
OnePlus 11 లాంచ్ ఈవెంట్ భారత్ లో ఫిబ్రవరి 7 న జరగనుంది. ఈ ఆఫ్ లైన్ ఈవెంట్ ఢిల్లీలో జరుగుతుంది. ఇదే ఈవెంట్ లో ఫ్లాగ్షిప్ టీడబ్ల్యూఎస్ OnePlus Buds Pro 2 ని వన్ ప్లస్ లాంచ్ చేయబోతోంది. ఈ రెండు డివైజెస్ తో పాటు, OnePlus Keyboard కూడా లాంచ్ కానుంది. ఈ కీబోర్డ్ ని Keychron తో కలిసి వన్ ప్లస్ డెవలప్ చేసింది.
Pricebaba వెలువరించిన కథనం ద్వారా OnePlus 11, వన్ ప్లస్ బడ్స్ ప్రో 2 మరియు వన్ ప్లస్ కీబోర్డ్ కి సంబంధించిన ధరలు బయటకు వచ్చాయి. లీక్ ని బట్టి, OnePlus 11 మూడు వేరియంట్స్ లో లభించనుంది. 16జిబి ర్యామ్ తో OnePlus 11 వస్తోంది. సరే, ఓసారి ఈ మూడు ప్రొడక్ట్స్ యొక్క వివరాలను తెలుసుకుందాం పదండి.
లీకైన OnePlus 11, OnePlus Buds Pro 2, OnePlus Keyboard భారత మార్కెట్ ధరలు
OnePlus 11 మూడు వేరియంట్స్ లో లభిస్తుంది. 12జిబి ర్యామ్ బేస్ వేరియంట్ ధర రూ.54,999 గా ఉంది. 16జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మిడ్ వేరియంట్ ధర రూ.59,999 గా ఉంది. 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ టాప్ వేరియంట్ ధర రూ.66,999 గా ఉంది.
ఇక OnePlus Buds Pro 2 టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్, 2021 లో వచ్చిన OnePlus Buds Pro కి సక్సెసర్ గా వస్తోంది. ఒక రిపోర్ట్ ప్రకారం, భారత్ లో OnePlus Buds Pro 2 ధర రూ.11,999 గా ఉంటుందని తెలుస్తోంది. ఆండ్రాయిడ్ 13 కోసం డెవలప్ చేయబడిన గూగుల్ యొక్క సిగ్నేచర్ స్పేషియల్ ఆడియో ఫీచర్ సపోర్ట్ తో ఈ బడ్స్ వస్తున్నట్లు సమాచారం.
ఇక OnePlus తొలిసారిగా తీసుకొస్తోన్న Keyboard ధర రూ.9,999 గా ఉంది. ఇప్పటికే కీ-బోర్డ్ యొక్క మైక్రోసైట్ వన్ ప్లస్ వెబ్ సైట్ లో దర్శనమిస్తోంది. ఆర్సీసీ మెంబర్స్ కి ఈ డివైజ్ స్పెషల్ డిస్కౌంట్ పై లభిస్తుంది. మార్చి నుంచి మే మధ్యలో ఈ కీబోర్డ్ ని భారీ ఎత్తున ఉత్పత్తి చేయనున్నట్లు సమాచారం. తర్వాత సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
OnePlus 11 స్పెసిఫికేషన్స్
- 6.7-inch క్యూహెచ్డీ+ ఈ4 అమోలెడ్ డిస్ప్లే
- 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
- క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్
- 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ
- ఆండ్రాయిడ్ 13 ఓఎస్
- 50ఎంపి+48ఎంపి+32ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా
- 16ఎంపి ఫ్రంట్ కెమెరా
- అలర్ట్ స్లైడర్
- 5000mAh బ్యాటరీ
- 100W ఫాస్ట్ చార్జింగ్
- వై-ఫై 6ఈ, బ్లూటూత్ 5.2
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.











