OPPO Reno 8T - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 09 Mar 2023 10:42:30 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 ‘ఒప్పో రెనో 8టీ’ లాంచ్ తేదీని ప్రకటించిన ఒప్పో సంస్థ https://www.91mobiles.com/telugu/oppo-reno-8t-launch-date-confirmed-by-company/ Fri, 27 Jan 2023 06:11:00 +0000 https://www.91mobiles.com/telugu/?p=4655 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో త్వరలో OPPO Reno 8T స్మార్ట్ ఫోన్ ని గ్లోబల్ గా లాంచ్ చేయనుంది. OPPO Reno 8T 4G తో పాటు ఇంకా OPPO Reno 8T 5G కూడా ఫిబ్రవరి 8 న లాంచ్ అవుతోంది. తాజాగా ఒప్పో నుంచి OPPO Reno 8T లాంచ్ కి సంబంధించిన ప్రకటన వచ్చింది. అయితే 4జీ, 5జీ మోడల్స్ లో దేనిని లాంచ్ చేయనున్నారో తెలపలేదు. దీంతో కనీసం […]

The post ‘ఒప్పో రెనో 8టీ’ లాంచ్ తేదీని ప్రకటించిన ఒప్పో సంస్థ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • OPPO Reno 8T లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించిన ఒప్పో కంపెనీ
  • 2023 ఫిబ్రవరి 8 న ఫిలిప్పైన్స్ లో లాంచ్ అవుతోన్న OPPO Reno 8T
  • త్వరలో భారత్ లో లాంచ్ కానున్న OPPO Reno 8T

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో త్వరలో OPPO Reno 8T స్మార్ట్ ఫోన్ ని గ్లోబల్ గా లాంచ్ చేయనుంది. OPPO Reno 8T 4G తో పాటు ఇంకా OPPO Reno 8T 5G కూడా ఫిబ్రవరి 8 న లాంచ్ అవుతోంది. తాజాగా ఒప్పో నుంచి OPPO Reno 8T లాంచ్ కి సంబంధించిన ప్రకటన వచ్చింది. అయితే 4జీ, 5జీ మోడల్స్ లో దేనిని లాంచ్ చేయనున్నారో తెలపలేదు. దీంతో కనీసం OPPO Reno 8T 4G లాంచ్ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. లేదంటే రెండు ఫోన్లు ఒకేసారి లాంచ్ అయ్యే చాన్స్ ఉంది.

‘ఒప్పో రెనో 8టీ’ లాంచ్ తేదీ ఖరారు

పైన చూపబడిన ప్రచార చిత్రం మాదిరి OPPO Reno 8T స్మార్ట్ ఫోన్ ఉంటుంది. పోస్టర్ ద్వారా OPPO Reno 8T లాంచ్ తేదీ కన్ఫర్మ్ అవుతోంది. OPPO Reno 8T లైనప్ లో మొత్తం రెండు మోడల్స్ ఉంటాయి. అవి: OPPO Reno 8T 4G, OPPO Reno 8T 5G. మరి ఫిబ్రవరి 8 వ తేదీన ఈ రెండు ఫోన్లు లాంచ్ అవుతాయా లేదంటే ఏదైనా ఒక ఫోన్ తొలుత లాంచ్ అవుతుందా అనేది ఇంకా తెలియదు.

OPPO Reno 8T సిరీస్ పొట్రెయిట్ ఎక్స్‌పర్ట్ అనే ట్యాగ్ లైన్ తో వస్తోంది. దీన్ని బట్టి ఈ ఫోన్ కెమెరా లవర్స్ కోసం ప్రత్యేకించి పొట్రెయిట్స్ ని ఇష్టపడే వారి కోసం తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. రెనో సిరీస్ అంటేనే కెమెరా ప్రధానంగా ఫోన్లు వస్తాయి. అయితే ఓఐఎస్ సపోర్ట్ లేకుండా వస్తే మాత్రం ఆ ఫోన్ ని కెమెరా బేస్డ్ ఫోన్స్ అని అనలేం కదా. ఈ విషయాన్ని ఒప్పో సంస్థ గుర్తుపెట్టుకుంటుందని ఆశిద్దాం. ఎందుకంటే, ఒప్పో రెనో 8 సిరీస్ లో కూడా ఓఐఎస్ లేకపోవడం గమనించదగిన విషయం. మరి ఆ లోటుని OPPO Reno 8T సిరీస్ లో తీరుస్తారో లేదో చూడాలి.

