Ola S1 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 08 Dec 2022 12:29:51 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Ola Electric స్కూటర్ ని ఉచితంగా గెలుచుకునే అవకాశం https://www.91mobiles.com/telugu/ola-electric-announces-year-end-offers/ Thu, 08 Dec 2022 12:29:51 +0000 https://www.91mobiles.com/telugu/?p=3889 హైలైట్స్ ఇయర్ ఎండ్ ఆఫర్స్ ప్రకటించిన ఓలా ఎలక్ట్రిక్ 10 స్కూటర్లను ఉచితంగా ఇవ్వనున్న ఓలా ఎలక్ట్రిక్, రిఫరల్ ప్రోగ్రామ్ ద్వారా రూ.4500 క్యాష్ బ్యాక్ పొందే అవకాశం డ్రా ద్వారా ఎంపికైన వారికి స్కూటర్లు గెలుచుకునే అవకాశం Ola Electric పలు ఇయర్-ఎండ్ ఆఫర్లను ప్రకటించింది. Ola S1, Ola S1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్లపై ఈ ఆఫర్స్ కస్టమర్లకు లభించనున్నాయి. కొత్త ఆఫర్లను చూస్తే, జీరో డౌన్ పేమెంట్, లోయర్ ఇంట్రెస్ట్ రేట్స్, ఓలా […]

The post Ola Electric స్కూటర్ ని ఉచితంగా గెలుచుకునే అవకాశం first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • ఇయర్ ఎండ్ ఆఫర్స్ ప్రకటించిన ఓలా ఎలక్ట్రిక్
  • 10 స్కూటర్లను ఉచితంగా ఇవ్వనున్న ఓలా ఎలక్ట్రిక్, రిఫరల్ ప్రోగ్రామ్ ద్వారా రూ.4500 క్యాష్ బ్యాక్ పొందే అవకాశం
  • డ్రా ద్వారా ఎంపికైన వారికి స్కూటర్లు గెలుచుకునే అవకాశం

Ola Electric పలు ఇయర్-ఎండ్ ఆఫర్లను ప్రకటించింది. Ola S1, Ola S1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్లపై ఈ ఆఫర్స్ కస్టమర్లకు లభించనున్నాయి. కొత్త ఆఫర్లను చూస్తే, జీరో డౌన్ పేమెంట్, లోయర్ ఇంట్రెస్ట్ రేట్స్, ఓలా ఫాస్ట్ చార్జర్ నెట్వర్క్ కి ఉచిత యాక్సెస్, ఏడాది పాటు ఉచిత సర్వీసింగ్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి.

Ola S1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్ పై రూ.10,000 డిస్కౌంట్ లభించనుంది. డ్రా లో భాగంగా 10 ఎలక్ట్రిక్ స్కూటర్లను గెలుచుకోవచ్చు. ఇందుకోసం మీరు మీకు సమీపంలోని ఓలా అథరైజ్డ్ షోరూమ్స్ లో టెస్ట్ రైడ్ ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఇంకా రిఫరల్ ప్రోగ్రామ్ కూడా ఉంది. దీని ద్వారా కస్టమర్లు రూ.4,500 క్యాష్‌బ్యాక్ పొందుతారు. వారు చేయల్సిందల్లా Ola S1 లేదా Ola S1 Pro వాహనాలను మరొక ముగ్గురికి రిఫర్ చేయడమే. దీంతో రూ.4500 క్యాష్ బ్యాక్ మీ సొంతం అవుతుంది.

ఈ ఏడాది చివరి వరకు ఆఫర్లు చెల్లుబాటు అవుతాయి. అంతే 2022 డిసెంబర్ 31 వరకు ఆఫర్స్ అందుబాటులో ఉంటాయి. రీసెంట్ గా లాంచ్ అయిన Ola S1 Air ఎలక్ట్రిక్ స్కూటర్ కి కూడా ఈ ఆఫర్స్ వర్తిస్తాయా లేదా అన్నది ఇంకా తెలియదు. కంపెనీ నుంచి కూడా ఎటువంటి ప్రకటన లేదు.

