Nokia X30 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 13 Sep 2023 09:33:19 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Nokia X30 5G స్మార్ట్‌ఫోన్ పై రూ.12,000 తగ్గింపు! https://www.91mobiles.com/telugu/nokia-x30-5g-price-cut-by-rs-12000-sale-on-amazon/ Wed, 13 Sep 2023 09:33:19 +0000 https://www.91mobiles.com/telugu/?p=8000 ప్రజాదరణ పొందిన Nokia బ్రాండ్ 2023 సంవత్సరం ప్రారంభంలో భారతీయ మార్కెట్ లో Nokia X30 5G డివైజ్ ని లాంచ్ చేసింది. ఇప్పుడు 6 నెలల తర్వాత, కంపెనీ Nokia X30 5G ధరను రూ.12,000 తగ్గించింది. అంటే, మీరు కొత్త మరియు శక్తివంతమైన 5G డివైజ్ ని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే, ఈ డీల్ మీకు తగినదని చెప్పవచ్చు. సరే, ఓసారి Nokia X30 5G యొక్క అసలు ధర, తగ్గింపు ధర, […]

The post Nokia X30 5G స్మార్ట్‌ఫోన్ పై రూ.12,000 తగ్గింపు! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • అమెజాన్ లో అందుబాటులో ఉన్న Nokia X30 5G
  • 8జిబి+256జిబి ఆప్షన్ తో వచ్చిన డివైజ్
  • కలర్ ఆప్షన్స్: ఐస్ వైట్, క్లౌడీ బ్లూ

ప్రజాదరణ పొందిన Nokia బ్రాండ్ 2023 సంవత్సరం ప్రారంభంలో భారతీయ మార్కెట్ లో Nokia X30 5G డివైజ్ ని లాంచ్ చేసింది. ఇప్పుడు 6 నెలల తర్వాత, కంపెనీ Nokia X30 5G ధరను రూ.12,000 తగ్గించింది. అంటే, మీరు కొత్త మరియు శక్తివంతమైన 5G డివైజ్ ని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే, ఈ డీల్ మీకు తగినదని చెప్పవచ్చు. సరే, ఓసారి Nokia X30 5G యొక్క అసలు ధర, తగ్గింపు ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Nokia X30 5G పై డిస్కౌంట్

  • Nokia X30 5G పై కంపెనీ రూ.12,000 తగ్గించింది. దీంతో ప్రస్తుతం ఈ ఫోన్ ని రూ.36,999 కే కొనుగోలు చేయవచ్చు.
  • 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ని ఈ ఫోన్ ఆఫర్ చేస్తుంది.
  • ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్ మరియు కంపెనీ అధికార వెబ్‌సైట్ ద్వారా డివైజ్ ని కొనుగోలు చేయవచ్చు.
  • ఐస్ వైట్, క్లౌడీ బ్లూ కలర్ ఆప్షన్స్ లో Nokia X30 5G లభిస్తుంది.
  • 2023 ఫిబ్రవరిలో రూ.48,999 ధరతో Nokia X30 5G డివైజ్ మార్కెట్ లోకి లాంచ్ చేయబడింది.

Nokia X30 5G స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Nokia X30 5G లో 6.43-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 700 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 20:9 యాస్పెక్ట్ రేషియో, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉన్నాయి.
  • చిప్సెట్: Nokia X30 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్ వాడారు.
  • స్టోరేజీ, ర్యామ్: Nokia X30 5G డివైజ్ లో 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉన్నాయి.
  • కెమెరా: Nokia X30 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Nokia X30 5G లో పవర్ బ్యాకప్ కోసం 4200 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Nokia X30 5G డివైజ్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Nokia X30 5G లో ఐపీ67 రేటింగ్, డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, బ్లూటూత్ ఉన్నాయి.

The post Nokia X30 5G స్మార్ట్‌ఫోన్ పై రూ.12,000 తగ్గింపు! first appeared on 91Mobiles Telugu.

]]>
50MP కెమెరా, 90Hz AMOLED డిస్ప్లేతో భారత్‌లో లాంచైన Nokia X30 5G https://www.91mobiles.com/telugu/nokia-x30-5g-launched-india-price-specs-availability/ Wed, 15 Feb 2023 10:32:17 +0000 https://www.91mobiles.com/telugu/?p=4939 Nokia X30 5G స్మార్ట్ ఫోన్ భారత్ లో లాంచైంది. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ తో ఈ ఫోన్ మార్కెట్ లోకి వచ్చింది. 2022 సెప్టెంబర్ లో గ్లోబల్ గా Nokia X30 5G ఫోన్ లాంచైంది. ఫోన్ యొక్క ఫ్రేమ్ 100 శాతం అల్యూమినియమ్ తో తయారైందని, 65 పర్సెంట్ రిసైకిల్డ్ ప్లాస్టిక్ తో బ్యాక్ ప్యానెల్ రూపొందిందని కంపెనీ చెబుతోంది. నోకియా కంపెనీ Nokia X30 5G ఫోన్ పై 3 […]

