OPPO Reno 11 Pro 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 07 May 2024 17:06:47 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 OPPO Reno 11 Pro 5G ధర తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/oppo-reno-11-pro-5g-price-reduced-know-full-details/ Tue, 07 May 2024 17:06:47 +0000 https://www.91mobiles.com/telugu/?p=11402 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO భారతీయ మార్కెట్ లో జనవరి నెలలో OPPO Reno 11 మరియు OPPO Reno 11 Pro 5G ఫోన్లను లాంచ్ చేసింది. తాజాగా OPPO Reno 11 Pro 5G ధరను కంపెనీ తగ్గించింది. రూ.2,000 తక్కువకే ఈ ఫోన్ ప్రస్తుతం లభించనుంది. ఒప్పో రెనో 11 ప్రో 5జీ యొక్క తగ్గింపు ధర, అసలు ధర వంటి వివరాలను తెలుసుకుందాం పదండి. OPPO Reno 11 Pro […]

The post OPPO Reno 11 Pro 5G ధర తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Reno 11 Pro 5G ధర రూ.2000 తగ్గింపు
  • మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్
  • 32ఎంపి సోని ఐఎంఎక్స్ 709 కెమెరా

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO భారతీయ మార్కెట్ లో జనవరి నెలలో OPPO Reno 11 మరియు OPPO Reno 11 Pro 5G ఫోన్లను లాంచ్ చేసింది. తాజాగా OPPO Reno 11 Pro 5G ధరను కంపెనీ తగ్గించింది. రూ.2,000 తక్కువకే ఈ ఫోన్ ప్రస్తుతం లభించనుంది. ఒప్పో రెనో 11 ప్రో 5జీ యొక్క తగ్గింపు ధర, అసలు ధర వంటి వివరాలను తెలుసుకుందాం పదండి.

OPPO Reno 11 Pro 5G ధర తగ్గింపు వివరాలు

OPPO Reno 11 Pro 5G డివైజ్ ధరను కంపెనీ రూ.2,000 తగ్గించింది. దీంతో ఈ ఫోన్ ప్రస్తుతం రూ.37,999 కి అమ్ముడవుతోంది.

ధర తగ్గింపుతో పాటు, కంపెనీ 10 శాతం క్యాష్‌బ్యాక్ మరియు 6 నెలల కాలపరిమితితో నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అందిస్తోంది.

ఫ్లిప్‌కార్ట్ పై ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ సాయంతో 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ మరియు భారీ ఎక్స్‌ఛేంజ్ బోనస్ కూడా లభిస్తుంది.

OPPO Reno 11 Pro 5G ఫోన్ రూ.39,999 ధరతో భారత్ లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ పెర్ల్ వైట్ మరియు రాక్ గ్రే కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

ఒప్పో వెబ్‌సైట్ తో పాటు, ఇతర రిటైల్ ఔట్‌లెట్స్ మరియు ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ ఫోన్‌ని కొనుగోలు చేయవచ్చు.

OPPO Reno 11 Pro 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: OPPO Reno 11 Pro 5G లో 6.74-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1600 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: OPPO Reno 11 Pro 5G లో స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్, అడ్రెనో జీపీయూ వాడారు.

ర్యామ్, స్టోరేజీ: Oppo Reno 11 Pro డివైజ్ లో 12జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీ ఉన్నాయి.

ఓఎస్: OPPO Reno 11 Pro 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ పై పని చేస్తుంది.

కెమెరా: OPPO Reno 11 Pro 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 32ఎంపి పొట్రెయిట్ లెన్స్, 8ఎంపి 2ఎక్స్ హైబ్రిడ్ జూమ్, 20ఎక్స్ డిజిటల్ జూమ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి సెల్ఫీ కెమెరా అందించారు.

బ్యాటరీ: OPPO Reno 11 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 4,700 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

బరువు, చుట్టుకొలత: Oppo Reno 11 Pro డివైజ్ 161.73 మి.మీ పొడవు, 73.34 మి.మీ వెడల్పు, 8.26 మి.మీ మందం, 190 గ్రాముల బరువు ఉంటుంది.

The post OPPO Reno 11 Pro 5G ధర తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>