OPPO A77 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 17 Oct 2022 14:33:33 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 ధర తగ్గింపు: OPPO F21 Pro, OPPO A55, OPPO A77 ఫోన్లపై డిస్కౌంట్ https://www.91mobiles.com/telugu/oppo-f21-pro-a55-a77-price-cut-discount/ Mon, 17 Oct 2022 14:33:33 +0000 https://www.91mobiles.com/telugu/?p=2929 హైలైట్స్ OPPO F21 Pro, OPPO A55, OPPO A77 ఫోన్ల ధరలు తగ్గించిన OPPO భారత్ లో ప్రస్తుతం OPPO F21 Pro ధర రూ.21,999 OPPO A55, OPPO A77 ఫోన్ల ధరలు వరుసగా రూ.14,499 మరియు రూ.15,999 ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థ ఒప్పో భారత్ లో కొన్ని ఫోన్ల ధరలను తగ్గించింది. ఓ రిపోర్ట్ ప్రకారం, ప్రస్తుతం భారత్ లో OPPO F21 Pro, OPPO A55, OPPO A77 ఫోన్లు […]

The post ధర తగ్గింపు: OPPO F21 Pro, OPPO A55, OPPO A77 ఫోన్లపై డిస్కౌంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • OPPO F21 Pro, OPPO A55, OPPO A77 ఫోన్ల ధరలు తగ్గించిన OPPO
  • భారత్ లో ప్రస్తుతం OPPO F21 Pro ధర రూ.21,999
  • OPPO A55, OPPO A77 ఫోన్ల ధరలు వరుసగా రూ.14,499 మరియు రూ.15,999

ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థ ఒప్పో భారత్ లో కొన్ని ఫోన్ల ధరలను తగ్గించింది. ఓ రిపోర్ట్ ప్రకారం, ప్రస్తుతం భారత్ లో OPPO F21 Pro, OPPO A55, OPPO A77 ఫోన్లు తగ్గించిన ధరతో అమ్ముడవుతున్నాయి. ఒప్పో అధికార వెబ్ సైట్ కూడా సవరించిన ధరలను చూపిస్తున్నాయి. ఓసారి తగ్గిన ధరల వివరాలను చూద్దాం.

అలాగే, OPPO F21 Pro, OPPO A55, OPPO A77 ఫోన్లపై రూ.1,000 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. OPPO A77 ధర తగ్గింపు తర్వాత రూ.15,999 కి సేల్ అవుతోంది.

OPPO F21 Pro, OPPO A55, OPPO A77 ఫోన్లపై డిస్కౌంట్

OPPO F21 Pro 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ఇదివరకు రూ.22,999 ధరతో అమ్ముడైంది. ఇప్పుడు ఈ ఫోన్ ధర రూ.1,000 డిస్కౌంట్ తర్వాత రూ.21,999 గా ఉంది. మరోవైపు OPPO A55 స్మార్ట్ ఫోన్ 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ రూ.14,499 వద్ద అమ్ముడవుతోంది. ఇక 6జిబి ర్యామ్ వేరియంట్ ధర రూ.14,999 గా ఉంది. OPPO A77 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర ప్రస్తుతం రూ.15,999 గా ఉంది.

OPPO F21 Pro స్పెసిఫికేషన్స్

OPPO F21 Pro లో 6.43-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. ఇందులో స్నాప్ డ్రాగన్ 680 చిప్సెట్ అమర్చారు. అలాగే ఇందులో 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ షూటర్, 2ఎంపి మోనోక్రోమ్ లెన్స్ ఉన్నాయి. 4500ఎంఏహెచ్ బ్యాటరీని ఈ ఫోన్ లో అమర్చారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది.

OPPO A55 స్పెసిఫికేషన్స్

OPPO A55 స్మార్ట్ ఫోన్ లో 6.55-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 720*1600 రెజుల్యూషన్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. ఈ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ35 చిప్సెట్, 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ ఉన్నాయి. OPPO A55 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి మోనోక్రోమ్ షూటర్ ఉన్నాయి. OPPO A55 లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

OPPO A77 స్పెసిఫికేషన్స్

OPPO A77 స్మార్ట్ ఫోన్ లో 6.56-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. ఈ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ35 చిప్సెట్ అమర్చారు. ఈ ఫోన్ 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీని కలిగి ఉంది. 1టిబి వరకు మెమొరీని ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు. OPPO A77 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. OPPO A77 లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post ధర తగ్గింపు: OPPO F21 Pro, OPPO A55, OPPO A77 ఫోన్లపై డిస్కౌంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
భారత్ లో లాంచ్ అయిన OPPO A77 4G https://www.91mobiles.com/telugu/oppo-a77-launched-india-price-specs-availability/ Wed, 03 Aug 2022 10:25:16 +0000 https://www.91mobiles.com/telugu/?p=1454 హైలైట్స్: భారత్ లో లాంచ్ అయిన ఒప్పో ఏ77 4జీ స్మార్ట్ ఫోన్ 6.56 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే, 60హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ హీలియో జీ35, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు భారత్ లో ఒప్పో ఏ77 ధర రూ.15,499 ఒప్పో ఏ77 4జీ స్మార్ట్ ఫోన్ భారత్ లో లాంచ్ అయ్యింది. ఒప్పో నుంచి వచ్చిన లేటెస్ట్ ‘ఏ’ సిరీస్ స్మార్ట్ ఫోన్ ఇదే. ఇదివరకే ఈ ఫోన్ గురించి […]

