Ola S1 Pro - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 24 Jan 2023 12:20:48 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 సస్పెన్షన్ విరిగిపోవడంతో Ola S1 Pro స్కూటర్ నడుపుతోన్న మహిళకు తీవ్ర గాయాలు https://www.91mobiles.com/telugu/ola-s1-pro-suspension-breaks-woman-with-injuries-admitted-to-icu/ Tue, 24 Jan 2023 12:20:48 +0000 https://www.91mobiles.com/telugu/?p=4621   అతి తక్కువ సమయంలోనే ఎక్కువ ప్రజాధరణ పొందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల సంస్థగా ఓలా కీర్తి గడించింది. అయితే విజయంతో పాటు ఈ సంస్థను ప్రమాదాల రూపంలో అపజయాలు కూడా పలకరిస్తున్నాయి. చాలా రోజులుగా మనం ఓలా స్కూటర్ల విషయంలో భద్రత లోపాల గురించి వరుస సంఘటనలను చూస్తూనే ఉన్నాం. ఓలా స్కూటర్ ప్రమాదాలు ఇప్పుడప్పుడే ఆగేలా లేవు. తాజాగా జరిగిన ఘటనలో ఓ మహిళా రైడర్ తీవ్రమైన గాయాలతో ఐసీయూలో చికిత్స పొందుతోంది. దీన్ని […]

The post సస్పెన్షన్ విరిగిపోవడంతో Ola S1 Pro స్కూటర్ నడుపుతోన్న మహిళకు తీవ్ర గాయాలు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Ola S1 Pro స్కూటర్ ఫ్రంట్ సస్పెన్షన్ విరిగిపోవడంతో చోటుచేసుకున్న ప్రమాదం
  • Ola S1 Pro నడుపుతోన్న మహిళా రైడర్ కి తీవ్రగాయాలు, ఐసీయూలో కొనసాగుతోన్న చికిత్స
  • సంఘటన తాలూకు సమాచారాన్ని ట్విట్టర్ ద్వారా షేర్ చేసిన బాధితురాలి భర్త సంకిత్ పర్మార్

 

అతి తక్కువ సమయంలోనే ఎక్కువ ప్రజాధరణ పొందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల సంస్థగా ఓలా కీర్తి గడించింది. అయితే విజయంతో పాటు ఈ సంస్థను ప్రమాదాల రూపంలో అపజయాలు కూడా పలకరిస్తున్నాయి. చాలా రోజులుగా మనం ఓలా స్కూటర్ల విషయంలో భద్రత లోపాల గురించి వరుస సంఘటనలను చూస్తూనే ఉన్నాం. ఓలా స్కూటర్ ప్రమాదాలు ఇప్పుడప్పుడే ఆగేలా లేవు.

తాజాగా జరిగిన ఘటనలో ఓ మహిళా రైడర్ తీవ్రమైన గాయాలతో ఐసీయూలో చికిత్స పొందుతోంది. దీన్ని బట్టి ప్రమాదం తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. Ola S1 Pro పై కేవలం 35 కేఎంపీహెచ్ స్పీడుతో వెళ్తుండగా ఉన్నట్లుండి ఫ్రంట్ సస్పెన్షన్ విరిగిపోవడంతో, బండిని నడుపుతోన్న మహిళ ముఖానికి తీవ్రగాయాలు అయ్యాయి. దీంతో ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించి ఐసీయూ లో చికిత్స అందిస్తున్నారు.

తన భార్యకు జరిగిన ప్రమాదం గురించి భర్త సంకిత్ పర్మార్ ట్విట్టర్ ద్వారా సమాచారాన్ని షేర్ చేశాడు. ఓలా సీఈవో భవీష్ అగర్వాల్ ని ట్యాగ్ చేస్తూ తన పోస్ట్ ని షేర్ చేశాడు. ఘటనకు బాధ్యులు ఎవరంటూ అతడు నిలదీశాడు. వరుసగా ఓలా స్కూటర్లు ప్రమాదానికి గురవుతుండటంతో జనాల్లో భయాందోళనలు ఎక్కువయ్యాయి.

