Performance comparison - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 24 Sep 2024 13:06:10 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Vivo T3 Ultra vs iQOO Neo 9 Pro: రూ.40,000 లోపు ఏది బెటర్ పెర్ఫామర్? https://www.91mobiles.com/telugu/vivo-t3-ultra-vs-iqoo-neo-9-pro-performance-comparison-which-is-better-performer-under-40k/ https://www.91mobiles.com/telugu/vivo-t3-ultra-vs-iqoo-neo-9-pro-performance-comparison-which-is-better-performer-under-40k/#respond Tue, 24 Sep 2024 13:06:10 +0000 https://www.91mobiles.com/telugu/?p=13712 మీరు గనుక సన్నని డిజైన్ మరియు వేగవంతమైన పెర్ఫామెన్స్ కోరుకుంటే మీకు Vivo T3 Ultra బాగా సరిపోతుంది. అయితే రూ.33,999 ధరతో ఈ ఫోన్‌కి iQOO Neo 9 Pro నుంచి గట్టి పోటీ ఉంది. ఈ ఫోన్ లో కూడా క్వాల్కమ్ ప్రాసెసర్ ఉంది. గతేడాది లాంచైన ఫ్లాగ్షిప్స్ లో వాడిన స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ ను ఐకూ లో వాడారు. ఐకూ నియో 9 ప్రో 5జీ యొక్క 256జిబి […]

The post Vivo T3 Ultra vs iQOO Neo 9 Pro: రూ.40,000 లోపు ఏది బెటర్ పెర్ఫామర్? first appeared on 91Mobiles Telugu.

]]>

మీరు గనుక సన్నని డిజైన్ మరియు వేగవంతమైన పెర్ఫామెన్స్ కోరుకుంటే మీకు Vivo T3 Ultra బాగా సరిపోతుంది. అయితే రూ.33,999 ధరతో ఈ ఫోన్‌కి iQOO Neo 9 Pro నుంచి గట్టి పోటీ ఉంది. ఈ ఫోన్ లో కూడా క్వాల్కమ్ ప్రాసెసర్ ఉంది. గతేడాది లాంచైన ఫ్లాగ్షిప్స్ లో వాడిన స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ ను ఐకూ లో వాడారు.

ఐకూ నియో 9 ప్రో 5జీ యొక్క 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.36,998 గా ఉంది. అంటే వివో టీ3 అల్ట్రా కంటే రూ.3,000 ఎక్కువ. రాబోవు సేల్స్ లో ఈ ధర మరింత తగ్గవచ్చు. అప్పుడు వివో టీ3 అల్ట్రాకి సమానంగా ఐకూ నియో 9 ప్రో 5జీ ధర కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ రెండు ఫోన్లను పోల్చి, ఏ ఫోన్ శక్తివంతమైనదో తెలుసుకుందాం.

గీక్‌బెంచ్

గీక్‌బెంచ్ టెస్టులో వివో టీ3 అల్ట్రాపై, ఐకూ నియో 9 ప్రో 5జీ పైచేయి సాధించింది. అయితే స్కోర్ల మధ్య తేడా చాలా తక్కువగానే ఉంది. ఓసారి ఆ వివరాలను చూద్దాం.

గీక్‌బెంచ్ పై సింగిల్-కోర్ టెస్టులో ఐకూ నియో 9 ప్రో 5జీ 2023 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్టులో 5564 పాయింట్లు స్కోర్ చేసింది. మరోవైపు, వివో టీ3 అల్ట్రా సింగిల్-కోర్ టెస్టులో 1854 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్టులో 5066 పాయింట్లు స్కోర్ చేసింది. ఫలితాలు దాదాపు దగ్గరగానే ఉన్నాయి. కాబట్టి పెర్ఫామెన్స్ లో తేడా చాలా తక్కువగానే ఉంటుంది. ఈ టెస్టు కోసం మేం రెండు ఫోన్ల యొక్క 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్స్ ఉపయోగించాం.

