POCO X5 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 14 Mar 2023 12:08:55 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 ఏడు 5జీ బ్యాండ్స్ సపోర్ట్‌తో భారత్‌లో లాంచైన POCO X5 5G https://www.91mobiles.com/telugu/poco-x5-5g-launched-india-price-specs-availability/ Tue, 14 Mar 2023 12:08:55 +0000 https://www.91mobiles.com/telugu/?p=5499 ఇటీవలె పోకో సంస్థ భారత్ లో POCO X5 Pro 5G ఫోన్ ని లాంచ్ చేసింది. తాజాగా ఈ కంపెనీ భారతీయ మార్కెట్ లో POCO X5 5G డివైజ్ ని విడుదల చేసింది. నేడు POCO X5 5G డివైజ్ 7 5జీ బ్యాండ్స్ సపోర్ట్ తో భారత్ లోకి ఎంట్రీ ఇచ్చింది. రిలయన్స్ జియో మరియు ఎయిర్టెల్ టెలీకామ్ ఆపరేటర్లకు చెందిన 5జీ సేవలను ఈ ఫోన్ ద్వారా పొందవచ్చు. సరే, ఓసారి […]

The post ఏడు 5జీ బ్యాండ్స్ సపోర్ట్‌తో భారత్‌లో లాంచైన POCO X5 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో నేడు లాంచైన POCO X5 5G స్మార్ట్ ఫోన్
  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్, 120 హెర్ట్జ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లేతో వచ్చిన డివైజ్
  • భారత్ లో POCO X5 5G ప్రారంభ ధర రూ.18,999

ఇటీవలె పోకో సంస్థ భారత్ లో POCO X5 Pro 5G ఫోన్ ని లాంచ్ చేసింది. తాజాగా ఈ కంపెనీ భారతీయ మార్కెట్ లో POCO X5 5G డివైజ్ ని విడుదల చేసింది. నేడు POCO X5 5G డివైజ్ 7 5జీ బ్యాండ్స్ సపోర్ట్ తో భారత్ లోకి ఎంట్రీ ఇచ్చింది. రిలయన్స్ జియో మరియు ఎయిర్టెల్ టెలీకామ్ ఆపరేటర్లకు చెందిన 5జీ సేవలను ఈ ఫోన్ ద్వారా పొందవచ్చు. సరే, ఓసారి POCO X5 5G యొక్క భారత మార్కెట్ ధర, ఫీచర్స్ మరియు స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

POCO X5 5G ధర

POCO X5 5G స్మార్ట్ ఫోన్ రెండు మెమొరీ వేరియంట్స్ లో లాంచైంది. బేస్ వేరియంట్ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ తో లభిస్తుంది. టాప్ వేరియంట్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీతో లభిస్తుంది. ఈ ఫోన్ లో 5జిబి వర్చువల్ ర్యామ్ టెక్నాలజీ కూడా ఉంది. దీంతో గరిష్టంగా 13జిబి వరకు ర్యామ్ ని వినియోగించుకోవచ్చు. అలాగే మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని 1టిబి వరకు పెంచుకునే వీలుంది.

POCO X5 5G డివైజ్ 6జిబి వేరియంట్ ధరను రూ.18,999 గా నిర్ణయించారు. 8జిబి ర్యామ్ యూనిట్ ధర రూ.20,999 గా ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్ యూజర్లు ఈ ఫోన్ కొనుగోలుపై రూ.2,000 డిస్కౌంట్ పొందవచ్చు. మార్చి 21 నుంచి ఫ్లిప్ కార్ట్ ద్వారా POCO X5 5G సేల్స్ మొదలవుతాయి. జాగ్వార్ బ్లాక్, వైల్డ్‌క్యాట్ బ్లూ, సూపర్‌నోవా గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.