The post భారత్ లో లాంచ్ అయిన OPPO A77 4G first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • భారత్ లో లాంచ్ అయిన ఒప్పో ఏ77 4జీ స్మార్ట్ ఫోన్
  • 6.56 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే, 60హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ హీలియో జీ35, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు
  • భారత్ లో ఒప్పో ఏ77 ధర రూ.15,499

ఒప్పో ఏ77 4జీ స్మార్ట్ ఫోన్ భారత్ లో లాంచ్ అయ్యింది. ఒప్పో నుంచి వచ్చిన లేటెస్ట్ ‘ఏ’ సిరీస్ స్మార్ట్ ఫోన్ ఇదే. ఇదివరకే ఈ ఫోన్ గురించి 91మొబైల్స్ తెలుగు ఓ కథనాన్ని ప్రచురించింది. ఆఫ్ లైన్ మార్కెట్ ను టార్గెట్ చేస్తూ వస్తున్న ఈ ఫోన్ లో 4జీ కనెక్టివిటీ మాత్రమే ఉంది. ఇక సెల్ఫీ కెమెరా కోసం ఈ ఫోన్లో వాటర్ డ్రాప్ నాచ్ ఉంది. ఫోన్ డిజైన్ చూస్తే, ఫ్లాట్ ఎడ్జెస్ కలిగి బాటమ్ లో కాస్త చిన్ ఉంది. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది. రెక్ట్యాంగులర్ మాడ్యూల్ లో డ్యూయల్ కెమెరాలు ఉన్నాయి. ఒప్పో ఏ77 4జీ, సన్ సెట్ ఆరెంజ్ కలర్ ఆప్షన్ లో లభించనుంది. ఫోన్ వెనకాల ఫాక్స్ లెదర్ ఫినిషింగ్ తో ప్రీమియమ్ లుక్ ని కలిగి ఉంది.

ఒప్పో ఏ77 లో 6.56 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ హీలియో జీ35 చిప్సెట్, ఆండ్రాయిడ్ 12 ఆధారిత కలర్ ఓఎస్ 12.1 కస్టమ్ స్కిన్, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 4జీ ఎల్టీఈ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి.

భారత్ లో OPPO A77 ధర

భారత్ లో ఒప్పో ఏ77 4జిబి+64జిబి మోడల్ ధర రూ.15,499 గా ఉంది. ఒప్పో వెబ్ సైట్ తో పాటు, ఆఫ్ లైన్ స్టోర్స్ ద్వారా ఈ స్మార్ట్ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. సన్సెట్ ఆరెంజ్, స్కై బ్లూ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభించనుంది. లాంచ్ ఆఫర్ క్రింద, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్ తో 10 శాతం క్యాష్ బ్యాక్ లభించనుంది.

OPPO A77 స్పెసిఫికేషన్స్

6.56 అంగుళాల హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ హీలియో జీ35 చిప్సెట్, 89.8 పర్సెంట్ స్క్రీన్ టు బాడీ రేషియో, 1610*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, 269 పిక్సెల్స్ పర్ ఇంచ్, వాటర్ డ్రాప్ నాచ్, 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ, ఎక్స్‌పాండబుల్ మెమొరీ, ఆండ్రాయిడ్ 12 ఆధారిత కలర్ ఓఎస్ 12.1 కస్టమ్ స్కిన్ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి.

ఒప్పో ఏ77 స్మార్ట్ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, అల్ట్రా లీనియర్ స్టీరియో స్పీకర్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్భీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.

ఇప్పుడు కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఒప్పో ఏ77 లో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇక ఈ ఫోన్లో హెచ్డీ+ డిస్ప్లే ఉన్న విషయం గమనించాలి. హెచ్డీ+ డిస్ప్లే ఉన్న ఫోన్ కి రూ.15 వేలకు పైగా ధరను నిర్ణయించడం కరెక్టేనంటారా?