విజేత: iQOO Neo 9 Pro

అంటుటు

అంటుటు టెస్టులో కూడా స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ కల్గిన ఐకూ నియో 9 ప్రో, డైమెన్సిటీ 9200+ ప్రాసెసర్ గల వివో టీ3 అల్ట్రా కంటే మంచి స్కోర్ చేసింది. అంటుటు అనేది జీపీయూ, మెమొరీ మరియు సీపీయూ పెర్ఫామెన్స్‌ను లోతైన పరీక్షలు జరిపి తెలుసుకుంటుంది.

అంటుటు టెస్టులో, స్కోర్లలో తేడాను గమనించవచ్చు. ఐకూ నియో 9 ప్రో బెటర్ పెర్ఫామెన్స్ అందిస్తుంది. అయితే వివో టీ3 అల్ట్రా (45డిగ్రీలు) తో పోల్చితే, ఐకూ నియో 9 ప్రో టెంపరేచర్ (46.2 డిగ్రీలు) కాస్త ఎక్కువగా ఉంది.

విజేత: iQOO Neo 9 Pro

సీపీయూ థ్రాటిల్

సీపీయూ థ్రాటిల్ టెస్టు కోసం మేం బర్నవుట్ యాప్ ను వినియోగించాం. ఈ టెస్టులో వివో టీ3 అల్ట్రా ఫోన్ బెటర్ పెర్ఫామెన్స్ చేసింది. పీక్ పెర్ఫామెన్స్ సమయంలో, వివో టీ3 అల్ట్రా బెటర్ స్టెబిలిటీ కలిగి ఉంటుందని ఈ టెస్టు ద్వారా రుజువైంది. అయితే ఇది రియల్ లైఫ్ కండీషన్స్ లో వేరుగా ఉంటుందని గమనించాలి.

స్మార్ట్‌ఫోన్ వివో టీ3 అల్ట్రా ఐకూ నియో 9 ప్రో
సీపీయూ థ్రాటిల్ 54.2% 53.70%

 

ఏదేమైనా ఈ టెస్టులో ఐకూ నియో 9 ప్రో పై, వివో టీ3 అల్ట్రా పైచేయి సాధించింది. థ్రాట్లింగ్ టెస్టులో వివో టీ3 అల్ట్రా స్కోర్ 54.2 శాతం ఉండగా, ఐకూ నియో 9 ప్రో 53.70 శాతం స్కోర్ చేసింది.

విజేత: Vivo T3 Ultra

గేమింగ్

గేమింగ్ టెస్టు కోసం మేం ఐకూ నియో 9 ప్రో మరియు వివో టీ3 అల్ట్రా ఫోన్లలో ఒకే విధమైన సెట్టింగ్స్ పెట్టాం. ఈ రెండు ఫోన్లో మేం బీజీఎంఐ, కాల్ ఆఫ్ డ్యూటీ గేమ్‌లను ఒక్కో దానిలో 30 నిమిషాల పాటు గేమ్ ఆడాం.

బీజీఎంఐ గేమ్‌ని 30 నిమిషాల ఆడిన తర్వాత, వివో టీ3 అల్ట్రా టెంపరేచర్ 6.7 శాతం పెరిగింది. మరోవైపు, ఐకూ నియో 9 ప్రో యొక్క టెంపరేచర్ 6.5 డిగ్రీలు పెరిగింది. రెండింటి మధ్య పెద్దగా తేడా లేదనిపిస్తోంది.

30 నిమిషాల పాటు కాల్ ఆఫ్ డ్యూటీ ఆడాక, వివో టీ3 అల్ట్రా టెంపరేచర్ 5.6 డిగ్రీలు పెరగగా, ఐకూ నియో 9 ప్రో టెంపరేచర్ 6.2 డిగ్రీలు పెరిగింది. టీ3 అల్ట్రా లో నిజజీవిత పరిస్థితుల్లో హీట్ మేనేజ్మెంట్ బాగుందని దీని ద్వారా రుజువైంది.