POCO X5 5G స్పెసిఫికేషన్స్

  • 6.67-ఇంచ్ 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే
  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్
  • 5జిబి వర్చువల్ ర్యామ్
  • 48ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్
  • 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ

POCO X5 5G స్మార్ట్ ఫోన్ లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ డిస్ప్లే వాడారు. ఇది 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది. స్క్రీన్ ప్రొటెక్షన్ కోసం గొరిల్లా గ్లాస్ 3 ని అందించారు. 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1200 నిట్స్ బ్రైట్నెస్, 45,00,000:1 కాంట్రాస్ట్ రేషియో వంటి ఫీచర్లు ఈ డిస్ప్లేలో ఉన్నాయి.

POCO X5 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 ప్రాసెసర్ ని ఈ ఫోన్ లో వాడారు. ఈ చిప్ 6 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. POCO X5 5G ఫోన్ 7 5జీ బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది.

POCO X5 5G స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48ఎంపి ప్రైమరీ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

POCO X5 5G స్మార్ట్ ఫోన్ డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, 3.5ఎంఎం ఆడియో జాక్, ఎన్ఎఫ్‌సీ, ఐఆర్ బ్లాస్టర్ వంటి కనెక్టివిటీ ఫీచర్లను కలిగి ఉంది. పవర్ బ్యాకప్ కోసం ఈ ఫోన్ లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ఐపీ53 వాటర్ అండ్ డస్ట్ రేటింగ్ తో వచ్చింది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post ఏడు 5జీ బ్యాండ్స్ సపోర్ట్‌తో భారత్‌లో లాంచైన POCO X5 5G first appeared on 91Mobiles Telugu.

]]>
త్వరలో లాంచ్ కానున్న POCO X5 సిరీస్; టీజ్ చేసిన పోకో ఇండియా హెడ్ https://www.91mobiles.com/telugu/poco-x5-5g-series-teased-india-launch-imminent/ Tue, 20 Dec 2022 14:20:02 +0000 https://www.91mobiles.com/telugu/?p=4097 హైలైట్స్ POCO X5 సిరీస్ ని సోషల్ మీడియాలో టీజ్ చేసిన పోకో ఇండియా హెడ్ హిమాన్శు టాండన్ జనవరి లేదా ఫిబ్రవరి నెలల్లో POCO X5 ని లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్న పోకో సంస్థ 4,900mAh బ్యాటరీ, 67W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానున్న POCO X5 5G 2022 సంవత్సరం ముగింపు ముగింట్లోకి వచ్చేసింది. అయితే 2022 కి గుడ్ బై చెబుతూ, 2023 లాంచ్ సీజన్ కూడా మొదలయ్యేందుకు ఇంకా […]

The post త్వరలో లాంచ్ కానున్న POCO X5 సిరీస్; టీజ్ చేసిన పోకో ఇండియా హెడ్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • POCO X5 సిరీస్ ని సోషల్ మీడియాలో టీజ్ చేసిన పోకో ఇండియా హెడ్ హిమాన్శు టాండన్
  • జనవరి లేదా ఫిబ్రవరి నెలల్లో POCO X5 ని లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్న పోకో సంస్థ
  • 4,900mAh బ్యాటరీ, 67W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానున్న POCO X5 5G

2022 సంవత్సరం ముగింపు ముగింట్లోకి వచ్చేసింది. అయితే 2022 కి గుడ్ బై చెబుతూ, 2023 లాంచ్ సీజన్ కూడా మొదలయ్యేందుకు ఇంకా కొన్ని రోజుల సమయమే మిగిలి ఉంది. దీంతో అప్పుడే ఎన్నో స్మార్ట్ ఫోన్ కంపెనీలు తమ తమ కొత్త ఫోన్లను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతున్నాయి.

తాజాగా స్మార్ట్ ఫోన్ లాంచెస్ కి సంబంధించిన అప్డేట్ ని ప్రముఖ టిప్‌స్టర్ యోగేశ్ బ్రార్ షేర్ చేశాడు. అయితే అతడు పోకో ఫోన్ ని మిస్ అయ్యాడు. దీంతో అతడి ట్వీట్ ని ట్యాగ్ చేస్తూ POCO ఇండియా హెడ్ హిమాన్శు ‘మరి POCO X5 సిరీస్?’ అంటూ ట్వీట్ చేశాడు.