The post 50MP కెమెరా, 90Hz AMOLED డిస్ప్లేతో భారత్‌లో లాంచైన Nokia X30 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో లాంచైన Nokia X30 5G స్మార్ట్ ఫోన్
  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్, 6.43-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వచ్చిన Nokia X30 5G
  • భారత్ లో Nokia X30 5G ధర రూ.48,999. క్లౌడీ బ్లూ, ఐస్ వైట్ కలర్ ఆప్షన్స్ లో లభించనున్న డివైజ్

Nokia X30 5G స్మార్ట్ ఫోన్ భారత్ లో లాంచైంది. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ తో ఈ ఫోన్ మార్కెట్ లోకి వచ్చింది. 2022 సెప్టెంబర్ లో గ్లోబల్ గా Nokia X30 5G ఫోన్ లాంచైంది. ఫోన్ యొక్క ఫ్రేమ్ 100 శాతం అల్యూమినియమ్ తో తయారైందని, 65 పర్సెంట్ రిసైకిల్డ్ ప్లాస్టిక్ తో బ్యాక్ ప్యానెల్ రూపొందిందని కంపెనీ చెబుతోంది.

నోకియా కంపెనీ Nokia X30 5G ఫోన్ పై 3 ఓఎస్ అప్‌గ్రేడ్స్ తో పాటు, 3 ఏళ్ళ పాటు నెలవారీ సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని హామీ ఇస్తోంది. భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఐపీ67 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ ని ఈ ఫోన్ లో అందించారు.

Nokia X30 5G స్మార్ట్ ఫోన్ లో 6.43-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 4200 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఉన్నాయి.

భారత్ లో Nokia X30 5G ధర, లభ్యత

భారత్ లో Nokia X30 5G ధరను రూ.48,999 గా నిర్ణయించారు. ఈ హ్యాండ్సెట్ క్లౌడీ బ్లూ, ఐస్ వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. అమెజాన్, నోకియా వెబ్ సైట్ ద్వారా ఫిబ్రవరి 20 నుంచి ఈ ఫోన్ సేల్స్ మొదలవుతాయి. నేటి నుంచి ఈ ఫోన్ ని ప్రీ-బుక్ చేసుకోవచ్చు.

లాంచ్ ఆఫర్ లో భాగంగా నోకియా వెబ్ సైట్ ద్వారా Nokia X30 5G ఫోన్ ని కొనుగోలు చేసే కస్టమర్లకు రూ.1000 డిస్కౌంట్ లభించనుంది. అలాగే రూ.2,799 విలువజేసే నోకియా కంఫర్ట్ ఇయర్ బడ్స్, రూ.2,999 విలువజేసే 33 వాట్ చార్జర్ ఉచితంగా లభిస్తాయి. ఇంకా అమెజాన్ పై రూ.4,000 ఎక్స్‌చేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది.

Nokia X30 5G స్పెసిఫికేషన్స్

Nokia X30 5G స్మార్ట్ ఫోన్ లో 6.43-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 1080*2400 పిక్సెల్స్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 700 నిట్స్ పీక్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ ఉన్నాయి. ఈ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 619ఎల్ జీపీయూ వాడారు. 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

ఇప్పుడు Nokia X30 5G కెమెరా విభాగం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటుంది. కెమెరాలు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ డీఎక్స్+ గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తున్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

Nokia X30 5G స్మార్ట్ ఫోన్ ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తో వస్తోంది. ఇంకా ఈ ఫోన్ ఐపీ67 వాటర్ అండ్ డస్ట్ రేటింగ్ ని కలిగి ఉంది. ఈ ఫోన్ 158.9 మిల్లీ మీటర్ల పొడవు, 73.9 మిల్లీ మీటర్ల వెడల్పు, 7.99 మిల్లీ మీటర్ల మందం, 185 గ్రాముల బరువు ఉంటుంది. ఈ డివైజ్ లో 5జీ, 4జీ వొల్టీ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్ 5.1, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి. పవర్ బ్యాకప్ కోసం ఈ ఫోన్ లో 4200 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 50MP కెమెరా, 90Hz AMOLED డిస్ప్లేతో భారత్‌లో లాంచైన Nokia X30 5G first appeared on 91Mobiles Telugu.

]]>