OPPO Find N2 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 08 Dec 2022 04:25:28 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 డిసెంబర్ 15 న లాంచ్ కానున్న OPPO Find N2, Find N2 Flip? https://www.91mobiles.com/telugu/oppo-find-n2-find-n2-flip-tipped-to-launch-on-december-15/ Thu, 08 Dec 2022 04:25:28 +0000 https://www.91mobiles.com/telugu/?p=3872 హైలైట్స్ శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్స్ కి గట్టి పోటీ ఇచ్చేందుకు వస్తోన్న ఒప్పో మడతబెట్టే ఫోన్లు లాంచ్ కి సిద్ధమైన OPPO Find N2, Find N2 Flip డిసెంబర్ 15 న OPPO Find N2, Find N2 Flip ఫోల్డబుల్ ఫోన్స్ లాంచ్ అవుతాయని అంచనా ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో రెండు కొత్త ఫోల్డబుల్ ఫోన్లను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. డిసెంబర్ 15 న ఈ మడతబెట్టే ఫోన్లు లాంచ్ అవుతాయని […]

The post డిసెంబర్ 15 న లాంచ్ కానున్న OPPO Find N2, Find N2 Flip? first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్స్ కి గట్టి పోటీ ఇచ్చేందుకు వస్తోన్న ఒప్పో మడతబెట్టే ఫోన్లు
  • లాంచ్ కి సిద్ధమైన OPPO Find N2, Find N2 Flip
  • డిసెంబర్ 15 న OPPO Find N2, Find N2 Flip ఫోల్డబుల్ ఫోన్స్ లాంచ్ అవుతాయని అంచనా

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో రెండు కొత్త ఫోల్డబుల్ ఫోన్లను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. డిసెంబర్ 15 న ఈ మడతబెట్టే ఫోన్లు లాంచ్ అవుతాయని అంచనా వేస్తున్నారు. 2021 లో వచ్చిన OPPO Find N కి సక్సెసర్ గా OPPO Find N2 మార్కెట్ లోకి రానుంది. దీంతో పాటు ఒక ఫ్లిప్ ఫోన్ కూడా తీసుకురావాలని ఒప్పో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరికొన్ని రోజుల్లో జరిగే ఒప్పో ఇన్నో డే 2022 ఈవెంట్ లో OPPO Find N2, Find N2 Flip ఫోల్డబుల్ ఫోన్స్ లాంచ్ అవుతాయని అంచనా వేస్తున్నారు. ఇటీవలె లీకైన OPPO Find N2 హ్యాండ్స్ ఆన్ వీడియో ద్వారా ఫోన్ డిజైన్ ఎలా ఉండనుందో తెలిసింది.

ప్రముఖ టిప్‌స్టర్ పండా తెలిపిన దాని ప్రకారం, ఒప్పో ఇన్నో డే 2022 డిసెంబర్ 14 న మొదలై డిసెంబర్ 15 వరకు కొనసాగుతుంది. డిసెంబర్ 15 నే ఈ OPPO Find N2, Find N2 Flip మడతబెట్టే ఫోన్లు లాంచ్ అవుతాయని పండా చెబుతున్నాడు. అయితే ఒప్పో నుంచి ఇంకా అధికార ప్రకటన రావాల్సి ఉంది. కాబట్టి అప్పుడే కచ్చితంగా ఏ విషయం చెప్పలేం.

OPPO Find N2 Flip స్పెసిఫికేషన్స్ (అంచనా)

చైనీస్ సామాజిక మాధ్యమం వీబో పై లీకైన OPPO Find N2 Flip ఫోన్ యొక్క వీడియో ద్వారా కొన్ని స్పెసిఫికేషన్స్ పై ఐడియా వచ్చింది. అంచనా ప్రకారం, ఈ డివైజ్ 6.8-ఇంచ్ ఫోల్డబుల్ ఫుల్ హెచ్డీ+ ఈ6 అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3.26-ఇంచ్ కవర్ డిస్ప్లే ని కలిగి ఉండనుంది. ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్సెట్, 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీతో రానుంది.

OPPO Find N2 Flip స్మార్ట్ ఫోన్ లో 50 మెగా పిక్సెల్ సోని ఐఎంఎక్స్890 మెయిన్ కెమెరా, 8 మెగా పిక్సెల్ సోని ఐఎంఎక్స్366 అల్ట్రావైడ్ కెమెరా ఉండనుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగా పిక్సెల్ సోని ఐఎంఎక్స్709 ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఈ ఒప్పో స్మార్ట్ ఫోన్ లో 4,300 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుందని అంచనా. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేసే అవకాశం ఉంది.