Ola S1 Pro, Ola S1 Pro లపై ఇయర్-ఎండ్ ఆఫర్స్

ఓలా ఎలక్ట్రిక్ రూ.3,499 విలువగల పూర్తి ఉచిత సర్వీస్ ని ఏడాది పాటు Ola S1, Ola S1 Pro స్కూటర్లపై అందిస్తోంది. ఓలా ఫాస్ట్ చార్జింగ్ నెట్వర్క్ కి ఉచిత యాక్సెస్ కూడా లభిస్తుంది. 2022 సెప్టెంబర్ లో పరిచయం చేసిన రూ.10,000 డిస్కౌంట్ ఆఫర్ ని ఇంకొన్ని రోజులపాటు కొనసాగించాలని ఓలా భావిస్తోంది. అలాగే Ola S1 Pro పై తగ్గించిన ధర 2022 డిసెంబర్ 31 వరకు అందుబాటులో ఉంటుంది.

భారత్ లో ప్రస్తుతం Ola S1 Pro ఎక్స్-షోరూమ్ ధర డిస్కౌంట్ తర్వాత రూ.1,29,000 గా ఉంది. Ola S1, Ola S1 Pro లపై ఓలా ఎలక్ట్రిక్ జీరో డౌన్‌పేమెంట్ మరియు జీరో ప్రాసెసింగ్ ఫీ స్కీమ్ ని ఆఫర్ చేస్తోంది. తగ్గించిన వడ్డీ రేట్ల మూలంగా ఈఎంఐ కూడా రూ.2,499 కి తగ్గిపోనుంది. మీరు గనుక ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని భావిస్తుంటే, ఓసారి ఓలా ఎలక్ట్రిక్ తన వాహనశ్రేణిపై అందిస్తోన్న వివిధ ఆఫర్లను చెక్ చేయండి. అలాగే ఓలా అందిస్తోన్న ఫీచర్లను కూడా ఇతర ఎలక్ట్రిక్ బండ్లతో పోల్చి చూసి సరైన దాన్ని ఎంపిక చేసుకోండి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Ola Electric స్కూటర్ ని ఉచితంగా గెలుచుకునే అవకాశం first appeared on 91Mobiles Telugu.

]]>
MoveOS 3 Beta అప్డేట్ తో Ola S1 ఎలక్ట్రిక్ స్కూటర్ కి కొత్త ఫీచర్లు https://www.91mobiles.com/telugu/ola-s1-move-os-3-beta-update-new-features/ Tue, 01 Nov 2022 15:01:39 +0000 https://www.91mobiles.com/telugu/?p=3183 హైలైట్స్ S1 ఎలక్ట్రిక్ స్కూటర్ కి లేటెస్ట్ అప్డేట్ ని రోలౌట్ చేస్తోన్న ఓలా ఎలక్ట్రిక్ MoveOS 3 Beta అప్డేట్ తో ఎనేబుల్ కానున్న ప్రాక్సిమిటీ ఆటోమేటిక్ అన్-లాక్ ఫీచర్ పార్టీ మోడ్, అదనపు రైడర్ ప్రొఫైల్స్ వంటి ఎన్నో ఫీచర్లతో వచ్చిన MoveOS 3 Beta అప్డేట్ Ola S1 ఎలక్ట్రిక్ స్కూటర్స్ MoveOS అప్డేట్ ని రిసీవ్ చేసుకుంటున్నాయి. ఈ లేటెస్ట్ అప్డేట్ తో ఎన్నో అదనపు ఫీచర్లు ఎనేబుల్ కానున్నాయి. MoveOS […]

The post MoveOS 3 Beta అప్డేట్ తో Ola S1 ఎలక్ట్రిక్ స్కూటర్ కి కొత్త ఫీచర్లు first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • S1 ఎలక్ట్రిక్ స్కూటర్ కి లేటెస్ట్ అప్డేట్ ని రోలౌట్ చేస్తోన్న ఓలా ఎలక్ట్రిక్
  • MoveOS 3 Beta అప్డేట్ తో ఎనేబుల్ కానున్న ప్రాక్సిమిటీ ఆటోమేటిక్ అన్-లాక్ ఫీచర్
  • పార్టీ మోడ్, అదనపు రైడర్ ప్రొఫైల్స్ వంటి ఎన్నో ఫీచర్లతో వచ్చిన MoveOS 3 Beta అప్డేట్

Ola S1 ఎలక్ట్రిక్ స్కూటర్స్ MoveOS అప్డేట్ ని రిసీవ్ చేసుకుంటున్నాయి. ఈ లేటెస్ట్ అప్డేట్ తో ఎన్నో అదనపు ఫీచర్లు ఎనేబుల్ కానున్నాయి. MoveOS 3.0 beta వర్షన్ తో Ola S1 యూనిట్స్ ఇప్పుడు ప్రాక్సిమిటీ అన్‌లాక్, కొత్త పార్టీ మోడ్, మరిన్ని రైడర్ ప్రొఫైల్స్ వంటి పీచర్లు పొందనున్నాయి. యూజర్లు తమ Ola S1 స్కూటర్ల డ్యాష్ బోర్డ్ ని కొత్త థీమ్స్ తో ఆకర్షణీయంగా మార్చేయవచ్చు. అలాగే కొత్త ఈ-స్కూటర్ సౌండ్స్ కూడా ఈ తాజా అప్డేట్ తో వస్తున్నాయి.

