POCO C51 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 17 Jul 2023 09:16:09 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 రూ.6,000 లోపు ధరతో భారత్‌లో లాంచైన POCO C51 ఎయిర్టెల్-ఎక్స్‌క్లూజివ్ మోడల్ https://www.91mobiles.com/telugu/poco-c51-airtel-exclusive-variant-launched-india-price-benefits/ Mon, 17 Jul 2023 09:16:09 +0000 https://www.91mobiles.com/telugu/?p=7204 చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ POCO మార్కెట్ లోకి POCO C51 ఎయిర్టెల్-ఎక్స్‌క్లూజివ్ వేరియంట్ ని లాంచ్ చేసింది. దీని ద్వారా ఎయిర్టెల్ ఎక్స్‌క్లూజివ్ బెనిఫిట్స్ యూజర్ కి లభిస్తాయి. ఇందులో 50జిబి డేటా వంటి ప్రయోజనాలు ఉన్నాయి. ఇకపోతే POCO C51 ఒక ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్. ఇందులో 120 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, మీడియాటెక్ హీలియో జీ36 చిప్సెట్, ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి. POCO C51 ఎయిర్టెల్ ఎక్స్‌క్లూజివ్ వేరియంట్: ధర, […]

The post రూ.6,000 లోపు ధరతో భారత్‌లో లాంచైన POCO C51 ఎయిర్టెల్-ఎక్స్‌క్లూజివ్ మోడల్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • లాంచైన POCO C51 ఎయిర్టెల్ ఎక్స్‌క్లూజివ్ వేరియంట్
  • ఏప్రిల్ లో రూ.8,499 ధరతో లాంచైన డివైజ్
  • ఎయిర్టెల్ వేరియంట్ ధర రూ.5,999

చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ POCO మార్కెట్ లోకి POCO C51 ఎయిర్టెల్-ఎక్స్‌క్లూజివ్ వేరియంట్ ని లాంచ్ చేసింది. దీని ద్వారా ఎయిర్టెల్ ఎక్స్‌క్లూజివ్ బెనిఫిట్స్ యూజర్ కి లభిస్తాయి. ఇందులో 50జిబి డేటా వంటి ప్రయోజనాలు ఉన్నాయి. ఇకపోతే POCO C51 ఒక ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్. ఇందులో 120 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, మీడియాటెక్ హీలియో జీ36 చిప్సెట్, ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

POCO C51 ఎయిర్టెల్ ఎక్స్‌క్లూజివ్ వేరియంట్: ధర, ఆఫర్లు

  • POCO C51 ఎయిర్టెల్ వేరియంట్ ని కస్టమర్లు రూ.5,999 కే సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ మరియు ఎయిర్టెల్ ఇండియా వెబ్‌సైట్స్ ద్వారా జులై 18 నుంచి POCO C51 ని కొనుగోలు చేయవచ్చు.
  • బెనిఫిట్స్ లో భాగంగా 7.5 శాతం (రూ.750 వరకు) డిస్కౌంట్, 50జిబి కాంప్లిమెంటరీ డేటా యూజర్ కి లభిస్తాయి.
  • యూజర్లకు ఐదు కూపన్స్ లభిస్తాయి. ప్రతీ కూపన్ ద్వారా 10జిబి ఉచిత డేటా లభిస్తుంది. యూజర్లు నెలకు ఒక కూపన్ ని మాత్రమే ఉపయోగించుకోగలరు.
  • POCO C51 ఎయిర్టెల్-లాక్డ్ వేరియంట్ ఫోన్ ని 18 నెలల పాటు కేవలం ఎయిర్టెల్ సిమ్ కార్డ్ పై మాత్రమే వాడుకోవాల్సి ఉంటుంది. ఆ సమయం తర్వాత వేరే సిమ్ కార్డ్ ని మార్చుకునే వీలుంటుంది.
  • డివైజ్ ని అన్‌లాక్ చేసుకునేందుకు యూజర్లు ఎయిర్టెల్ సిమ్ కార్డ్ ని 24 గంటల లోపు ఫోన్ లో వేయాల్సి ఉంటుంది. అంతేకాదు, అదనంగా యూజర్లు తమ సిమ్ పై ఎయిర్టెల్ ట్రూలీ అన్‌లిమిటెడ్ రూ.199 రీచార్జ్ ని కలిగి ఉండాలి.
  • ఎయిర్టెల్ సిమ్ కాకుండా వేరే సిమ్ వాడాలని చూసే వారు, మొదటగా ఎయిర్టెల్ సిమ్ ని ఫోన్ ప్రైమరీ స్లాట్ లో వేసాక, మరొక కంపెనీ సిమ్ ని సెకండరీ స్లాట్ లో వేసి వాడుకోవచ్చు.
  • తొలుత రూ.8,499 ధరతో POCO C51 స్మార్ట్ ఫోన్ భారత్ లో లాంచ్ అయ్యింది. అయితే ఇంట్రడక్టరీ ఆఫర్ లో భాగంగా ఫ్లిప్ కార్ట్ పై రూ.7,799 ధరకే అప్పుడు లభించింది.

