హైలైట్స్
- S1 ఎలక్ట్రిక్ స్కూటర్ కి లేటెస్ట్ అప్డేట్ ని రోలౌట్ చేస్తోన్న ఓలా ఎలక్ట్రిక్
- MoveOS 3 Beta అప్డేట్ తో ఎనేబుల్ కానున్న ప్రాక్సిమిటీ ఆటోమేటిక్ అన్-లాక్ ఫీచర్
- పార్టీ మోడ్, అదనపు రైడర్ ప్రొఫైల్స్ వంటి ఎన్నో ఫీచర్లతో వచ్చిన MoveOS 3 Beta అప్డేట్

Ola S1 ఎలక్ట్రిక్ స్కూటర్స్ MoveOS అప్డేట్ ని రిసీవ్ చేసుకుంటున్నాయి. ఈ లేటెస్ట్ అప్డేట్ తో ఎన్నో అదనపు ఫీచర్లు ఎనేబుల్ కానున్నాయి. MoveOS 3.0 beta వర్షన్ తో Ola S1 యూనిట్స్ ఇప్పుడు ప్రాక్సిమిటీ అన్లాక్, కొత్త పార్టీ మోడ్, మరిన్ని రైడర్ ప్రొఫైల్స్ వంటి పీచర్లు పొందనున్నాయి. యూజర్లు తమ Ola S1 స్కూటర్ల డ్యాష్ బోర్డ్ ని కొత్త థీమ్స్ తో ఆకర్షణీయంగా మార్చేయవచ్చు. అలాగే కొత్త ఈ-స్కూటర్ సౌండ్స్ కూడా ఈ తాజా అప్డేట్ తో వస్తున్నాయి.
పేరులో ఉన్నట్లుగానే ప్రస్తుతం ఈ MoveOS బీటా ఫేస్ పై ఉంది. ఎవరైతే రిక్వెస్ట్ చేస్తారో వారికి మాత్రమే యాక్సెస్ లభిస్తుంది. అఫీషియల్ MoveOS3 ల్యాండింగ్ పేజీకి వెళ్ళి బీటా యాక్సెస్ కోసం రిక్వెస్ట్ చేయండి. అందుకోసం మీరు మీ యొక్క Ola S1 బండితో అసోసియేట్ అయి ఉన్న ఫోన్ నంబర్ ని నమోదు చేయాల్సి ఉంటుంది. MoveOS 3 beta వర్షన్ ప్రస్తుతానికి Ola S1 యూనిట్స్ కి మాత్రమే పరిమితం. రీసెంట్ గా లాంచ్ అయిన Ola S1 Air కి అందుబాటులో లేదన్న విషయం గమనించాలి.
ట్విట్టర్ ద్వారా ఓలా ఎలక్ట్రిక్ రోలౌట్ ని ప్రకటించింది. దాంతో సాఫ్ట్వేర్ అప్డేట్ కంపెనీ యొక్క ఎలక్ట్రిక్ వెహికిల్స్ కి ఎలా రీచ్ అవుతుందో అర్థమైంది. MoveOS 3 beta అప్డేట్ ని విడతల వారీగా రోలౌట్ చేయనున్నట్లు ఓలా ఎలక్ట్రిక్ చేసిన ట్వీట్ ద్వారా తెలుస్తోంది. స్టేబుల్ వర్షన్ వచ్చే వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. అటు తర్వాత, అన్ని Ola S1 యూనిట్స్ కి MoveOS 3 అప్డేట్ యాక్సెస్ లభిస్తుంది.
MoveOS 3 అప్డేట్ ద్వారా Ola S1 డ్యాష్ బోర్డ్స్ కి కొత్త కస్టమైజేషన్ ఆప్షన్స్ రానున్నాయి. కొత్త సౌండ్స్ తో పాటు పలు ఇతర కొత్త ఫీచర్లు జత చేరనున్నాయి. వాటిలో ప్రాక్సిమిటీ అన్లాక్, పార్టీ మోడ్ ఫీచర్లు ముఖ్యమైనవి.
MoveOS 3 Beta – కొత్త ఫీచర్లు
MoveOS 3 Beta అప్డేట్ లో హైలైట్ ఏంటంటే అది ‘ప్రాక్సిమిటీ అన్లాక్ ఫీచర్’. ఈ అప్డేట్ తో Ola S1 ఓనర్లు తమ స్కూటర్స్ ని వాటి సమీపంలోకి వెళ్తే చాలు అవి అన్లాక్ అయిపోతాయి. యూజర్స్ యొక్క స్మార్ట్ ఫోన్ ద్వారా ఈ ఫీచర్ వర్కవుట్ అవుతుంది. దగ్గరకు వెళ్ళగానే బండి అన్ లాక్ అయిపోయి రైడ్ కి సిద్ధంగా ఉంటుంది. అలాగే బండి ఓనర్ దూరంగా వెళ్ళగానే స్కూటర్ లాక్ అవుతుంది.
MoveOS 3 Beta అప్డేట్ ద్వారా మల్టీపుల్ రైడర్ ప్రొఫైల్స్ ఆప్షన్ జతచేరుతోంది. బండి ఓనర్స్ తమ స్కూటర్ ని ఇతరులకు ఇచ్చినప్పుడు డిఫరెంట్ ప్రొఫైల్ ని సెట్ చేసి, రైడ్స్ ని ట్రాక్ చేసే అవకాశం ఉంది. స్కూటర్ ని రైడ్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా డ్యాష్ బోర్డ్ స్క్రీన్ ద్వారా రిప్లైస్ ఇచ్చే ఫీచర్ కూడా ఈ అప్డేట్ తో వస్తోంది.
ఇక పార్టీ మోడ్ సాయంతో Ola S1 యొక్క అన్ని లైట్స్ ని సింక్రనైజ్ అవుతాయి. అలాగే ఏకకాలంలో సంగీతం కూడా ప్లే అవుతుంది. ఇప్పుడు ఫాస్ట్ చార్జింగ్ సాయంతో 15 నిమిషాల పాటు చార్జ్ చేస్తే, 50 కిలోమీటర్ల రేంజ్ వస్తుందని ఓలా ఎలక్ట్రిక్ చెబుతోంది. ఈ అప్డేట్ నిజంగా ఆహ్వానించదగినది. ఇక బ్రేక్ వేసినప్పుడు బండి బ్యాటరీ చార్జ్ అయ్యే విధంగా 3 విభిన్న రెజెన్ మోడ్స్ ని ఈ నయా అప్డేట్ తీసుకొస్తోంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.











