
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO జనవరి 12న భారతీయ మార్కెట్ లో OPPO Reno 11 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో OPPO Reno 11 మరియు OPPO Reno 11 Pro ఫోన్లు లాంచ్ కానున్నాయి. ఇప్పటికే ఈ రెండు ఫోన్లు చైనాలో లాంచ్ అయ్యాయి. తాజాగా OPPO Reno 11 సిరీస్ వియత్నాం మార్కెట్ లో విడుదలైంది. సరే, ఓసారి OPPO Reno 11 వియత్నాం లాంచ్ విశేషాలు, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.
వియత్నాంలో లాంచైన OPPO Reno 11 సిరీస్
- OPPO Reno 11 సిరీస్ వియత్నాంలో లాంచ్ అయ్యింది. ఇప్పటికే చైనాలో OPPO Reno 11 సిరీస్ ఎంట్రీ ఇచ్చింది.
- లైనప్ లో OPPO Reno 11 Pro మరియు OPPO Reno 11 డివైజెస్ మార్కెట్ లోకి వచ్చాయి.
- భారత్ లో జనవరి 12న లాంచ్ అవుతున్నాయి. సరే, ఓసారి వియత్నాం మార్కెట్ లో ఈ డివైజెస్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
OPPO Reno 11 Pro 5G ధర
- OPPO Reno 11 Pro స్మార్ట్‌ఫోన్ 12జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీ వేరియంట్ ధరను 1,69,90,000 VND (సుమారు రూ.57,900) గా ఉంది.
- OPPO Reno 11 Pro డివైజ్ వియత్నాం మార్కెట్ లో పర్ల్ వైట్ మరియు కోరల్ గ్రే కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
OPPO Reno 11 5G ధర
- OPPO Reno 11 5G స్మార్ట్‌ఫోన్ సింగిల్ మెమొరీ వేరియంట్ లో లాంచ్ అయ్యింది. దీని ధర ఎలా ఉందో తెలుసుకుందాం.
- OPPO Reno 11 5G 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర 1,09,90,000 VND (సుమారు రూ.37,000) గా ఉంది.
- OPPO Reno 11 5G స్మార్ట్‌ఫోన్ వియత్నాం మార్కెట్ లో ఓషన్ వేవ్స్ మరియు కోరల్ గ్రే కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
OPPO Reno 11 5G స్పెసిఫికేషన్స్ (గ్లోబల్)
- డిస్ప్లే: Oppo Reno 11 లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ కర్వ్డ్-ఎడ్జ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1080*2412 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Oppo Reno 11 లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ ఉంది.
- ర్యామ్, స్టోరేజీ: Oppo Reno 11 లో 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఉంటాయి.
- ఓఎస్: Oppo Reno 11 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 పై పని చేస్తుంది.
- కెమెరా: Oppo Reno 11 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఎల్‌వైటీ-600 ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 32ఎంపి టెలీఫోటో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
- బ్యాటరీ: Oppo Reno 11 లో పవర్ బ్యాకప్ కోసం 4,800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- బరువు, చుట్టుకొలత: Oppo Reno 11 డివైజ్ 162.36 మి.మీ పొడవు, 73.98 మి.మీ వెడల్పు, 7.62 మి.మీ మందం, 184 గ్రాముల బరువు ఉంటుంది.
OPPO Reno 11 Pro 5G స్పెసిఫికేషన్స్ (గ్లోబల్)
- డిస్ప్లే: OPPO Reno 11 Pro 5G లో 6.74-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1600 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.
- ప్రాసెసర్: OPPO Reno 11 Pro 5G లో స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్, అడ్రెనో జీపీయూ వాడారు.
- ర్యామ్, స్టోరేజీ: Oppo Reno 11 Pro డివైజ్ లో 12జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీ ఉన్నాయి.
- ఓఎస్: OPPO Reno 11 Pro 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ పై పని చేస్తుంది.
- కెమెరా: OPPO Reno 11 Pro 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 32ఎంపి పొట్రెయిట్ లెన్స్, 8ఎంపి 2ఎక్స్ హైబ్రిడ్ జూమ్, 20ఎక్స్ డిజిటల్ జూమ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి సెల్ఫీ కెమెరా అందించారు.
- బ్యాటరీ: OPPO Reno 11 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 4,700 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- బరువు, చుట్టుకొలత: Oppo Reno 11 Pro డివైజ్ 161.73 మి.మీ పొడవు, 73.34 మి.మీ వెడల్పు, 8.26 మి.మీ మందం, 190 గ్రాముల బరువు ఉంటుంది.











