OPPO F27 Pro Plus 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 10 Sep 2024 16:47:26 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Nothing Phone 2a Plus vs OPPO F27 Pro Plus: ఏది బెటర్ బ్యాటరీ లైఫ్ ఇస్తుంది? https://www.91mobiles.com/telugu/nothing-phone-2a-plus-vs-oppo-f27-pro-plus-battery-comparison-which-one-gives-better-battery-life/ https://www.91mobiles.com/telugu/nothing-phone-2a-plus-vs-oppo-f27-pro-plus-battery-comparison-which-one-gives-better-battery-life/#respond Tue, 10 Sep 2024 16:47:26 +0000 https://www.91mobiles.com/telugu/?p=13425 స్మార్ట్‌ఫోన్ కొనే ముందు ప్రధానంగా చూసే స్పెసిఫికేషన్స్ లో బ్యాటరీ విభాగం ఒకటి. ఫోన్ ఎక్కువ సేపు వాడుకోవాలంటే, మంచి పవర్ బ్యాకప్ ఉండాలి. అంటే బ్యాటరీ లైఫ్ ఎక్కువగా అందించే ఫోన్‌ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మార్కెట్ లో చాలా ఫోన్లు ఉంటాయి. అందులో ఏ ఫోన్ బ్యాటరీ లైఫ్ ఎంతా? అనేది వాడితే గానీ తెలియదు. అందుకే మేం ఎప్పటికప్పుడు ఫోన్ల బ్యాటరీ పెర్ఫామెన్స్ ఎలా ఉందో కొన్ని టెస్టులు జరిపి తెలుసుకుంటున్నాం. Nothing […]

The post Nothing Phone 2a Plus vs OPPO F27 Pro Plus: ఏది బెటర్ బ్యాటరీ లైఫ్ ఇస్తుంది? first appeared on 91Mobiles Telugu.

]]>

స్మార్ట్‌ఫోన్ కొనే ముందు ప్రధానంగా చూసే స్పెసిఫికేషన్స్ లో బ్యాటరీ విభాగం ఒకటి. ఫోన్ ఎక్కువ సేపు వాడుకోవాలంటే, మంచి పవర్ బ్యాకప్ ఉండాలి. అంటే బ్యాటరీ లైఫ్ ఎక్కువగా అందించే ఫోన్‌ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మార్కెట్ లో చాలా ఫోన్లు ఉంటాయి. అందులో ఏ ఫోన్ బ్యాటరీ లైఫ్ ఎంతా? అనేది వాడితే గానీ తెలియదు. అందుకే మేం ఎప్పటికప్పుడు ఫోన్ల బ్యాటరీ పెర్ఫామెన్స్ ఎలా ఉందో కొన్ని టెస్టులు జరిపి తెలుసుకుంటున్నాం.

Nothing Phone 2a Plus మరియు OPPO F27 Pro Plus ఫోన్ల బ్యాటరీ పనితనాన్ని మేం కొన్ని టెస్టులు చేసి పరీక్షించాం. ఆ వివరాలను మీకోసం ఇక్కడ అందిస్తున్నాం. ఓసారి చదివి తెలుసుకోండి.

Nothing Phone 2a Plus లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు. మరోవైపు OPPO F27 Pro Plus లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.

పీసీమార్క్ టెస్ట్

మేం జరిపిన పీసీమార్క్ టెస్టులో రెండు ఫోన్ల యొక్క బ్రైట్నెస్ 80 శాతం, వాల్యూమ్ 50 శాతం పెట్టడం జరిగింది. అలాగే నెట్వర్క్ కమ్యూనికేషన్ ను డిసేబుల్ చేశాం.

నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ డివైజ్ 14 గంటల 34 నిమిషాల బ్యాటరీ లైఫ్ అందించింది. మరోవైపు, ఒప్పో ఎఫ్27 ప్రో ప్లస్ 10 గంటల 46 నిమిషాల బ్యాటరీ లైఫ్ ఇచ్చింది. దీన్ని బట్టి, నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్, ఒప్పో ఎఫ్27 ప్రో ప్లస్ కంటే ఎక్కువసేపు నడుస్తుందని స్పష్టమైంది.

విజేత: Nothing Phone 2a Plus

వీడియో స్ట్రీమింగ్ టెస్ట్

రెండు ఫోన్లలో ఒకే విధమైన సెట్టింగ్స్ పెట్టి, యూట్యూబ్ లో 30 నిమిషాల పాటు హై-క్వాలిటీ వీడియోలను చూడటం జరిగింది. ఈ టెస్టులో నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ బ్యాటరీ 4 శాతం ఖర్చయ్యింది. మరోవైపు, ఒప్పో ఎఫ్27 ప్రో ప్లస్ బ్యాటరీ కూడా 4 శాతం ఖర్చయ్యింది. ఈ టెస్టులో రెండు ఫోన్లు కూడా సమఉజ్జీలుగా నిలిచాయి.

