Oppo Reno 8 Series - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 18 Jul 2022 15:09:42 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 భారత్ లో లాంచ్ అయిన OPPO Reno 8, OPPO Reno 8 Pro https://www.91mobiles.com/telugu/oppo-reno-8-series-launched-in-india-price-specs-availability/ Mon, 18 Jul 2022 15:09:42 +0000 https://www.91mobiles.com/telugu/?p=1049 హైలైట్స్: భారత్ లో లాంచ్ అయిన ఒప్పో రెనో 8 మరియు ఒప్పో రెనో 8 ప్రో మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్, 4,500ఎంఏహెచ్ బ్యాటరీ, 80వాట్ సూపర్ వూక్ ఛార్జింగ్, ఆండ్రాయిడ్ 12, కలర్ ఓఎస్ 12.1 ఈ ఫోన్స్ ప్రత్యేకతలు. ఒప్పో అధికార వెబ్ సైట్ ద్వారా జులై 19 నుంచి రెనో 8 ప్రో, జులై 25 నుంచి రెనో 8 ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి. ఒప్పో రెనో 8 సిరీస్ భారత్ లో […]

The post భారత్ లో లాంచ్ అయిన OPPO Reno 8, OPPO Reno 8 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • భారత్ లో లాంచ్ అయిన ఒప్పో రెనో 8 మరియు ఒప్పో రెనో 8 ప్రో
  • మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్, 4,500ఎంఏహెచ్ బ్యాటరీ, 80వాట్ సూపర్ వూక్ ఛార్జింగ్, ఆండ్రాయిడ్ 12, కలర్ ఓఎస్ 12.1 ఈ ఫోన్స్ ప్రత్యేకతలు.
  • ఒప్పో అధికార వెబ్ సైట్ ద్వారా జులై 19 నుంచి రెనో 8 ప్రో, జులై 25 నుంచి రెనో 8 ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి.

ఒప్పో రెనో 8 సిరీస్ భారత్ లో లాంచ్ అయ్యింది. ఈ సిరీస్ లో స్టాండర్డ్ వేరియంట్ ఒప్పో రెనో 8, అలాగే ఒప్పో రెనో 8 ప్రో మోడల్స్ ఉంటాయి. చైనాలో రెనో 8 సిరీస్, రెనో 8ప్రో+ వేరియంట్ తో కలుపుకుని మే నెల్లో లాంచ్ అయ్యింది. ఇక ఒప్పో రెనో 8 ప్రో+, భారత్ లో రెనో 8 ప్రో గా లాంచ్ అయ్యింది. జులై 25 నుంచి ఒప్పో రెనో 8 ని ఒప్పో వెబ్ సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇక రెనో 8 ప్రో జులై 19 నుంచి అందుబాటులోకి వస్తుంది.

ఒప్పో రెనో 8 సిరీస్ మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్, 4,500ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ సూపర్ వూక్ ఛార్జింగ్, ఆండ్రాయిడ్ 12 ఆధారిత కలర్ ఓఎస్ 12.1, మారిసిలికాన్ ఎక్స్ చిప్ వంటి ఫీచర్లున్నాయి. మరి భారత్ లో ఒప్పో రెనో 8 సిరీస్ యొక్క ధర, ఇతర స్పెసిఫికేషన్లను ఇక్కడ చూద్దాం.

భారత్ లో OPPO Reno 8 సిరీస్ ధర

ఒప్పో రెనో 8 షిమ్మర్ గోల్డ్, షిమ్మర్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. దీని ధర రూ.29,999 నుంచి ప్రారంభమవుతుంది. ఇక ఒప్పో రెనో 8 ప్రో గ్లేజ్డ్ గ్రీన్, గ్లేజ్డ్ బ్లాక్ రంగుల్లో లభించనుంది. దీని ధర రూ.45,999 నుంచి మొదలవుతుంది. ఆసక్తి గల వారు, ఒప్పో వెబ్ సైట్ ద్వారా జులై 25 నుంచి రెనో 8 ని, జులై 19 నుంచి రెనో 8 ప్రో ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు.

OPPO Reno 8 స్పెసిఫికేషన్స్

6.43 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, అమోలెడ్ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్, కలర్ ఓఎస్ 12.1 కస్టమ్ స్కిన్, మీడియాటెక్ డైమెన్సిటీ 1300 చిప్సెట్, 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి.

రెనో 8 లో మారిసిలికాన్ ఎక్స్-పవర్డ్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ (50ఎంపి సోనీ ఐఎంఎక్స్766 ప్రైమరీ, 2ఎంపి బ్లాక్&వైట్, 2ఎంపి మ్యాక్రో) ఉంది. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32ఎంపి (సోనీ ఐఎంఎక్స్709) ఫ్రంట్ కెమెరా ఉంది. 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ సూపర్ వూక్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి. రెనో 8 ఫోన్ 28 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ అవుతుందని కంపెనీ చెబుతోంది.

OPPO Reno 8 Pro స్పెసిఫికేషన్స్

ఒప్పో రెనో 8 ప్రో ఫోన్లో 6.7 అంగుళాల ఫుల్-హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్10+, మీడియాటెక్ డైమెన్సిటీ 8100 మ్యాక్స్ చిప్సెట్, 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 80వాట్ సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్, 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ, 50ఎంపి ఐఎంఎక్స్766 ప్రైమరీ, 8ఎంపి ఐఎంఎక్స్355 అల్ట్రా వైడ్, 2ఎంపి ఓవీ02బీ10 మ్యాక్రో లెన్స్ లతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 32ఎంపి ఐఎంఎక్స్709 ఫ్రంట్ కెమెరా, ఆండ్రాయిడ్ 12, కలర్ ఓఎస్ 12.1 కస్టమ్ స్కిన్ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి.

