POCO - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 13 Dec 2022 14:10:09 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Flipkart బిగ్ సేవింగ్ డేస్ సేల్: POCO C31, M4 Pro 5G, X4 Pro 5G, F4 5G ఫోన్లపై డిస్కౌంట్ https://www.91mobiles.com/telugu/flipkart-big-saving-days-sale-offers-poco-phones/ Tue, 13 Dec 2022 14:08:53 +0000 https://www.91mobiles.com/telugu/?p=3972 హైలైట్స్ ఫ్లిప్ కార్ట్ లో డిసెంబర్ 16 నుంచి మొదలు కానున్న సేవింగ్ డేస్ సేల్ సేల్ లో భాగంగా POCO C31, M4 Pro 5G, X4 Pro 5G లతో పాటు ఇతర ఫోన్లపై డిస్కౌంట్ డిసెంబర్ 21 వరకు కొనసాగనున్న Flipkart Big Saving Days Sale ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ POCO మరోసారి ఆఫర్లతో వచ్చింది. 2022 డిసెంబర్ 16 న మొదలు కానున్న ఫ్లిప్ కార్ట్ బిగ్ […]

The post Flipkart బిగ్ సేవింగ్ డేస్ సేల్: POCO C31, M4 Pro 5G, X4 Pro 5G, F4 5G ఫోన్లపై డిస్కౌంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • ఫ్లిప్ కార్ట్ లో డిసెంబర్ 16 నుంచి మొదలు కానున్న సేవింగ్ డేస్ సేల్
  • సేల్ లో భాగంగా POCO C31, M4 Pro 5G, X4 Pro 5G లతో పాటు ఇతర ఫోన్లపై డిస్కౌంట్
  • డిసెంబర్ 21 వరకు కొనసాగనున్న Flipkart Big Saving Days Sale

ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ POCO మరోసారి ఆఫర్లతో వచ్చింది. 2022 డిసెంబర్ 16 న మొదలు కానున్న ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్ లో పోకో తన ఫోన్లపై డిస్కౌంట్స్ ప్రకటించింది. ఈ సేల్ డిసెంబర్ 21 వరకు కొనసాగనుంది. POCO C31, M4 Pro 5G, X4 Pro 5G, POCO F4 5G లపై పోకో సంస్థ డిస్కౌంట్స్ ప్రకటించింది.

అంతేకాదు, ఈ డిస్కౌంట్స్ తో పాటు ఎస్బీఐ, కొటక్ మహీంద్ర బ్రాంక్ క్రెడిట్ కార్డ్స్ ద్వారా డిస్కౌంట్స్ లభించనున్నాయి. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ రూ.2,000 డిస్కౌంట్ ఇస్తుండగా, కొటక్ బ్యాంక్ రూ.1000 డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. కొటక్ మహింద్రా బ్యాంక్ ఆఫర్ డిసెంబర్ 13 నుంచి అందుబాటులో ఉంది.

ఫ్లిప్ కార్ట్ సేవింగ్స్ డేస్ సేల్ సందర్భంగా ఏయే పోకో స్మార్ట్ ఫోన్స్ పై డిస్కౌంట్స్ లభించనుందో ఇక్కడ అందిస్తున్నాం. ఓసారి చూడండి.

Flipkart Big Saving Days Sale Offers

POCO C31

POCO C31 స్మార్ట్ ఫోన్ 3జిబి ర్యామ్, 32జిబి స్టోరేజీ అసలు ధర రూ.10,999 కాగా, ఆఫర్ లో రూ.6,499 కే లభిస్తోంది. ఈ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 10 వాట్ చార్జింగ్, 6.53-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఈ డివైజ్ రాయల్ బ్లూ, షాడో గ్రే కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

POCO M4 Pro 5G

POCO M4 Pro 5G స్మార్ట్ ఫోన్ 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ వేరియంట్ ప్రస్తుతం రూ.12,249 కే లభిస్తోంది. ఈ డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 810 చిప్సెట్, 6.6-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వచ్చింది. ఈ డివైజ్ పవర్ బ్లాక్, కూల్ బ్లూ, యెల్లో కలర్ ఆప్షన్స్ లో లభించనుంది.

