50MP కెమెరా, 90Hz AMOLED డిస్ప్లేతో భారత్‌లో లాంచైన Nokia X30 5G

Highlights

  • భారత్ లో లాంచైన Nokia X30 5G స్మార్ట్ ఫోన్
  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్, 6.43-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వచ్చిన Nokia X30 5G
  • భారత్ లో Nokia X30 5G ధర రూ.48,999. క్లౌడీ బ్లూ, ఐస్ వైట్ కలర్ ఆప్షన్స్ లో లభించనున్న డివైజ్

Nokia X30 5G స్మార్ట్ ఫోన్ భారత్ లో లాంచైంది. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ తో ఈ ఫోన్ మార్కెట్ లోకి వచ్చింది. 2022 సెప్టెంబర్ లో గ్లోబల్ గా Nokia X30 5G ఫోన్ లాంచైంది. ఫోన్ యొక్క ఫ్రేమ్ 100 శాతం అల్యూమినియమ్ తో తయారైందని, 65 పర్సెంట్ రిసైకిల్డ్ ప్లాస్టిక్ తో బ్యాక్ ప్యానెల్ రూపొందిందని కంపెనీ చెబుతోంది.

నోకియా కంపెనీ Nokia X30 5G ఫోన్ పై 3 ఓఎస్ అప్‌గ్రేడ్స్ తో పాటు, 3 ఏళ్ళ పాటు నెలవారీ సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని హామీ ఇస్తోంది. భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఐపీ67 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ ని ఈ ఫోన్ లో అందించారు.

Nokia X30 5G స్మార్ట్ ఫోన్ లో 6.43-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 4200 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఉన్నాయి.

భారత్ లో Nokia X30 5G ధర, లభ్యత

భారత్ లో Nokia X30 5G ధరను రూ.48,999 గా నిర్ణయించారు. ఈ హ్యాండ్సెట్ క్లౌడీ బ్లూ, ఐస్ వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. అమెజాన్, నోకియా వెబ్ సైట్ ద్వారా ఫిబ్రవరి 20 నుంచి ఈ ఫోన్ సేల్స్ మొదలవుతాయి. నేటి నుంచి ఈ ఫోన్ ని ప్రీ-బుక్ చేసుకోవచ్చు.

లాంచ్ ఆఫర్ లో భాగంగా నోకియా వెబ్ సైట్ ద్వారా Nokia X30 5G ఫోన్ ని కొనుగోలు చేసే కస్టమర్లకు రూ.1000 డిస్కౌంట్ లభించనుంది. అలాగే రూ.2,799 విలువజేసే నోకియా కంఫర్ట్ ఇయర్ బడ్స్, రూ.2,999 విలువజేసే 33 వాట్ చార్జర్ ఉచితంగా లభిస్తాయి. ఇంకా అమెజాన్ పై రూ.4,000 ఎక్స్‌చేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది.

Nokia X30 5G స్పెసిఫికేషన్స్

Nokia X30 5G స్మార్ట్ ఫోన్ లో 6.43-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 1080*2400 పిక్సెల్స్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 700 నిట్స్ పీక్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ ఉన్నాయి. ఈ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 619ఎల్ జీపీయూ వాడారు. 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

ఇప్పుడు Nokia X30 5G కెమెరా విభాగం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటుంది. కెమెరాలు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ డీఎక్స్+ గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తున్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

Nokia X30 5G స్మార్ట్ ఫోన్ ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తో వస్తోంది. ఇంకా ఈ ఫోన్ ఐపీ67 వాటర్ అండ్ డస్ట్ రేటింగ్ ని కలిగి ఉంది. ఈ ఫోన్ 158.9 మిల్లీ మీటర్ల పొడవు, 73.9 మిల్లీ మీటర్ల వెడల్పు, 7.99 మిల్లీ మీటర్ల మందం, 185 గ్రాముల బరువు ఉంటుంది. ఈ డివైజ్ లో 5జీ, 4జీ వొల్టీ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్ 5.1, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి. పవర్ బ్యాకప్ కోసం ఈ ఫోన్ లో 4200 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.