల వివరాలు తెలుసుకుందాం పదండి.

Nokia G60 5G ధర, లభ్యత

Nokia G60 5G స్మార్ట్ ఫోన్ 6జిబి ర్యామ్ + 128జిబి ఇంటర్నల్ స్టోరేజీ తో వస్తోంది. ఈ ఫోన్ ధరను భారత మార్కెట్ లో రూ.29,999 గా నిర్ణయించారు. నోకియా ఇండియా వెబ్‌సైట్ మరియు ఇతర రిటైల్ స్టోర్స్ ద్వారా ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు.

Nokia G60 5G స్పెసిఫికేషన్స్

Nokia G60 5G స్మార్ట్ ఫోన్ లో 6.58-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే అందించారు. ఇది 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది. ఇందులో 500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంది. డిస్ప్లే ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ని అందించారు. ఈ డిస్ప్లే వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్ తో వచ్చింది.

Nokia G60 5G స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 ప్రాసెసర్ అమర్చారు. ఇదొక ఆక్టాకోర్ చిప్. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 619 జీపీయూ ని వాడారు. ఈ ఫోన్ లో 6జిబి ఎల్సీడీడీఆర్4ఎక్స్ ర్యామ్ మరియు 128జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీని అందించారు. ఈ హ్యాండ్సెట్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ తో ప్రీ-లోడ్ అయి వస్తోంది. Nokia G60 5G కి మూడేళ్ళ పాటు ఆండ్రాయిడ్ ఓఎస్ అప్డేట్స్ ఇస్తామని కంపెనీ హామీ ఇచ్చింది.

ఇప్పుడు Nokia G60 5G యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 5 మెగా పిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 8 మెగా పిక్సెల్ కెమెరాను అందించారు.

Nokia G60 5G లో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 20 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ హ్యాండ్సెట్ లో భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ని అందించారు. పవర్ బటన్ లో ఫింగర్ ప్రింట్ స్కానర్ నిక్షిప్తమై ఉంటుంది. ఈ ఫోన్లో మైక్రోఎస్డీ కార్డ్ ఆప్షన్, 3.5 ఎంఎం ఆడియో జాక్ కూడా ఉన్నాయి. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం టైప్-సీ పోర్ట్ ని అందించారు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post ఫస్ట్ సేల్: 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో వచ్చిన Nokia G60 5G first appeared on 91Mobiles Telugu.

]]>
భారత్ లో లాంచ్ అయిన Nokia G60 5G; ఫోన్ కొనుగోలుపై వైర్డ్ ఇయర్ బడ్స్ ఉచితం https://www.91mobiles.com/telugu/nokia-g60-5g-launched-india-price-specs-availability/ Wed, 02 Nov 2022 10:22:23 +0000 https://www.91mobiles.com/telugu/?p=3195 హైలైట్స్ భారత మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన Nokia G60 5G స్మార్ట్ ఫోన్ 6జిబి ర్యామ్, స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్, 120 హెర్ట్జ్ డిస్ప్లే, 50 ఎంపి కెమెరా ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్ భారత్ లో Nokia G60 5G ధర రూ.29,999 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ నోకియా భారత మార్కెట్ లో Nokia G60 5G స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ 120 హెర్ట్జ్ డిస్ప్లే, […]

The post భారత్ లో లాంచ్ అయిన Nokia G60 5G; ఫోన్ కొనుగోలుపై వైర్డ్ ఇయర్ బడ్స్ ఉచితం first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • భారత మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన Nokia G60 5G స్మార్ట్ ఫోన్
  • 6జిబి ర్యామ్, స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్, 120 హెర్ట్జ్ డిస్ప్లే, 50 ఎంపి కెమెరా ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్
  • భారత్ లో Nokia G60 5G ధర రూ.29,999

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ నోకియా భారత మార్కెట్ లో Nokia G60 5G స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ 120 హెర్ట్జ్ డిస్ప్లే, 50ఎంపి కెమెరా, 6జిబి ర్యామ్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ తో లాంచ్ అయ్యింది. Nokia G60 5G ధరనున రూ.29,999 గా నిర్ణయించారు. ఈ ఫోన్ నవంబర్ 8 నుంచి భారత్ లో సేల్ కి వస్తోంది. Nokia G60 5G యొక్క స్పెసిఫికేషన్స్ ఇతర వివరాలు తెలుసుకుందాం పదండి.