గేమింగ్ వివో టీ3 అల్ట్రా ఐకూ నియో 9 ప్రో
బీజీఎంఐ 6.7 డిగ్రీల సెల్సియస్ 6.5 డిగ్రీల సెల్సియస్
కాల్ ఆఫ్ డ్యూటీ 5.6 డిగ్రీల సెల్సియస్ 6.2 డిగ్రీల సెల్సియస్

 

ఇతర రియల్-లైఫ్ ఎక్స్‌పీరియన్స్ అనేది రెండు ఫోన్లలో ఒకే విధంగా ఉంది. అయితే టీ3 అల్ట్రాలో కర్వ్డ్ డిస్ప్లే ఉండగా, నియో 9 ప్రో లో ఫ్లాట్ స్క్రీన్ ఉంది. టీ3 అల్ట్రా లోని కర్వ్డ్ డిస్ప్లే వల్లన గేమింగ్ టెస్టు సమయంలో కొన్ని మిస్‌టచెస్‌ను మేం గమనించాం.

హై-ఇంటెన్సిటీ పెర్ఫామెన్స్ విషయంలో రెండు ఫోన్లు సమానంగా ఉన్నాయి. అయితే హీట్ మేనేజ్మెంట్ పరంగా వివో టీ3 అల్ట్రాదే పైచేయి.

విజేత: Vivo T3 Ultra

ఏది బెటర్?

మేం జరిపిన టెస్టుల ప్రకారం, Vivo T3 Ultra మరియు iQOO Neo 9 Pro ఫోన్లు సమానంగా నిలిచాయి. కాబట్టి, గేమింగ్ కోసమే ఫోన్ కావాలంటే రెండూ కూడా బాగుంటాయి.

గమనించాల్సిన విషయం ఏంటంటే, ఐకూ నియో 9 ప్రో ఎక్కువ సంఖ్యలో ప్రీ-ఇన్‌స్టాల్డ్ యాప్స్ (57) తో వస్తుంది. అదే, వివో టీ3 అల్ట్రా (47) ప్రీ-ఇన్‌స్టాల్డ్ యాప్స్ తో వస్తుంది. ఇక్కడ వివో టీ3 అల్ట్రా తక్కువ బ్లోట్‌వేర్ కలిగి ఉందని తెలుస్తోంది. అయితే, వివో టీ3 అల్ట్రాకి రెండేళ్ళు ఓఎస్ అప్డేట్స్ లభించనుండగా, ఐకూ నియో 9 ప్రో కి 3 ఏళ్ళు ఓఎస్ అప్డేట్స్ లభిస్తాయి. ఇక్కడ ఐకూ నియో 9 ప్రో పైచేయి సాధించింది.

The post Vivo T3 Ultra vs iQOO Neo 9 Pro: రూ.40,000 లోపు ఏది బెటర్ పెర్ఫామర్? first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/vivo-t3-ultra-vs-iqoo-neo-9-pro-performance-comparison-which-is-better-performer-under-40k/feed/ 0
Vivo T3 Pro vs Motorola Edge 50 Fusion: ఏది బెటర్‌గా పెర్ఫామ్ చేస్తుంది? https://www.91mobiles.com/telugu/vivo-t3-pro-vs-motorola-edge-50-fusion-performance-comparison-which-is-better/ https://www.91mobiles.com/telugu/vivo-t3-pro-vs-motorola-edge-50-fusion-performance-comparison-which-is-better/#respond Thu, 12 Sep 2024 15:27:31 +0000 https://www.91mobiles.com/telugu/?p=13464 Vivo నుంచి కొన్ని రోజుల క్రితం Vivo T3 Pro ఫోన్ లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ రూ.24,999 ధరతో మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్, 3డీ అమోలెడ్ స్క్రీన్, 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. ఇదే సెగ్మెంట్ లో మరొక ఫోన్ Motorola Edge 50 Fusion కూడా లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్ […]

The post Vivo T3 Pro vs Motorola Edge 50 Fusion: ఏది బెటర్‌గా పెర్ఫామ్ చేస్తుంది? first appeared on 91Mobiles Telugu.

