లీకైన OPPO Reno 8T ధర; 108ఎంపి కెమెరాతో వస్తోన్న డివైజ్

Highlights

  • భారత్ లో OPPO Reno 8T ధర రూ.27,000 నుంచి రూ.29,000 మధ్య ఉండే అవకాశం
  • 108ఎంపి మెయిన్ కెమెరాతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తోన్న OPPO Reno 8T
  • ఫిబ్రవరి మొదటి వారంలో లాంచ్ కానున్న OPPO Reno 8T సిరీస్ ఫోన్లు

చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్ OPPO త్వరలో OPPO Reno 8T సిరీస్ ని లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ లైనప్ లో OPPO Reno 8T 4G, OPPO Reno 8T 5G అనే రెండు మోడల్స్ ఉంటాయి. అయితే, లాంచ్ కి ముందు కంపెనీ తన ఇండోనేషియా అధికార వెబ్‌సైట్ లో ఈ సిరీస్ కి సంబంధించిన ల్యాండింగ్ పేజీని క్రియేట్ చేసింది.

ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ OPPO Reno 8T యొక్క భారతీయ మార్కెట్ ధర, ఫోన్ ర్యామ్, స్టోరేజీ ఆప్షన్స్, డిజైన్, కెమెరా స్పెసిఫికేషన్స్ తదితర వివరాలు వెల్లడించాడు. సరే, ఓసారి ఆ వివరాలేంటో తెలుసుకుందాం పదండి.

భారత్ లో OPPO Reno 8T ధర (అంచనా)

OPPO Reno 8T సిరీస్ స్మార్ట్ ఫోన్ల యొక్క ధరకు సంబంధించిన అధికార ప్రకటన ఏదీ ఇప్పటివరకు బయటకు రాలేదు. అయితే టిప్‌స్టర్ చెబుతున్న దాని ప్రకారం, భారత మార్కెట్ లో ఈ ఫోన్ ధర రూ.27,000 నుంచి రూ.29,000 మధ్య ఉంటుందని సమాచారం. OPPO Reno 8T డివైజ్ 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ తో లాంచ్ కానుందని సమాచారం. అలాగే వేరియంట్ ధర భారత్ లో రూ.32,000 గా ఉంటుందని అంచనా.

OPPO Reno 8T స్పెసిఫికేషన్స్ (అంచనా)

టిప్‌స్టర్ అందించిన సమాచారం ప్రకారం, OPPO Reno 8T స్మార్ట్ ఫోన్ 108ఎంపి ప్రైమరీ కెమెరా, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 3డీ కర్వ్డ్ డిజైన్, మైక్రో లెన్స్, 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీతో వస్తున్నట్లు తెలుస్తోంది.

OPPO Reno 8T స్మార్ట్ ఫోన్ 6.67-ఇంచ్ ఓఎల్ఈడీ 10-బిట్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తోంది. రియర్ కెమెరాలో 108ఎంపి మెయిన్ లెన్స్, 2ఎంపి డ్యూయల్ లెన్సెస్ ఉంటాయని అంచనా. OPPO Reno 8T 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 ప్రాసెసర్ ఉండనుంది. పవర్ బ్యాకప్ కోసం ఇందులో 4,800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.

OPPO Reno 8T ఇండియా లాంచ్ టైమ్‌లైన్ (అంచనా)

OPPO Reno 8T స్మార్ట్ ఫోన్ భారత్ లో ఫిబ్రవరి మొదటి వారంలో లాంచ్ కానుందని సమాచారం. అయితే లాంచ్ కి సంబంధించి ఒప్పో సంస్థ నుంచి ఇంకా అధికార ప్రకటన రావాల్సి ఉంది. త్వరలోనే ఒప్పో నుంచి అధికార ప్రకటన వస్తుందని ఆశిద్దాం.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

Previous articleలాంచ్‌కి ముందు లీకైన Moto G23 ఇమేజెస్
Next articleఫిబ్రవరి 4 న భారత్‌లో లాంచ్ అవుతోన్న Infinix Zero 5G 2023
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.