హైలైట్స్
- త్వరలో లాంచ్ కానున్న OPPO Find N2 ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్
- Galaxy Z Fold 4 తో పోటీ పడనున్న OPPO Find N2 డివైజ్
- ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ద్వారా రివీల్ అయిన OPPO Find N2 స్పెసిఫికేషన్స్
OPPO సంస్థ తన కొత్త ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ కంపెనీ రెండు మడతబెట్టే ఫోన్లను లాంచ్ చేయనుందని సమాచారం. అవి OPPO Find N2 మరియు OPPO Find N2 Flip. 2022 డిసెంబర్ లో ఈ రెండు డివైజెస్ ని ఒప్పో చైనాలో లాంచ్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇంతవరకు కంపెనీ నుంచి లాంచ్ తేదీకి సంబంధించిన ప్రకటన రాలేదు. ఈలోపు OPPO Find N2 సిరీస్ యొక్క కొన్ని వివరాలు నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. ఈ లేటెస్ట్ లీక్ డిజిటల్ చాట్ స్టేషన్ నుంచి వచ్చింది.
టిప్‌స్టర్ OPPO Find N2 యొక్క ప్రధాన స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ని వెల్లడించింది. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4 తో OPPO Find N2 పోటీపడనుంది. ఓసారి OPPO Find N2 స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం పదండి.
OPPO Find N2 ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్
OPPO Find N2 ఒప్పో నుంచి వస్తోన్న ప్రీమియమ్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్. ఈ డివైజ్ స్పెసిఫికేషన్స్ ఆన్లైన్ లో లీకైయ్యాయి. ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ప్రకారం, OPPO Find N2 స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో వస్తోంది. అలాగే 12జిబి ర్యామ్, అడ్రెనో 730 జీపీయూ ఈ ఫోన్ లో ఉండనున్నాయి. OPPO Find N2 ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
OPPO Find N2 7.1-ఇంచ్ ఎల్టీపీవో అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తోందని టిప్‌స్టర్ వెల్లడించింది. ఇప్పుడు కెమెరా విభాగం ఎలా ఉందో చూద్దాం.
OPPO Find N2 లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండనుంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 మెయిన్ కెమెరా, 48ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 32ఎంపి సోని ఐఎంఎక్స్709 టెలీఫోటో లెన్స్ ఉంటాయి. గతంలో వచ్చిన రూమర్లను బట్టి ఈ ఫోన్ రెండు 32ఎంపి ఫ్రంట్ కెమెరాలను కలిగి ఉంటుందని తెలిసింది. ఇందులో ఒక కెమెరా కవర్ డిస్ప్లే పైన, మరొకటి లోపల ఉంటుంది.
OPPO Find N2 లో 4520 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోల్డబుల్ ఫోన్ 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. డిజిటల్ చాట్ స్టేషన్ OPPO Find N2 యొక్క కవర్ డిస్ప్లే కి సంబంధించిన వివరాలను వెల్లడించలేదు. అయితే రీసెంట్ రిపోర్ట్స్ ని ప్రకారం, OPPO Find N2 5.54-ఇంచ్ 120 హెర్ట్జ్ అమోలెడ్ ఔటర్ డిస్ప్లే తో రానుందని తెలిసింది.
OPPO Find N2 డివైజ్ ఒప్పో తయారు చేసిన మారిసిలికాన్ ఎక్స్ ఎన్పీయూ చిప్ ని కలిగి ఉంటుంది. ఇమేజ్ ప్రాసెసింగ్ ని ఇది మరింత మెరుగుపరుస్తుంది. OPPO Find N2 మూడు కలర్ ఆప్షన్స్ లో లాంచ్ కానుంది. అవి: గ్రీన్, బ్లాక్, వైట్.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.