]]>

Vivo నుంచి కొన్ని రోజుల క్రితం Vivo T3 Pro ఫోన్ లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ రూ.24,999 ధరతో మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్, 3డీ అమోలెడ్ స్క్రీన్, 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. ఇదే సెగ్మెంట్ లో మరొక ఫోన్ Motorola Edge 50 Fusion కూడా లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్ తో వచ్చింది. ఇప్పుడు ఈ రెండు ఫోన్ల యొక్క పెర్ఫామెన్స్‌ను పోల్చి చూసి, రెండింట్లో ఏది శక్తివంతమైన ఫోన్ అనే విషయాన్ని తెలుసుకుందాం.

గీక్‌బెంచ్

ఈ టెస్ట్ కోసం రెండు ఫోన్ల యొక్క టాప్ మోడల్స్‌ను వినియోగించాం. Vivo T3 Pro 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 2.1 స్టోరేజీ వేరియంట్ ధర రూ.26,999 గా ఉంది. Motorola Edge 50 Fusion 12జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్ వేరియంట్ ధర రూ.24,999 గా ఉంది.

గీక్‌బెంచ్‌పై సింగిల్-కోర్ టెస్ట్ లో వివో టీ3 ప్రో 1147 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 3117 పాయింట్లు స్కోర్ చేసింది. మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ సింగిల్-కోర్ టెస్ట్ లో 1020 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 2945 పాయింట్లు స్కోర్ చేసింది.

వివో టీ3 ప్రో డివైజ్ యాప్ లోడ్, జనరల్ స్క్రోలింగ్, గేమింగ్, వీడియో రికార్డింగ్ వంటి పనులను ఎక్కువ ఎఫిషియంట్ గా చేస్తుంది. తక్కువ ర్యామ్ కన్ఫిగరేషన్ ఉన్నప్పటికీ వివో మంచి స్కోర్ నమోదు చేసింది.

విజేత: Vivo T3 Pro

అంటుటు

వివో టీ3 ప్రో యొక్క అంటుటు స్కోర్ 8,12,119 గా ఉంది. మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ అంటుటు స్కోర్ 6,20,648 గా ఉంది. ఈ టెస్టులో అత్యధిక పాయింట్లు సాధించిన వివో టీ3 ప్రో, మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ కంటే మేటిగా నిలిచింది.

విజేత: Vivo T3 Pro

సీపీయూ థ్రాటిల్

సీపీయూ థ్రాటిల్ టెస్ట్ కోసం మేం బర్నవుట్ యాప్ వినియోగించాం. గతంలో ఈ టెస్టులో మోటోరోలా ఫోన్ రియల్మీ 13 ప్లస్ మీద పైచేయి సాధించింది. ఇప్పుడు కూడా తన డామినేషన్ ను చూపించింది.

వివో టీ3 ప్రో డివైజ్ బర్నవుట్ టెస్ట్ లో 67.9 పర్సెంట్ స్టెబిలిటీని చూపించింది. మరోవైపు, మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ డివైజ్ 76.5 పర్సెంట్ స్టెబిలిటీని చూపించింది.

విజేత: Motorola Edge 50 Fusion

గేమింగ్

మేం జరిపిన గేమింగ్ టెస్ట్ లో.. వివో టీ3 ప్రో మరియు మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఫోన్లలో 30 నిమిషాల పాటు బీజీఎంఐ, కాల్ ఆఫ్ డ్యూటీ గేమ్‌లను ఆడాం. ఈ సమయంలో టెంపరేచర్ ను గమనించాం.

బీజీఎంఐ రౌండ్ తర్వాత, వివో టీ3 ప్రో టెంపరేచర్ 3.8 డిగ్రీలు పెరిగింది. మరోవైపు, ఎడ్జ్ 50 ఫ్యూజన్ టెంపరేచర్ 7.5 డిగ్రీలు పెరిగింది. 30 నిమిషాల పాటు కాల్ ఆఫ్ డ్యూటీ ఆడాక, టీ3 ప్రో డివైజ్ టెంపరేచర్ 3.1 డిగ్రీలు పెరిగగా, మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ యొక్క టెంపరేచర్ 7.2 డిగ్రీలు పెరిగింది.