‘ఒప్పో రెనో 8టీ’ స్పెసిఫికేషన్స్ (అంచనా)

OPPO Reno 8T 4G మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్ తో వస్తున్నట్లు సమాచారం. ఈ ఫోన్ లో 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉండనుంది. గతంలో వచ్చిన లీక్స్ ని బట్టి ఈ విషయం కన్ఫర్మ్ అయ్యింది. ఇకపోతే 6.67-ఇంచ్ ఫ్లాట్ డిస్ప్లే, పంచ్ హోల్ సెల్ఫీ కెమెరాతో ఈ ఫోన్ వస్తోంది. ఫ్రంట్ కెమెరా స్క్రీన్ పై భాగాన ఎడమవైపు మూలన ఉంటుంది.

ఇప్పుడు OPPO Reno 8T 4G యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ లో 108 ఎంపి ప్రైమరీ కెమెరా ఉంటుంది. దీనికి తోడు ఒక 2ఎంపి డెప్త్ కెమెరా, మరొక 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32 ఎంపి కెమెరా ఉంటుంది. పవర్ బ్యాకప్ కోసం OPPO Reno 8T లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

OPPO Reno 8T 4G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ ఓఎస్ 13.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ప్రస్తుతం ఈ ఫోన్ ఫిలిప్పైన్స్ లాంచ్ తేదీ మాత్రమే తెలిసింది. త్వరలోనే భారత మార్కెట్ తో పాటు ఇతర గ్లోబల్ మార్కెట్స్ లాంచ్ వివరాలు బయటకు రానున్నాయి. ఆమేరకు ఒప్పో నుంచి ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post ‘ఒప్పో రెనో 8టీ’ లాంచ్ తేదీని ప్రకటించిన ఒప్పో సంస్థ first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన OPPO Reno 8T ధర; 108ఎంపి కెమెరాతో వస్తోన్న డివైజ్ https://www.91mobiles.com/telugu/oppo-reno-8t-india-price-launch-timeline/ Mon, 23 Jan 2023 09:42:01 +0000 https://www.91mobiles.com/telugu/?p=4600 చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్ OPPO త్వరలో OPPO Reno 8T సిరీస్ ని లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ లైనప్ లో OPPO Reno 8T 4G, OPPO Reno 8T 5G అనే రెండు మోడల్స్ ఉంటాయి. అయితే, లాంచ్ కి ముందు కంపెనీ తన ఇండోనేషియా అధికార వెబ్‌సైట్ లో ఈ సిరీస్ కి సంబంధించిన ల్యాండింగ్ పేజీని క్రియేట్ చేసింది. ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ OPPO Reno 8T […]

The post లీకైన OPPO Reno 8T ధర; 108ఎంపి కెమెరాతో వస్తోన్న డివైజ్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో OPPO Reno 8T ధర రూ.27,000 నుంచి రూ.29,000 మధ్య ఉండే అవకాశం
  • 108ఎంపి మెయిన్ కెమెరాతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తోన్న OPPO Reno 8T
  • ఫిబ్రవరి మొదటి వారంలో లాంచ్ కానున్న OPPO Reno 8T సిరీస్ ఫోన్లు

చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్ OPPO త్వరలో OPPO Reno 8T సిరీస్ ని లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ లైనప్ లో OPPO Reno 8T 4G, OPPO Reno 8T 5G అనే రెండు మోడల్స్ ఉంటాయి. అయితే, లాంచ్ కి ముందు కంపెనీ తన ఇండోనేషియా అధికార వెబ్‌సైట్ లో ఈ సిరీస్ కి సంబంధించిన ల్యాండింగ్ పేజీని క్రియేట్ చేసింది.

ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ OPPO Reno 8T యొక్క భారతీయ మార్కెట్ ధర, ఫోన్ ర్యామ్, స్టోరేజీ ఆప్షన్స్, డిజైన్, కెమెరా స్పెసిఫికేషన్స్ తదితర వివరాలు వెల్లడించాడు. సరే, ఓసారి ఆ వివరాలేంటో తెలుసుకుందాం పదండి.

భారత్ లో OPPO Reno 8T ధర (అంచనా)

OPPO Reno 8T సిరీస్ స్మార్ట్ ఫోన్ల యొక్క ధరకు సంబంధించిన అధికార ప్రకటన ఏదీ ఇప్పటివరకు బయటకు రాలేదు. అయితే టిప్‌స్టర్ చెబుతున్న దాని ప్రకారం, భారత మార్కెట్ లో ఈ ఫోన్ ధర రూ.27,000 నుంచి రూ.29,000 మధ్య ఉంటుందని సమాచారం. OPPO Reno 8T డివైజ్ 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ తో లాంచ్ కానుందని సమాచారం. అలాగే వేరియంట్ ధర భారత్ లో రూ.32,000 గా ఉంటుందని అంచనా.

OPPO Reno 8T స్పెసిఫికేషన్స్ (అంచనా)

టిప్‌స్టర్ అందించిన సమాచారం ప్రకారం, OPPO Reno 8T స్మార్ట్ ఫోన్ 108ఎంపి ప్రైమరీ కెమెరా, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 3డీ కర్వ్డ్ డిజైన్, మైక్రో లెన్స్, 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీతో వస్తున్నట్లు తెలుస్తోంది.

OPPO Reno 8T స్మార్ట్ ఫోన్ 6.67-ఇంచ్ ఓఎల్ఈడీ 10-బిట్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తోంది. రియర్ కెమెరాలో 108ఎంపి మెయిన్ లెన్స్, 2ఎంపి డ్యూయల్ లెన్సెస్ ఉంటాయని అంచనా. OPPO Reno 8T 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 ప్రాసెసర్ ఉండనుంది. పవర్ బ్యాకప్ కోసం ఇందులో 4,800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.

OPPO Reno 8T ఇండియా లాంచ్ టైమ్‌లైన్ (అంచనా)

OPPO Reno 8T స్మార్ట్ ఫోన్ భారత్ లో ఫిబ్రవరి మొదటి వారంలో లాంచ్ కానుందని సమాచారం. అయితే లాంచ్ కి సంబంధించి ఒప్పో సంస్థ నుంచి ఇంకా అధికార ప్రకటన రావాల్సి ఉంది. త్వరలోనే ఒప్పో నుంచి అధికార ప్రకటన వస్తుందని ఆశిద్దాం.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post లీకైన OPPO Reno 8T ధర; 108ఎంపి కెమెరాతో వస్తోన్న డివైజ్ first appeared on 91Mobiles Telugu.

]]>
8GB ర్యామ్, MediaTek Helio G99 చిప్‌తో రానున్న OPPO Reno 8T https://www.91mobiles.com/telugu/oppo-reno-8t-spotted-geekbench-database-key-specs-revealed/ Sun, 08 Jan 2023 03:50:08 +0000 https://www.91mobiles.com/telugu/?p=4378 హైలైట్స్ గతంలో SIRIM, BIS సర్టిఫికేషన్స్ పై కనిపించిన OPPO Reno 8T 4జీ కనెక్టివిటీతో వస్తోన్న OPPO Reno 8T స్మార్ట్ ఫోన్ 33 వాట్ సూపర్‌వూక్ చార్జింగ్ తో వస్తోన్న OPPO Reno 8T Reno 8 లైనప్ లో త్వరలో మరొక స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసేందుకు ఒప్పో సంస్థ సిద్ధమవుతోంది. OPPO Reno 8T పేరుతో ఒక ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. గతంలో ఈ డివైజ్ SIRIM […]