పేరులో ఉన్నట్లుగానే ప్రస్తుతం ఈ MoveOS బీటా ఫేస్ పై ఉంది. ఎవరైతే రిక్వెస్ట్ చేస్తారో వారికి మాత్రమే యాక్సెస్ లభిస్తుంది. అఫీషియల్ MoveOS3 ల్యాండింగ్ పేజీకి వెళ్ళి బీటా యాక్సెస్ కోసం రిక్వెస్ట్ చేయండి. అందుకోసం మీరు మీ యొక్క Ola S1 బండితో అసోసియేట్ అయి ఉన్న ఫోన్ నంబర్ ని నమోదు చేయాల్సి ఉంటుంది. MoveOS 3 beta వర్షన్ ప్రస్తుతానికి Ola S1 యూనిట్స్ కి మాత్రమే పరిమితం. రీసెంట్ గా లాంచ్ అయిన Ola S1 Air కి అందుబాటులో లేదన్న విషయం గమనించాలి.

ట్విట్టర్ ద్వారా ఓలా ఎలక్ట్రిక్ రోలౌట్ ని ప్రకటించింది. దాంతో సాఫ్ట్‌వేర్ అప్డేట్ కంపెనీ యొక్క ఎలక్ట్రిక్ వెహికిల్స్ కి ఎలా రీచ్ అవుతుందో అర్థమైంది. MoveOS 3 beta అప్డేట్ ని విడతల వారీగా రోలౌట్ చేయనున్నట్లు ఓలా ఎలక్ట్రిక్ చేసిన ట్వీట్ ద్వారా తెలుస్తోంది. స్టేబుల్ వర్షన్ వచ్చే వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. అటు తర్వాత, అన్ని Ola S1 యూనిట్స్ కి MoveOS 3 అప్డేట్ యాక్సెస్ లభిస్తుంది.

MoveOS 3 అప్డేట్ ద్వారా Ola S1 డ్యాష్ బోర్డ్స్ కి కొత్త కస్టమైజేషన్ ఆప్షన్స్ రానున్నాయి. కొత్త సౌండ్స్ తో పాటు పలు ఇతర కొత్త ఫీచర్లు జత చేరనున్నాయి. వాటిలో ప్రాక్సిమిటీ అన్‌లాక్, పార్టీ మోడ్ ఫీచర్లు ముఖ్యమైనవి.

MoveOS 3 Beta – కొత్త ఫీచర్లు

MoveOS 3 Beta అప్డేట్ లో హైలైట్ ఏంటంటే అది ‘ప్రాక్సిమిటీ అన్‌లాక్ ఫీచర్’. ఈ అప్డేట్ తో Ola S1 ఓనర్లు తమ స్కూటర్స్ ని వాటి సమీపంలోకి వెళ్తే చాలు అవి అన్‌లాక్ అయిపోతాయి. యూజర్స్ యొక్క స్మార్ట్ ఫోన్ ద్వారా ఈ ఫీచర్ వర్కవుట్ అవుతుంది. దగ్గరకు వెళ్ళగానే బండి అన్ లాక్ అయిపోయి రైడ్ కి సిద్ధంగా ఉంటుంది. అలాగే బండి ఓనర్ దూరంగా వెళ్ళగానే స్కూటర్ లాక్ అవుతుంది.

MoveOS 3 Beta అప్డేట్ ద్వారా మల్టీపుల్ రైడర్ ప్రొఫైల్స్ ఆప్షన్ జతచేరుతోంది. బండి ఓనర్స్ తమ స్కూటర్ ని ఇతరులకు ఇచ్చినప్పుడు డిఫరెంట్ ప్రొఫైల్ ని సెట్ చేసి, రైడ్స్ ని ట్రాక్ చేసే అవకాశం ఉంది. స్కూటర్ ని రైడ్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా డ్యాష్ బోర్డ్ స్క్రీన్ ద్వారా రిప్లైస్ ఇచ్చే ఫీచర్ కూడా ఈ అప్డేట్ తో వస్తోంది.

