OPPO: 80W ఫాస్ట్ చార్జింగ్‌తో చైనాలో లాంచైన OPPO K12x

Highlights

  • చైనాలో OPPO K12x లాంచ్
  • 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్
  • 12జిబి ర్యామ్, 5500mAh బ్యాటరీ

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO తన సొంత మార్కెట్ చైనాలో ఒక కొత్త కే-సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేసింది. OPPO K12x పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 చిప్సెట్, 12జిబి ర్యామ్, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది. ఓసారి OPPO K12x యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ధర వివరాలు తెలుసుకుందాం పదండి.

OPPO K12x ధర

OPPO K12x స్మార్ట్‌ఫోన్ చైనాలో 3 వేరియంట్స్ లో లభించనుంది. వాటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

OPPO K12x 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధరను 1299 యువాన్లు (సుమారు రూ.14,990) గా నిర్ణయించారు. 12జిబి + 256జిబి వేరియంట్ ధర 1499 యువాన్లు (సుమారు రూ.17,190) గా ఉంది. 12జిబి + 512జిబి స్టోరేజీ మోడల్ ధర 1799 యువాన్లు (సుమారు రూ.20,990) గా ఉంది. OPPO K12x డివైజ్ గ్రీన్ మరియు గ్రే కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

OPPO K12x స్పెసిఫికేషన్స్

స్క్రీన్: OPPO K12x లో 6.67-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ డిస్ప్లే, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఓఎల్ఈడీ ప్యానెల్, 1200 నిట్స్ బ్రైట్నెస్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉన్నాయి. ఈ ఫోన్ ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తో రావడం విశేషం.

ప్రాసెసర్: OPPO K12x లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 చిప్సెట్ ఉంటుంది. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.2GHz. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 619 జీపీయూ వాడారు.

ఓఎస్: OPPO K12x స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

మెమొరీ: OPPO K12x డివైజ్ 8జిబి/12జిబి ర్యామ్, 256జిబి/512జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 1టిబి వరకు మెమొరీని పెంచుకోవచ్చు. ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ టెక్నాలజీని ఈ ఫోన్ లో అందించారు.

కెమెరా: OPPO K12x లో డ్యూయల్ రియర్ కెమెరా సెట్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: OPPO K12x లో పవర్ బ్యాకప్ కోసం 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Previous articlePOCO F6 ఇండియా లాంచ్ తేదీ ఖరారు
Next articleVivo Y200 Pro: లీకైన వై200 ప్రో ధర, స్పెసిఫికేషన్స్
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.