విజేత: సమానం

గేమింగ్ టెస్ట్

రెండు ఫోన్లలో ఒకే విధమైన సెట్టింగ్స్ తో, 30 నిమిషాల పాటు, కాల్ ఆఫ్ డ్యూటీ, రియల్ రేసింగ్ 3, బీజీఎంఐ వంటి గేమ్‌లు ఆడటం జరిగింది. టెస్టు తర్వాత, నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ యొక్క బ్యాటరీ గేములను బట్టి, వరుసగా 7 శాతం, 6 శాతం, 6 శాతంగా ఖర్చయ్యింది. యావరేజీ తీస్తే, దీన్ని 6.3 శాతం గా చెప్పవచ్చు.

మరోవైపు, ఒప్పో ఎఫ్27 ప్రో ప్లస్ బ్యాటరీ వరుసగా 7 శాతం, 8 శాతం మరియు 8 శాతం మేర ఖర్చయ్యింది. యావరేజీ చూస్తే, 7.6 శాతం గా ఉంది.

విజేత: Nothing Phone 2a Plus

చార్జింగ్ టెస్ట్

నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ ఫోన్‌ని 50 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది. అయితే బాక్స్ లో చార్జర్ అందించలేదు. దీంతో, మేం మోటోరోలా యొక్క 68 వాట్ పీడీ చార్జర్ ను వాడి, చార్జ్ చేసినప్పుటు 20 శాతం నుంచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు 51 నిమిషాల సమయం పట్టింది.

మరోవైపు, ఒప్పో ఎఫ్27 ప్రో ప్లస్ ను 67 వాట్ సూపర్‌వూక్ చార్జర్ తో చార్జ్ చేసినప్పుడు, 20 శాతం నుంచి 100 శాతం వరకు చార్జ్ అయ్యేందుకు 48 నిమిషాల సమయం పట్టింది.

ఈ టెస్టు తర్వాత రెండు ఫోన్ల యొక్క స్కోరును గమనిస్తే, చాలా తక్కువ తేడా మాత్రమే ఉంది. బాక్స్ లో చార్జర్ తో రాకపోవడం నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ కి ఒక పాయింట్‌ను కోల్పోయేలా చేసింది.

విజేత: OPPO F27 Pro Plus

ఏది బెటర్?

మేం చేసిన బ్యాటరీ పోలిక నివేదిక ప్రకారం, పీసీమార్క్ టెస్ట్ మరియు గేమింగ్ టెస్టులలో Nothing Phone 2a Plus బాగా పెర్ఫామ్ చేసింది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7350 చిప్సెట్ వల్లనేనని చెప్పవచ్చు. ఎందుకంటే, ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైంది. కాబట్టి, ఎంతో శక్తివంతమైంది.

ఇక, OPPO F27 Pro Plus లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైంది. ఈ ఫోన్ చార్జింగ్ డిపార్ట్‌మెంట్ లో మేటిగా నిలిచింది. బాక్స్ లో ఫాస్ట్ చార్జర్ ను ప్రొవైడ్ చేయడం ప్లస్ పాయింట్ గా చెప్పవచ్చు.

ఈ రెండు స్మార్ట్‌ఫోన్లను టెస్ట్ చేసిన వారు: ఆదిత్యా పాండే మరియు ఉజ్వల్ శర్మ

The post Nothing Phone 2a Plus vs OPPO F27 Pro Plus: ఏది బెటర్ బ్యాటరీ లైఫ్ ఇస్తుంది? first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/nothing-phone-2a-plus-vs-oppo-f27-pro-plus-battery-comparison-which-one-gives-better-battery-life/feed/ 0
OPPO F27 Pro+ 5G: IP69 రేటింగ్‌తో భారత్‌లో లాంచైన ఒప్పో ఎఫ్27 ప్రో+ 5జీ https://www.91mobiles.com/telugu/oppo-f27-pro-plus-5g-launched-india-ip-69-rating/ https://www.91mobiles.com/telugu/oppo-f27-pro-plus-5g-launched-india-ip-69-rating/#respond Thu, 13 Jun 2024 15:00:30 +0000 https://www.91mobiles.com/telugu/?p=12059 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO నుంచి ఎఫ్-సిరీస్ లో ఒక కొత్త స్మార్ట్‌ఫోన్ భారతీయ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. OPPO F27 Pro+ 5G అనే పేరుతో ఈ ఫోన్ విడుదలైంది. ఐపీ69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో భారత్ లో లాంచైన మొదటి ఫోన్‌గా ఒప్పో ఎఫ్27 ప్రో ప్లస్ 5జీ నిలిచింది. ఈ ఫోన్ లో ఇంకా 3డీ కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ […]