Nokia G60 5G ధర

Nokia G60 5G యొక్క ధర మరియు విక్రయం గురించి తెలుసుకుందాం. Nokia G60 5G స్మార్ట్ ఫోన్ సింగిల్ వేరియంట్ లో మాత్రమే లాంచ్ అయ్యింది. 128జిబి స్టోరేజీ, 6జిబి ర్యామ్ తో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ ధరను భారత్ లో రూ.29,999 గా నిర్ణయించారు. నవంబర్ 8 నుంచి ఈ ఫోన్ అమ్మకానికి వస్తోంది. ఈ ఫోన్ బ్లాక్ మరియు ఐస్ కలర్ వేరియంట్స్ లో లభించనుంది. Nokia G60 5G కొనుగోలు పై రూ.3599 విలువ గల నోకియా వైర్డ్ బడ్స్ ఉచితంగా పొందవచ్చు. నేటి నుంచి ఈ ఫోన్ ప్రీ-బుకింగ్స్ మొదలయ్యాయి. నవంబర్ 7 వరకు ప్రీ-బుకింగ్స్ కొనసాగుతాయి.

Nokia G60 5G స్పెసిఫికేషన్స్

Nokia G60 5G 20:9 యాస్పెక్ట్ రేషియో, 6.58-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 1080*2400 పిక్సెల్స్ రెజుల్యూషన్ ని కలిగి ఉంది. ఈ ఫోన్ యొక్క స్క్రీన్ ఎల్సీడీ ప్యానెల్ తో తయారైంది. ఈ స్క్రీన్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ మరియు 500 నిట్స్ బ్రైట్నెస్ ని కలిగి ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 తో డిస్ప్లే కి ప్రొటెక్షన్ కల్పించారు. Nokia G60 5G స్మార్ట్ ఫోన్ 165.99 మిల్లీ మీటర్ల పొడవు, 75.93 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.61 మిల్లీ మీటర్ల మందం, 190 గ్రాముల బరువు ఉంటుంది.

Nokia G60 5G స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, 5ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ ప్యానెల్ పై 8 మెగా పిక్సెల్ కెమెరాను అందించారు.

Nokia G60 5G స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ అమర్చారు. ఈ ఫోన్ పర్యావరణహితమైన మెటీరియల్ తో తయారైంది. ఈ ఫోన్ ఐపీ52 డస్ట్ అండ్ వాటర్ ప్రూఫ్ రేటింగ్ తో వస్తోంది. భద్రత కోసం ఈ ఫోన్ లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అందించారు. పవర్ బ్యాకప్ కోసం Nokia G60 5G లో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 20 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post భారత్ లో లాంచ్ అయిన Nokia G60 5G; ఫోన్ కొనుగోలుపై వైర్డ్ ఇయర్ బడ్స్ ఉచితం first appeared on 91Mobiles Telugu.

]]>
120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో వస్తోన్న Nokia G60 5G https://www.91mobiles.com/telugu/nokia-g60-5g-india-launch-timeline-specs-revealed/ Mon, 31 Oct 2022 08:32:21 +0000 https://www.91mobiles.com/telugu/?p=3138 హైలైట్స్ త్వరలో భారత మార్కెట్ లో లాంచ్ కానున్న Nokia G60 5G 2022 బెర్లిన్ ఈవెంట్ లో Nokia G60 5G ని అనౌన్స్ చేసిన HMD Global స్నాప్ డ్రాగన్ 695 5జి చిప్, 120 హెర్ట్జ్ డిస్ప్లే, 50ఎంపి కెమెరా ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్ HMD Global సంస్థ పలు కొత్త నోకియా స్మార్ట్ ఫోన్స్ ని నోకియా టీ21 ట్యాబ్లెట్ తో కలిపి 2022 సెప్టెంబర్ లో బెర్లిన్ లో […]