ఒప్పో రెనో 8, ఒప్పో రెనో 8 ప్రో ఫోన్ల యొక్క ఫీచర్లను బట్టి చూస్తుంటే, బ్యాటరీ, కెమెరా, విభాగంపై ఎక్కువగా ఫోకస్ చేసినట్ల కనిపిస్తోంది. ముఖ్యంగా మెయిన్ సెన్సర్స్ సోనీ కంపెనీ తయారు చేసినవి కావడం ఇక్కడ ప్లస్ పాయింట్. అలాగే మారిసిలికాన్ అనే సరికొత్త ఇమేజ్ ప్రాసెసింగ్ టెక్నాలజీని ఈ ఫోన్లలో ఒప్పో అందిస్తోంది.

The post భారత్ లో లాంచ్ అయిన OPPO Reno 8, OPPO Reno 8 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
భారత్ లో లాంచ్ కి ముందు హల్ చల్ చేస్తున్న Oppo Reno 8 5G పిక్స్ https://www.91mobiles.com/telugu/oppo-reno-8-series-india-launch-pics-surfaced/ Wed, 13 Jul 2022 16:52:54 +0000 https://www.91mobiles.com/telugu/?p=949 హైలైట్స్:  జులై 18 న భారత్ లో లాంచ్ కానున్న ఒప్పో రెనో 8 సిరీస్  మీడియాటెక్ డైమెన్సిటీ 1300 చిప్సెట్, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఈ ఫోన్ ప్రత్యేకతలు  నెట్టింట్లో ప్రత్యక్షమైన ఒప్పో రెనో 8 లైవ్ ఇమేజెస్ ఒప్పో రెనో 8 సిరీస్ జులై 18 న భారత్ లో లాంచ్ అవుతోంది. ఈ సిరీస్ లో స్టాండర్డ్ వేరియంట్ ఒప్పో రెనో 8 మరియు ఒప్పో […]

The post భారత్ లో లాంచ్ కి ముందు హల్ చల్ చేస్తున్న Oppo Reno 8 5G పిక్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  •  జులై 18 న భారత్ లో లాంచ్ కానున్న ఒప్పో రెనో 8 సిరీస్
  •  మీడియాటెక్ డైమెన్సిటీ 1300 చిప్సెట్, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఈ ఫోన్ ప్రత్యేకతలు
  •  నెట్టింట్లో ప్రత్యక్షమైన ఒప్పో రెనో 8 లైవ్ ఇమేజెస్

ఒప్పో రెనో 8 సిరీస్ జులై 18 న భారత్ లో లాంచ్ అవుతోంది. ఈ సిరీస్ లో స్టాండర్డ్ వేరియంట్ ఒప్పో రెనో 8 మరియు ఒప్పో రెనో 8 ప్రో మోడల్స్ ఉంటాయి. ఒప్పో రెనో 8 ప్రో+ వేరియంట్ భారత్ కి రావడం లేదు. ఇది చైనాలో మే నెల్లో లాంచ్ అయ్యింది. ఇప్పుడు లాంచ్ కి ముందు టిప్ స్టర్ ముకుల్ శర్మ ఒప్పో రెనో 8 5జీ యొక్క డిజైన్, స్పెసిఫికేషన్లను రివీల్ చేశాడు.

CNY 2,499 (రూ.29,500) ధరతో ఒప్పో రెనో 8 8జిబి+128జిబి వేరియంట్ చైనాలో లాంచ్ అయ్యింది. ఒప్పో రెనో 8 ప్రో (చైనా వేరియంట్) ఒప్పో రెనో 8 గా, ఒప్పో రెనో 8 ప్రో+ (చైనా వేరియంట్) ఒప్పో రెనో 8 ప్రో గా భారత్ లో లాంచ్ అవుతున్నాయి. మరి ఒప్పో రెనో 8 యొక్క డిజైన్, స్పెసిఫికేషన్స్ పై ఓ లుక్ వేద్దాం పదండి.

Oppo Reno 8 5G లైవ్ ఇమేజెస్

టిప్ స్టర్ ముకుల్ శర్మ షేర్ చేసిన ఒప్పో రెనో 8 5జీ యొక్క లైవ్ పిక్స్ ద్వారా డిజైన్, కెమెరా బంప్ క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఫోన్ టాప్ లెఫ్ట్ కార్నర్ లో పంచ్-హోల్ కటౌట్, థిన్ బెజెల్స్, బాటమ్ లో మందంగా ఉన్న చిన్, కుడివైపు పవర్ బటన్, వెనుకాల ట్రిపుల్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్, బాటమ్ రైట్ కార్నర్ లో ఒప్పో బ్రాండింగ్ ఉన్నాయి.

Oppo Reno 8 5G స్పెసిఫికేషన్స్

ఒప్పో రెనో 8 5జీ ఫోన్లో 6.43 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 1300 చిప్సెట్, 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ, 4,500ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ఆండ్రాయిడ్ 12 ఆధారిత కలర్ ఓఎస్ 12.1 స్కిన్ వంటి ఫీచర్లున్నాయి.

ఒప్పో రెనో 8 5జీ లో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపు 32ఎంపి కెమెరా అమర్చారు. ఇక వెనుక వైపున ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. దీంట్లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి బ్లాక్ అండ్ వైట్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. ఇక భద్రత కోసం ఈ ఫోన్లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ను అందించారు.

The post భారత్ లో లాంచ్ కి ముందు హల్ చల్ చేస్తున్న Oppo Reno 8 5G పిక్స్ first appeared on 91Mobiles Telugu.

]]>