The post భారత్ లో లాంచ్ అయిన OPPO A77 4G first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్ కి ముందు లీకైన OPPO A77 ధర, స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/oppo-a77-price-specs-revealed-before-launch/ Mon, 01 Aug 2022 07:36:10 +0000 https://www.91mobiles.com/telugu/?p=1385 హైలైట్స్: ఆగస్టు మొదటి వారంలో ఒప్పో ఏ77 హ్యాండ్సెట్ ధర రూ.16,000 ఉండే అవకాశం మీడియాటెక్ హీలియో జీ35, 6.56-అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు మిడ్-రేంజ్ సెగ్మెంట్ లో ఒప్పో బ్రాండ్ నుంచి ఏ మరియు ఎఫ్ సిరీస్ ఫోన్లు వస్తుంటాయి. రెనో లైనప్ తర్వాత వీటికి డిమాండ్ ఉంటుంది. త్వరలోనే ఒప్పో నుంచి ఏ77 అనే స్మార్ట్ ఫోన్ […]

The post లాంచ్ కి ముందు లీకైన OPPO A77 ధర, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • ఆగస్టు మొదటి వారంలో ఒప్పో ఏ77
  • హ్యాండ్సెట్ ధర రూ.16,000 ఉండే అవకాశం
  • మీడియాటెక్ హీలియో జీ35, 6.56-అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు

మిడ్-రేంజ్ సెగ్మెంట్ లో ఒప్పో బ్రాండ్ నుంచి ఏ మరియు ఎఫ్ సిరీస్ ఫోన్లు వస్తుంటాయి. రెనో లైనప్ తర్వాత వీటికి డిమాండ్ ఉంటుంది. త్వరలోనే ఒప్పో నుంచి ఏ77 అనే స్మార్ట్ ఫోన్ లాంచ్ కానుందని సమాచారం. ప్రముఖ లీక్‌స్టర్ ముకుల్ శర్మ ఒప్పో ఏ77 గురించి లాంచ్ టైమ్ లైన్, ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ ని విడుదల చేశాడు. లీక్ ని బట్టి, ఒప్పో ఏ77 స్మార్ట్ ఫోన్ రెడ్ మీ నోట్ 11 ప్రో+, రియల్ మీ 9 5జీ, శాంసంగ్ గెలాక్సీ ఎమ్13 తదితర ఫోన్లతో పోటీపడనుంది.

లీక్ ద్వారా తెలుస్తున్నదేంటంటే, ఒప్పో ఏ77 ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ35 చిప్సెట్ ను అమర్చారు. అంటే ఈ ఫోన్ లో 4జీ ఎల్టీఈ మాత్రమే ఉంటుంది. 5జీ ఉండదు.

భారత్ లో OPPO A77 లాంచ్ ఎప్పుడు?

ఆగస్టు మొదటి వారంలో ఒప్పో ఏ77 భారత్ లో లాంచ్ కానుందని సమాచారం. మరికొన్ని రోజుల్లో ఫోన్ లాంచ్ కి సంబంధించిన అసలైన తేదీని వెల్లడి కానుంది. ఒప్పో ఏ77 స్మార్ట్ ఫోన్ రెడ్ మీ నోట్ 11 ప్రో+, రియల్ మీ 9 5జీ, శాంసంగ్ గెలాక్సీ ఎమ్13 తదితర ఫోన్లతో పోటీపడనుంది.

భారత్ లో OPPO A77 ప్రైస్, కలర్స్

ఒప్పో ఏ77 బేస్ వేరియంట్ ధర భారత్ లో రూ.16,000 ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక టాప్-ఎండ్ మోడల్ కి కాస్త ఎక్కువ రేటు ఉండే అవకాశముంది. సన్‌సెట్ ఆరెంజ్, స్కై బ్లూ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభ్యం కానుంది.

OPPO A77 స్పెసిఫికేషన్స్

టిప్‌స్టర్ ముకుల్ చెబుతున్న దాన్ని బట్టి, ఒప్పో ఏ77 స్మార్ట్ ఫోన్ లో 6.56 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే ఉండనుంది. ఇది ఎల్సీడీ 60హెర్ట్జ్ ప్యానెల్ అని తెలుస్తోంది. ఇక ఫోన్లో మీడియాటెక్ హీలియో జీ35 చిప్సెట్ ను అమర్చారు. 8జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ, మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీ ఎక్స్‌ప్యాన్షన్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, కలర్ ఓఎస్ 12.1 కస్టమ్ స్కిన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఒప్పో ఏ77 స్మార్ట్ ఫోన్లో 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, అల్ట్రా-లీనియర్ డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. ఇక కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్లో వెనుకాల రెండు కెమెరాలున్నాయి. వీటిలో ఒకటి 50ఎంపి ప్రధాన కెమెరా కాగా, మరొకటి 2ఎంపి మ్యాక్రో సెన్సర్. కెమెరాలో నైట్ ఫీచర్స్ ని అందించారు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కొరకు ఈ ఫోన్లో 8ఎంపి ఏఐ పోట్రెయిట్ లెన్స్ ను ముందు భాగంలో అందించారు. ఒప్పో ఏ77 స్మార్ట్ ఫోన్ రెడ్ మీ నోట్ 11 ప్రో+, రియల్ మీ 9 5జీ, శాంసంగ్ గెలాక్సీ ఎమ్13 తదితర ఫోన్లతో పోటీపడనుంది.

The post లాంచ్ కి ముందు లీకైన OPPO A77 ధర, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>