Realme 10 4G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 09 Jan 2023 08:00:34 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 90Hz Super AMOLED డిస్ప్లే, 8GB ర్యామ్ తో భారత్‌లో లాంచైన Realme 10 4G https://www.91mobiles.com/telugu/realme-10-4g-launched-india-price-specs-availability/ Mon, 09 Jan 2023 08:00:34 +0000 https://www.91mobiles.com/telugu/?p=4385 హైలైట్స్ నేడు భారత మార్కెట్ లో లాంచైన Realme 10 4G స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్, 8జిబి + 8జిబి వర్చువల్ ర్యామ్, 128జిబి స్టోరేజీతో వచ్చిన Realme 10 4G Realme 10 4G ఫోన్ 4జిబి+64జిబి వేరియంట్ ఇంట్రడక్టరీ ప్రైస్ రూ.12,999 రియల్మీ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తోన్న Realme 10 4G డివైజ్ నేడు భారత్ లో లాంచైంది. ఈ ఫోన్ 4జీ కనెక్టివిటీతో వచ్చింది. అందుబాటు ధర, […]

The post 90Hz Super AMOLED డిస్ప్లే, 8GB ర్యామ్ తో భారత్‌లో లాంచైన Realme 10 4G first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • నేడు భారత మార్కెట్ లో లాంచైన Realme 10 4G స్మార్ట్ ఫోన్
  • మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్, 8జిబి + 8జిబి వర్చువల్ ర్యామ్, 128జిబి స్టోరేజీతో వచ్చిన Realme 10 4G
  • Realme 10 4G ఫోన్ 4జిబి+64జిబి వేరియంట్ ఇంట్రడక్టరీ ప్రైస్ రూ.12,999

రియల్మీ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తోన్న Realme 10 4G డివైజ్ నేడు భారత్ లో లాంచైంది. ఈ ఫోన్ 4జీ కనెక్టివిటీతో వచ్చింది. అందుబాటు ధర, మంచి ఫీచర్ల కోసం చూసే కస్టమర్లు Realme 10 4G ని ఎంచుకోవచ్చు. నేడు భారత మార్కెట్ లోకి వచ్చిన ఈ ఫోన్ ఎటువంటి స్పెసిఫికేషన్స్ కలిగి ఉందో తెలుసుకుందాం.

భారత్ లో నేడు Realme 10 4G స్మార్ట్ ఫోన్ లాంచైంది. ఈ ఫోన్ ఉత్తమమైన ఫీచర్లు మరియు డిజైన్ తో వచ్చింది. ఈ ఫోన్ లో 50ఎంపి మెయిన్ కెమెరా, 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు. ఇంతేకాకుండా ఈ ఫోన్ లో హై-రెజుల్యూషన్ ఆడియో మరియు 3.5ఎంఎం ఆడియో జాక్ అందించారు. ఇంకా ఈ ఫోన్ బ్యాక్ ప్యానెల్ యూనిక్ గ్రేడియంట్ డిజైన్ తో వచ్చింది. సరే పదండి, ఓసారి Realme 10 4G యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Realme 10 4G స్పెసిఫికేషన్స్

Realme 10 4G స్మార్ట్ ఫోన్ 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, అమోలెడ్ ప్యానెల్ తో వచ్చింది. ఇందులో 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అందించారు. ఈ డివైజ్ లో మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్ వాడారు. ఇది 6 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైన చిప్. ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ, 1టీబీ వరకు ఎక్స్‌టర్నల్ మెమొరీని ఈ ఫోన్ లో అందించారు. 8జిబి ర్యామ్ వరకు ఆప్షన్స్ తో ఈ ఫోన్ వచ్చింది. ఇందులో 8జిబి డైనమిక్ ర్యామ్ కూడా అందించారు. 40FPS PUBG సపోర్ట్ తో ఈ ఫోన్ వచ్చింది.