వివో టీ3 ప్రో, ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఫోన్లలో కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లేలను అందించారు. దీంతో గేమింగ్ టైమ్‌లో మిస్‌టచెస్ చోటుచేసుకున్నాయి. వివో టీ3 ప్రో ఎక్స్‌ట్రిమ్+ ఫ్రేమ్ రేట్స్ (90ఎఫ్‌పీఎస్) ను స్మూథ్ గ్రాఫిక్స్ పై ఆఫర్ చేస్తుంది. ఎడ్జ్ 50 ఫ్యూజన్ లో ఈ ఫీచర్ ఇంకా అందుబాటులో లేదు. మేం జరిపిన టెస్టుల్లో వివో టీ3 ప్రో ఫ్రేమ్ రేట్స్ కన్సిస్టెంట్ గా ఉన్నాయి.

విజేత: Vivo T3 Pro

ఏది బెటర్?

మేం జరిపిన టెస్టులను బట్టి, స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ కల్గిన Vivo T3 Pro విజేతగా నిలిచింది. పెర్ఫామెన్స్ బాగా ఉండాలని భావించే వారికి వివో టీ3 ప్రో మంచి ఎంపిక అవుతుంది. అయితే, మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ క్లీన్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది.

ఇంకా ఎడ్జ్ 50 ఫ్యూజన్ కు 3 ఏళ్ళు మేజర్ ఓఎస్ అప్డేట్స్ లభిస్తాయి. కానీ, టీ3 ప్రో కి మాత్రం 2 ఏళ్ళు మేజర్ ఓఎస్ అప్డేట్స్ లభిస్తాయి.

ఈ రెండు ఫోన్లను టెస్ట్ చేసిన వారు: ఉజ్వల్ శర్మ, ఆదిత్యా పాండే

The post Vivo T3 Pro vs Motorola Edge 50 Fusion: ఏది బెటర్‌గా పెర్ఫామ్ చేస్తుంది? first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/vivo-t3-pro-vs-motorola-edge-50-fusion-performance-comparison-which-is-better/feed/ 0
Vivo V40 vs Honor 200: ఏ ఫోన్ బెటర్‌గా పెర్ఫామ్ చేస్తుంది? https://www.91mobiles.com/telugu/vivo-v40-vs-honor-200-performance-comparison-which-is-better/ https://www.91mobiles.com/telugu/vivo-v40-vs-honor-200-performance-comparison-which-is-better/#respond Sun, 25 Aug 2024 18:24:24 +0000 https://www.91mobiles.com/telugu/?p=13146 మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌కు పోటీ ఎక్కువైపోతోంది. ఈ సెగ్మెంట్ లో కంపెనీలు శక్తివంతమైన ఫోన్లను లాంచ్ చేస్తున్నాయి. ఇటీవలె లాంచైన Vivo V40 మరియు Honor 200 గట్టి పోటీదారులుగా నిలుస్తున్నాయి. రెండు ఫోన్లు కూడా ఒకే ధర శ్రేణిని కలిగి ఉన్నాయి. మరి ఈ రెండు ఫోన్లలో ఒక దాన్ని ఎంచుకోవడం సులువైన పని కాదు కదా. ఏ ఫోన్ బెటర్ గా పెర్ఫామ్ చేస్తుందోననే విషయం తెలుసుకునేందుకు 91మొబైల్స్ ఈ ఫోన్ల యొక్క గీక్‌బెంచ్ […]

The post Vivo V40 vs Honor 200: ఏ ఫోన్ బెటర్‌గా పెర్ఫామ్ చేస్తుంది? first appeared on 91Mobiles Telugu.