దీంతో హిమాన్శు టాండన్ POCO X5 5G కి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ ఇచ్చినట్లైంది. ఈ ఫోన్ జనవరి లేదా ఫిబ్రవరి నెలల్లో ఈ ఫోన్ లాంచ్ కానుందని అంచనా వేస్తున్నారు. ఇక ఇటీవలె POCO X5 5G బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ మరియు ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ వెబ్ సైట్స్ ని విజిట్ చేసింది. సదరు వెబ్ సైట్స్ పై POCO X5 5G ఫోన్ 22101320I అనే మోడల్ నంబర్ తో కనిపించింది. ఇది జరిగిన రెండు వారాల తర్వాత చైనా యొక్క 3సీ మరియు ఐఎండీఏ సర్టిఫికేషన్ వెబ్ సైట్స్ పై 22101320C అనే మోడల్ నంబర్ తో కనిపించింది.

POCO X5 5G గురించి మాకు తెలిసిన వివరాలివే (లీక్డ్)

POCO X5 5G స్మార్ట్ ఫోన్ 4900 ఎంఏహెచ్ బ్యాటరీతో రానుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ని కలిగి ఉంటుందని సర్టిఫికేషన్స్ లిస్టింగ్స్ ద్వారా తెలుస్తోంది. POCO X5 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది. అయితే POCO X5 5G యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ ఇంకా మిస్టరీగానే ఉన్నాయి. త్వరలోనే ఈ వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే 2023 జనవరి మొదటి త్రైమాసికంలో POCO X5 5G లాంచ్ అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

అయితే POCO X5 5G యొక్క మోడల్ నంబర్ ని చూస్తే Redmi Note 12 5G మాదిరి కనిపిస్తోంది. కాబట్టి, POCO X5 5G డివైజ్ రెడ్మీ నోట్ 12 5జీ ఆధారంగా చేసుకుని వస్తుందని మనం అంచనా వేయవచ్చు. అయితే కొన్ని మార్పులు చేర్పులతో POCO X5 5G వచ్చే అవకాశం ఉంది.

POCO X5 5G డివైజ్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 చిప్సెట్ తో, POCO X5 Pro క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 778జి+ ప్రాసెసర్ తో వచ్చే అవకాశం ఉంది. ఇవి కేవలం అంచనాలు మాత్రమే. రానున్న రోజుల్లో స్పెసిఫికేషన్స్ పై మరింత క్లారిటీ వస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post త్వరలో లాంచ్ కానున్న POCO X5 సిరీస్; టీజ్ చేసిన పోకో ఇండియా హెడ్ first appeared on 91Mobiles Telugu.

]]>
BIS సర్టిఫికేషన్ పొందిన POCO X5 5G https://www.91mobiles.com/telugu/poco-x5-5g-bis-certification-india-launch-imminent/ Mon, 14 Nov 2022 14:37:47 +0000 https://www.91mobiles.com/telugu/?p=3427 హైలైట్స్ త్వరలో భారత్ లో లాంచ్ కానున్న POCO X5 5G BIS, FCC వెబ్ సైట్స్ పై కనిపించిన POCO X5 5G స్మార్ట్ ఫోన్ రెక్టాంగ్యులర్ డిజైన్ తో వస్తోన్న POCO X5 5G POCO X5 5G స్మార్ట్ ఫోన్ త్వరలో భారత్ లో లాంచ్ అవుతోంది. తాజాగా ఈ డివైజ్ BIS లిస్టింగ్ పై కనిపించడంతో ఈ విషయం స్పష్టమైంది. ప్రపంచ వ్యాప్తంగా సరసమైన ధరలకు ఫోన్లకు అందిస్తోన్న చైనీస్ స్మార్ట్ […]

The post BIS సర్టిఫికేషన్ పొందిన POCO X5 5G first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • త్వరలో భారత్ లో లాంచ్ కానున్న POCO X5 5G
  • BIS, FCC వెబ్ సైట్స్ పై కనిపించిన POCO X5 5G స్మార్ట్ ఫోన్
  • రెక్టాంగ్యులర్ డిజైన్ తో వస్తోన్న POCO X5 5G

