Phone blast - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 26 Sep 2024 10:47:17 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Motorola ఫోన్ నుంచి మంటలు, కాలిపోయిన ఫోన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/motorola-phone-catches-fire-know-full-details/ https://www.91mobiles.com/telugu/motorola-phone-catches-fire-know-full-details/#respond Thu, 26 Sep 2024 10:47:17 +0000 https://www.91mobiles.com/telugu/?p=13761 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola స్మార్ట్‌ఫోన్లకు భారతీయ మార్కెట్ లో ఇటీవల డిమాండ్ బాగా పెరిగింది. సరసమైన ధరల్లో అధిక ఫీచర్లను అందిస్తూ, యూజర్లలో మంచి పేరును సంపాదించింది. జనాలు కూడా ఈమధ్య ఈ బ్రాండ్ ఫోన్లను కొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ సమయంలో ఓ చేదు వార్త వెలుగులోకి వచ్చింది. తాజాగా ఒక మోటోరోలా ఫోన్ లో నిప్పులు చెలరేగి దాదాపుగా కాలిపోయింది. ఈ ఫోన్ Motorola G34 అని ప్రాథమికంగా ఒక అంచనాకు […]

The post Motorola ఫోన్ నుంచి మంటలు, కాలిపోయిన ఫోన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • మోటోరోలా ఫోన్ నుంచి మంటలు
  • కాలిపోయిన స్మార్ట్‌ఫోన్
  • Motorola G34 గా నిర్ధారణ

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola స్మార్ట్‌ఫోన్లకు భారతీయ మార్కెట్ లో ఇటీవల డిమాండ్ బాగా పెరిగింది. సరసమైన ధరల్లో అధిక ఫీచర్లను అందిస్తూ, యూజర్లలో మంచి పేరును సంపాదించింది. జనాలు కూడా ఈమధ్య ఈ బ్రాండ్ ఫోన్లను కొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ సమయంలో ఓ చేదు వార్త వెలుగులోకి వచ్చింది. తాజాగా ఒక మోటోరోలా ఫోన్ లో నిప్పులు చెలరేగి దాదాపుగా కాలిపోయింది. ఈ ఫోన్ Motorola G34 అని ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు.

Motorola G34 నుంచి మంటలు

ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ తాజాగా తన X ఖాతాలో కాలిపోయిన ఫోన్ యొక్క ఫోటోలను షేర్ చేశారు. వాటిని చూస్తే, ఫోన్ చాలా వరకు కాలిపోయినట్లు స్పష్టంగా తెలుస్తోంది.

అయితే ఈ ఫోటోల్లో బ్రాండ్ పేరు కనిపించలేదు. కానీ, టిప్‌స్టర్ ఆ ఫోన్ మోటోరోలా జీ34 అని తెలిపారు.

సోషల్ మీడియాలో 4 ఇమేజెస్ షేర్ అయ్యాయి. వాటిని గమనిస్తే, డిస్ప్లే కూడా సెపరేట్ అయినట్లు తెలుస్తోంది.

నిప్పు అంటుకోవడం వల్లన ఫోన్ వెనుక, ముందు వైపున ప్యానెల్స్ డ్యామేజ్ అయ్యాయి. టిప్‌స్టర్ ఈ పోస్ట్‌ను షేర్ చేసిన తర్వాత, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

హీటింగ్ ప్రాబ్లెమ్ వల్లన ఫోన్ లో మంటలు చెలరేగి ఉంటాయని అంచనా వేయవచ్చు.

ఈ ఘటన వల్లన ఎవరికైనా గాయాపడ్డారా? బాధితులు ఎవరు అనే విషయాలు ఇంకా తెలియదు.

మోటోరోలా కంపెనీ స్పందన ఏంటి?

మోటోరోలా ఫోన్ యొక్క ఫోటోలు వైరల్ అయ్యాక, బ్రాండ్ నుంచి రెస్పాన్స్ వచ్చింది. తన పోస్ట్ లో మోటోరోలా “మీ భద్రతే మాకు ప్రధానం. మీరు బాగున్నారని ఆశిస్తున్నాం. మీకు సరైన పరిష్కారం అందించేందుకై మీతో కలిసి పని చేస్తాం. మీ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ మరియు ఈమెయిల్ ఐడీని ఇవ్వగలరు” అని పేర్కొంది.

