OnePlus Ace 2V - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 09 Mar 2023 13:09:21 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 5000ఎంఏహెచ్ బ్యాటరీ, ఐఆర్ బ్లాస్టర్, ఎన్ఎఫ్‌సీ తో వస్తోన్న OnePlus Ace 2V https://www.91mobiles.com/telugu/oneplus-reveals-ace-2v-aka-nord-3-specs-via-weibo/ Fri, 03 Mar 2023 09:33:56 +0000 https://www.91mobiles.com/telugu/?p=5206 కొన్ని రోజుల క్రితం, OnePlus సంస్థ OnePlus Ace 2 సిరీస్ ని చైనాలో లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ సిరీస్ లో కొత్త మోడల్ గా OnePlus Ace 2V మార్కెట్ లోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. వన్‌ప్లస్ సంస్థ Weibo పోస్ట్ ద్వారా OnePlus Ace 2V లాంచ్ తేదీని ప్రకటించింది. 2023 మార్చి 7 న మధ్యాహ్నం 2.30 గంటలకు చైనాలో ఈ ఫోన్ లాంచ్ అవుతోంది. ఇప్పటికే OnePlus Ace 2V ప్రీ-బుకింగ్స్ […]

The post 5000ఎంఏహెచ్ బ్యాటరీ, ఐఆర్ బ్లాస్టర్, ఎన్ఎఫ్‌సీ తో వస్తోన్న OnePlus Ace 2V first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • OnePlus Ace 2V స్పెసిఫికేషన్స్ రివీల్ చేసిన OnePlus సంస్థ
  • మార్చి 7 న చైనాలో లాంచ్ అవుతోన్న OnePlus Ace 2V; కన్ఫర్మ్ చేసిన OnePlus
  • గ్లోబల్ గా Nord (నార్డ్) బ్రాండింగ్ తో లాంచ్ కానున్న OnePlus Ace 2V

కొన్ని రోజుల క్రితం, OnePlus సంస్థ OnePlus Ace 2 సిరీస్ ని చైనాలో లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ సిరీస్ లో కొత్త మోడల్ గా OnePlus Ace 2V మార్కెట్ లోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. వన్‌ప్లస్ సంస్థ Weibo పోస్ట్ ద్వారా OnePlus Ace 2V లాంచ్ తేదీని ప్రకటించింది. 2023 మార్చి 7 న మధ్యాహ్నం 2.30 గంటలకు చైనాలో ఈ ఫోన్ లాంచ్ అవుతోంది.

ఇప్పటికే OnePlus Ace 2V ప్రీ-బుకింగ్స్ మొదలయ్యాయి. అలాగే OnePlus కంపెనీ Weibo పోస్ట్స్ ద్వారా OnePlus Ace 2V స్పెసిఫికేషన్స్ ని రివీల్ చేస్తూ వస్తోంది. లేటెస్ట్ పోస్ట్ ద్వారా OnePlus Ace 2V యొక్క బ్యాటరీ మరియు ఇతర స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి.

OnePlus Ace 2V స్పెసిఫికేషన్స్ ని రివీల్ చేసిన OnePlus సంస్థ

త్వరలో లాంచ్ కాబోయే OnePlus Ace 2V డివైజ్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానున్నట్లు OnePlus వెల్లడించింది. అయితే ఈ డివైజ్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ తో రావడం లేదు. లీగ్ ఆఫ్ లెజెండ్స్ లో 120ఎఫ్‌పీఎస్ గేమింగ్ కి, గేమ్ ఫర్ పీస్ లో 90ఎఫ్‌పీఎస్ గేమింగ్ కి ఈ ఫోన్ సపోర్ట్ చేయనున్నట్లు OnePlus ప్రకటించింది. OnePlus Ace 2V డివైజ్ 8.15 మిల్లీ మీటర్ల మందం, 191.5 గ్రాముల బరువు ఉంటుందని OnePlus తెలిపింది.

వీటితో పాటు OnePlus Ace 2V డివైజ్ ఐఆర్ బ్లాస్టర్ మరియు పూర్తిస్థాయి ఎన్ఎఫ్‌సీ వంటి ఫీచర్లతో వస్తోంది. OnePlus Ace 2V ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్సెట్ తో రానున్నట్లు గతంలో OnePlus వెల్లడించింది. ఈ చిప్ 5 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. ఇక రీసెంట్ గా OnePlus చైనా ప్రెసిడెంట్ OnePlus Ace 2V డివైజ్ 12జిబి+256జిబి మరియు 12జిబి+512జిబి వేరియంట్స్ లో వస్తోందని తెలిపారు.

