హైలైట్స్:
- భారత్ లో లాంచ్ అయిన ఒప్పో ఏ77 4జీ స్మార్ట్ ఫోన్
- 6.56 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే, 60హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ హీలియో జీ35, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు
- భారత్ లో ఒప్పో ఏ77 ధర రూ.15,499
ఒప్పో ఏ77 4జీ స్మార్ట్ ఫోన్ భారత్ లో లాంచ్ అయ్యింది. ఒప్పో నుంచి వచ్చిన లేటెస్ట్ ‘ఏ’ సిరీస్ స్మార్ట్ ఫోన్ ఇదే. ఇదివరకే ఈ ఫోన్ గురించి 91మొబైల్స్ తెలుగు ఓ కథనాన్ని ప్రచురించింది. ఆఫ్ లైన్ మార్కెట్ ను టార్గెట్ చేస్తూ వస్తున్న ఈ ఫోన్ లో 4జీ కనెక్టివిటీ మాత్రమే ఉంది. ఇక సెల్ఫీ కెమెరా కోసం ఈ ఫోన్లో వాటర్ డ్రాప్ నాచ్ ఉంది. ఫోన్ డిజైన్ చూస్తే, ఫ్లాట్ ఎడ్జెస్ కలిగి బాటమ్ లో కాస్త చిన్ ఉంది. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది. రెక్ట్యాంగులర్ మాడ్యూల్ లో డ్యూయల్ కెమెరాలు ఉన్నాయి. ఒప్పో ఏ77 4జీ, సన్ సెట్ ఆరెంజ్ కలర్ ఆప్షన్ లో లభించనుంది. ఫోన్ వెనకాల ఫాక్స్ లెదర్ ఫినిషింగ్ తో ప్రీమియమ్ లుక్ ని కలిగి ఉంది.
ఒప్పో ఏ77 లో 6.56 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ హీలియో జీ35 చిప్సెట్, ఆండ్రాయిడ్ 12 ఆధారిత కలర్ ఓఎస్ 12.1 కస్టమ్ స్కిన్, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 4జీ ఎల్టీఈ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి.
భారత్ లో OPPO A77 ధర
భారత్ లో ఒప్పో ఏ77 4జిబి+64జిబి మోడల్ ధర రూ.15,499 గా ఉంది. ఒప్పో వెబ్ సైట్ తో పాటు, ఆఫ్ లైన్ స్టోర్స్ ద్వారా ఈ స్మార్ట్ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. సన్సెట్ ఆరెంజ్, స్కై బ్లూ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభించనుంది. లాంచ్ ఆఫర్ క్రింద, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్ తో 10 శాతం క్యాష్ బ్యాక్ లభించనుంది.
OPPO A77 స్పెసిఫికేషన్స్
6.56 అంగుళాల హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ హీలియో జీ35 చిప్సెట్, 89.8 పర్సెంట్ స్క్రీన్ టు బాడీ రేషియో, 1610*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, 269 పిక్సెల్స్ పర్ ఇంచ్, వాటర్ డ్రాప్ నాచ్, 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ, ఎక్స్‌పాండబుల్ మెమొరీ, ఆండ్రాయిడ్ 12 ఆధారిత కలర్ ఓఎస్ 12.1 కస్టమ్ స్కిన్ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి.
ఒప్పో ఏ77 స్మార్ట్ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, అల్ట్రా లీనియర్ స్టీరియో స్పీకర్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్భీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.
ఇప్పుడు కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఒప్పో ఏ77 లో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇక ఈ ఫోన్లో హెచ్డీ+ డిస్ప్లే ఉన్న విషయం గమనించాలి. హెచ్డీ+ డిస్ప్లే ఉన్న ఫోన్ కి రూ.15 వేలకు పైగా ధరను నిర్ణయించడం కరెక్టేనంటారా?