గతంలో కూడా పేలిన Motorola G34

గతంలో కూడా మోటోరోలా జీ34 లో మంటలు చెలరేగి, పేలినట్లు వార్తలు వచ్చాయి. సెప్టెంబర్ 5వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. తన మోటో జీ34 పేలినట్లు రాంబాబు సోలంకి అనే యూజర్ తన సోషల్ మీడియా ఖాతాలో వివరాలను షేర్ చేశారు. అంతేకాదు, పేలుడుకి సంబంధించిన ఫోటోలను కూడా పంచుకున్నారు. తాను ఫోన్‌ని గత నెలలో కొనుగోలు చేసినట్లు పోస్ట్ లో యూజర్ పేర్కొన్నారు.

స్మార్ట్‌ఫోన్ పేలకుండా ఏం చేయాలి?

ఫోన్‌ని నేరుగా సూర్యకాంతిలో ఉంచవద్దు. అలాగే వేడిమి ఉన్న ప్రదేశంలో చార్జ్ చేయవద్దు.

రాత్రి వేళ చార్జింగ్ పెట్టి.. అలాగే గంటల తరబడి ఫోన్‌ని వదిలేయవద్దు. అలాగే ఎప్పుడైనా సరే, ఫోన్ 100 శాతం చార్జింగ్ పూర్తయ్యాక వెంటనే ఆఫ్ చేయండి. చార్జింగ్ లో ఉన్నప్పుడు ఫోన్ వాడకండి.

కంపెనీ అందించిన చార్జర్ మరియు కేబుల్‌ను మాత్రమే వాడండి. థర్డ్ పార్టీ లేదా ఫేక్ బ్యాటరీలు వాడకండి. మీ ఫోన్ గనుక విపరీతంగా వేడెక్కినట్లు అనిపిస్తే, వెంటనే స్విచాఫ్ చేసేయండి.

The post Motorola ఫోన్ నుంచి మంటలు, కాలిపోయిన ఫోన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/motorola-phone-catches-fire-know-full-details/feed/ 0
నాసిక్‌లో పేలిన స్మార్ట్‌ఫోన్; బద్దలైన కిటికీలు, పలువురికి గాయాలు https://www.91mobiles.com/telugu/phone-blast-in-nashik-3-people-injured/ Fri, 29 Sep 2023 05:20:21 +0000 https://www.91mobiles.com/telugu/?p=8218 మొబైల్ ఫోన్ పేలుళ్ళు తరచూ జరుగుతూనే ఉన్నాయి. దేశంలో ఏదో ఒక ప్రాంతంలో స్మార్ట్‌ఫోన్లు పేలిన ఘటనలు వార్తల్లోకెక్కుతున్నాయి. కారణాలేవైనా పేలుళ్ళు ఆగడం లేదు. తాజాగా మహారాష్ట్ర లోని నాసిక్ లో ఓ ఇంట్లో మొబైల్ ఫోన్ పేలింది. ఈ పేలుడు దాటికి పలువురికి గాయాలయ్యాయి. పేలుడు తీవ్రత ఎంత ఎక్కువగా ఉందంటే, ఇంటి కిటికీలు కూడా బద్ధలైపోయాయి. ఇప్పటి వరకు మొబైల్ ఫోన్ పేలిన ఘటనలో ఇంత తీవ్రత ఉన్న పేలుడు ఇదేనని భావిస్తున్నారు. పేలిన […]

The post నాసిక్‌లో పేలిన స్మార్ట్‌ఫోన్; బద్దలైన కిటికీలు, పలువురికి గాయాలు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నాసిక్ లో పేలిన మొబైల్ ఫోన్
  • పేలుడు దాటికి బద్ధలైన ఇంటి కిటికీలు
  • ఇంట్లో ఉన్న పలువురికి గాయాలు

మొబైల్ ఫోన్ పేలుళ్ళు తరచూ జరుగుతూనే ఉన్నాయి. దేశంలో ఏదో ఒక ప్రాంతంలో స్మార్ట్‌ఫోన్లు పేలిన ఘటనలు వార్తల్లోకెక్కుతున్నాయి. కారణాలేవైనా పేలుళ్ళు ఆగడం లేదు. తాజాగా మహారాష్ట్ర లోని నాసిక్ లో ఓ ఇంట్లో మొబైల్ ఫోన్ పేలింది. ఈ పేలుడు దాటికి పలువురికి గాయాలయ్యాయి. పేలుడు తీవ్రత ఎంత ఎక్కువగా ఉందంటే, ఇంటి కిటికీలు కూడా బద్ధలైపోయాయి. ఇప్పటి వరకు మొబైల్ ఫోన్ పేలిన ఘటనలో ఇంత తీవ్రత ఉన్న పేలుడు ఇదేనని భావిస్తున్నారు.

