5000ఎంఏహెచ్ బ్యాటరీ, ఐఆర్ బ్లాస్టర్, ఎన్ఎఫ్‌సీ తో వస్తోన్న OnePlus Ace 2V

Highlights

  • OnePlus Ace 2V స్పెసిఫికేషన్స్ రివీల్ చేసిన OnePlus సంస్థ
  • మార్చి 7 న చైనాలో లాంచ్ అవుతోన్న OnePlus Ace 2V; కన్ఫర్మ్ చేసిన OnePlus
  • గ్లోబల్ గా Nord (నార్డ్) బ్రాండింగ్ తో లాంచ్ కానున్న OnePlus Ace 2V

కొన్ని రోజుల క్రితం, OnePlus సంస్థ OnePlus Ace 2 సిరీస్ ని చైనాలో లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ సిరీస్ లో కొత్త మోడల్ గా OnePlus Ace 2V మార్కెట్ లోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. వన్‌ప్లస్ సంస్థ Weibo పోస్ట్ ద్వారా OnePlus Ace 2V లాంచ్ తేదీని ప్రకటించింది. 2023 మార్చి 7 న మధ్యాహ్నం 2.30 గంటలకు చైనాలో ఈ ఫోన్ లాంచ్ అవుతోంది.

ఇప్పటికే OnePlus Ace 2V ప్రీ-బుకింగ్స్ మొదలయ్యాయి. అలాగే OnePlus కంపెనీ Weibo పోస్ట్స్ ద్వారా OnePlus Ace 2V స్పెసిఫికేషన్స్ ని రివీల్ చేస్తూ వస్తోంది. లేటెస్ట్ పోస్ట్ ద్వారా OnePlus Ace 2V యొక్క బ్యాటరీ మరియు ఇతర స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి.

OnePlus Ace 2V స్పెసిఫికేషన్స్ ని రివీల్ చేసిన OnePlus సంస్థ

త్వరలో లాంచ్ కాబోయే OnePlus Ace 2V డివైజ్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానున్నట్లు OnePlus వెల్లడించింది. అయితే ఈ డివైజ్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ తో రావడం లేదు. లీగ్ ఆఫ్ లెజెండ్స్ లో 120ఎఫ్‌పీఎస్ గేమింగ్ కి, గేమ్ ఫర్ పీస్ లో 90ఎఫ్‌పీఎస్ గేమింగ్ కి ఈ ఫోన్ సపోర్ట్ చేయనున్నట్లు OnePlus ప్రకటించింది. OnePlus Ace 2V డివైజ్ 8.15 మిల్లీ మీటర్ల మందం, 191.5 గ్రాముల బరువు ఉంటుందని OnePlus తెలిపింది.

వీటితో పాటు OnePlus Ace 2V డివైజ్ ఐఆర్ బ్లాస్టర్ మరియు పూర్తిస్థాయి ఎన్ఎఫ్‌సీ వంటి ఫీచర్లతో వస్తోంది. OnePlus Ace 2V ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్సెట్ తో రానున్నట్లు గతంలో OnePlus వెల్లడించింది. ఈ చిప్ 5 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. ఇక రీసెంట్ గా OnePlus చైనా ప్రెసిడెంట్ OnePlus Ace 2V డివైజ్ 12జిబి+256జిబి మరియు 12జిబి+512జిబి వేరియంట్స్ లో వస్తోందని తెలిపారు.

OnePlus Ace 2V స్మార్ట్ ఫోన్ 6.74-ఇంచ్ 1.5కే ఓఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1450 నిట్స్ పీక్ బ్రైట్నెస్, పీడబ్ల్యూఎం డిమ్మింగ్ తో వస్తోంది. 1.5కే రెజుల్యూషన్ డిస్ప్లే, 2కే డిస్ప్లేతో పోల్చితే 24.4 శాతం తక్కువ పవర్ ని తీసుకుంటుంది. సెంటర్డ్ పంచ్ హోల్ డిస్ప్లే, హెచ్డీఆర్10+ సపోర్ట్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

గతంలో రివీల్ అయినట్లుగా, OnePlus Ace 2V డివైజ్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తోంది. ఇందులో 64ఎంపి ఓఐఎస్ మెయిన్ సెన్సర్, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 5ఎంపి మ్యాక్రో సెన్సర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి సోని ఐఎంఎక్స్471 సెన్సర్ ఉంటుంది. అంటుటు లిస్టింగ్ ప్రకారం, ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో 3.5ఎంఎం ఆడియో జాక్ కూడా ఉండనుంది.

OnePlus Ace 2V ఫోన్ ని OnePlus సంస్థ గేమర్స్ ని ఉద్దేశించి తీసుకొస్తోంది. అందుకోసం వైర్డ్ ఆడియో అనేది కచ్చితంగా ఉండాల్సిన ఫీచర్. OnePlus Ace 2V ఫ్లాట్-ఎడ్జ్ డిజైన్ తో వస్తోంది. ACE 2 లో కూడా ఇదే రకం డిజైన్ ఉంది. OnePlus Ace 2V ఫోన్ గ్లోబల్ మార్కెట్స్ లో Nord 3 పేరుతో లాంచ్ కానుందని రూమర్లు వినిపిస్తున్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.