భారత్ లో లాంచ్ అయిన OPPO Reno 8, OPPO Reno 8 Pro

హైలైట్స్:

  • భారత్ లో లాంచ్ అయిన ఒప్పో రెనో 8 మరియు ఒప్పో రెనో 8 ప్రో
  • మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్, 4,500ఎంఏహెచ్ బ్యాటరీ, 80వాట్ సూపర్ వూక్ ఛార్జింగ్, ఆండ్రాయిడ్ 12, కలర్ ఓఎస్ 12.1 ఈ ఫోన్స్ ప్రత్యేకతలు.
  • ఒప్పో అధికార వెబ్ సైట్ ద్వారా జులై 19 నుంచి రెనో 8 ప్రో, జులై 25 నుంచి రెనో 8 ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి.

ఒప్పో రెనో 8 సిరీస్ భారత్ లో లాంచ్ అయ్యింది. ఈ సిరీస్ లో స్టాండర్డ్ వేరియంట్ ఒప్పో రెనో 8, అలాగే ఒప్పో రెనో 8 ప్రో మోడల్స్ ఉంటాయి. చైనాలో రెనో 8 సిరీస్, రెనో 8ప్రో+ వేరియంట్ తో కలుపుకుని మే నెల్లో లాంచ్ అయ్యింది. ఇక ఒప్పో రెనో 8 ప్రో+, భారత్ లో రెనో 8 ప్రో గా లాంచ్ అయ్యింది. జులై 25 నుంచి ఒప్పో రెనో 8 ని ఒప్పో వెబ్ సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇక రెనో 8 ప్రో జులై 19 నుంచి అందుబాటులోకి వస్తుంది.

ఒప్పో రెనో 8 సిరీస్ మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్, 4,500ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ సూపర్ వూక్ ఛార్జింగ్, ఆండ్రాయిడ్ 12 ఆధారిత కలర్ ఓఎస్ 12.1, మారిసిలికాన్ ఎక్స్ చిప్ వంటి ఫీచర్లున్నాయి. మరి భారత్ లో ఒప్పో రెనో 8 సిరీస్ యొక్క ధర, ఇతర స్పెసిఫికేషన్లను ఇక్కడ చూద్దాం.

భారత్ లో OPPO Reno 8 సిరీస్ ధర

ఒప్పో రెనో 8 షిమ్మర్ గోల్డ్, షిమ్మర్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. దీని ధర రూ.29,999 నుంచి ప్రారంభమవుతుంది. ఇక ఒప్పో రెనో 8 ప్రో గ్లేజ్డ్ గ్రీన్, గ్లేజ్డ్ బ్లాక్ రంగుల్లో లభించనుంది. దీని ధర రూ.45,999 నుంచి మొదలవుతుంది. ఆసక్తి గల వారు, ఒప్పో వెబ్ సైట్ ద్వారా జులై 25 నుంచి రెనో 8 ని, జులై 19 నుంచి రెనో 8 ప్రో ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు.

OPPO Reno 8 స్పెసిఫికేషన్స్

6.43 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, అమోలెడ్ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్, కలర్ ఓఎస్ 12.1 కస్టమ్ స్కిన్, మీడియాటెక్ డైమెన్సిటీ 1300 చిప్సెట్, 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి.

రెనో 8 లో మారిసిలికాన్ ఎక్స్-పవర్డ్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ (50ఎంపి సోనీ ఐఎంఎక్స్766 ప్రైమరీ, 2ఎంపి బ్లాక్&వైట్, 2ఎంపి మ్యాక్రో) ఉంది. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32ఎంపి (సోనీ ఐఎంఎక్స్709) ఫ్రంట్ కెమెరా ఉంది. 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ సూపర్ వూక్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి. రెనో 8 ఫోన్ 28 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ అవుతుందని కంపెనీ చెబుతోంది.

OPPO Reno 8 Pro స్పెసిఫికేషన్స్

ఒప్పో రెనో 8 ప్రో ఫోన్లో 6.7 అంగుళాల ఫుల్-హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్10+, మీడియాటెక్ డైమెన్సిటీ 8100 మ్యాక్స్ చిప్సెట్, 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 80వాట్ సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్, 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ, 50ఎంపి ఐఎంఎక్స్766 ప్రైమరీ, 8ఎంపి ఐఎంఎక్స్355 అల్ట్రా వైడ్, 2ఎంపి ఓవీ02బీ10 మ్యాక్రో లెన్స్ లతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 32ఎంపి ఐఎంఎక్స్709 ఫ్రంట్ కెమెరా, ఆండ్రాయిడ్ 12, కలర్ ఓఎస్ 12.1 కస్టమ్ స్కిన్ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి.

ఒప్పో రెనో 8, ఒప్పో రెనో 8 ప్రో ఫోన్ల యొక్క ఫీచర్లను బట్టి చూస్తుంటే, బ్యాటరీ, కెమెరా, విభాగంపై ఎక్కువగా ఫోకస్ చేసినట్ల కనిపిస్తోంది. ముఖ్యంగా మెయిన్ సెన్సర్స్ సోనీ కంపెనీ తయారు చేసినవి కావడం ఇక్కడ ప్లస్ పాయింట్. అలాగే మారిసిలికాన్ అనే సరికొత్త ఇమేజ్ ప్రాసెసింగ్ టెక్నాలజీని ఈ ఫోన్లలో ఒప్పో అందిస్తోంది.