OnePlus Buds Pro 2 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 14 Feb 2023 05:09:32 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 First Sale: నేడే OnePlus 11, OnePlus Buds Pro 2 ఫస్ట్ సేల్ https://www.91mobiles.com/telugu/oneplus-11-5g-oneplus-buds-pro-2-india-first-sale-today-via-amazon/ Tue, 14 Feb 2023 05:09:32 +0000 https://www.91mobiles.com/telugu/?p=4906 గతవారం జరిగిన క్లౌడ్ 11 ఈవెంట్ లో ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ OnePlus తన ఫ్లాగ్షిప్ డివైజ్ OnePlus 11 తో పాటు బడ్స్ ప్రో 2, వన్‌ప్లస్ 11ఆర్ ని భారత్ లో లాంచ్ చేసింది. వీటి నుంచి నేడు OnePlus 11 మరియు OnePlus Buds Pro 2 సేల్ కి వచ్చాయి. OnePlus 11 డివైజ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ తో వచ్చింది. భారత్ లో OnePlus […]

The post First Sale: నేడే OnePlus 11, OnePlus Buds Pro 2 ఫస్ట్ సేల్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో నేడు ఫస్ట్ సేల్ కి వచ్చిన OnePlus 11, OnePlus Buds Pro 2
  • భారత్ లో OnePlus 11 ధర రూ.56,999, OnePlus Buds Pro 2 ధర రూ.11,999
  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ తో వచ్చిన OnePlus 11 స్మార్ట్ ఫోన్

గతవారం జరిగిన క్లౌడ్ 11 ఈవెంట్ లో ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ OnePlus తన ఫ్లాగ్షిప్ డివైజ్ OnePlus 11 తో పాటు బడ్స్ ప్రో 2, వన్‌ప్లస్ 11ఆర్ ని భారత్ లో లాంచ్ చేసింది. వీటి నుంచి నేడు OnePlus 11 మరియు OnePlus Buds Pro 2 సేల్ కి వచ్చాయి. OnePlus 11 డివైజ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ తో వచ్చింది.

భారత్ లో OnePlus 11, OnePlus Buds Pro 2 ధర, లాంచ్ ఆఫర్స్, లభ్యత

OnePlus 11 హ్యాండ్సెట్ 8జిబి + 128జిబి వేరియంట్ ధర రూ.56,999 గా ఉంది. 16జిబి + 256జిబి యూనిట్ ధర రూ.61,999 గా ఉంది. లాంచ్ ఆఫర్ లో భాగంగా వన్‌ప్లస్ సంస్థ ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ (ఈఎంఐ, నాన్-ఈఎంఐ) మరియు డెబిట్ కార్డ్ (ఈఎంఐ) లావాదేవీలపై రూ.1,000 డిస్కౌంట్ అందిస్తోంది.

నేడు అనగా ఫిబ్రవరి 14 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్ మరియు వన్ ప్లస్ స్టోర్ ద్వారా OnePlus 11 సేల్ మొదలవుతుంది.

భారత్ లో OnePlus Buds Pro 2 ధరను రూ.11,999 గా నిర్ణయించారు. లాంచ్ ఆఫర్ లో భాగంగా వన్‌ప్లస్ సంస్థ ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ (ఈఎంఐ, నాన్-ఈఎంఐ) మరియు డెబిట్ కార్డ్ (ఈఎంఐ) లావాదేవీలపై రూ.500 డిస్కౌంట్ అందిస్తోంది. నేడు అనగా ఫిబ్రవరి 14 మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్, ఫ్లిప్ కార్ట్ మరియు వన్‌ప్లస్ స్టోర్ ద్వారా OnePlus Buds Pro 2 ని కొనుగోలు చేయవచ్చు.

OnePlus 11 స్పెసిఫికేషన్స్

OnePlus 11 5G డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 మెయిన్ సెన్సర్, 32ఎంపి సోని ఐఎంఎక్స్709 టెలీఫోటో లెన్స్, 48ఎంపి సోని ఐఎంఎక్స్581 అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి సోని ఐఎంఎక్స్471 సెన్సర్ ఉన్నాయి. వన్‌ప్లస్ కెమెరా విభాగం కోసం హేజల్‌బ్లడ్ తో కలిసి పని చేసింది.

OnePlus 11 5G స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో లాంచైంది. ఈ డివైజ్ లో 6.7-ఇంచ్ క్యూహెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 16జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీ ఉన్నాయి. యూఎఫ్ఎస్4.0 స్టోరేజీ, ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్ టెక్నాలజీని ఈ ఫోన్ లో అందించారు.