OPPO Find N2 ఫోల్డబుల్ ఫోన్

మరోవైపు OPPO Find N2 ఫోల్డబుల్ ఫోన్ చైనా కంపల్సరీ సర్టిఫికెట్ (3సీ) పొందినట్లు సమాచారం. ఈ డివైజ్ 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేయనుంది. ఇంకా ఈ హ్యాండ్సెట్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 చిప్సెట్, 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉండే అవకాశం ఉంది. ఇకపోతే ఈ డివైజ్ లో మారిసిలికాన్ ఎక్స్ ఇమేజింగ్ న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ (NPU) మరియు హాజెల్‌బ్లడ్ ఆప్టిమైజేషన్స్ ఉండనున్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post డిసెంబర్ 15 న లాంచ్ కానున్న OPPO Find N2, Find N2 Flip? first appeared on 91Mobiles Telugu.

]]>
7.1-inch అమోలెడ్ ఫోల్డబుల్ డిస్ప్లే, 8+ జెన్ 1 చిప్ తో వస్తోన్న OPPO Find N2 https://www.91mobiles.com/telugu/oppo-find-n2-foldable-phone-specs-leaked/ Fri, 02 Dec 2022 05:59:18 +0000 https://www.91mobiles.com/telugu/?p=3818 హైలైట్స్ త్వరలో లాంచ్ కానున్న OPPO Find N2 ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ Galaxy Z Fold 4 తో పోటీ పడనున్న OPPO Find N2 డివైజ్ ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ద్వారా రివీల్ అయిన OPPO Find N2 స్పెసిఫికేషన్స్ OPPO సంస్థ తన కొత్త ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ కంపెనీ రెండు మడతబెట్టే ఫోన్లను లాంచ్ చేయనుందని సమాచారం. అవి OPPO Find N2 […]

The post 7.1-inch అమోలెడ్ ఫోల్డబుల్ డిస్ప్లే, 8+ జెన్ 1 చిప్ తో వస్తోన్న OPPO Find N2 first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • త్వరలో లాంచ్ కానున్న OPPO Find N2 ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్
  • Galaxy Z Fold 4 తో పోటీ పడనున్న OPPO Find N2 డివైజ్
  • ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ద్వారా రివీల్ అయిన OPPO Find N2 స్పెసిఫికేషన్స్

OPPO సంస్థ తన కొత్త ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ కంపెనీ రెండు మడతబెట్టే ఫోన్లను లాంచ్ చేయనుందని సమాచారం. అవి OPPO Find N2 మరియు OPPO Find N2 Flip. 2022 డిసెంబర్ లో ఈ రెండు డివైజెస్ ని ఒప్పో చైనాలో లాంచ్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇంతవరకు కంపెనీ నుంచి లాంచ్ తేదీకి సంబంధించిన ప్రకటన రాలేదు. ఈలోపు OPPO Find N2 సిరీస్ యొక్క కొన్ని వివరాలు నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. ఈ లేటెస్ట్ లీక్ డిజిటల్ చాట్ స్టేషన్ నుంచి వచ్చింది.

టిప్‌స్టర్ OPPO Find N2 యొక్క ప్రధాన స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ని వెల్లడించింది. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4 తో OPPO Find N2 పోటీపడనుంది. ఓసారి OPPO Find N2 స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం పదండి.

OPPO Find N2 ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్

OPPO Find N2 ఒప్పో నుంచి వస్తోన్న ప్రీమియమ్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్. ఈ డివైజ్ స్పెసిఫికేషన్స్ ఆన్‌లైన్ లో లీకైయ్యాయి. ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ప్రకారం, OPPO Find N2 స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో వస్తోంది. అలాగే 12జిబి ర్యామ్, అడ్రెనో 730 జీపీయూ ఈ ఫోన్ లో ఉండనున్నాయి. OPPO Find N2 ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

OPPO Find N2 7.1-ఇంచ్ ఎల్టీపీవో అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తోందని టిప్‌స్టర్ వెల్లడించింది. ఇప్పుడు కెమెరా విభాగం ఎలా ఉందో చూద్దాం.

OPPO Find N2 లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండనుంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 మెయిన్ కెమెరా, 48ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 32ఎంపి సోని ఐఎంఎక్స్709 టెలీఫోటో లెన్స్ ఉంటాయి. గతంలో వచ్చిన రూమర్లను బట్టి ఈ ఫోన్ రెండు 32ఎంపి ఫ్రంట్ కెమెరాలను కలిగి ఉంటుందని తెలిసింది. ఇందులో ఒక కెమెరా కవర్ డిస్ప్లే పైన, మరొకటి లోపల ఉంటుంది.

OPPO Find N2 లో 4520 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోల్డబుల్ ఫోన్ 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. డిజిటల్ చాట్ స్టేషన్ OPPO Find N2 యొక్క కవర్ డిస్ప్లే కి సంబంధించిన వివరాలను వెల్లడించలేదు. అయితే రీసెంట్ రిపోర్ట్స్ ని ప్రకారం, OPPO Find N2 5.54-ఇంచ్ 120 హెర్ట్జ్ అమోలెడ్ ఔటర్ డిస్ప్లే తో రానుందని తెలిసింది.