OnePlus Ace 2V స్మార్ట్ ఫోన్ 6.74-ఇంచ్ 1.5కే ఓఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1450 నిట్స్ పీక్ బ్రైట్నెస్, పీడబ్ల్యూఎం డిమ్మింగ్ తో వస్తోంది. 1.5కే రెజుల్యూషన్ డిస్ప్లే, 2కే డిస్ప్లేతో పోల్చితే 24.4 శాతం తక్కువ పవర్ ని తీసుకుంటుంది. సెంటర్డ్ పంచ్ హోల్ డిస్ప్లే, హెచ్డీఆర్10+ సపోర్ట్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

గతంలో రివీల్ అయినట్లుగా, OnePlus Ace 2V డివైజ్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తోంది. ఇందులో 64ఎంపి ఓఐఎస్ మెయిన్ సెన్సర్, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 5ఎంపి మ్యాక్రో సెన్సర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి సోని ఐఎంఎక్స్471 సెన్సర్ ఉంటుంది. అంటుటు లిస్టింగ్ ప్రకారం, ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో 3.5ఎంఎం ఆడియో జాక్ కూడా ఉండనుంది.

OnePlus Ace 2V ఫోన్ ని OnePlus సంస్థ గేమర్స్ ని ఉద్దేశించి తీసుకొస్తోంది. అందుకోసం వైర్డ్ ఆడియో అనేది కచ్చితంగా ఉండాల్సిన ఫీచర్. OnePlus Ace 2V ఫ్లాట్-ఎడ్జ్ డిజైన్ తో వస్తోంది. ACE 2 లో కూడా ఇదే రకం డిజైన్ ఉంది. OnePlus Ace 2V ఫోన్ గ్లోబల్ మార్కెట్స్ లో Nord 3 పేరుతో లాంచ్ కానుందని రూమర్లు వినిపిస్తున్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 5000ఎంఏహెచ్ బ్యాటరీ, ఐఆర్ బ్లాస్టర్, ఎన్ఎఫ్‌సీ తో వస్తోన్న OnePlus Ace 2V first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్‌కి ముందు లీకైన OnePlus Ace 2V స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/oneplus-ace-2v-specs-leaked-before-launch/ Thu, 02 Mar 2023 09:58:07 +0000 https://www.91mobiles.com/telugu/?p=5187 గత నెలలో OnePlus Ace 2 ని చైనాలో లాంచ్ చేసిన వన్ ప్లస్ సంస్థ ఇప్పుడు OnePlus Ace 2V డివైజ్ ని తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. గ్లోబల్ మార్కెట్స్ లో ఈ ఫోన్ OnePlus Nord 3 గా లాంచ్ కానుందని అంచనా వేస్తున్నారు. అధికార ప్రకటన ప్రకారం, OnePlus Ace 2V డివైజ్ చైనా మార్కెట్ లో మార్చి 7 న లాంచ్ అవుతోంది. అయితే లాంచ్ కి కొన్ని రోజుల ముందే […]

The post లాంచ్‌కి ముందు లీకైన OnePlus Ace 2V స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న OnePlus Ace 2V (OnePlus Nord 3)
  • 16జిబి ర్యామ్, 120 హెర్ట్జ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 1.5కే రెజుల్యూషన్ తో రానున్న OnePlus Ace 2V
  • లాంచ్ కి ముందు లీకైన OnePlus Ace 2V (OnePlus Nord 3)

గత నెలలో OnePlus Ace 2 ని చైనాలో లాంచ్ చేసిన వన్ ప్లస్ సంస్థ ఇప్పుడు OnePlus Ace 2V డివైజ్ ని తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. గ్లోబల్ మార్కెట్స్ లో ఈ ఫోన్ OnePlus Nord 3 గా లాంచ్ కానుందని అంచనా వేస్తున్నారు. అధికార ప్రకటన ప్రకారం, OnePlus Ace 2V డివైజ్ చైనా మార్కెట్ లో మార్చి 7 న లాంచ్ అవుతోంది. అయితే లాంచ్ కి కొన్ని రోజుల ముందే OnePlus ప్రెసిడెంట్ Li Jie Louis కన్ఫిగరేషన్ ఆప్షన్స్ ని రివీల్ చేశారు.