పేలిన డియొడరెంట్

NDTV కథనం ప్రకారాం, ఘటన సంభవించినప్పుడు ఫోన్ చార్జింగ్ లో ఉంది. ఫోన్ బ్రాండ్ కి సంబంధించిన సమాచారం తెలియదు. అయితే, ఫోన్ కి సమీపంలో ఒక సెంటు బాటిల్ ఉందని తెలుస్తోంది. దీంతో బ్లాస్ట్ మరింత తీవ్రతరమైనట్లు తెలుస్తోంది.

డియోడరెంట్ బాటిల్ పేలుడు ధాటిని తీవ్రతరం చేసినట్లు తెలుస్తోంది. ఇక్కడ విషయం ఏంటంటే, మనం వాడే డియోడరెంట్స్ లో పేలే గుణం కలిగిన ఎన్నో పదార్థాలు ఉంటాయి. పెద్ద ఫైర్ యాక్సిడెంట్ అయ్యేందుకు ఒక చిన్న నిప్పురవ్వ చాలు.

ఘటనలో ముగ్గురికి గాయాలు

అత్యంత శక్తివంతంగా జరిగిన ఈ పేలుడు ఘటనలో ఇంట్లో ఉన్న గ్లాస్, విండోస్ బద్ధలైపోయినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఇంటికి దగ్గరగా నిలిపి ఉంచిన వాహనాలు సైతం పేలుడు ప్రభావానికి గురైనట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

అసలు ఫోన్లు ఎందుకు పేలుతాయి?

  • బ్యాటరీలో లోపం ఉంటే మొబైల్ ఫోన్లు పేలుతుంటాయి. పేలుడు సంభవించడానికి గల కారణాలలో ఇది అత్యంత సాధారణమైనది.
  • పాత స్మార్ట్‌ఫోన్ బ్యాటరీలు ఉబ్బి తర్వాత పేలుతాయి. ఇలా బ్యాటరీ ఉబ్బిన తర్వాత చార్జ్ చేస్తే పేలేందుకు అవకాశాలు చాలా ఎక్కువ. బ్యాటరీలు ఉబ్బినట్లు మీరు గమనిస్తే, వెంటనే జాగ్రత్త పడండి.
  • లోపంతో ఉన్న బ్యాటరీ లేదా చార్జర్ షార్ట్ సర్క్యూట్ కి దారి తీసి ప్రమాదానికి కారణం కావచ్చు.
  • ఇవి తరచూ మనకు కనిపించే కారణాలు. కానీ, ప్రస్తుతం జరిగిన ఘటనలో పూర్తిగా దర్యాప్తు జరిగిన తర్వాతే అసలు నిజాలు బయటకు వస్తాయి.

The post నాసిక్‌లో పేలిన స్మార్ట్‌ఫోన్; బద్దలైన కిటికీలు, పలువురికి గాయాలు first appeared on 91Mobiles Telugu.

]]>
70ఏళ్ళ వృద్ధుడి జేబులో పేలిన మొబైల్ ఫోన్, కేరళలో ఘటన; వీడియో చూడండి! https://www.91mobiles.com/telugu/70-years-old-man-phone-blast-kerala/ Fri, 19 May 2023 13:25:33 +0000 https://www.91mobiles.com/telugu/?p=6396 కేరళ రాష్ట్రంలోని త్రిస్సురు లో 70 ఏళ్ళ వృద్ధుడి జేబులో మొబైల్ ఫోన్ పేలింది. ఈ సంఘటన గురువారం నాడు ఉదయం 10 గంటలకు చోటు చేసుకుంది. ఇల్యాస్ అనే వృద్ధుడు మరోటికల్ ప్రాంతంలోని ఓషాపులో టీ తాగుతున్నారు. అదే సమయంలో ఉన్నట్లుండి ఆయన జేబులోని ఫోన్ పేలింది. నిప్పుడు వ్యాపించడంతో ఆయన వెనువెంటనే ఫోన్ ని తీసి క్రింద పారేశారు. ఆయనకు ఎటువంటి గాయాలు కాలేదు. ఒక నెల వ్యవధిలో కేరళలో ఈ తరహా ఘటన […]

The post 70ఏళ్ళ వృద్ధుడి జేబులో పేలిన మొబైల్ ఫోన్, కేరళలో ఘటన; వీడియో చూడండి! first appeared on 91Mobiles Telugu.