]]>

మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌కు పోటీ ఎక్కువైపోతోంది. ఈ సెగ్మెంట్ లో కంపెనీలు శక్తివంతమైన ఫోన్లను లాంచ్ చేస్తున్నాయి. ఇటీవలె లాంచైన Vivo V40 మరియు Honor 200 గట్టి పోటీదారులుగా నిలుస్తున్నాయి. రెండు ఫోన్లు కూడా ఒకే ధర శ్రేణిని కలిగి ఉన్నాయి. మరి ఈ రెండు ఫోన్లలో ఒక దాన్ని ఎంచుకోవడం సులువైన పని కాదు కదా. ఏ ఫోన్ బెటర్ గా పెర్ఫామ్ చేస్తుందోననే విషయం తెలుసుకునేందుకు 91మొబైల్స్ ఈ ఫోన్ల యొక్క గీక్‌బెంచ్ స్కోర్స్, అంటుటు స్కోర్, థ్రాట్లింగ్ టెస్ట్, గేమింగ్ టెస్ట్ లను పరిశీలించింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.

గమనిక: టెస్టింగ్ కోసం వివో వీ40 యొక్క 8జిబి+128జిబి వేరియంట్‌ను ఉపయోగించాం. టాప్ ఎండ్ వేరియంట్‌తో పోల్చితే బెంచ్‌మార్క్ స్కోర్స్ కాస్త తక్కువగా ఉంటాయి.

గీక్‌బెంచ్

గీక్‌బెంచ్ అనేది ఇండస్ట్రీ స్టాండర్డ్ బెంచ్‌మార్క్. ఇది సింగిల్-కోర్ మరియు మల్టీ-కోర్ టాస్కుల్లో డివైజ్ యొక్క సీపీయూ పెర్ఫామెన్స్ ఎలా ఉందో తెలుసుకుంటుంది. వివో వీ40 మరియు హానర్ 200 ఫోన్లలో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ ఉంది. దీంతో స్కోర్స్ విషయంలో పెద్ద తేడా కనిపించలేదు.

Vivo V40: గీక్‌బెంచ్ పై వివో వీ40 సింగిల్-కోర్ టెస్ట్ లో 1164 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 3216 పాయింట్లు స్కోర్ చేసింది.

Honor 200: గీక్‌బెంచ్ పై హానర్ 200 డివైజ్ సింగిల్-కోర్ట్ టెస్ట్ లో 1164 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 3360 పాయింట్లు స్కోర్ చేసింది.

సింగిల్-కోర్ పెర్ఫామెన్స్ ప్రధానంగా వర్డ్ ప్రాసెసింగ్, వెబ్ బ్రౌజింగ్, యాప్ లోడింగ్ స్పీడ్స్ పై ప్రభావం చూపుతుంది. మల్టీ-కోర్ పెర్ఫామెన్స్ ప్రధానంగా గేమింగ్, ఫోటో మరియు వీడియో ఎడిటింగ్, మల్టీటాస్కింగ్ తదితర వాటిపై ప్రభావం చూపుతుంది. రెండు ఫోన్ల ఫలితాలను గమనిస్తే, హానర్ 200 ఫోన్‌ది పైచేయి అనిపిస్తోంది.

విజేత: Honor 200

అంటుటు

అంటుటు బెంచ్‌మార్క్ అనేది కాంప్రెహెన్సివ్ టెస్టింగ్ స్టాండర్డ్. ఇది గీక్‌బెంచ్ టెస్ట్ కంటే లోతైనది. స్మార్ట్‌ఫోన్ యొక్క సీపీయూ పెర్ఫామెన్స్, జీపీయూ పెర్ఫామెన్స్, మెమొరీ పెర్ఫామెన్స్, యూజర్ ఎక్స్‌పీరియన్స్ వంటి విషయాలను అంటుటు బెంచ్‌మార్క్ ఎవాల్యూయేట్ చేస్తుంది.