కేవలం 35 స్పీడుతో వెళ్తోన్న బండి

బాధితురాలి భర్త సంకిత్ పర్మార్ ట్విట్టర్ ద్వారా సమాచారాన్ని అందించాడు. అతడి పోస్ట్ ప్రకారం, ఘటన రాత్రి 9.15 గంటల సమయంలో జరిగింది. తన భార్య ఓలా స్కూటర్ ని 35 కేఎంపీహెచ్ వేగంతో నడుపుతోందని, కానీ ఉన్నట్లుండి ఫ్రంట్ వీల్ సస్పెన్షన్ స్కూటర్ నుంచి వేరైందని అతడు తెలిపాడు. ఈ ప్రమాదంలో మహిళ వేగంగా నేలపై పడిపోయింది. దీంతో ఆమె ముఖానికి, తలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమెను ఐసీయూ లో అడ్మిట్ చేశారు.

ఓలా స్కూటర్లకు ఇటువంటి ప్రమాదాలు చోటుచేసుకోవడం ఇదేమీ కొత్త కాదు. సస్పెన్షన్ బ్రేకేజీ కి సంబంధించిన ఎన్నో ఘటనలు నెట్టింట్లో తారసపడుతున్నాయి. ఇప్పటివరకు ఓలా నుంచి తాజా ఘటనపై స్పందన రాలేదు. సాఫ్ట్ వేర్ కి సంబంధించిన గ్లిచెస్, బగ్స్ ని ఫిక్స్ చేసేందుకు ఇప్పటికే ఓలా సంస్థ ఓఎస్ అప్డేట్స్ ని రోలౌట్ చేస్తోంది.

ఇటీవలె ఓలా కంపెనీ MOVEOS 3.0 ని లాంచ్ చేసింది. ఇది కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. రీగన్ మోడ్స్, హిల్ హోల్డ్, పార్టీ మోడ్, ప్రాక్సిమిటీ అన్‌లాక్, వెకేషన్ మోడ్ తదితర ఫీచర్లు ఈ కొత్త ఓఎస్ లో ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post సస్పెన్షన్ విరిగిపోవడంతో Ola S1 Pro స్కూటర్ నడుపుతోన్న మహిళకు తీవ్ర గాయాలు first appeared on 91Mobiles Telugu.

]]>
Ola Electric స్కూటర్ ని ఉచితంగా గెలుచుకునే అవకాశం https://www.91mobiles.com/telugu/ola-electric-announces-year-end-offers/ Thu, 08 Dec 2022 12:29:51 +0000 https://www.91mobiles.com/telugu/?p=3889 హైలైట్స్ ఇయర్ ఎండ్ ఆఫర్స్ ప్రకటించిన ఓలా ఎలక్ట్రిక్ 10 స్కూటర్లను ఉచితంగా ఇవ్వనున్న ఓలా ఎలక్ట్రిక్, రిఫరల్ ప్రోగ్రామ్ ద్వారా రూ.4500 క్యాష్ బ్యాక్ పొందే అవకాశం డ్రా ద్వారా ఎంపికైన వారికి స్కూటర్లు గెలుచుకునే అవకాశం Ola Electric పలు ఇయర్-ఎండ్ ఆఫర్లను ప్రకటించింది. Ola S1, Ola S1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్లపై ఈ ఆఫర్స్ కస్టమర్లకు లభించనున్నాయి. కొత్త ఆఫర్లను చూస్తే, జీరో డౌన్ పేమెంట్, లోయర్ ఇంట్రెస్ట్ రేట్స్, ఓలా […]

The post Ola Electric స్కూటర్ ని ఉచితంగా గెలుచుకునే అవకాశం first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • ఇయర్ ఎండ్ ఆఫర్స్ ప్రకటించిన ఓలా ఎలక్ట్రిక్
  • 10 స్కూటర్లను ఉచితంగా ఇవ్వనున్న ఓలా ఎలక్ట్రిక్, రిఫరల్ ప్రోగ్రామ్ ద్వారా రూ.4500 క్యాష్ బ్యాక్ పొందే అవకాశం
  • డ్రా ద్వారా ఎంపికైన వారికి స్కూటర్లు గెలుచుకునే అవకాశం

Ola Electric పలు ఇయర్-ఎండ్ ఆఫర్లను ప్రకటించింది. Ola S1, Ola S1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్లపై ఈ ఆఫర్స్ కస్టమర్లకు లభించనున్నాయి. కొత్త ఆఫర్లను చూస్తే, జీరో డౌన్ పేమెంట్, లోయర్ ఇంట్రెస్ట్ రేట్స్, ఓలా ఫాస్ట్ చార్జర్ నెట్వర్క్ కి ఉచిత యాక్సెస్, ఏడాది పాటు ఉచిత సర్వీసింగ్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి.