ఇక పార్టీ మోడ్ సాయంతో Ola S1 యొక్క అన్ని లైట్స్ ని సింక్రనైజ్ అవుతాయి. అలాగే ఏకకాలంలో సంగీతం కూడా ప్లే అవుతుంది. ఇప్పుడు ఫాస్ట్ చార్జింగ్ సాయంతో 15 నిమిషాల పాటు చార్జ్ చేస్తే, 50 కిలోమీటర్ల రేంజ్ వస్తుందని ఓలా ఎలక్ట్రిక్ చెబుతోంది. ఈ అప్డేట్ నిజంగా ఆహ్వానించదగినది. ఇక బ్రేక్ వేసినప్పుడు బండి బ్యాటరీ చార్జ్ అయ్యే విధంగా 3 విభిన్న రెజెన్ మోడ్స్ ని ఈ నయా అప్డేట్ తీసుకొస్తోంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post MoveOS 3 Beta అప్డేట్ తో Ola S1 ఎలక్ట్రిక్ స్కూటర్ కి కొత్త ఫీచర్లు first appeared on 91Mobiles Telugu.

]]>
దీపావళి రోజున లాంచ్ అవుతోన్న బడ్జెట్ ఫ్రెండ్లీ Ola S1 ఎలక్ట్రిక్ స్కూటర్ https://www.91mobiles.com/telugu/ola-s1-affordable-e-scooter-to-launch-this-diwali/ Fri, 07 Oct 2022 14:41:29 +0000 https://www.91mobiles.com/telugu/?p=2802 హైలైట్స్: దీపావళి రోజున కొత్త చవకైన ఎలక్ట్రిక్ స్కూటర్ ని లాంచ్ చేస్తున్న ఓలా ఎలక్ట్రిక్ రీసెంట్ గా ట్వీట్ ద్వారా కన్ఫర్మ్ చేసిన Ola సీఈవో భవీశ్ అగర్వాల్ సెప్టెంబర్ లో 9,634 ఎలక్ట్రిక్ స్కూటర్లను అమ్మిన ఓలా కంపెనీ భారతదేశంలో అత్యధికంగా ఎలక్ట్రిక్ స్కూటర్లను అమ్మే కంపెనీల్లో Ola Electric కూడా ఒకటి. ఈ కంపెనీ ఇప్పుడు తక్కువ బడ్జెట్ లో ఒక ఈ-స్కూటర్ ని తీసుకొస్తొంది. ఓలా సీఈవో భవీశ్ చేసిన ట్వీట్ […]

The post దీపావళి రోజున లాంచ్ అవుతోన్న బడ్జెట్ ఫ్రెండ్లీ Ola S1 ఎలక్ట్రిక్ స్కూటర్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • దీపావళి రోజున కొత్త చవకైన ఎలక్ట్రిక్ స్కూటర్ ని లాంచ్ చేస్తున్న ఓలా ఎలక్ట్రిక్
  • రీసెంట్ గా ట్వీట్ ద్వారా కన్ఫర్మ్ చేసిన Ola సీఈవో భవీశ్ అగర్వాల్
  • సెప్టెంబర్ లో 9,634 ఎలక్ట్రిక్ స్కూటర్లను అమ్మిన ఓలా కంపెనీ

భారతదేశంలో అత్యధికంగా ఎలక్ట్రిక్ స్కూటర్లను అమ్మే కంపెనీల్లో Ola Electric కూడా ఒకటి. ఈ కంపెనీ ఇప్పుడు తక్కువ బడ్జెట్ లో ఒక ఈ-స్కూటర్ ని తీసుకొస్తొంది. ఓలా సీఈవో భవీశ్ చేసిన ట్వీట్ ని బట్టి ఈ బడ్జెట్ స్కూటర్ దీపావళి పండుగ రోజున లాంచ్ అవ్వనుందని తెలుస్తోంది.

ఈ నెలలోనే న్యూ వెహికిల్ లాంచ్ కానుందని ఓలా సీఈవో భవీశ్ అగర్వాల్ ట్వీట్ ద్వారా తెలుస్తోంది. “ఈ నెలలో సంథింగ్ బిగ్ ప్లాన్ చేస్తున్నాం. #EndICEAge రెవొల్యూషన్ ని కనీసం 2 ఏళ్ళు యాక్సలరేట్ చేయనుంది. నిజంగా ఎగ్జైటింగ్ గా ఉంది,” అంటూ భవీశ్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఓలా ఎస్1 వెహికిల్స్ లో కెల్లా అత్యంత చౌకైన స్కూటర్ ని ఓలా ఎలక్ట్రిక్ లాంచ్ చేయబోతున్నట్లు కార్ అండ్ బైక్ ఓ కథనాన్ని వెలువరించింది.