OPPO Find N2 డివైజ్ ఒప్పో తయారు చేసిన మారిసిలికాన్ ఎక్స్ ఎన్‌పీయూ చిప్ ని కలిగి ఉంటుంది. ఇమేజ్ ప్రాసెసింగ్ ని ఇది మరింత మెరుగుపరుస్తుంది. OPPO Find N2 మూడు కలర్ ఆప్షన్స్ లో లాంచ్ కానుంది. అవి: గ్రీన్, బ్లాక్, వైట్.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 7.1-inch అమోలెడ్ ఫోల్డబుల్ డిస్ప్లే, 8+ జెన్ 1 చిప్ తో వస్తోన్న OPPO Find N2 first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన OPPO Find N2 ఫోల్డబుల్ ఫోన్ స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/oppo-find-n2-specs-leaked-before-launch/ Tue, 08 Nov 2022 07:28:46 +0000 https://www.91mobiles.com/telugu/?p=3302 హైలైట్స్ డిసెంబర్ లో OPPO Find N2 ఫోల్డబుల్ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం లాంచ్ కి ముందు లీకైన OPPO Find N2 స్పెసిఫికేషన్స్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ తో రానున్న OPPO Find N2 గతేడాది OPPO కంపెనీ తన తొలి ఫోల్డబుల్ ఫోన్ OPPO Find N ని చైనాలో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఎక్స్‌క్లూజివ్ గా తన స్వదేశానికే పరిమితం చేసింది ఒప్పో. ఇతర […]

The post లీకైన OPPO Find N2 ఫోల్డబుల్ ఫోన్ స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • డిసెంబర్ లో OPPO Find N2 ఫోల్డబుల్ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం
  • లాంచ్ కి ముందు లీకైన OPPO Find N2 స్పెసిఫికేషన్స్
  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ తో రానున్న OPPO Find N2

గతేడాది OPPO కంపెనీ తన తొలి ఫోల్డబుల్ ఫోన్ OPPO Find N ని చైనాలో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఎక్స్‌క్లూజివ్ గా తన స్వదేశానికే పరిమితం చేసింది ఒప్పో. ఇతర గ్లోబల్ మార్కెట్స్ లో విడుదల చేయలేదు. ఒప్పో నుంచి మొదటి మడతబెట్టే ఫోన్ వచ్చి ఏడాది అవుతోంది. దీంతో కంపెనీ దీనికి సక్సెసర్ గా OPPO Find N2 ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతానికి లాంచ్ తేదీకి సంబంధించి అధికార సమాచారం ఏదీ లేదు. ఈలోపు OPPO Find N2 యొక్క స్పెసిఫికేషన్స్ నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

OPPO Find N2 ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ వి అని భావిస్తోన్న పిక్స్ నెట్టింట్లో కనిపించాయి. లాంచ్ కి ముందు ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ బయటకు వచ్చాయి. మరి OPPO Find N2 యొక్క స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందామా? పదండి.

OPPO Find N2 స్పెసిఫికేషన్స్

OPPO Find N2 ఫోల్డబుల్ ఫోన్ కాంపాక్ట్ డిస్ప్లేతో వస్తోంది. Samsung Galaxy Z Fold 4 కి ఇది పోటీ ఇవ్వనుంది. లీకైన స్పెసిఫికేషన్స్ ని బట్టి, OPPO Find N2 PGU110 అనే మోడల్ నంబర్ ని కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. OPPO Find N2 క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో వస్తోంది. అయితే స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ ని కూడా ఒప్పో పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. నవంబర్ లోనే ఈ ఫ్లాగ్షిప్ చిప్సెట్ లాంచ్ అవుతోంది.

అయితే Snapdragon 8+ Gen 1 ప్రాసెసర్ ని తీసిపడేయడానికి లేదు. ఇది కూడా ఎంతో శక్తివంతమైన ప్రాసెసర్. ఎన్నో ఇంటెన్సివ్ టాస్క్స్ ని అవలీలగా చేసేస్తుంది. లీకైన స్క్రీన్ షాట్ ని బట్టి ఈ ఫోన్ 12జిబి ర్యామ్, 256జిబి ఇంటర్నల్ స్టోరేజీ తో వస్తున్నట్లు స్పష్టమవుతోంది. అలాగే ఈ ఫోన్ లో MariSilicon X Neural Processing Unit (NPU) కూడా ఉండనుంది. ఇది ఒప్పో స్వయంగా అభివృద్ధ చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నాయిస్ రిడక్షన్ ఫీచర్. 4కే అల్ట్రా నైట్ మోడ్ వీడియో రికార్డింగ్ కూడా ఇందులో ఉంది.

లీకైన సమాచారాన్ని బట్టి OPPO Find N2 7.1-ఇంచ్ ఎల్టీపీవో అమోలెడ్ ఫోల్డబుల్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4520 ఎంఏహెచ్ బ్యాటరీ తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ ఓఎస్ 13 పై పని చేయనుంది. పవర్ బటన్ లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇంటిగ్రేట్ అయి ఉంటుందని సమాచారం. బ్లాక్, వైట్, గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post లీకైన OPPO Find N2 ఫోల్డబుల్ ఫోన్ స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>