OPPO K12x - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 22 Jul 2024 06:15:28 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 OPPO K12x: త్వరలో భారత్‌లో లాంచ్ కానున్న ఒప్పో కే12ఎక్స్ https://www.91mobiles.com/telugu/oppo-k12x-5g-to-launch-soon-in-india/ https://www.91mobiles.com/telugu/oppo-k12x-5g-to-launch-soon-in-india/#respond Mon, 22 Jul 2024 06:15:28 +0000 https://www.91mobiles.com/telugu/?p=12604 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO నుంచి త్వరలో కే-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ కానుంది. OPPO K12x పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఒప్పో కంపెనీ నుంచి ఇంకా ఈ ఫోన్ కి సంబంధించిన అధికార ప్రకటన బయటకు రాలేదు. కానీ, ఈలోపే ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ పై OPPO K12x దర్శనమిచ్చింది. OPPO K12x స్మార్ట్‌ఫోన్ భారత్ లో ఆగస్టు నెలలో లాంచ్ అవుతుందని సమాచారం. ఓసారి ఇండియా […]

The post OPPO K12x: త్వరలో భారత్‌లో లాంచ్ కానున్న ఒప్పో కే12ఎక్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో OPPO K12x లాంచ్
  • ఫ్లిప్‌కార్ట్ పై టీజర్ విడుదల
  • 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO నుంచి త్వరలో కే-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ కానుంది. OPPO K12x పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఒప్పో కంపెనీ నుంచి ఇంకా ఈ ఫోన్ కి సంబంధించిన అధికార ప్రకటన బయటకు రాలేదు. కానీ, ఈలోపే ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ పై OPPO K12x దర్శనమిచ్చింది. OPPO K12x స్మార్ట్‌ఫోన్ భారత్ లో ఆగస్టు నెలలో లాంచ్ అవుతుందని సమాచారం. ఓసారి ఇండియా లాంచ్ టీజర్ కు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.

OPPO K12x ఇండియా లాంచ్ టీజర్

OPPO K12x స్మార్ట్‌ఫోన్ యొక్క టీజర్‌ను కంపెనీ ఫ్లిప్‌కార్ట్ మైక్రో-సైట్ ద్వారా విడుదల చేసింది. అయితే ఈ టీజర్‌ను తర్వాత తొలగించారు. ఈలోపే, దానికి సంబంధించిన స్క్రీన్‌షాట్ ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది. ‘సంథింగ్ ఎపిక్ కమింగ్ సూన్’ అని ఆ స్క్రీన్‌షాట్ పై రాసి ఉంది. ఇక్కడ విషయం ఏంటంటే, ఈ ఒప్పో ఫోన్ ఇప్పటికే చైనాలో లాంచ్ అయ్యింది. భారతీయ వేరియంట్ స్పెసిఫికేషన్స్ చైనా మోడల్ మాదిరే ఉంటాయని అంచనా వేయవచ్చు.

OPPO K12x స్పెసిఫికేషన్స్

స్క్రీన్: OPPO K12x లో 6.67-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ డిస్ప్లే, 2400*1080 పిక్సెల్ రెజుల్యూషన్, ఓఎల్ఈడీ ప్యానెల్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1200 నిట్స్ బ్రైట్నెస్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

ప్రాసెసర్: OPPO K12x లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైన చిప్. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.2 గిగాహెర్ట్జ్. అడ్రెనో 619 జీపీయూ గ్రాఫిక్స్ ఈ ఫోన్ లో వాడారు.

ఓఎస్: OPPO K12x స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

మెమొరీ: OPPO K12x డివైజ్ 8జిబి/12జిబి ర్యామ్, 256జిబి/512జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 1టిబి వరకు మెమొరీని పెంచుకోవచ్చు. ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ టెక్నాలజీని ఈ ఫోన్ లో అందించారు.

కెమెరా: OPPO K12x లో డ్యూయల్ రియర్ కెమెరా సెట్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: OPPO K12x లో పవర్ బ్యాకప్ కోసం 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: OPPO K12x లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post OPPO K12x: త్వరలో భారత్‌లో లాంచ్ కానున్న ఒప్పో కే12ఎక్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/oppo-k12x-5g-to-launch-soon-in-india/feed/ 0
OPPO: 80W ఫాస్ట్ చార్జింగ్‌తో చైనాలో లాంచైన OPPO K12x https://www.91mobiles.com/telugu/oppo-k12x-launched-in-china-with-80w-fast-charging/ Tue, 14 May 2024 06:28:30 +0000 https://www.91mobiles.com/telugu/?p=11510 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO తన సొంత మార్కెట్ చైనాలో ఒక కొత్త కే-సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేసింది. OPPO K12x పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 చిప్సెట్, 12జిబి ర్యామ్, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది. ఓసారి OPPO K12x యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ధర వివరాలు తెలుసుకుందాం పదండి. OPPO K12x ధర OPPO K12x స్మార్ట్‌ఫోన్ చైనాలో […]

The post OPPO: 80W ఫాస్ట్ చార్జింగ్‌తో చైనాలో లాంచైన OPPO K12x first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చైనాలో OPPO K12x లాంచ్
  • 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్
  • 12జిబి ర్యామ్, 5500mAh బ్యాటరీ

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO తన సొంత మార్కెట్ చైనాలో ఒక కొత్త కే-సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేసింది. OPPO K12x పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 చిప్సెట్, 12జిబి ర్యామ్, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది. ఓసారి OPPO K12x యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ధర వివరాలు తెలుసుకుందాం పదండి.

OPPO K12x ధర

OPPO K12x స్మార్ట్‌ఫోన్ చైనాలో 3 వేరియంట్స్ లో లభించనుంది. వాటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

OPPO K12x 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధరను 1299 యువాన్లు (సుమారు రూ.14,990) గా నిర్ణయించారు. 12జిబి + 256జిబి వేరియంట్ ధర 1499 యువాన్లు (సుమారు రూ.17,190) గా ఉంది. 12జిబి + 512జిబి స్టోరేజీ మోడల్ ధర 1799 యువాన్లు (సుమారు రూ.20,990) గా ఉంది. OPPO K12x డివైజ్ గ్రీన్ మరియు గ్రే కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

OPPO K12x స్పెసిఫికేషన్స్

స్క్రీన్: OPPO K12x లో 6.67-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ డిస్ప్లే, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఓఎల్ఈడీ ప్యానెల్, 1200 నిట్స్ బ్రైట్నెస్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉన్నాయి. ఈ ఫోన్ ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తో రావడం విశేషం.

ప్రాసెసర్: OPPO K12x లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 చిప్సెట్ ఉంటుంది. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.2GHz. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 619 జీపీయూ వాడారు.

ఓఎస్: OPPO K12x స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

మెమొరీ: OPPO K12x డివైజ్ 8జిబి/12జిబి ర్యామ్, 256జిబి/512జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 1టిబి వరకు మెమొరీని పెంచుకోవచ్చు. ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ టెక్నాలజీని ఈ ఫోన్ లో అందించారు.

కెమెరా: OPPO K12x లో డ్యూయల్ రియర్ కెమెరా సెట్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: OPPO K12x లో పవర్ బ్యాకప్ కోసం 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post OPPO: 80W ఫాస్ట్ చార్జింగ్‌తో చైనాలో లాంచైన OPPO K12x first appeared on 91Mobiles Telugu.

]]>