POCO C51 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: POCO C51 లో 6.52-ఇంచ్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉన్నాయి.
  • రియర్ కెమెరా: POCO C51 డివైజ్ లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 8ఎంపి ప్రైమరీ కెమెరా, ఒక ఏఐ లెన్స్ అందించారు.
  • సెల్ఫీ కెమెరా: POCO C51 లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు.
  • ప్రాసెసర్: POCO C51 స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ36 ఆక్టా-కోర్ చిప్సెట్ వాడారు.
  • స్టోరేజీ: POCO C51 లో 4జిబి ర్యామ్ (3జిబి వర్చువల్ ర్యామ్), 64జిబి స్టోరేజీ అందించారు.
  • ఓఎస్: POCO C51 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 గో ఎడిషన్ ఓఎస్ పై పని చేస్తుంది.
  • బ్యాటరీ: POCO C51 స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: POCO C51 స్మార్ట్ ఫోన్ లో ఫింగర్ ప్రింట్ స్కానర్, 3.5 మి.మీ హెడ్‌ఫోన్ జాక్, బ్లూటూత్ 5.0, వై-ఫై తదితర ఫీచర్లు ఉన్నాయి.
  • కలర్స్: POCO C51 డివైజ్ పవర్ బ్లాక్ మరియు రాయల్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

The post రూ.6,000 లోపు ధరతో భారత్‌లో లాంచైన POCO C51 ఎయిర్టెల్-ఎక్స్‌క్లూజివ్ మోడల్ first appeared on 91Mobiles Telugu.

]]>
5000 ఎంఏహెచ్ బ్యాటరీ, టర్బో ర్యామ్ ఫీచర్ తో భారత్‌లో లాంచైన POCO C51 https://www.91mobiles.com/telugu/poco-c51-launched-india-price-specs-availability/ Fri, 07 Apr 2023 08:18:07 +0000 https://www.91mobiles.com/telugu/?p=5797 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ పోకో నేడు భారతీయ మార్కెట్ లో POCO C51 ఫోన్ ని లాంచ్ చేసింది. ఇది సీ-సిరీస్ లో కంపెనీ నుంచి వచ్చిన కొత్త డివైజ్. ఫీచర్ల గురించి మాట్లాడితే, ఈ ఫోన్ లో ఆండ్రాయిడ్ 13 ఓఎస్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 7జిబి ర్యామ్ (4జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్ + 3జిబి వర్చువల్ ర్యామ్) వంటివి ఉన్నాయి. భారత్ లో ఈ డివైజ్ ఫ్లిప్ కార్ట్ ద్వారా అమ్ముడవుతుంది. సరే, […]

The post 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, టర్బో ర్యామ్ ఫీచర్ తో భారత్‌లో లాంచైన POCO C51 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • 6.52-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే తో భారత్ లో లాంచైన POCO C51
  • 10 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చిన డివైజ్
  • బ్లూ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభించనున్న హ్యాండ్సెట్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ పోకో నేడు భారతీయ మార్కెట్ లో POCO C51 ఫోన్ ని లాంచ్ చేసింది. ఇది సీ-సిరీస్ లో కంపెనీ నుంచి వచ్చిన కొత్త డివైజ్. ఫీచర్ల గురించి మాట్లాడితే, ఈ ఫోన్ లో ఆండ్రాయిడ్ 13 ఓఎస్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 7జిబి ర్యామ్ (4జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్ + 3జిబి వర్చువల్ ర్యామ్) వంటివి ఉన్నాయి. భారత్ లో ఈ డివైజ్ ఫ్లిప్ కార్ట్ ద్వారా అమ్ముడవుతుంది. సరే, ఓసారి POCO C51 వివరాలు తెలుసుకుందాం పదండి.