OnePlus Ace 2V స్మార్ట్ ఫోన్ LPDDR5X RAM తో వస్తున్నట్లు వన్ ప్లస్ ప్రెసిడెంట్ రివీల్ చేశారు. కంపెనీ షేర్ చేసిన మరొక టీజర్ ఇమేజ్ లో OnePlus Ace 2V డివైజ్ UFS 3.1 స్టోరేజీతో రానున్నట్లు స్పష్టమైంది. త్వరలో లాంచ్ కాబోయే OnePlus Ace 2V డివైజ్ MediaTek Dimensity 9000 చిప్సెట్ తో లాంచ్ కానుందని OnePlus సంస్థ ఇదివరకే స్పష్టం చేసింది. ఓసారి OnePlus Ace 2V స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

OnePlus Ace 2V: ఖరారైన స్పెసిఫికేషన్స్

 

OnePlus Ace 2V డివైజ్ 12జిబి + 256జిబి మరియు 16జిబి + 256జిబి వేరియంట్స్ లో లభించనుందని OnePlus చైనా ప్రెసిడెంట్ కన్ఫర్మ్ చేశారు. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో సాధారణంగా అయితే 8జిబి+128జిబి ని ఆఫర్ చేస్తారు. కానీ వన్‌ప్లస్ మాత్రం 12జిబి+256జిబి ని ఆఫర్ చేస్తుండటం విశేషం.

OnePlus Ace 2V స్మార్ట్ ఫోన్ 6.74-ఇంచ్ ఫ్లెక్సిబుల్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 1.5 కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1450 నిట్స్ బ్రైట్నెస్, హెచ్డీఆర్10+ సపోర్ట్ తో రానున్నట్లు వన్‌ప్లస్ కన్ఫర్మ్ చేసింది. ఇంకా ఈ ఫోన్ పంచ్-హోల్ నాచ్ డిజైన్ తో వస్తోంది. 2కే డిస్ప్లే తో పోల్చితే OnePlus Ace 2V లోని 1.5 కే డిస్ప్లే 24.4 శాతం తక్కువ పవర్ ని వాడుకుంటుంది.

OnePlus Ace 2V డివైజ్ ఫ్లాట్ ఎడ్జ్ డిజైన్ తో వస్తోంది. ఈ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తోంది. ఇందులో 64ఎంపి మెయిన్ కెమెరా, 16ఎంపి సెల్ఫీ కెమెరా ఉండనుంది. OnePlus Ace 2V లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుందని అంచనా. ఇకపోతే ఈ ఫోన్ 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానున్నట్లు సమాచారం. గతంలో OnePlus Ace 2V డివైజ్ AnTuTu డేటాబేస్ పై కనిపించింది. దీంతో ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో వస్తున్నట్లు స్పష్టమైంది.

OnePlus Ace 2V డివైజ్ కంపెనీ యొక్క సిగ్నేచర్ ఫీచర్ అయిన అలర్ట్ స్లైడర్ తో వస్తోంది. అయితే OnePlus Ace 2V లో 3.5 ఎంఎం ఆడియో జాక్ ఉంటుందా లేదా అనే విషయం ఇంకా తెలియదు. త్వరలోనే వన్‌ప్లస్ నుంచి ఈ ఫోన్ కి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రానున్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post లాంచ్‌కి ముందు లీకైన OnePlus Ace 2V స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
ఐకానిక్ Alert Slider తో వస్తోన్న OnePlus Ace 2V https://www.91mobiles.com/telugu/oneplus-ace-2v-official-teaser-video-key-specs-alert-slider-dimensity-9000-chipset/ Tue, 28 Feb 2023 11:16:01 +0000 https://www.91mobiles.com/telugu/?p=5142 త్వరలో లాంచ్ కాబోయే OnePlus Ace 2V స్మార్ట్ ఫోన్ అఫీషియల్ టీజర్ వీడియోని OnePlus సంస్థ రివీల్ చేసింది. ఈ డివైజ్ చైనాలో మార్చి 7 న లాంచ్ అవుతోంది. OnePlus Ace 2V స్మార్ట్ ఫోన్ భారత్ తో పాటు ఇతర గ్లోబల్ మార్కెట్స్ లో OnePlus Nord 3 పేరుతో లాంచ్ కానుంది. ఇక తాజాగా రివీలైన కొత్త టీజర్ ద్వారా డిజైన్, ఫినిషెస్ కి సంబంధించిన గ్లిమ్స్ తెలిసాయి. OnePlus Ace 2V […]