వివో వీ40 అంటుటు స్కోర్ 8,10,653 గా ఉంది. మరోవైపు హానర్ 200 అంటుటు స్కోర్ 8,25,206 గా ఉంది. హానర్ 200 లో హయ్యర్ ర్యామ్, స్మూథర్ ఓఎస్ వల్లన వివో వీ40 కంటే మెరుగైన స్కోర్ సాధించింది.

విజేత: Honor 200

థ్రాట్లింగ్ టెస్ట్

ఒత్తిడి పరిస్థితుల్లో స్మార్ట్‌ఫోన్ యొక్క చిప్సెట్ పనితీరును పరీక్షించడమే ఈ థ్రాట్లింగ్ టెస్ట్. ఈ టెస్ట్ కోసం మేం, బర్నవుట్ బెంచ్‌మార్క్ యాప్ ఉపయోగించాం. ఫోన్ యొక్క ప్రాసెసర్ పై ఈ యాప్ స్ట్రెస్ టెస్ట్ రన్ చేసి, పెర్ఫామెన్స్ ఔట్‌పుట్‌ను బట్టి స్కోర్ ఇస్తుంది.

బర్నవుట్ సీపీయూ థ్రాట్లింగ్ టెస్ట్ లో, వివో వీ40 పెర్ఫామెన్స్ ఔట్‌పుట్ 68.8 శాతంగా నమోదైంది. మరోవైపు హానర్ 200 యొక్క రిజల్ట్ 79.3 శాతంగా నమోదైంది.

విజేత: Honor 200

గేమింగ్ టెస్ట్

పాపులర్ గేమ్స్‌ను ఈ రెండు ఫోన్లలో 30 నుంచి 40 నిమిషాల పాటు హయ్యస్ట్ సెట్టింగ్స్ తో ఆడటం జరిగింది. అలాగే గేమ్ కి ముందు తర్వాత టెంపరేచర్స్ మరియు బ్యాటరీ డ్రాప్స్ కూడా పరిశీలించాం.

రెండు ఫోన్లలో బీజీఎంఐ, కాల్ ఆఫ్ డ్యూటీ: మొబైల్, రియల్ రేసింగ్ 3 గేమ్స్‌ను ఆడాం. హయ్యస్ట్ సెట్టింగ్ పై గేమ్స్ స్మూథ్ గా రన్ అయ్యాయి. వివో వీ40 తో పోల్చితే, హానర్ 200 కాస్త బెటర్ ఎఫ్‌పీఎస్ కౌంట్ నమోదు చేసింది.

థర్మల్స్ విషయానికి వస్తే, వివో వీ40 యొక్క టెంపరేచర్ 5 శాతం పెరిగింది. మరోవైపు, హానర్ 200 యొక్క యావరేజ్ టెంపరేచర్ 7 డిగ్రీలుగా ఉంది. 2 డిగ్రీలు ఎక్కువగా వేడెక్కడం వల్లన హానర్ 200 యొక్క బ్యాటరీ కూడా ఖర్చయ్యింది. గేమింగ్ సమయంలో బెటర్ ఎఫ్‌పీఎస్ కారణంగా హానర్ 200 విజేతగా నిలిచింది.

విజేత: Honor 200

ఏది బెటర్ పెర్ఫార్మర్?

వివో వీ40, హానర్ 200 డివైజెస్ వాటి ధరల ప్రకారం చూస్తే, సాలిడ్ పెర్ఫామెన్స్ ఇస్తాయి. అయితే, గేమింగ్ మరియు సస్టెయిన్డ్ పెర్ఫామెన్స్ కోసం స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 బాగా ఉపయోగపడుతుంది. హానర్ 200, వివో వీ40 తో పోల్చితే కాస్త ముందంజలో ఉంది. థర్మల్ మరియు బ్యాటరీ మేనేజ్మెంట్ విషయాల్లో వివో వీ40 బాగుంది.

The post Vivo V40 vs Honor 200: ఏ ఫోన్ బెటర్‌గా పెర్ఫామ్ చేస్తుంది? first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/vivo-v40-vs-honor-200-performance-comparison-which-is-better/feed/ 0