OnePlus 11 5G స్మార్ట్ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 100 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ డివైజ్ లో వై-ఫై 7, డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ ఎల్టీఈ, జీపీఎస్, బ్లూటూత్ 5.3 వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post First Sale: నేడే OnePlus 11, OnePlus Buds Pro 2 ఫస్ట్ సేల్ first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన OnePlus 11, Buds Pro 2 ధరలు https://www.91mobiles.com/telugu/oneplus-11-buds-pro-2-oneplus-keyboard-prices-leaked-before-launch/ Mon, 23 Jan 2023 14:42:18 +0000 https://www.91mobiles.com/telugu/?p=4608 OnePlus 11 లాంచ్ ఈవెంట్ భారత్ లో ఫిబ్రవరి 7 న జరగనుంది. ఈ ఆఫ్ లైన్ ఈవెంట్ ఢిల్లీలో జరుగుతుంది. ఇదే ఈవెంట్ లో ఫ్లాగ్షిప్ టీడబ్ల్యూఎస్ OnePlus Buds Pro 2 ని వన్ ప్లస్ లాంచ్ చేయబోతోంది. ఈ రెండు డివైజెస్ తో పాటు, OnePlus Keyboard కూడా లాంచ్ కానుంది. ఈ కీబోర్డ్ ని Keychron తో కలిసి వన్ ప్లస్ డెవలప్ చేసింది. Pricebaba వెలువరించిన కథనం ద్వారా OnePlus […]

The post లీకైన OnePlus 11, Buds Pro 2 ధరలు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఫిబ్రవరి 7 న భారత్ లో లాంచ్ అవుతోన్న OnePlus 11, Buds Pro 2
  • 2023 లో భారత్ లో వన్ ప్లస్ యొక్క ఫస్ట్ ఈవెంట్ ఇదే
  • Keychron తో కలిసి కీబోర్డ్ ని డెవలప్ చేసిన వన్‌ప్లస్

OnePlus 11 లాంచ్ ఈవెంట్ భారత్ లో ఫిబ్రవరి 7 న జరగనుంది. ఈ ఆఫ్ లైన్ ఈవెంట్ ఢిల్లీలో జరుగుతుంది. ఇదే ఈవెంట్ లో ఫ్లాగ్షిప్ టీడబ్ల్యూఎస్ OnePlus Buds Pro 2 ని వన్ ప్లస్ లాంచ్ చేయబోతోంది. ఈ రెండు డివైజెస్ తో పాటు, OnePlus Keyboard కూడా లాంచ్ కానుంది. ఈ కీబోర్డ్ ని Keychron తో కలిసి వన్ ప్లస్ డెవలప్ చేసింది.

Pricebaba వెలువరించిన కథనం ద్వారా OnePlus 11, వన్ ప్లస్ బడ్స్ ప్రో 2 మరియు వన్ ప్లస్ కీబోర్డ్ కి సంబంధించిన ధరలు బయటకు వచ్చాయి. లీక్ ని బట్టి, OnePlus 11 మూడు వేరియంట్స్ లో లభించనుంది. 16జిబి ర్యామ్ తో OnePlus 11 వస్తోంది. సరే, ఓసారి ఈ మూడు ప్రొడక్ట్స్ యొక్క వివరాలను తెలుసుకుందాం పదండి.

లీకైన OnePlus 11, OnePlus Buds Pro 2, OnePlus Keyboard భారత మార్కెట్ ధరలు

OnePlus 11 మూడు వేరియంట్స్ లో లభిస్తుంది. 12జిబి ర్యామ్ బేస్ వేరియంట్ ధర రూ.54,999 గా ఉంది. 16జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మిడ్ వేరియంట్ ధర రూ.59,999 గా ఉంది. 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ టాప్ వేరియంట్ ధర రూ.66,999 గా ఉంది.

ఇక OnePlus Buds Pro 2 టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్, 2021 లో వచ్చిన OnePlus Buds Pro కి సక్సెసర్ గా వస్తోంది. ఒక రిపోర్ట్ ప్రకారం, భారత్ లో OnePlus Buds Pro 2 ధర రూ.11,999 గా ఉంటుందని తెలుస్తోంది. ఆండ్రాయిడ్ 13 కోసం డెవలప్ చేయబడిన గూగుల్ యొక్క సిగ్నేచర్ స్పేషియల్ ఆడియో ఫీచర్ సపోర్ట్ తో ఈ బడ్స్ వస్తున్నట్లు సమాచారం.

ఇక OnePlus తొలిసారిగా తీసుకొస్తోన్న Keyboard ధర రూ.9,999 గా ఉంది. ఇప్పటికే కీ-బోర్డ్ యొక్క మైక్రోసైట్ వన్ ప్లస్ వెబ్ సైట్ లో దర్శనమిస్తోంది. ఆర్‌సీసీ మెంబర్స్ కి ఈ డివైజ్ స్పెషల్ డిస్కౌంట్ పై లభిస్తుంది. మార్చి నుంచి మే మధ్యలో ఈ కీబోర్డ్ ని భారీ ఎత్తున ఉత్పత్తి చేయనున్నట్లు సమాచారం. తర్వాత సేల్ కి అందుబాటులోకి వస్తుంది.

OnePlus 11 స్పెసిఫికేషన్స్

  • 6.7-inch క్యూహెచ్డీ+ ఈ4 అమోలెడ్ డిస్ప్లే
  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్
  • 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ
  • ఆండ్రాయిడ్ 13 ఓఎస్
  • 50ఎంపి+48ఎంపి+32ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా
  • 16ఎంపి ఫ్రంట్ కెమెరా
  • అలర్ట్ స్లైడర్
  • 5000mAh బ్యాటరీ
  • 100W ఫాస్ట్ చార్జింగ్
  • వై-ఫై 6ఈ, బ్లూటూత్ 5.2

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post లీకైన OnePlus 11, Buds Pro 2 ధరలు first appeared on 91Mobiles Telugu.

]]>