POCO X4 Pro 5G

POCO X4 Pro 5G స్మార్ట్ ఫోన్ బేస్ మోడల్ ధర రూ.18,999 గా ఉండగా, ఆఫర్ లో ప్రస్తుతం రూ.14,449 కే లభిస్తోంది. ఈ డివైజ్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 ప్రాసెసర్ వినియోగించారు. ఈ స్మార్ట్ ఫోన్ లో 6.67-ఇంచ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 64ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి వైడ్ యాంగిల్ కెమెరా, 2 ఎంపి మ్యాక్రో కెమెరా, 16ఎంపి సెల్ఫీ కెమెరా ఉన్నాయి.

POCO M4 5G

POCO M4 5G స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం రూ.10,549 కే లభిస్తోది. ఈ డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్ వాడారు. ఈ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. 6.58-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

POCO M4 5G లో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు. ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

POCO F4 5G

POCO F4 5G స్మార్ట్ ఫోన్ 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.24,999 కాగా, ప్రస్తుతం ఆఫర్ లో రూ.22,999 కే లభిస్తోంది. POCO F4 5G డివైజ్ లో హెచ్డీఆర్10+ సర్టిఫైడ్ స్క్రీన్, 4500ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. ఇంకా 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 6.67-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Flipkart బిగ్ సేవింగ్ డేస్ సేల్: POCO C31, M4 Pro 5G, X4 Pro 5G, F4 5G ఫోన్లపై డిస్కౌంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
POCO ఫోన్ గా రానున్న Redmi Note 12 5G; లాంచ్ కి ముందు BIS వెబ్‌సైట్ పై కనిపించిన హ్యాండ్సెట్ https://www.91mobiles.com/telugu/redmi-note-12-5g-rebrand-poco-india-launch/ Thu, 03 Nov 2022 13:54:12 +0000 https://www.91mobiles.com/telugu/?p=3227 హైలైట్స్ పోకో స్మార్ట్ ఫోన్ గా రానున్న Redmi Note 12 5G లాంచ్ కి ముందు బీఐఎస్ వెబ్‌సైట్ పై కనిపించిన Redmi Note 12 5G స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 చిప్ ని కలిగి ఉన్న Redmi Note 12 5G షావోమీ ఇటీవలె Redmi Note 12 సిరీస్ ని చైనాలో లాంచ్ చేసింది. ఈ లైనప్ లో మొత్తం నాలుగు డివైజెస్ ఉంటాయి. అవి: Redmi Note 12 […]

The post POCO ఫోన్ గా రానున్న Redmi Note 12 5G; లాంచ్ కి ముందు BIS వెబ్‌సైట్ పై కనిపించిన హ్యాండ్సెట్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • పోకో స్మార్ట్ ఫోన్ గా రానున్న Redmi Note 12 5G
  • లాంచ్ కి ముందు బీఐఎస్ వెబ్‌సైట్ పై కనిపించిన Redmi Note 12 5G
  • స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 చిప్ ని కలిగి ఉన్న Redmi Note 12 5G

షావోమీ ఇటీవలె Redmi Note 12 సిరీస్ ని చైనాలో లాంచ్ చేసింది. ఈ లైనప్ లో మొత్తం నాలుగు డివైజెస్ ఉంటాయి. అవి: Redmi Note 12 5G, Redmi Note 12 5G Pro, Redmi Note 12 Pro+, Redmi Note 12 Explorer Edition. వీటిలో Redmi Note 12 Pro+ 5G భారత్ లో Xiaomi 12i HyperCharge పేరుతో లాంచ్ కానుందని సమాచారం. అయితే దీనిపై షావోమీ నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. ఇక దీని భారత వేరియంట్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) పై 22101316UP అనే మోడల్ నంబర్ తో కనిపించింది. అలాగే మరొక నోట్ 12 సిరీస్ ఫోన్ కూడా రీబ్రాండ్ అయి లాంచ్ కానుందని సమాచారం. Redmi Note 12 5G భారత్ లో POCO బ్రాండింగ్ తో ఎంట్రీ ఇవ్వనుందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ నెలలో Redmi Note 12 5G స్మార్ట్ ఫోన్ POCO ఫోన్ గా భారత్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. చైనాలో లాంచ్ అయిన Redmi Note 12 5G యొక్క మోడల్ నంబర్ 22101317C గా ఉంది. M17 దీని కుదింపబడిన మోడల్ నంబర్. భారత్ లో పోకో ఫోన్ గా లాంచ్ అవ్వనున్న Redmi Note 12 5G స్మార్ట్ ఫోన్ బీఐఎస్ డేటాబేస్ పై కనిపించింది. ఈ POCO ఫోన్ 22111317PI అనే మోడల్ నంబర్ తో కనిపించింది. ఈ మోడల్ నంబర్ కి చైనా వర్షన్ నంబర్ కి తేడా ఉంది. కానీ, షార్ట్ వర్షన్ మోడల్ నంబర్ మాత్రం ఒకే విధంగా ఉంది.

