హైలైట్స్
- Ola S1 Pro పై నవరాత్రి డిస్కౌంట్ రూ.10,000 ని దీపావళి వరకు పొడిగించిన ఓలా
- సేల్ సందర్భంగా డిస్కౌంట్ ధర రూ.1,30,000 కి లభించనున్న Ola S1 Pro
- ఐదు సంవత్సరాల ఎక్స్‌టెండెడ్ వ్యారంటీ ప్యాకేజీ పై రూ.1500 డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్న ఓలా

Ola Electric ఇటీవలె నవరాత్రి డిస్కౌంట్ ఆఫర్ ని తీసుకొచ్చింది. ఈ ఆఫర్ ఏంటంటే, Ola S1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్ పై రూ.10,000 డిస్కౌంట్ లభిస్తుంది. జనాల నుంచి అద్భుతమైన స్పందన వస్తుండటంతో, ఈ నవరాత్రి ఆఫర్ ని దీపావళి వరకు పొడిగిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. అసలైతే, Ola S1 Pro డిస్కౌంట్ ఆఫర్ 2022 అక్టోబర్ 5 తో ముగియాల్సి ఉంది. కానీ, దీపావళి వరకు పొడిగించారు. ఈ బండిని కొనుగోలు చేసే వారికి ఇదొక సదవకాశమని చెప్పాలి.
భారత్ లో Ola S1 Pro బండి ధర, ఆఫర్లు
Ola S1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్ ని కొనాలని అనుకుంటున్న కస్టమర్లకు రూ.10,000 డిస్కౌంట్ లభిస్తుంది. దీపావళి వరకు ఈ డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. అలాగే 5 సంవత్సరాల ఎక్స్‌టెండెడ్ వ్యారంటీ ప్యాకేజీ పై రూ.1500 డిస్కౌంట్ ని కూడ ఓలా అందిస్తోంది. అలాగే స్టాండర్డ్ వర్షన్ అయిన Ola S1 స్కూటర్ ఇంట్రడక్టరీ ధర (రూ.99,999 ఎక్స్-షోరూమ్) ను కూడా ఓలా ఎక్స్‌టెండ్ చేసింది.
మరోవైపు Ola S1 Pro రూ.1,40,000 (ఎక్స్-షోరూమ్) కి సేల్ అవుతోంది. రూ.10,000 డిస్కౌంట్ తో ఈ స్కూటర్ రూ.1,30,000 (ఎక్స్-షోరూమ్) కి లభిస్తుంది. ఫెస్టివ్ సీజన్ ఆఫర్ లో భాగంగా, ఓలా కంపెనీ లోన్స్ పై ఎటువంటి ప్రాసెసింగ్ ఫీ తీసుకోవడం లేదు. అలాగే లోన్ వడ్డీ రేటు 8.99 శాతంగా ఉంది.
Ola S1 Pro, Ola S1 స్పెసిఫికేషన్స్
Ola S1 Pro 4 కిలోవాట్ లిథియమ్-ఐయాన్ బ్యాటరీ ప్యాక్ తో వస్తోంది. ఈ బండి సింగిల్ చార్జ్ పై 181 కిలోమీటర్లు పరిగెడుతుంది. Ola S1 Pro 11.3బీహెచ్‌పీ హార్స్‌పవర్, 58ఎన్ఎం పీక్ టార్క్ ని జనరేట్ చేస్తుంది. మరోవైపు Ola S1 బండి 3 కిలోవాట్ లిథియమ్-ఐయాన్ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది సింగిల్ చార్జ్ పై 141 కిలోమీటర్ల దూరం పరిగెడుతుంది. Ola S1 11.3 బీహెచ్2పి హార్స్‌పవర్, 58ఎన్ఎం పీక్ టార్క్ జనరేట్ చేస్తుంది. Ola S1 Pro మరియు Ola S1 స్కూటర్లు 7.0-ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ తో వస్తున్నాయి. ఈ క్లస్టర్ Move OS 2.0 సాఫ్ట్‌వేర్ పై పని చేస్తుంది.
అక్టోబర్ 22 న ఓలా ఎలక్ట్రిక్ దీపావళి ఈవెంట్ ని నిర్వహిస్తోంది. ఈ ఈవెంట్ లో కంపెనీ నుంచి మరింత తక్కువ ధర కలిగిన Ola S1 వేరియంట్లు లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇటీవలె కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ ని ఓలా ఎలక్ట్రిక్ సీఈవో భవీశ్ అగర్వాల్ టీజ్ చేశారు. దీంతో రాబోవు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ పై హైప్ పెరిగింది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.