The post OPPO F27 Pro+ 5G: IP69 రేటింగ్‌తో భారత్‌లో లాంచైన ఒప్పో ఎఫ్27 ప్రో+ 5జీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో OPPO F27 Pro+ 5G లాంచ్
  • ఐపీ69 రేటింగ్‌తో వచ్చిన తొలి ఫోన్
  • 3డీ కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO నుంచి ఎఫ్-సిరీస్ లో ఒక కొత్త స్మార్ట్‌ఫోన్ భారతీయ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. OPPO F27 Pro+ 5G అనే పేరుతో ఈ ఫోన్ విడుదలైంది. ఐపీ69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో భారత్ లో లాంచైన మొదటి ఫోన్‌గా ఒప్పో ఎఫ్27 ప్రో ప్లస్ 5జీ నిలిచింది. ఈ ఫోన్ లో ఇంకా 3డీ కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

OPPO F27 Pro+ 5G ధర, లభ్యత

OPPO F27 Pro+ 5G రెండు మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వీటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

OPPO F27 Pro+ 5G యొక్క 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.27,999 గా నిర్ణయించారు. మరోవైపు, 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ గల టాప్ వేరియంట్ ధర రూ.29,999 గా ఉంది.

లాంచ్ ఆఫర్‌లో భాగంగా, హెచ్డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ మరియు ఎస్బీఐ కార్డ్స్ లావాదేవీలపై 10 శాతం డిస్కౌంట్‌ను ఒప్పో ఆఫర్ చేస్తోంది. ఇంకా, 12-నెలల కాలవ్యవధి గల యాక్సిడెంటల్ మరియు లిక్విడ్ డ్యామేజీ ప్రొటెక్షన్ ప్లాన్‌ను ఫోన్‌తో పాటు ఉచితంగా అందిస్తోంది.

OPPO F27 Pro+ 5G స్పెసిఫికేషన్స్

స్క్రీన్: OPPO F27 Pro+ 5G లో 6.7-ఇంచ్ 3డీ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, ఫుల్‌హెచ్డీ+ (2412*1080 పిక్సెల్స్) రెజుల్యూషన్, 394 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 500 నిట్స్ బ్రైట్నెస్, 800 నిట్స్ హెచ్‌బీఎమ్ బ్రైట్నెస్, 950 నిట్స్ హెచ్డీఆర్ బ్రైట్నెస్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ఉన్నాయి.

ప్రాసెసర్: OPPO F27 Pro+ 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్, మాలి జీ68 జీపీయూ ఉన్నాయి.

మెమొరీ: OPPO F27 Pro+ 5G డివైజ్ 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్, 128జిబి/256జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

సాఫ్ట్‌వేర్: OPPO F27 Pro+ 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ తో లాంచ్ అయ్యింది.

కెమెరా: OPPO F27 Pro+ 5G లో 64ఎంపి ఒమ్నివిజన్ ఒవి64బి మెయిన్ కెమెరా (f/1.7 అపర్చర్), 2ఎంపి పొట్రెయిట్ లెన్స్ (f/2.4 అపర్చర్) ఉన్నాయి. సెల్పీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: OPPO F27 Pro+ 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: OPPO F27 Pro+ 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.3, వై-ఫై 6, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో, బైడూ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: OPPO F27 Pro+ 5G లో డ్యామేజ్ ప్రూఫ్ 360 డిగ్రీ ఆర్మర్ బాడీ, ఐపీ69 రేటింగ్, ఎంఐఎల్-810హెచ్ సర్టిఫికేషన్, ఎస్‌జీఎస్ ప్రీమియమ్ పెర్ఫామెన్స్ 5 స్టార్స్ డ్రాప్ రెసిస్టన్స్, 48-మంథ్ ఫ్లూయెన్సీ సర్టిఫికేషన్ ఉన్నాయి.

బరువు, చుట్టుకొలత: OPPO F27 Pro+ 5G డివైజ్ 162.7 మి.మీ పొడవు, 74.2 మి.మీ వెడల్పు, 7.89 మి.మీ మందం ఉంటుంది.