The post ఐకానిక్ Alert Slider తో వస్తోన్న OnePlus Ace 2V first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • తాజాగా విడుదలైన OnePlus Ace 2V అఫీషియల్ టీజర్, త్వరలో చైనాలో లాంచ్
  • త్రీ-స్టేజ్ అలర్ట్ స్లైడర్ తో రానున్నట్లు ఖరారైన OnePlus Ace 2V స్మార్ట్ ఫోన్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్సెట్, పేస్టల్ గ్రీన్ కలర్ ఆప్షన్ తో రానున్న OnePlus Ace 2V

త్వరలో లాంచ్ కాబోయే OnePlus Ace 2V స్మార్ట్ ఫోన్ అఫీషియల్ టీజర్ వీడియోని OnePlus సంస్థ రివీల్ చేసింది. ఈ డివైజ్ చైనాలో మార్చి 7 న లాంచ్ అవుతోంది. OnePlus Ace 2V స్మార్ట్ ఫోన్ భారత్ తో పాటు ఇతర గ్లోబల్ మార్కెట్స్ లో OnePlus Nord 3 పేరుతో లాంచ్ కానుంది. ఇక తాజాగా రివీలైన కొత్త టీజర్ ద్వారా డిజైన్, ఫినిషెస్ కి సంబంధించిన గ్లిమ్స్ తెలిసాయి.

OnePlus Ace 2V డిజైన్

OnePlus Ace 2V టీజర్ వీడియో చైనీస్ సామాజిక మాధ్యమం వీబో పై ప్రత్యక్షమైంది. ప్రముఖ భారతీయ టిప్‌స్టర్ ముకుల్ శర్మ ఈ వీడియోని తన ట్విట్టర్ హ్యాండిల్ పై షేర్ చేశారు. దీంతో OnePlus Ace 2V ఫస్ట్ లుక్ బయటకు వచ్చింది. ఫోన్ బ్యాక్ ప్యానెల్ గ్లాసీ ఫినిషింగ్ తో ఉంది. బ్యాక్ ప్యానెల్ పై రెండు సర్క్యులర్ మాడ్యూల్స్ లో ట్రిపుల్ కెమెరా యూనిట్ ఉంది. అలాగే రెండు ఎల్ఈడీ ఫ్లాషెస్ ఉన్నట్లు అనిపిస్తోంది.

సంప్రదాయ వన్‌ప్లస్ అలర్ట్ స్లైడర్ OnePlus Ace 2V తో రీఎంట్రీ ఇస్తోంది. ఈ అలర్ట్ స్లైడర్ త్రీ స్టేజెస్ ఫంక్షనాలిటీని కలిగి ఉంటుంది. అవి: మ్యూట్, వైబ్రేట్ మరియు రింగ్. OnePlus Ace 2V లో పవర్ బటన్ కుడివైపున ఉండగా, వాల్యూమ్ రాకర్ ఎడమవైపున ఉంది. టాప్ ఎడ్జ్ లో సెకండరీ మైక్రోఫోన్, ఐఆర్ బ్లాస్టర్ ఉన్నాయి. ముందు వైపున ఫుల్ స్క్రీన్ డిస్ప్లే, సన్నని బెజెల్స్, ఫ్రంట్ కెమెరా కోసం పంచ్ హోల్ కటౌట్ ఉన్నాయి.

OnePlus Ace 2V స్పెసిఫికేషన్స్

OnePlus Ace 2V స్మార్ట్ ఫోన్ లో MediaTek Dimensity 9000 చిప్సెట్ ఉండే అవకాశం ఉంది. ఇకపోతే ఈ ఫోన్ 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ తో వస్తున్నట్లు సమాచారం. ఇంకా ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో లాంచ్ కానుంది. OnePlus Ace 2V లో 6.72-inch FHD+ AMOLED స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

OnePlus Ace 2V కెమెరా విభాగం విషయానికి వస్తే, ఈ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ సెన్సర్, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు. పవర్ బ్యాకప్ కోసం OnePlus Ace 2V లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. దీని ఫాస్ట్ చార్జింగ్ కెపాసిటీ వివరాలు ఇంకా తెలియదు. త్వరలోనే పూర్తి స్పెసిఫికేషన్స్ బయటకు రానున్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post ఐకానిక్ Alert Slider తో వస్తోన్న OnePlus Ace 2V first appeared on 91Mobiles Telugu.

]]>