Ola S1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్ పై రూ.10,000 డిస్కౌంట్ లభించనుంది. డ్రా లో భాగంగా 10 ఎలక్ట్రిక్ స్కూటర్లను గెలుచుకోవచ్చు. ఇందుకోసం మీరు మీకు సమీపంలోని ఓలా అథరైజ్డ్ షోరూమ్స్ లో టెస్ట్ రైడ్ ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఇంకా రిఫరల్ ప్రోగ్రామ్ కూడా ఉంది. దీని ద్వారా కస్టమర్లు రూ.4,500 క్యాష్‌బ్యాక్ పొందుతారు. వారు చేయల్సిందల్లా Ola S1 లేదా Ola S1 Pro వాహనాలను మరొక ముగ్గురికి రిఫర్ చేయడమే. దీంతో రూ.4500 క్యాష్ బ్యాక్ మీ సొంతం అవుతుంది.

ఈ ఏడాది చివరి వరకు ఆఫర్లు చెల్లుబాటు అవుతాయి. అంతే 2022 డిసెంబర్ 31 వరకు ఆఫర్స్ అందుబాటులో ఉంటాయి. రీసెంట్ గా లాంచ్ అయిన Ola S1 Air ఎలక్ట్రిక్ స్కూటర్ కి కూడా ఈ ఆఫర్స్ వర్తిస్తాయా లేదా అన్నది ఇంకా తెలియదు. కంపెనీ నుంచి కూడా ఎటువంటి ప్రకటన లేదు.

Ola S1 Pro, Ola S1 Pro లపై ఇయర్-ఎండ్ ఆఫర్స్

ఓలా ఎలక్ట్రిక్ రూ.3,499 విలువగల పూర్తి ఉచిత సర్వీస్ ని ఏడాది పాటు Ola S1, Ola S1 Pro స్కూటర్లపై అందిస్తోంది. ఓలా ఫాస్ట్ చార్జింగ్ నెట్వర్క్ కి ఉచిత యాక్సెస్ కూడా లభిస్తుంది. 2022 సెప్టెంబర్ లో పరిచయం చేసిన రూ.10,000 డిస్కౌంట్ ఆఫర్ ని ఇంకొన్ని రోజులపాటు కొనసాగించాలని ఓలా భావిస్తోంది. అలాగే Ola S1 Pro పై తగ్గించిన ధర 2022 డిసెంబర్ 31 వరకు అందుబాటులో ఉంటుంది.

భారత్ లో ప్రస్తుతం Ola S1 Pro ఎక్స్-షోరూమ్ ధర డిస్కౌంట్ తర్వాత రూ.1,29,000 గా ఉంది. Ola S1, Ola S1 Pro లపై ఓలా ఎలక్ట్రిక్ జీరో డౌన్‌పేమెంట్ మరియు జీరో ప్రాసెసింగ్ ఫీ స్కీమ్ ని ఆఫర్ చేస్తోంది. తగ్గించిన వడ్డీ రేట్ల మూలంగా ఈఎంఐ కూడా రూ.2,499 కి తగ్గిపోనుంది. మీరు గనుక ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని భావిస్తుంటే, ఓసారి ఓలా ఎలక్ట్రిక్ తన వాహనశ్రేణిపై అందిస్తోన్న వివిధ ఆఫర్లను చెక్ చేయండి. అలాగే ఓలా అందిస్తోన్న ఫీచర్లను కూడా ఇతర ఎలక్ట్రిక్ బండ్లతో పోల్చి చూసి సరైన దాన్ని ఎంపిక చేసుకోండి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Ola Electric స్కూటర్ ని ఉచితంగా గెలుచుకునే అవకాశం first appeared on 91Mobiles Telugu.