భారత్ లో POCO C51 ధర, సేల్ తేదీ

  • 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ = రూ.8,499

POCO C51 స్మార్ట్ ఫోన్ 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ సింగిల్ వేరియంట్ లో లాంచైంది. ఈ ఫోన్ ధర రూ.10,000 లోపు ఉంది. స్పెషల్ ఫస్ట్ డే సేల్ లో భాగంగా, ఈ ఫోన్ ని రూ.7,799 కి కొనుగోలు చేయవచ్చు. POCO C51 అసలు ధర రూ.8,499.

POCO C51 స్పెసిఫికేషన్స్

డిజైన్ మరియు డిస్ప్లే

  • 6.52-ఇంచ్ హెచ్డీ+ పంచ్-హోల్ డిస్ప్లే
  • 120 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్
  • 720*1600 పిక్సెల్ రెజుల్యూషన్

POCO C51 స్మార్ట్ ఫోన్ రాయల్ బ్లూ మరియు పవర్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. బ్యాక్ ప్యానెల్ లెదర్ ఫినిషింగ్ మాదిరి కనిపిస్తోంది. ఇది రియర్ ప్యానెల్ పై స్క్రాచెస్ పడకుండా చూస్తుంది. POCO C51 లో 6.52-ఇంచ్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 269 పీపీఐ, 1600*720 పిక్సెల్ రెజుల్యూషన్, 20:9 యాస్పెక్ట్ రేషియో, 120 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉన్నాయి.

హార్డ్‌వేర్ మరియు సాఫ్ట్‌వేర్

  • మీడియాటెక్ హీలియో జీ36 చిప్
  • ఆండ్రాయిడ్ 13 గో ఓఎస్
  • 3జిబి వర్చువల్ ర్యామ్

POCO C51 లో మీడియాటెక్ హీలియో జీ36 చిప్ వాడారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ గో 13 ఎడిషన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీని కలిగి ఉంది. టర్బో ర్యామ్ ఫీచర్ ద్వారా 7జిబి వరకు ర్యామ్ యూజర్ కి లభిస్తుంది.

కెమెరా విభాగం

  • 8 మెగాపిక్సెల్ రియర్ కెమెరా
  • 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా

POCO C51 లో సింగిల్ రియర్ కెమెరా ఉంటుంది. రియర్ ప్యానెల్ పై 8ఎంపి మెయిన్ కెమెరా అందించారు. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 5ఎంపి కెమెరా ఉంటుంది.

బ్యాటరీ, చార్జింగ్ మరియు కనెక్టివిటీ ఆప్షన్స్

  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • మైక్రో-యూఎస్బీ పోర్ట్

POCO C51 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం మైక్రో-యూఎస్బీ పోర్ట్ ఇచ్చారు. వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, మైక్రో-యూఎస్బీ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. యాక్సలరో మీటర్, ఫింగర్ ప్రింట్ స్కానర్ ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, టర్బో ర్యామ్ ఫీచర్ తో భారత్‌లో లాంచైన POCO C51 first appeared on 91Mobiles Telugu.