POCO X5 5G స్మార్ట్ ఫోన్ త్వరలో భారత్ లో లాంచ్ అవుతోంది. తాజాగా ఈ డివైజ్ BIS లిస్టింగ్ పై కనిపించడంతో ఈ విషయం స్పష్టమైంది. ప్రపంచ వ్యాప్తంగా సరసమైన ధరలకు ఫోన్లకు అందిస్తోన్న చైనీస్ స్మార్ట్ ఫోన్ తయారీదారు అయిన POCO త్వరలో భారత్ లో POCO X5 5G ని లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. తాజాగా ఈ ఫోన్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ ని పొందింది. ఈ డిైవజ్ ఫెడరల్ కమ్యూనికేషన్స్ వెబ్ సైట్ పై కూడా కనిపించింది. అంటే ఈ ఫోన్ యూఎస్ఏ లో కూడా లాంచ్ కానున్నట్లు స్పష్టమైంది.

భారత్ లో POCO X5 5G లాంచ్ తేదీ

POCO X5 5G స్మార్ట్ ఫోన్ భారత్ లో ఎప్పుడు లాంచ్ అవుతుందో ఇంకా తెలియలేదు. అయితే, ఈ ఏడాది లోనే ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. తాము ఈసారి ఉత్తమమైన దానితో వస్తున్నట్లు పోకో బ్రాండ్ ఇండియా హెడ్ హిమాన్శు టాండన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

POCO X5 5G స్మార్ట్ ఫోన్ 22101320I అనే మోడల్ నంబర్ తో బీఐఎస్ మరియు ఐఎంఈఐ డేటాబేస్ లపై కనిపించింది. చైనాలో ఈ ఫోన్ రెడ్మీ డివైజ్ గా లాంచ్ కానుంది. చైనా వేరియంట్ 22101320C అనే మోడల్ నంబర్ ని కలిగి ఉంది.

ఈలోపు ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ POCO X5 5G స్మార్ట్ ఫోన్ యొక్క BIS, FCC లిస్టింగ్ సమాచారాన్ని ట్వీట్ చేశాడు.

POCO X5 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

FCC లిస్టింగ్ ప్రకారం, POCO X5 5G స్మార్ట్ ఫోన్ రెక్టాంగ్యులర్ కెమెరా మాడ్యూల్ డిజైన్ తో వస్తోంది. ఇందులో 4900 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. అయితే కంపెనీ దీన్ని 5000 ఎంఏహెచ్ బ్యాటరీగా ప్రమోట్ చేసే అవకాశం ఉంది. ఇంకా ఈ ఫోన్ డ్యూయల్-బ్యాండ్ వై-ఫై సపోర్ట్ తో వస్తోంది. అలాగే n5, n7, n38, n41, n77, n78 5జీ బ్యాండ్స్ కి ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. POCO X5 5G ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

ఇక గతంలో లీకైన సమాచారాన్ని బట్టి, POCO X5 5G స్మార్ట్ ఫోన్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, క్వాల్కమ్ స్నాప్ గ్రాగన్ 778జి+ ప్రాసెసర్ తో రానున్నట్లు తెలుస్తోంది. త్వరలో మరింత కచ్చితమైన సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post BIS సర్టిఫికేషన్ పొందిన POCO X5 5G first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్ కి ముందు లీకైన POCO X5 5G స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/poco-x5-5g-specs-tipped-before-launch/ Tue, 04 Oct 2022 12:03:51 +0000 https://www.91mobiles.com/telugu/?p=2736 హైలైట్స్: IMEI లిస్టింగ్ పై కనిపించిన POCO X5 5G స్పెసిఫికేషన్స్ 22101320I అనే మోడల్ నంబర్ ని కలిగి ఉన్న హ్యాండ్సెట్ 120హెర్ట్జ్ డిస్ప్లే, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, స్నాప్ డ్రాగన్ 778జి+ చిప్సెట్ తో రానున్న POCO X5 5G స్మార్ట్ ఫోన్ POCO కంపెనీ నుంచి ఈ ఏడాది మొదట్లో POCO X4 Pro 5G అనే స్మార్ట్ ఫోన్ లాంచ్ అయ్యింది. త్వరలోనే పోకో X5 సిరీస్ ని లాంచ్ చేయనుందని […]