The post OPPO F27 Pro+ 5G: IP69 రేటింగ్‌తో భారత్‌లో లాంచైన ఒప్పో ఎఫ్27 ప్రో+ 5జీ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/oppo-f27-pro-plus-5g-launched-india-ip-69-rating/feed/ 0
OPPO F27 Pro+ 5G: వచ్చే వారం భారత్‌లో లాంచ్ అవుతోన్న ఒప్పో కొత్త ఫోన్ https://www.91mobiles.com/telugu/oppo-f27-pro-plus-5g-india-launch-next-week-official/ Thu, 06 Jun 2024 11:47:23 +0000 https://www.91mobiles.com/telugu/?p=11942 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO ఎఫ్-సిరీస్‌లో ఒక కొత్త ఫోన్‌ని భారత్‌లో లాంచ్ చేయనుంది. OPPO F27 Pro+ 5G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. ఈ ఫోన్ ఐపీ69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో వస్తోంది. ఈ రేటింగ్ తో రానున్న మొదటి ఫోన్ ఇదే కావడం విశేషం. ఒప్పో ఎఫ్27 ప్రో ప్లస్ ఫోన్‌లో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ఉంటుందని సదరు బ్రాండ్ కన్ఫర్మ్ చేసింది. […]

The post OPPO F27 Pro+ 5G: వచ్చే వారం భారత్‌లో లాంచ్ అవుతోన్న ఒప్పో కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • OPPO F27 Pro+ 5G లాంచ్ తేదీ ఖరారు
  • జూన్ 13న భారత్ లో డివైజ్ లాంచ్
  • ఐపీ69 రేటింగ్ తో వస్తోన్న ఫోన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO ఎఫ్-సిరీస్‌లో ఒక కొత్త ఫోన్‌ని భారత్‌లో లాంచ్ చేయనుంది. OPPO F27 Pro+ 5G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. ఈ ఫోన్ ఐపీ69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో వస్తోంది. ఈ రేటింగ్ తో రానున్న మొదటి ఫోన్ ఇదే కావడం విశేషం. ఒప్పో ఎఫ్27 ప్రో ప్లస్ ఫోన్‌లో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ఉంటుందని సదరు బ్రాండ్ కన్ఫర్మ్ చేసింది. తాజాగా ఈ ఫోన్ లాంచ్ తేదీ ఖరారైంది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.

OPPO F27 Pro+ 5G ఇండియా లాంచ్ తేదీ

OPPO F27 Pro+ 5G స్మార్ట్‌ఫోన్ భారత్ లో జూన్ 13వ తేదీన లాంచ్ అవుతోంది. ఈ విషయాన్ని ఒప్పో సంస్థ సోషల్ మీడియా ద్వారా కన్ఫర్మ్ చేసింది. ఈ ఫోన్ మిడ్నైట్ నేవీ మరియు డస్క్ పింక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

OPPO F27 Pro+ 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే: OPPO F27 Pro+ 5G లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 3డీ కర్వ్డ్ అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

ప్రాసెసర్: OPPO F27 Pro+ 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ ఉంటుంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.6GHz.

కెమెరా: OPPO F27 Pro+ 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 64ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమరా ఉంటుంది.

బ్యాటరీ: OPPO F27 Pro+ 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: OPPO F27 Pro+ 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉంటాయి.

The post OPPO F27 Pro+ 5G: వచ్చే వారం భారత్‌లో లాంచ్ అవుతోన్న ఒప్పో కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
OPPO F27 సిరీస్ లాంచ్ తేదీ వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/oppo-f27-series-launch-date-know-the-details/ Mon, 03 Jun 2024 10:03:30 +0000 https://www.91mobiles.com/telugu/?p=11861 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO త్వరలో ఎఫ్-సిరీస్ లో కొత్త ఫోన్లను లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో OPPO F27 Pro మరియు OPPO F27 Pro+ అనే మోడల్స్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. ఈ సిరీస్ జూన్ లో లాంచ్ కానున్నాయి. జూన్ 13న లాంచ్ ఉంటుందని ఒక పోస్టర్ రివీల్ అయ్యింది. OPPO A3 Pro కి రీబ్రాండ్ వర్షన్‌గా OPPO F27 Pro వస్తోందని సమాచారం. OPPO F27 Pro […]

The post OPPO F27 సిరీస్ లాంచ్ తేదీ వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • జూన్‌లో OPPO F27 సిరీస్ లాంచ్
  • గీక్‌బెంచ్, బీఐఎస్‌పై లిస్టైన OPPO F27 Pro+
  • డివైజ్ మోడల్ నంబర్ CPH2643

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO త్వరలో ఎఫ్-సిరీస్ లో కొత్త ఫోన్లను లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో OPPO F27 Pro మరియు OPPO F27 Pro+ అనే మోడల్స్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. ఈ సిరీస్ జూన్ లో లాంచ్ కానున్నాయి. జూన్ 13న లాంచ్ ఉంటుందని ఒక పోస్టర్ రివీల్ అయ్యింది. OPPO A3 Pro కి రీబ్రాండ్ వర్షన్‌గా OPPO F27 Pro వస్తోందని సమాచారం.

