BIS సర్టిఫికేషన్ పొందిన POCO X5 5G

హైలైట్స్

  • త్వరలో భారత్ లో లాంచ్ కానున్న POCO X5 5G
  • BIS, FCC వెబ్ సైట్స్ పై కనిపించిన POCO X5 5G స్మార్ట్ ఫోన్
  • రెక్టాంగ్యులర్ డిజైన్ తో వస్తోన్న POCO X5 5G

POCO X5 5G స్మార్ట్ ఫోన్ త్వరలో భారత్ లో లాంచ్ అవుతోంది. తాజాగా ఈ డివైజ్ BIS లిస్టింగ్ పై కనిపించడంతో ఈ విషయం స్పష్టమైంది. ప్రపంచ వ్యాప్తంగా సరసమైన ధరలకు ఫోన్లకు అందిస్తోన్న చైనీస్ స్మార్ట్ ఫోన్ తయారీదారు అయిన POCO త్వరలో భారత్ లో POCO X5 5G ని లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. తాజాగా ఈ ఫోన్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ ని పొందింది. ఈ డిైవజ్ ఫెడరల్ కమ్యూనికేషన్స్ వెబ్ సైట్ పై కూడా కనిపించింది. అంటే ఈ ఫోన్ యూఎస్ఏ లో కూడా లాంచ్ కానున్నట్లు స్పష్టమైంది.

భారత్ లో POCO X5 5G లాంచ్ తేదీ

POCO X5 5G స్మార్ట్ ఫోన్ భారత్ లో ఎప్పుడు లాంచ్ అవుతుందో ఇంకా తెలియలేదు. అయితే, ఈ ఏడాది లోనే ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. తాము ఈసారి ఉత్తమమైన దానితో వస్తున్నట్లు పోకో బ్రాండ్ ఇండియా హెడ్ హిమాన్శు టాండన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

POCO X5 5G స్మార్ట్ ఫోన్ 22101320I అనే మోడల్ నంబర్ తో బీఐఎస్ మరియు ఐఎంఈఐ డేటాబేస్ లపై కనిపించింది. చైనాలో ఈ ఫోన్ రెడ్మీ డివైజ్ గా లాంచ్ కానుంది. చైనా వేరియంట్ 22101320C అనే మోడల్ నంబర్ ని కలిగి ఉంది.

ఈలోపు ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ POCO X5 5G స్మార్ట్ ఫోన్ యొక్క BIS, FCC లిస్టింగ్ సమాచారాన్ని ట్వీట్ చేశాడు.

POCO X5 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

FCC లిస్టింగ్ ప్రకారం, POCO X5 5G స్మార్ట్ ఫోన్ రెక్టాంగ్యులర్ కెమెరా మాడ్యూల్ డిజైన్ తో వస్తోంది. ఇందులో 4900 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. అయితే కంపెనీ దీన్ని 5000 ఎంఏహెచ్ బ్యాటరీగా ప్రమోట్ చేసే అవకాశం ఉంది. ఇంకా ఈ ఫోన్ డ్యూయల్-బ్యాండ్ వై-ఫై సపోర్ట్ తో వస్తోంది. అలాగే n5, n7, n38, n41, n77, n78 5జీ బ్యాండ్స్ కి ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. POCO X5 5G ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

ఇక గతంలో లీకైన సమాచారాన్ని బట్టి, POCO X5 5G స్మార్ట్ ఫోన్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, క్వాల్కమ్ స్నాప్ గ్రాగన్ 778జి+ ప్రాసెసర్ తో రానున్నట్లు తెలుస్తోంది. త్వరలో మరింత కచ్చితమైన సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

Previous articleనెట్టింట్లో ప్రత్యక్షమైన Realme 10 Pro+ 5G లైవ్ ఇమేజెస్
Next articleనేడు మధ్యాహ్నం 12 గంటలకు మొదలుకానున్న Lava Blaze 5G ఫస్ట్ సేల్
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.