]]>

కేరళ రాష్ట్రంలోని త్రిస్సురు లో 70 ఏళ్ళ వృద్ధుడి జేబులో మొబైల్ ఫోన్ పేలింది. ఈ సంఘటన గురువారం నాడు ఉదయం 10 గంటలకు చోటు చేసుకుంది. ఇల్యాస్ అనే వృద్ధుడు మరోటికల్ ప్రాంతంలోని ఓషాపులో టీ తాగుతున్నారు. అదే సమయంలో ఉన్నట్లుండి ఆయన జేబులోని ఫోన్ పేలింది. నిప్పుడు వ్యాపించడంతో ఆయన వెనువెంటనే ఫోన్ ని తీసి క్రింద పారేశారు. ఆయనకు ఎటువంటి గాయాలు కాలేదు. ఒక నెల వ్యవధిలో కేరళలో ఈ తరహా ఘటన మూడవది.

న్యూస్ ఏజెన్సీ పీటీఐ ప్రకారం, ఈ ఘటనలో ఎటువంటి డ్యామేజీ జరగలేదు. ఘటన గురించి తెలిసిన వెంటనే ఒలురు పోలీస్ స్టేషన్ అధికారి తాను బాధిత వ్యక్తితో మాట్లాడినట్లు తెలిపారు. ఫోన్ ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నట్లు ఆయన చెప్పారు.

ఏడాది క్రితం కొనుగోలు చేసిన ఫోన్

తాను ఏడాది క్రితం రూ.1000 పెట్టి ఫీచర్ ఫోన్ కొనుగోలు చేసినట్లు ఇల్యాస్ తెలిపారు. తన ఫోన్ ఏ సమస్య లేకుండా బాగానే పని చేస్తోందని ఆయన అన్నారు. తాను చాయ్ త్రాగుతున్నప్పుడు పాకెట్ లోని ఫోన్ సడెన్ గా పేలిందని ఇల్యాస్ అన్నారు.

గత వారం కూడా కేరళలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటన

కేరళ రాష్ట్రంలోని కోళీకోడ్ లో ఒక యువకుడి పాకెట్ లోని ఫోన్ సడెన్ గా పేలింది. సదరు యువకుడు తన ఫోన్ డిస్ప్లే ని ఐదారు నెలల క్రితం రిపెయిర్ చేయించినట్లు తెలిసింది. అంతకు ముందు కూడా కేరళలో ఫోన్ పేలి 8 ఏళ్ళ బాలిక మరణించింది. అప్పుడో ఇప్పుడో దేశం నలువైపులా ఈ తరహా ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

ఫోన్లు ఎందుకు నిప్పంటుకుంటున్నాయి?

1. ఒరిజినల్ బ్యాటరీ కాకుండా వేరేది వాడటం
2. కంపెనీ సేవా కేంద్రంలో కాకుండా బయట రిపేరు చేయించడం
3. సూచించిన చార్జర్ కాకుండా వేరేది వాడటం
4. చార్జింగ్ పెట్టినప్పుడు ఫోన్ వినియోగించడం
5. ఫోన్ లో ఏదైనా తయారీ లోపం ఉండటం

పైన పేర్కొన్న ఐదు కారణాల వల్లన ఫోన్లు మంటల్లో చిక్కుకునేందుకు లేదా పేలేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఫోన్లను జాగ్రత్తగా వాడండి. నచ్చిన విధంగా ఫోన్లను వాడకుండా, కంపెనీ భద్రతా సూచనల ప్రకారం ఫోన్ ని వినియోగించండి.

వీడియో: ఇక్కడ క్లిక్ చేయండి.

The post 70ఏళ్ళ వృద్ధుడి జేబులో పేలిన మొబైల్ ఫోన్, కేరళలో ఘటన; వీడియో చూడండి! first appeared on 91Mobiles Telugu.

]]>