]]>
ఏప్రిల్ 7 న భారత్ లో లాంచ్ కానున్న POCO C51, ధర రూ.8 వేల లోపు ఉండే అవకాశం! https://www.91mobiles.com/telugu/poco-c51-india-launch-date-april-7th/ Tue, 04 Apr 2023 12:56:43 +0000 https://www.91mobiles.com/telugu/?p=5742 POCO C51 స్మార్ట్ ఫోన్ భారత్ లో ఏప్రిల్ 7 న లాంచ్ అవుతోంది. ఈ సిరీస్ లో మొదటగా POCO C50 డివైజ్ ని 2023 జనవరిలో కంపెనీ లాంచ్ చేసింది. తర్వాత 2023 ఫిబ్రవరిలో POCO C55 డివైజ్ లాంచ్ అయ్యింది. ఇప్పుడు POCO C51 ఇండియా లాంచ్, లుక్ మరియు డిజైన్, ఎన్నో ముఖ్యమైన ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఏప్రిల్ 7 న ఈ డివైజ్ ధర అనౌన్స్ అవుతుంది. భారత్ […]

The post ఏప్రిల్ 7 న భారత్ లో లాంచ్ కానున్న POCO C51, ధర రూ.8 వేల లోపు ఉండే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చవకైన స్మార్ట్ ఫోన్ గా రానున్న POCO C51
  • ఫోన్ ధర రూ.8 వేల లోపు ఉండే అవకాశం
  • 3జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ తో రానున్న డివైజ్

POCO C51 స్మార్ట్ ఫోన్ భారత్ లో ఏప్రిల్ 7 న లాంచ్ అవుతోంది. ఈ సిరీస్ లో మొదటగా POCO C50 డివైజ్ ని 2023 జనవరిలో కంపెనీ లాంచ్ చేసింది. తర్వాత 2023 ఫిబ్రవరిలో POCO C55 డివైజ్ లాంచ్ అయ్యింది. ఇప్పుడు POCO C51 ఇండియా లాంచ్, లుక్ మరియు డిజైన్, ఎన్నో ముఖ్యమైన ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఏప్రిల్ 7 న ఈ డివైజ్ ధర అనౌన్స్ అవుతుంది.

భారత్ లో POCO C51 ధర

POCO C51 స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన వివరాలను కంపెనీ వెల్లడించలేదు. అయితే ఏప్రిల్ 7 న ఈ డివైజ్ లాంచ్ కానుంది. అదే రోజున ధర రివీల్ అవుతుంది. POCO C51 లో-బడ్జెట్ ఫోన్ అయినందున దీని ధర సుమారు రూ.8 వేల వద్ద ఉండనుందని అంచనా వేయవచ్చు. రెండు మెమొరీ వేరియంట్స్ లో ఈ పోకో ఫోన్ అందుబాటులో ఉంటుంది.

POCO C51 ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

  • 6.52-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే
  • మీడియాటెక్ హీలియో జీ36 చిప్
  • 7జిబి టర్బో ర్యామ్
  • ఆండ్రాయిడ్ 13 గో ఎడిషన్
  • 8ఎంపి రియర్ కెమెరా
  • 5ఎంపి సెల్ఫీ కెమెరా
  • 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ

POCO C51 డివైజ్ కి సంబంధించిన సమాచారం బయటకు వచ్చింది. ఈ ఫోన్ లో 6.52-ఇంచ్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 1600*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్ ఉన్నాయి. వాటర్ డ్రాప్ నాచ్ లో ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

POCO C51 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 గో ఎడిషన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ36 చిప్సెట్ వాడారు. ఇది 12 నానో మీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. ఈ ప్రాసెసర్ 2.2 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 3జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ టెక్నాలజీతో వస్తోంది. దీంతో ఈ ఫోన్ 4జిబి ఇంటర్నల్ ర్యామ్ ని 7జిబి వరకు పెంచుకోవచ్చు.

POCO C51 కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ డివైజ్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 8ఎంపి ప్రైమరీ కెమెరా, సెకండరీ ఏఐ లెన్స్ ఉంటుంది. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం POCO C51 లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

POCO C51 స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్ భద్రత కోసం బ్యాక్ ప్యానెల్ పై ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. డ్యూయల్ సిమ్ సపోర్ట్, 3.5ఎంఎం ఆడియో జాక్, మైక్రో యూఎస్బీ పోర్ట్, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉంటాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post ఏప్రిల్ 7 న భారత్ లో లాంచ్ కానున్న POCO C51, ధర రూ.8 వేల లోపు ఉండే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>