]]>
Ola S1 Pro దీపావళి ఆఫర్: డిస్కౌంట్ గడువు తేదీని పొడిగించిన Ola https://www.91mobiles.com/telugu/ola-electric-extends-discount-offer-on-ola-s1-pro-till-diwali/ Tue, 18 Oct 2022 06:35:19 +0000 https://www.91mobiles.com/telugu/?p=2937 హైలైట్స్ Ola S1 Pro పై నవరాత్రి డిస్కౌంట్ రూ.10,000 ని దీపావళి వరకు పొడిగించిన ఓలా సేల్ సందర్భంగా డిస్కౌంట్ ధర రూ.1,30,000 కి లభించనున్న Ola S1 Pro ఐదు సంవత్సరాల ఎక్స్‌టెండెడ్ వ్యారంటీ ప్యాకేజీ పై రూ.1500 డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్న ఓలా Ola Electric ఇటీవలె నవరాత్రి డిస్కౌంట్ ఆఫర్ ని తీసుకొచ్చింది. ఈ ఆఫర్ ఏంటంటే, Ola S1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్ పై రూ.10,000 డిస్కౌంట్ లభిస్తుంది. జనాల […]

The post Ola S1 Pro దీపావళి ఆఫర్: డిస్కౌంట్ గడువు తేదీని పొడిగించిన Ola first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • Ola S1 Pro పై నవరాత్రి డిస్కౌంట్ రూ.10,000 ని దీపావళి వరకు పొడిగించిన ఓలా
  • సేల్ సందర్భంగా డిస్కౌంట్ ధర రూ.1,30,000 కి లభించనున్న Ola S1 Pro
  • ఐదు సంవత్సరాల ఎక్స్‌టెండెడ్ వ్యారంటీ ప్యాకేజీ పై రూ.1500 డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్న ఓలా

Ola Electric ఇటీవలె నవరాత్రి డిస్కౌంట్ ఆఫర్ ని తీసుకొచ్చింది. ఈ ఆఫర్ ఏంటంటే, Ola S1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్ పై రూ.10,000 డిస్కౌంట్ లభిస్తుంది. జనాల నుంచి అద్భుతమైన స్పందన వస్తుండటంతో, ఈ నవరాత్రి ఆఫర్ ని దీపావళి వరకు పొడిగిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. అసలైతే, Ola S1 Pro డిస్కౌంట్ ఆఫర్ 2022 అక్టోబర్ 5 తో ముగియాల్సి ఉంది. కానీ, దీపావళి వరకు పొడిగించారు. ఈ బండిని కొనుగోలు చేసే వారికి ఇదొక సదవకాశమని చెప్పాలి.

భారత్ లో Ola S1 Pro బండి ధర, ఆఫర్లు

Ola S1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్ ని కొనాలని అనుకుంటున్న కస్టమర్లకు రూ.10,000 డిస్కౌంట్ లభిస్తుంది. దీపావళి వరకు ఈ డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. అలాగే 5 సంవత్సరాల ఎక్స్‌టెండెడ్ వ్యారంటీ ప్యాకేజీ పై రూ.1500 డిస్కౌంట్ ని కూడ ఓలా అందిస్తోంది. అలాగే స్టాండర్డ్ వర్షన్ అయిన Ola S1 స్కూటర్ ఇంట్రడక్టరీ ధర (రూ.99,999 ఎక్స్-షోరూమ్) ను కూడా ఓలా ఎక్స్‌టెండ్ చేసింది.

మరోవైపు Ola S1 Pro రూ.1,40,000 (ఎక్స్-షోరూమ్) కి సేల్ అవుతోంది. రూ.10,000 డిస్కౌంట్ తో ఈ స్కూటర్ రూ.1,30,000 (ఎక్స్-షోరూమ్) కి లభిస్తుంది. ఫెస్టివ్ సీజన్ ఆఫర్ లో భాగంగా, ఓలా కంపెనీ లోన్స్ పై ఎటువంటి ప్రాసెసింగ్ ఫీ తీసుకోవడం లేదు. అలాగే లోన్ వడ్డీ రేటు 8.99 శాతంగా ఉంది.

