
చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ POCO మార్కెట్ లోకి POCO C51 ఎయిర్టెల్-ఎక్స్‌క్లూజివ్ వేరియంట్ ని లాంచ్ చేసింది. దీని ద్వారా ఎయిర్టెల్ ఎక్స్‌క్లూజివ్ బెనిఫిట్స్ యూజర్ కి లభిస్తాయి. ఇందులో 50జిబి డేటా వంటి ప్రయోజనాలు ఉన్నాయి. ఇకపోతే POCO C51 ఒక ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్. ఇందులో 120 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, మీడియాటెక్ హీలియో జీ36 చిప్సెట్, ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.
POCO C51 ఎయిర్టెల్ ఎక్స్‌క్లూజివ్ వేరియంట్: ధర, ఆఫర్లు
- POCO C51 ఎయిర్టెల్ వేరియంట్ ని కస్టమర్లు రూ.5,999 కే సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ మరియు ఎయిర్టెల్ ఇండియా వెబ్‌సైట్స్ ద్వారా జులై 18 నుంచి POCO C51 ని కొనుగోలు చేయవచ్చు.
- బెనిఫిట్స్ లో భాగంగా 7.5 శాతం (రూ.750 వరకు) డిస్కౌంట్, 50జిబి కాంప్లిమెంటరీ డేటా యూజర్ కి లభిస్తాయి.
- యూజర్లకు ఐదు కూపన్స్ లభిస్తాయి. ప్రతీ కూపన్ ద్వారా 10జిబి ఉచిత డేటా లభిస్తుంది. యూజర్లు నెలకు ఒక కూపన్ ని మాత్రమే ఉపయోగించుకోగలరు.
- POCO C51 ఎయిర్టెల్-లాక్డ్ వేరియంట్ ఫోన్ ని 18 నెలల పాటు కేవలం ఎయిర్టెల్ సిమ్ కార్డ్ పై మాత్రమే వాడుకోవాల్సి ఉంటుంది. ఆ సమయం తర్వాత వేరే సిమ్ కార్డ్ ని మార్చుకునే వీలుంటుంది.
- డివైజ్ ని అన్‌లాక్ చేసుకునేందుకు యూజర్లు ఎయిర్టెల్ సిమ్ కార్డ్ ని 24 గంటల లోపు ఫోన్ లో వేయాల్సి ఉంటుంది. అంతేకాదు, అదనంగా యూజర్లు తమ సిమ్ పై ఎయిర్టెల్ ట్రూలీ అన్‌లిమిటెడ్ రూ.199 రీచార్జ్ ని కలిగి ఉండాలి.
- ఎయిర్టెల్ సిమ్ కాకుండా వేరే సిమ్ వాడాలని చూసే వారు, మొదటగా ఎయిర్టెల్ సిమ్ ని ఫోన్ ప్రైమరీ స్లాట్ లో వేసాక, మరొక కంపెనీ సిమ్ ని సెకండరీ స్లాట్ లో వేసి వాడుకోవచ్చు.
- తొలుత రూ.8,499 ధరతో POCO C51 స్మార్ట్ ఫోన్ భారత్ లో లాంచ్ అయ్యింది. అయితే ఇంట్రడక్టరీ ఆఫర్ లో భాగంగా ఫ్లిప్ కార్ట్ పై రూ.7,799 ధరకే అప్పుడు లభించింది.
POCO C51 స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: POCO C51 లో 6.52-ఇంచ్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉన్నాయి.
- రియర్ కెమెరా: POCO C51 డివైజ్ లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 8ఎంపి ప్రైమరీ కెమెరా, ఒక ఏఐ లెన్స్ అందించారు.
- సెల్ఫీ కెమెరా: POCO C51 లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు.
- ప్రాసెసర్: POCO C51 స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ36 ఆక్టా-కోర్ చిప్సెట్ వాడారు.
- స్టోరేజీ: POCO C51 లో 4జిబి ర్యామ్ (3జిబి వర్చువల్ ర్యామ్), 64జిబి స్టోరేజీ అందించారు.
- ఓఎస్: POCO C51 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 గో ఎడిషన్ ఓఎస్ పై పని చేస్తుంది.
- బ్యాటరీ: POCO C51 స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఇతర ఫీచర్లు: POCO C51 స్మార్ట్ ఫోన్ లో ఫింగర్ ప్రింట్ స్కానర్, 3.5 మి.మీ హెడ్‌ఫోన్ జాక్, బ్లూటూత్ 5.0, వై-ఫై తదితర ఫీచర్లు ఉన్నాయి.
- కలర్స్: POCO C51 డివైజ్ పవర్ బ్లాక్ మరియు రాయల్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.











