OPPO A58 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 08 Nov 2022 12:13:21 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 90Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో లాంచ్ అయిన OPPO A58 5G https://www.91mobiles.com/telugu/oppo-a58-5g-launched-china-specs-price/ Tue, 08 Nov 2022 12:13:21 +0000 https://www.91mobiles.com/telugu/?p=3312 హైలైట్స్ చైనాలో లాంచ్ అయిన OPPO A58 5G స్మార్ట్ ఫోన్ త్వరలో భారత్ తో పాటు ఇతర మార్కెట్స్ లో లాంచ్ అయ్యే అవకాశం 6.56-ఇంచ్ డిస్ప్లే, 50ఎంపి మెయిన్ కెమెరా, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్ OPPO సంస్థ ఏ-సిరీస్ లో మరో ఫోన్ ని లాంచ్ చేసింది. OPPO A58 5G అనే కొత్త బడ్జెట్ 5జీ ఫోన్ ని మార్కెట్ లోకి తీసుకొచ్చింది ఒప్పో. అయితే […]

The post 90Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో లాంచ్ అయిన OPPO A58 5G first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • చైనాలో లాంచ్ అయిన OPPO A58 5G స్మార్ట్ ఫోన్
  • త్వరలో భారత్ తో పాటు ఇతర మార్కెట్స్ లో లాంచ్ అయ్యే అవకాశం
  • 6.56-ఇంచ్ డిస్ప్లే, 50ఎంపి మెయిన్ కెమెరా, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్

OPPO సంస్థ ఏ-సిరీస్ లో మరో ఫోన్ ని లాంచ్ చేసింది. OPPO A58 5G అనే కొత్త బడ్జెట్ 5జీ ఫోన్ ని మార్కెట్ లోకి తీసుకొచ్చింది ఒప్పో. అయితే ఈ ఫోన్ ప్రస్తుతం చైనాలో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే భారత్ తో సహా ఇతర గ్లోబల్ మార్కెట్స్ లో OPPO A58 5G లాంచ్ అవ్వనుంది. OPPO A58 5G ప్రస్తుతం ఉన్న ఏ57 డిజైన్ తో పోల్చితే కొంచెం కొత్త డిజైన్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.

OPPO A58 5G స్మార్ట్ ఫోన్ మూడు కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఒప్పో ఈ డివైజ్ ని సింగిల్ స్టోరేజీ వేరియంట్ లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ మీడియాటెక్ ప్రాసెసర్, డ్యూయల్ కెమెరా సెటప్ తో వచ్చింది. OPPO A58 5G యొక్క ధర, స్పెసిఫికేషన్స్ ఇతర వివరాలను తెలుసుకుందాం పదండి.

OPPO A58 5G ధర

ఒప్పో కంపెనీ OPPO A58 5G ఫోన్ ని ఒకే స్టోరేజీ ఆప్షన్ లో చైనా మార్కెట్ లో లాంచ్ చేసింది. ఈ 5జీ స్మార్ట్ ఫోన్ 8జిబి ర్యామ్, 256జిబి ఇంటర్నల్ స్టోరేజీ తో వచ్చింది. చైనాలో ఈ ఫోన్ ధర CNY 1,699 (సుమారు రూ.19,200) గా ఉంది. బ్రీజ్ పర్పుల్, సీ బ్లూ, స్టార్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.

OPPO A58 5G స్పెసిఫికేషన్స్

OPPO A58 5G స్మార్ట్ ఫోన్ 6.56-ఇంచ్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే తో వచ్చింది. ఇది 1612*720 పిక్సెల్స్ రెజుల్యూషన్ కలిగి ఉంది. ఈ ఫోన్ వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లేని కలిగి ఉంది. సన్నని బెజెల్స్ డిస్ప్లే చుట్టూ ఉన్నాయి. అయితే బాటమ్ లో మందపాటి చిన్ ఉంది. ఈ డిస్ప్లే 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 600 నిట్స్ బ్రైట్నెస్ ని కలిగి ఉంది.

OPPO A58 5G బ్యాక్ ప్యానెల్ పై రెండు సర్క్యులర్ కటౌట్స్ ఉన్నాయి. వీటిలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు.

OPPO A58 5G డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్ ని వినియోగించారు. ఇది బడ్జెట్ 5జీ ప్రాసెసర్. ఇప్పటికే భారత్ లో రూ.13,000 ధరలో లభిస్తోన్న ఫోన్లలో ఈ చిప్ ని మనం గమనించవచ్చు. OPPO A58 5G లో 8జిబి ఎల్పిడిడిఆర్4ఎక్స్ ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 2.2 ఇంటర్నల్ స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని పెంచుకోవచ్చు. 5జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ కూడా ఇందులో ఉండటం విశేషం. అంటే మొత్తంగా 8జిబి+5జిబి ర్యామ్ లభిస్తుంది.