Redmi Note 12 5G స్పెసిఫికేషన్స్

Redmi Note 12 5G స్మార్ట్ ఫోన్ 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ని కలిగి ఉంది. ఫ్లాట్ స్క్రీన్, హోల్ పంచ్ కౌటౌట్ ని గమనించవచ్చు. ఈ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 చిప్సెట్ అమర్చారు. Redmi Note 12 5G లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఇప్పుడు Redmi Note 12 5G యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ లో 48 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సర్ ఉన్నాయి. Redmi Note 12 5G లో 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు. ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

షావోమీ Redmi Note 12 5G స్మార్ట్ ఫోన్ ని చైనాలో CNY 1199 (రూ.13,600) ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ బేస్ మోడల్ 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ తో లాంచ్ అయ్యింది. ఈ డివైజ్ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో కూడా లభిస్తుంది. భారత్ లో 8జిబి ర్యామ్ ఆప్షన్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. Redmi Note 12 5G వైట్, బ్లూ, బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తోంది. ఈ ఫోన్ 188 గ్రాముల బరువు, 7.98 మిల్లీ మీటర్ల మందం ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post POCO ఫోన్ గా రానున్న Redmi Note 12 5G; లాంచ్ కి ముందు BIS వెబ్‌సైట్ పై కనిపించిన హ్యాండ్సెట్ first appeared on 91Mobiles Telugu.

]]>
త్వరలో లాంచ్ కానున్న POCO M5 https://www.91mobiles.com/telugu/poco-m5-to-launch-in-india-spotted-on-bis-website/ Fri, 22 Jul 2022 06:47:38 +0000 https://www.91mobiles.com/telugu/?p=1161 హైలైట్స్: పోకో ఎమ్5 సిరీస్ పై కంపెనీ పని చేస్తున్నట్లు సమాచారం ఈ లైనప్ లో ఉండనున్న స్టాండర్డ్ వేరియంట్ పోకో ఎమ్5, పోకో ఎమ్5ఎస్ బీఐఎస్ వెబ్ సైట్ లో కనిపించిన పోకో ఎమ్5, త్వరలోనే దేశంలో లాంచ్ అయ్యే అవకాశం ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ పోకో, పోకో ఎమ్5 సిరీస్ పై పని చేస్తున్నట్లు సమాచారం. పోకో ఎమ్5 సిరీస్ లో పోకో ఎమ్5, పోకో ఎమ్5ఎస్ మోడల్స్ ఉంటాయి. ఈ మధ్య […]

The post త్వరలో లాంచ్ కానున్న POCO M5 first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • పోకో ఎమ్5 సిరీస్ పై కంపెనీ పని చేస్తున్నట్లు సమాచారం
  • ఈ లైనప్ లో ఉండనున్న స్టాండర్డ్ వేరియంట్ పోకో ఎమ్5, పోకో ఎమ్5ఎస్
  • బీఐఎస్ వెబ్ సైట్ లో కనిపించిన పోకో ఎమ్5, త్వరలోనే దేశంలో లాంచ్ అయ్యే అవకాశం

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ పోకో, పోకో ఎమ్5 సిరీస్ పై పని చేస్తున్నట్లు సమాచారం. పోకో ఎమ్5 సిరీస్ లో పోకో ఎమ్5, పోకో ఎమ్5ఎస్ మోడల్స్ ఉంటాయి. ఈ మధ్య కాలంలో పోకో ఎమ్5 పోన్ పలు సర్టిఫికేషన్ అథారిటీ వెబ్ సైట్స్ పై కనిపిస్తోంది.ఇప్పుడు స్టాండర్డ్ వేరియంట్ పోకో ఎమ్5 ఇండియన్ బీఐఎస్ సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై దర్శనమిచ్చింది. దీంతో త్వరలోనే భారత్ లో ఈ ఫోన్ లాంచ్ కానుందని అర్థమవుతోంది.