The post లాంచ్ కి ముందు లీకైన POCO X5 5G స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • IMEI లిస్టింగ్ పై కనిపించిన POCO X5 5G స్పెసిఫికేషన్స్
  • 22101320I అనే మోడల్ నంబర్ ని కలిగి ఉన్న హ్యాండ్సెట్
  • 120హెర్ట్జ్ డిస్ప్లే, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, స్నాప్ డ్రాగన్ 778జి+ చిప్సెట్ తో రానున్న POCO X5 5G స్మార్ట్ ఫోన్

POCO కంపెనీ నుంచి ఈ ఏడాది మొదట్లో POCO X4 Pro 5G అనే స్మార్ట్ ఫోన్ లాంచ్ అయ్యింది. త్వరలోనే పోకో X5 సిరీస్ ని లాంచ్ చేయనుందని సమాచారం. ఈ సిరీస్ లో పోకో కనీసం రెండు స్మార్ట్ ఫోన్స్ ని లాంచ్ చేయనుందని సమాచారం. అవి: POCO X5, X5 Pro 5G. లాంచ్ టైమ్ లైన్ కి సంబంధించి కంపెనీ నుంచి ఎటువంటి సమాచారం రాలేదు. ఈలోపు స్టాండర్డ్ వేరియంట్ అయిన POCO X5 5G, IMEI డేటాబేస్ పై కనిపించింది.

ఐఎంఈఐ లిస్టింగ్ ద్వారా POCO X5 5G డివైజ్ యొక్క మోడల్ నంబర్ రివీల్ అయ్యింది. దీనికి తోడు XiaomiUI రిపోర్ట్ POCO X5 5G యొక్క ముఖ్యమైన స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ని రివీల్ చేసింది.

POCO X5 5G IMEI లిస్టింగ్

పోకో బ్రాండ్ నుంచి వస్తోన్న మిడ్-రేంజ్ స్మార్ట్ ఫోన్ POCO X5 5G. త్వరలోనే ఈ కంపెనీ భారత్ తో పాటు ఇతర మార్కెట్స్ లో ఈ డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఐఎంఈఐ లిస్టింగ్ పై POCO X5 5G ఫోన్ 22101320G, 22101320I అనే మోడల్ నంబర్లతో కనిపించింది. ఈ నంబర్స్ లో G అంటే గ్లోబల్ వేరియంట్ అని అర్థం. ఇక I అంటే ఇండియన్ వేరియంట్. చైనీస్ వేరియంట్ రెడ్మీ ఫోన్ గా లాంచ్ అవుతుంది. ఇది 22101320C అనే మోడల్ నంబర్ ని కలిగి ఉంది.

XiaomiUI వెబ్ సైట్ కథనాన్ని బట్టి, POCO X5 5G ఫోన్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగిన డిస్ప్లే తో రానుందని సమాచారం. ఇంకా ఈ ఫోన్లో అమోలెడ్ కి బదులుగా ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్ ని వాడినట్లు తెలుస్తోంది. ఈ డివైజ్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 778జి+ చిప్సెట్ ని కలిగి ఉండనుంది. ఇదే చిప్సెట్ ని మనం Nothing Phone (1), Moto Edge 30 5G స్మార్ట్ ఫోన్స్ లో చూశాం.

ఇక POCO X5 5G డివైజ్ రెడ్‌వుడ్ అనే కోడ్ నేమ్ తో కనిపించింది. ఇకపోతే ఈ ఫోన్ ఈ ఏడాది ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. XiaomiUI ప్రకారం, POCO X5 5G అక్టోబర్ 13 నుంచి అక్టోబర్ 20 మధ్య లాంచ్ కానుంది. కాబట్టి మేం మా పాఠకులకు ఇస్తున్న సలహా ఏంటంటే, లాంచ్ డేట్ ని కచ్చితమని అనుకోవద్దు. లాంచ్ తేదీలో మార్పులు ఉండే అవకాశం ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post లాంచ్ కి ముందు లీకైన POCO X5 5G స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>