The post 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో వస్తోన్న Nokia G60 5G first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • త్వరలో భారత మార్కెట్ లో లాంచ్ కానున్న Nokia G60 5G
  • 2022 బెర్లిన్ ఈవెంట్ లో Nokia G60 5G ని అనౌన్స్ చేసిన HMD Global
  • స్నాప్ డ్రాగన్ 695 5జి చిప్, 120 హెర్ట్జ్ డిస్ప్లే, 50ఎంపి కెమెరా ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్

HMD Global సంస్థ పలు కొత్త నోకియా స్మార్ట్ ఫోన్స్ ని నోకియా టీ21 ట్యాబ్లెట్ తో కలిపి 2022 సెప్టెంబర్ లో బెర్లిన్ లో జరిగిన ఈవెంట్ లో లాంచ్ చేసింది. ఇప్పుడు నోకియా జి-సిరీస్ లో Nokia G60 5G అనే కొత్త ఫోన్ ని భారత మార్కెట్ లో లాంచ్ చేసేందుకు హెచ్ఎండీ గ్లోబల్ కంపెనీ సిద్ధమవుతోంది.

త్వరలోనే Nokia G60 5G స్మార్ట్ ఫోన్ ని భారత్ లో లాంచ్ చేయబోతున్నట్లు నోకియా మొబైల్ ఇండియా ప్రకటించింది. అలాగే త్వరలోనే ప్రీ-బుకింగ్, ఆఫర్స్ వివరాలు వెల్లడించనున్నట్లు కంపెనీ తెలిపింది. Nokia G60 5G స్నాప్ డ్రాగన్ చిప్సెట్ తో వస్తోంది. కొన్ని నెలల క్రితం ఈ ఫోన్ నోకియా ఎక్స్30 5జీ, నోకియా సీ31 స్మార్ట్ ఫోన్స్ తో పాటు అనౌన్స్ అయ్యింది.

Nokia G60 5G ఇండియా లాంచ్ ఖరారు

Nokia G60 5G త్వరలో భారత్ లో లాంచ్ కాబోతున్నట్లు ట్విట్టర్ ద్వారా నోకియా ఇండియా ప్రకటించింది. ఈ ఫోన్ రెండు కలర్ ఆప్షన్స్ లో లభించనుంది. Nokia G60 5G నలుపు, తెలుపు రంగు ఎంపికల్లో లభిస్తుంది. ట్విట్టర్ లో కంపెనీ పోస్ట్ చేసిన టీజర్ ని బట్టి, రానున్న వారాల్లో Nokia G60 5G ని లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి కంపెనీ నుంచి స్పష్టత లేదు.

Nokia G60 5G స్పెసిఫికేషన్స్

Nokia G60 5G స్మార్ట్ ఫోన్ 6.58-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్, 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉన్నాయి. Nokia G60 5G లో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 20 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. టైప్-సీ పోర్ట్ ద్వారా చార్జింగ్ చేసుకోవచ్చు. కెమెరా విషయానికి వస్తే, ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 5ఎంపి అల్ట్రా వైడ్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8ఎంపి కెమెరా అందించారు.

Nokia G60 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై పని చేయనుంది. మూడేళ్ళ పాటు మేజర్ ఓఎస్ అప్డేట్స్ ని అందించనున్నట్లు నోకియా హామీ ఇచ్చింది. అంటే Nokia G60 5G ఆండ్రాయిడ్ 15 ఓఎస్ అప్డేట్ కూడా పొందనుందన్న మాట. ఇతర ఫీచర్ల విషయానికి వస్తే, ఈ ఫోన్ లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, బ్లూటూత్, ఎన్ఎఫ్‌సీ, 3.5ఎంఎం ఆడియో జాక్, డ్యూయల్ బ్యాండ్ వైఫై ఉన్నాయి. Nokia G60 5G ఫోన్ 190 గ్రాముల బరువు, 8.61 మిల్లీ మీటర్ల మందం ఉంటుంది.

Nokia G60 5G ధరను 319 యూరోలు (సుమారు రూ.25,300) గా నిర్ణయించారు. భారత్ లో Nokia G60 5G ధర దాదాపు రూ.20,000 గా ఉండే అవకాశం ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో వస్తోన్న Nokia G60 5G first appeared on 91Mobiles Telugu.

]]>