The post 8GB ర్యామ్, MediaTek Helio G99 చిప్‌తో రానున్న OPPO Reno 8T first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • గతంలో SIRIM, BIS సర్టిఫికేషన్స్ పై కనిపించిన OPPO Reno 8T
  • 4జీ కనెక్టివిటీతో వస్తోన్న OPPO Reno 8T స్మార్ట్ ఫోన్
  • 33 వాట్ సూపర్‌వూక్ చార్జింగ్ తో వస్తోన్న OPPO Reno 8T

Reno 8 లైనప్ లో త్వరలో మరొక స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసేందుకు ఒప్పో సంస్థ సిద్ధమవుతోంది. OPPO Reno 8T పేరుతో ఒక ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. గతంలో ఈ డివైజ్ SIRIM సర్టిఫికేషన్ పై CPH2481 మోడల్ నంబర్ తో కనిపించింది. ఇటీవలె ఈ డివైజ్ బెంచ్ మార్కింగ్ సైట్ గీక్ బెంచ్ పై కూడా దర్శనమిచ్చింది. గీక్ బెంచ్ డేటాబేస్ లిస్టింగ్ ద్వారా OPPO Reno 8T యొక్క ప్రధాన స్పెసిఫికేషన్స్ గురించి తెలిసింది.

OPPO Reno 8T స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్, 8జిబి ర్యామ్ తో వస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పటికే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్ నుంచి సర్టిఫికెట్ పొందింది. దీంతో OPPO Reno 8T త్వరలోనే భారత మార్కెట్ లో లాంచ్ కానుందని భావిస్తున్నారు. సరే, ఓసారి OPPO Reno 8T యొక్క ఇతర స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం పదండి.

OPPO Reno 8T 4G స్పెసిఫికేషన్స్

OPPO Reno 8T స్మార్ట్ ఫోన్ CPH2481 మోడల్ నంబర్ తో గీక్ బెంచ్ 5 డేటాబేస్ పై కనిపించింది. సింగిల్ కోర్ టెస్ట్ లో ఈ డివైజ్ 554 పాయింట్లు, మల్టీకోర్ టెస్ట్ లో 1873 పాయింట్లు సాధించింది. OPPO Reno 8T లో మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్ వాడినట్లు సమాచారం. గ్రాఫిక్స్ కోసం మాలి జీ57 జీపీయూ ఉపయోగించారు. ఇక జీ99 చిప్ ని ఇప్పటికి రియల్మీ 10, పోకో ఎమ్5, రెడ్మీ 11 ప్రైమ్, ఇన్ఫినిక్స్ నోట్ 12 ప్రో తదితర ఫోన్లలో వాడారు.

గీక్ బెంచ్ లిస్టింగ్ ద్వారా OPPO Reno 8T ఫోన్ 8జిబి ర్యామ్ తో వస్తున్నట్లు స్పష్టమైంది. ఇతర ర్యామ్ ఆప్షన్స్ లో కూడా ఫోన్ లభించనుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఇప్పటికి OPPO Reno 8T కి సబంధించి తెలిసిన సమాచారం ఇంతే. రానున్న రోజుల్లో మరింత సమాచారాన్ని అందించేందుకు ప్రయత్నం చేస్తాం.

5జీ హవా నడుస్తోన్న ఈ సమయంలో ఒప్పో సంస్థ 4జీ ఫోన్ తో వస్తుండటం, అది కూడా రెనో సిరీస్ లో 4జీ ఫోన్ ని తెస్తుండటం ఆశ్చర్యంగా అనిపిస్తోంది. రెనో సిరీస్ ఫోన్లంటే కెమెరా సెంట్రిక్ హ్యాండ్సెట్స్ గా ప్రాచర్యం పొందాయి. ఇప్పుడు రెనో 8టీ లో కూడా మంచి కెమెరాలు, అధిక ఫీచర్లను కాస్త అందుబాటు ధరలో అందించనుందని భావించవచ్చు. ఈ ఫోన్ ధర ఏ రేంజ్ లో ఉంటుందో ఇంకా తెలియాల్సి ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 8GB ర్యామ్, MediaTek Helio G99 చిప్‌తో రానున్న OPPO Reno 8T first appeared on 91Mobiles Telugu.

]]>