OPPO F27 Pro Plus 5G గీక్‌బెంచ్, బీఐఎస్ లిస్టింగ్స్

బీఐఎస్ మరియు గీక్‌బెంచ్ లిస్టింగ్స్ ద్వారా మోడల్ నంబర్ తప్పా, మరే ఇతర స్పెసిఫికేషన్స్ రివీల్ కాలేదు. అయితే, బీఐఎస్ పై లిస్ట్ అవ్వడంతో, త్వరలోనే ఈ ఫోన్ భారత్ లో లాంచ్ కానుందని అర్థమవుతోంది. త్వరలోనే ఇండియా లాంచ్ వివరాలను ఒప్పో అధికారికంగా ప్రకటించనుంది. లిస్టింగ్ పై OPPO F27 Pro Plus 5G స్మార్ట్‌ఫోన్ CPH2643 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. ఇప్పుడు ఒప్పో ఎఫ్27 సిరీస్ లాంచ్ తేదీ వివరాలను తెలుసుకుందాం.

OPPO F27 సిరీస్ లాంచ్ తేదీ (లీక్)

OPPO F27 సిరీస్ లాంచ్ తేదీని ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

పోస్టర్ ప్రకారం, OPPO F27 Pro+ డివైజ్ జూన్ 13న లాంచ్ అవుతుందని తెలుస్తోంది. మరొక మోడల్ OPPO F27 Pro ఇంకా స్టాండర్డ్ వర్షన్ OPPO F27 గురించి ఏ వివరాలు లేవు. బహుశా ఇవి కూడా అదే రోజున లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

OPPO F27 Pro+ బ్లూ మరియు పింక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. రెండింట్లో లెదర్ బ్యాక్ ప్యానెల్ ఉంది. ప్రో మరియు ప్రో ప్లస్ మోడల్స్ బ్లూ, పింక్ కలర్స్ మరియు లెదర్ బ్యాక్ డిజైన్ తో వస్తాయని అంచనా వేయవచ్చు.

లీకైన ఇమేజ్ లో ఫోన్ వాటర్ లో మునిగి కనిపిస్తోంది. ఈ సిరీస్ ఫోన్లు ఐపీ66, ఐపీ68 మరియు ఐపీ69 సర్టిఫికేషన్స్ తో రానున్నట్లు లీక్ ద్వారా తెలుస్తోంది.

OPPO F27 Pro సిరీస్ లాంచ్ వివరాలను కంపెనీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. లీకైన తేదీ కూడా కచ్చిమైందని చెప్పలేం.

OPPO F25 Pro స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: OPPO F25 Pro 5G లో 6.7-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్ (2412*1080 పిక్సెల్స్), 394 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1100 నిట్స్ పీక్ బ్రైట్నెస్, హెచ్డీఆర్10+, పాండా గ్లాస్, సెంటర్డ్ పంచ్ హోల్ కటౌట్ ఉన్నాయి.

ప్రాసెసర్: OPPO F25 Pro 5G స్మార్ట్‌ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్, మాలి జీ68 జీపీయూ ఉన్నాయి.

ర్యామ్, స్టోరేజీ: OPPO F25 Pro 5G డివైజ్ 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 8జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

సాఫ్ట్‌వేర్: OPPO F25 Pro 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కెమెరా: OPPO F25 Pro 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి ఒమ్నివిజన్ ఒవి64బి సెన్సర్, 8ఎంపి సోని ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి సోని ఐఎంఎక్స్615 కెమెరా ఉంది.

బ్యాటరీ: OPPO F25 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సెక్యూరిటీ: OPPO F25 Pro 5G లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఐపీ65 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ ఉన్నాయి.

కనెక్టివిటీ: OPPO F25 Pro 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.2, వై-ఫై 6, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో, బైడూ, క్యూజీఎస్ఎస్ ఉన్నాయి.

బరువు, చుట్టుకొలత: OPPO F25 Pro 5G డివైజ్ 161.6 మి.మీ పొడవు, 74.7 మి.మీ వెడల్పు, 7.54 మి.మీ మందం ఉంటుంది.

The post OPPO F27 సిరీస్ లాంచ్ తేదీ వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>