బీఐఎస్ లో లిస్ట్ అయిన POCO M5

ప్రముఖ టిప్ స్టర్ ముకుల్ శర్మ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని షేర్ చేశాడు. పోకో ఎమ్5 (మోడల్ నంబర్ 22071219సీఐ) బీఐఎస్ సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై కనిపించిందని అతడు చెప్పాడు. అయితే బీఐఎస్ లిస్టింగ్ తో ఫోన్ కచ్చితంగా లాంచ్ అవుతుందని చెప్పలేం. అయితే, భారత్ లో సదరు డివైజ్ లాంచ్ అయ్యేందుకు కొంతవరకు మార్గం సుగమమైందని దీనర్థం. అంటే త్వరలోనే భారత్ లో ఈ ఫోన్ లాంచ్ అవ్వనుందన్న మాట.

POCO M5 స్పెసిఫికేషన్స్ (అంచనా)

గత నివేదికల ఆధారంగా పోకో ఎమ్5 4జీ డివైజ్ అని తెలుస్తోంది. అలాగే ఈ డివైజ్ ఎన్ఎఫ్సీ కి సంపోర్ట్ చేస్తుందని సమాచారం. సాఫ్ట్ వేర్ విషయానికి వస్తే, పోకో ఎమ్5 ఆండ్రాయిడ్ 12 ఆధారిత, ఎంఐయూఐ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఇక పోకో ఎమ్5, మీడియాటెక్ 4జీ ప్రాసెసర్ తో రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ర్యామ్, స్టోరేజీ వివరాలు చూద్దాం. ఈ ఫోన్లో 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉండనున్నట్లు తెలుస్తోంది.

ఇప్పుడు కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. పోకో ఎమ్5 లో 50ఎంపి ప్రధాన కెమెరా, 8ఎంపి సెల్ఫీ షూటర్ ఉండనున్నాయి. పోకో ఎమ్5 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుందని సమాచారం. ఇక ఈ ఫోన్ లో యూఎస్బీ టైప్-సీ ఛార్జింగ్ పోర్ట్ ఉండనుంది. ఫీచర్లకు సంబంధించిన ఇతర వివరాలు, లాంచ్ తేదీ త్వరలోనే వెల్లడయ్యే అవకాశముంది. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఈ డివైజ్ 4జీ కనెక్టివిటీతో వస్తుంది. అయితే ఇది నివేదికల ఆధారంగా తెలుస్తున్న విషయం మాత్రమే. లాంచ్ అనంతరం, ఏయే ఫీచర్లు ఉంటాయో పూర్తి వివరాలు తెలుస్తాయి.

కాగా, ఇటీవలె పోకో కంపెనీ నుంచి పోకో ఎఫ్4 5జీ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఫోన్ భారత మార్కెట్ లో బాగా అమ్ముడైంది. దీంతో మాంచి జోష్ లో ఉన్న పోకో వరుసబెట్టి ఫోన్లను లాంచ్ చేయాలని చూస్తోంది. ఇందులో భాగంగానే పోకో ఎమ్5 సిరీస్ ను లాంచ్ చేయాలని సదరు కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఇక పోకో ఎమ్5ఎస్ ఫోన్, రెడ్ మీ నోట్ 10ఎస్ కి రీబ్రాండెడ్ వర్షన్ అని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో పోకో ఎమ్5ఎస్ లో మీడియాటెక్ హీలియో జీ95 ప్రాసెసర్, 6.43 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే ఉండనున్నాయని అంచనా వేస్తున్నారు. మరింత సమాచారం కొరకు 91మొబైల్స్ తెలుగు ని ఫాలో అవ్వండి.

The post త్వరలో లాంచ్ కానున్న POCO M5 first appeared on 91Mobiles Telugu.

]]>