Ola S1 Pro, Ola S1 స్పెసిఫికేషన్స్

Ola S1 Pro 4 కిలోవాట్ లిథియమ్-ఐయాన్ బ్యాటరీ ప్యాక్ తో వస్తోంది. ఈ బండి సింగిల్ చార్జ్ పై 181 కిలోమీటర్లు పరిగెడుతుంది. Ola S1 Pro 11.3బీహెచ్‌పీ హార్స్‌పవర్, 58ఎన్ఎం పీక్ టార్క్ ని జనరేట్ చేస్తుంది. మరోవైపు Ola S1 బండి 3 కిలోవాట్ లిథియమ్-ఐయాన్ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది సింగిల్ చార్జ్ పై 141 కిలోమీటర్ల దూరం పరిగెడుతుంది. Ola S1 11.3 బీహెచ్2పి హార్స్‌పవర్, 58ఎన్ఎం పీక్ టార్క్ జనరేట్ చేస్తుంది. Ola S1 Pro మరియు Ola S1 స్కూటర్లు 7.0-ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ తో వస్తున్నాయి. ఈ క్లస్టర్ Move OS 2.0 సాఫ్ట్‌వేర్ పై పని చేస్తుంది.

అక్టోబర్ 22 న ఓలా ఎలక్ట్రిక్ దీపావళి ఈవెంట్ ని నిర్వహిస్తోంది. ఈ ఈవెంట్ లో కంపెనీ నుంచి మరింత తక్కువ ధర కలిగిన Ola S1 వేరియంట్లు లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇటీవలె కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ ని ఓలా ఎలక్ట్రిక్ సీఈవో భవీశ్ అగర్వాల్ టీజ్ చేశారు. దీంతో రాబోవు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ పై హైప్ పెరిగింది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Ola S1 Pro దీపావళి ఆఫర్: డిస్కౌంట్ గడువు తేదీని పొడిగించిన Ola first appeared on 91Mobiles Telugu.

]]>
Ola S1 Pro కంటే ఎక్కువగా అమ్ముడైన Ather 450x ఎలక్ట్రిక్ స్కూటర్లు https://www.91mobiles.com/telugu/ather-450x-outsells-ola-s1-pro-in-august-enters-top-five/ Sat, 03 Sep 2022 04:30:31 +0000 https://www.91mobiles.com/telugu/?p=2065 హైలైట్స్: జులై 2022 కంటే, ఆగస్టు 2022 లో 12.7 శాతం పెరిగిన ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు ఆగస్టులో 10,000 యూనిట్లకు పైగా అమ్మి అగ్రస్థానంలో ఉన్న హీరో ఎలక్ట్రిక్ ఓలా ఎలక్ట్రిక్ ని అధిగమించి టాప్-5 లో చేరిన ఏథర్ ఎనర్జీ మరోసారి దేశంలో ఎలక్ట్రిక్ టూ-వీలర్ సెగ్మెంట్ స్థిరమైన వృద్ధి రేటుని కనబరించింది. జులై 2022 తో పోల్చితే, ఆగస్టు 2022 లో 12.7 శాతం పెరుగుదలను నమోదు చేసింది. పది వేలకు పైగా […]

The post Ola S1 Pro కంటే ఎక్కువగా అమ్ముడైన Ather 450x ఎలక్ట్రిక్ స్కూటర్లు first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • జులై 2022 కంటే, ఆగస్టు 2022 లో 12.7 శాతం పెరిగిన ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు
  • ఆగస్టులో 10,000 యూనిట్లకు పైగా అమ్మి అగ్రస్థానంలో ఉన్న హీరో ఎలక్ట్రిక్
  • ఓలా ఎలక్ట్రిక్ ని అధిగమించి టాప్-5 లో చేరిన ఏథర్ ఎనర్జీ

మరోసారి దేశంలో ఎలక్ట్రిక్ టూ-వీలర్ సెగ్మెంట్ స్థిరమైన వృద్ధి రేటుని కనబరించింది. జులై 2022 తో పోల్చితే, ఆగస్టు 2022 లో 12.7 శాతం పెరుగుదలను నమోదు చేసింది. పది వేలకు పైగా బండ్లను అమ్మి హీరో ఎలక్ట్రిక్ సేల్స్ రికార్డుని నమోదు చేసింది. ఏథర్ ఎనర్జీ, టీవీఎస్ లు సత్తా చాటాయి. ఇక ఒకినావా ఆటోటెక్ మెరుగైన ర్యాంక్ కి చేరుకుంది. ఇక ఇంటర్నెట్ యొక్క ఫేవరెట్ ఈ-స్కూటర్ బ్రాండ్ ఓలా ఎలక్ట్రిక్ వరుసగా నాలుగో నెల కూడా సేల్స్ లో వెనుకబడింది.