OPPO A58 5G లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో 3.5 ఎంఎం ఆడియో జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, బ్లూటూత్ 5.3, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. OPPO A58 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత కలర్ ఓఎస్ 12.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 90Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో లాంచ్ అయిన OPPO A58 5G first appeared on 91Mobiles Telugu.

]]>
MediaTek Dimensity 700 చిప్సెట్ తో వస్తోన్న OPPO A58 5G https://www.91mobiles.com/telugu/oppo-a58-5g-specs-leaked-before-launch/ Tue, 01 Nov 2022 13:01:58 +0000 https://www.91mobiles.com/telugu/?p=3179 హైలైట్స్ త్వరలో లాంచ్ కానున్న OPPO A58 5G స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్, 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్ ట్రాన్‌క్విల్ సీ బ్లూ, బ్రీజ్ పర్పుల్, స్టారీ స్కై బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభించనున్న OPPO A58 5G ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ OPPO త్వరలో OPPO A98 అనే స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయనున్నట్లు నిన్నే ఓ వార్త బయటకు వచ్చింది. […]

The post MediaTek Dimensity 700 చిప్సెట్ తో వస్తోన్న OPPO A58 5G first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • త్వరలో లాంచ్ కానున్న OPPO A58 5G స్మార్ట్ ఫోన్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్, 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్
  • ట్రాన్‌క్విల్ సీ బ్లూ, బ్రీజ్ పర్పుల్, స్టారీ స్కై బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభించనున్న OPPO A58 5G

ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ OPPO త్వరలో OPPO A98 అనే స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయనున్నట్లు నిన్నే ఓ వార్త బయటకు వచ్చింది. ఈ ఫోన్ 108ఎంపి కెమెరా, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తున్నట్లు సమాచారం. అయితే తాజాగా ఒప్పో నుంచి OPPO A58 5G అనే మరొక స్మార్ట్ ఫోన్ కూడా రాబోతోందని ఇంకో వార్త ఇవాళ నెట్టింట్లో ప్రత్యక్షమైంది. OPPO A58 5G కి సంబంధించిన ఫోటోస్, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ వివరాలు 91మొబైల్స్ కి అందాయి.

OPPO A58 5G స్పెసిఫికేషన్స్

OPPO A58 5G 6.56-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే తో వస్తోంది. ఈ స్క్రీన్ ఎల్సీడీ ప్యానెల్ తో తయారైంది. ఇది 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. OPPO A58 5G స్క్రీన్ బెజెల్-లెస్ డిజైన్ తో వస్తోంది. బాటమ్ లో మందపాటి చిన్ ఉంటుంది. ఇకపోతే వి-షేప్ నాచ్, డిస్ప్లే పై భాగం మధ్యలో ఉంటుంది. ఇందులో సెల్ఫీ కెమెరా నిక్షిప్తమై ఉంటుంది.

OPPO A58 5G ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత కలర్ ఓఎస్ 12.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. అలాగే ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్ తో రానుందని సమాచారం. OPPO A58 5G 8జిబి వరకు ర్యామ్ మరియు 256జిబి వరకు ఇంటర్నల్ స్టోరేజీ ఆప్షన్ తో వస్తోంది. ఇందులో LPDDR4x ర్యామ్, UFS 2.2 స్టోరేజీ టెక్నాలజీని వాడటం జరిగింది.

ఇప్పుడు OPPO A58 5G యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. OPPO A58 5G లో 50 మెగా పిక్సెల్ శాంసంగ్ సెన్సర్ వాడారు. ఇకపోతే ఇందులో 108ఎంపి సెకండరీ సెన్సర్ ఉండనుంది. సెకండరీ కెమెరా కోసం 108ఎంపి లెన్స్ ని వాడటం ఇదే మొదటిసారి కావచ్చు. మరి ఇది ఎంతవరకు నిజమో అధికార సమాచారం వచ్చాక తెలుస్తుంది. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపున 8 మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది. OPPO A58 5G లో 3880 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

OPPO A58 5G ధర, వేరియంట్స్

OPPO A58 5G మొత్తం మూడు వేరియంట్స్ లో లభ్యం కానుంది. అవి: 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్, 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ యూనిట్, 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్. OPPO A58 5G యొక్క ధర ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. OPPO A58 5G మొత్తం మూడు రంగుల్లో లభ్యమవుతుంది. అవి: ట్రాన్‌క్విల్ సీ బ్లూ, బ్రీజ్ పర్పుల్, స్టారీ స్కై బ్లాక్ కలర్.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post MediaTek Dimensity 700 చిప్సెట్ తో వస్తోన్న OPPO A58 5G first appeared on 91Mobiles Telugu.

]]>