కార్ అండ్ బైక్ రిపోర్ట్ లో పేర్కొన్న దాని ప్రకారం, సరికొత్త, చౌకైన Ola S1 ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.80,000 లోపు ఉండనుందని సమాచారం. అంటే ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న పెట్రోల్ స్కూటర్ల ధరలోనే ఈ స్కూటర్ వస్తుందన్న మాట. ఓలా ఎస్1, ఎస్1 ప్రో స్కూటర్లలో ఉన్న దాదాపు అన్ని ఫీచర్లను ఈ బడ్జెట్ స్కూటర్లో కూడా అందిస్తున్నట్లు ఓలా ఎలక్ట్రిక్ చెబుతోంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ యొక్క MoveOS ప్లాట్ఫామ్ పై పని చేస్తుంది.

ఆగస్టులో ఓలా కంపెనీ Ola S1 స్కూటర్ ని లాంచ్ చేసింది. ఓలా ఎస్1 ప్రో కంటే దీని ధర తక్కువ. ఓలా ఎస్1 ఎక్స్-షోరూమ్ ధర రూ.99,999 గా కంపెనీ నిర్ణయించింది. ఇది 5.5 కిలో వాట్ మోటర్, 8.5 కిలో వాట్ పీక్ పవర్ ని కలిగి ఉంది. ఇది 141 కిలోమీటర్ల రేంజ్ తో వచ్చింది. అలాగే 95 కేఎంపీహెచ్ అత్యధిక స్పీడ్ ని కలిగి ఉంది. హోమ్ చార్జర్ తో ఓలా ఎస్1 స్కూటర్ 5 గంటల్లో పూర్తిగా చార్జ్ అవుతుంది.

Ola S1 స్కూటర్ లో 3 కిలో వాట్ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఓలా యొక్క మూవ్ ఓఎస్ ప్లాట్ఫామ్ పై ఈ స్కూటర్ పని చేస్తుంది. మ్యూజిక్ ప్లే బ్యాక్ ఫీచర్, నేవిగేషన్, కంపానియన్ యాప్, రివర్స్ మోడ్ వంటి ఫీచర్లు ఈ బండి లో ఉన్నాయి. దీపావళి వరకు మూవ్ ఓఎస్ 3.0 అప్డేట్ ని ఓలా తీసుకురానుంది.

ఇటీవలె నవరాత్రి పర్వదినాల్లో తమ కంపెనీ విజయవంతంగా ప్రతి నిమిషం ఎలక్ట్రిక్ స్కూటర్ ని అమ్మినట్లు సదరు కంపెనీ తెలిపింది. పండుగ సీజన్ లో తమ అమ్మకాలు నాలుగు రెట్లు పెరిగాయని కంపెనీ చెప్పింది. దేశ వ్యాప్తంగా 1 లక్ష కస్టమర్ టెస్ట్ డ్రైవ్స్ ఆర్గనైజ్ చేసామని ఓలా ఎలక్ట్రిక్ తెలిపింది. సెప్టెంబర్ లో ఓలా సంస్థ 9364 యూనిట్లను అమ్మింది. వాహన్ నంబర్స్ ద్వారా ఈ విషయం స్పష్టమైంది.

వాహనాల అమ్మకాలు బాగానే ఉన్నప్పటికీ, ఓలా ఎలక్ట్రిక్ కి మాత్రం సమస్యలు లేకపోలేదు. ఇటీవలి కాలంలో ఓలా ఈ-స్కూటర్లపై ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. ఓలా ఎస్1 ప్రో లో సాఫ్ట్ వేర్ సమస్యల వల్లన 90 కిలోమీటర్ల వేగంతో బండి రివర్స్ వెళ్ళడం భయం కలిగించే విషయం. అలాగే అడపాదడపా మంటలు చెలరేగడం వంటి ఉదంతాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. త్వరలోనే అన్ని సమస్యలకు ఓలా ఎలక్ట్రిక్ చెక్ పెడుతుందని ఆశిద్దాం.

The post దీపావళి రోజున లాంచ్ అవుతోన్న బడ్జెట్ ఫ్రెండ్లీ Ola S1 ఎలక్ట్రిక్ స్కూటర్ first appeared on 91Mobiles Telugu.

]]>