2022 ఆగస్టులో భారత ఎలక్ట్రిక్ టూ-వీలర్ సెక్టర్ లో మొత్తం 50,076 యూనిట్లు అమ్ముడయ్యాయి. హీరో ఎలక్ట్రిక్ అమ్మకాల్లో 10,476 యూనిట్స్ మార్కుని దాటింది. దీంతో ఈ సంస్థ భారత్ లో అతిపెద్ద టూ-వీలర్ సెల్లర్ గా అవతరించింది. మార్చి 2022 నుంచి చూస్తే, 10,000 యూనిట్స్ మార్కుని దాటడం హీరో కి తొలిసారి.

పెరుగుతోన్న ఎలక్ట్రిక్ టూ-వీలర్ సేల్స్, అగ్రస్థానంలో హీరో ఎలక్ట్రిక్

వాహన్ పోర్టల్ ప్రకారం, ఆగస్టు 2022 లో 50,076 యూనిట్స్ ఎలక్ట్రిక్ టూ-వీలర్స్ అమ్మకాల ద్వారా భారత్ 12.7 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇది జులై 2022 తో పోల్చితే ఎక్కువ. 10,476 యూనిట్లు అమ్మి, హీరో ఎలక్ట్రిక్ మరోసారి ఫస్ట్ ర్యాంక్ కైవసం చేసుకుంది. మార్చి 2022 తర్వాత హీరో కంపెనీకి ఈ ఫీట్ సాధించడం ఇదే తొలిసారి కావడం విశేషం. దీంతో ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్లో హీరో కి తిరుగులేదని నిరూపించుకున్నట్లైంది.

ఒకినావా ఆటోటెక్ 8,554 యూనిట్లు అమ్మి రెండో స్థానంలో నిలిచింది. ఇక మరో ఈవీ మేకర్ ఆంపియర్, టీవీఎస్ ని దాటేసి మూడో స్థానంలోకి దూసుకెళ్ళింది. ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కు మెరుగులు దిద్దిన టీవీఎస్ 6,282 యూనిట్లు అమ్మి సత్తా చాటింది. మొత్తంగా ఈ స్కూటర్ వి 50 శాతం సేల్స్ పెరిగాయి. రానున్న రోజుల్లో టీవీఎస్ కంపెనీ తన పోటీదారులకు గట్టి పోటీ ఇచ్చే అవకాశముంది.

బెంగళూరుకి చెందిన స్టార్టప్ ఏథర్ ఎనర్జీ 5,239 యూనిట్లు అమ్మి తానేంటో నిరూపించుకుంది. ఆగస్టు 2022 లో హయ్యస్ట్ మంత్లీ సేల్స్ నమోదు చేసింది ఏథర్ ఎనర్జీ. దీంతో ఓలా ఎలక్ట్రిక్ ని వెనక్కి నెట్టి 5 వ స్థానంలో నిలిచింది ఏథర్. మరోవైపు ఓలా ఎలక్ట్రిక్ వరుసగా నాలుగో నెల కూడా అమ్మకాల్లో క్షీణతను ప్రదర్శించింది. ఆగస్టు 2022 లో కేవలం 3,421 యూనిట్లను మాత్రమే ఓలా ఎలక్ట్రిక్ అమ్మగలిగింది.

ఇక బజాజ్ ఆటో 2,554 యూనిట్లు అమ్మింది. మరో స్టార్టప్ రివోల్ట్ కంపెనీ రివోల్ట్ ఆర్‌వీ ఎలక్ట్రిక్ బైక్ ను అమ్ముతోన్న సంగతి తెలిసిందే. ఈ సంస్థ 1604 యూనిట్ల ఆర్‌వీ400 బండ్లను అమ్మి పర్వాలేదనిపించింది.

లేటెస్ట్ ఆటోమొబైల్, టెలీకామ్, స్మార్ట్ ఫోన్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post Ola S1 Pro కంటే ఎక్కువగా అమ్ముడైన Ather 450x ఎలక్ట్రిక్ స్కూటర్లు first appeared on 91Mobiles Telugu.

]]>