Realme 10 4G లో గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అందించారు. ఇంకా 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఈ ఫోన్ లో ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫోన్ యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి బ్లాక్ అండ్ వైట్ కెమెరా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

Realme 10 4G కెమెరా ఫీచర్ల గురించి తెలుసుకుందాం. ఇందులో ప్రోలైట్ ఇమేజింగ్ టెక్నాలజీ, ఫ్లాష్ నైట్ వ్యూ అల్గారిథమ్, 121 పర్సెంట్ నైట్ షాట్ స్పీడ్ వంటివి అందించారు. ఫ్రంట్ కెమెరా క్లియర్ ఫ్యూజన్ అల్గారిథమ్ తో వచ్చింది. 200 పర్సెంట్ అల్ట్రాబూమ్ స్పీకర్, 3.5ఎంఎం ఆడియో జాక్, హై-రెజ్ ఆడియో ఈ ఫోన్ లో ఉన్నాయి.

Realme 10 4G స్మార్ట్ ఫోన్ 7.95 ఎంఎం మందం, 178 గ్రాముల బరువు కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 33 వాట్ సూపర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Realme 10 4G ధర

Realme 10 4G స్మార్ట్ ఫోన్ 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.13,999 కాగా, ఇంట్రడక్టరీ ప్రైస్ కింద రూ.12,999 కే లభించనుంది. ఇంకా 8జిబి ర్యామ్ + 128జిబి వేరియంట్ ధర రూ.16,999 గా నిర్ణయించారు. ఈ ఫోన్ సేల్స్ జనవరి 15 నుంచి ప్రారంభమవుతాయి. ఫ్లిప్ కార్ట్, రియల్మీ స్టోర్స్, రిటైల్ షాప్స్ ద్వారా ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 90Hz Super AMOLED డిస్ప్లే, 8GB ర్యామ్ తో భారత్‌లో లాంచైన Realme 10 4G first appeared on 91Mobiles Telugu.

]]>
జనవరి 9 న భారత్ లో లాంచ్ అవుతోన్న Realme 10 4G https://www.91mobiles.com/telugu/realme-10-4g-india-launch-date-confirmed-by-company/ Tue, 03 Jan 2023 04:25:26 +0000 https://www.91mobiles.com/telugu/?p=4296 హైలైట్స్ భారత్ లో Realme 10 4G లాంచ్ ని కన్ఫర్మ్ చేసిన రియల్మీ సంస్థ జనవరి 9 న లాంచ్ కానున్న డివైజ్, ఫ్లిప్ కార్ట్ ద్వారా జరగనున్న అమ్మకాలు మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్, 90 హెర్ట్జ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తోన్న Realme 10 4G కొన్ని రోజుల నుంచి Realme 10 4G గురించి టీజ్ చేస్తూ వస్తోన్న రియల్మీ సంస్థ ఎట్టకేలకు ఈ ఫోన్ లాంచ్ […]

The post జనవరి 9 న భారత్ లో లాంచ్ అవుతోన్న Realme 10 4G first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • భారత్ లో Realme 10 4G లాంచ్ ని కన్ఫర్మ్ చేసిన రియల్మీ సంస్థ
  • జనవరి 9 న లాంచ్ కానున్న డివైజ్, ఫ్లిప్ కార్ట్ ద్వారా జరగనున్న అమ్మకాలు
  • మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్, 90 హెర్ట్జ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తోన్న Realme 10 4G

కొన్ని రోజుల నుంచి Realme 10 4G గురించి టీజ్ చేస్తూ వస్తోన్న రియల్మీ సంస్థ ఎట్టకేలకు ఈ ఫోన్ లాంచ్ తేదీని ప్రకటించింది. Realme 10 4G డివైజ్ భారత్ లో జనవరి 9 న లాంచ్ అవుతోంది. అలాగే ఫ్లిప్ కార్ట్ ద్వారా ఈ ఫోన్ విక్రయించబడనుంది. 4జీ కనెక్టివిటీతో వస్తున్నందున ధర కూడా అందుబాటులోనే ఉండనుంది.

Realme 10 4G స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అమోలెడ్ డిస్ప్లే, 50ఎంపి మెయిన్ కెమెరాతో వస్తోంది. సరే, ఓసారి Realme 10 4G యొక్క ప్రధాన స్పెసిఫికేషన్స్ మరియు ఇతర వివరాలను తెసుకుందాం పదండి.

Realme 10 4G భారత్ లాంచ్ తేదీ ఖరారు

పైన కనిపిస్తోన్న ఇమేజ్ ని బట్టి Realme 10 4G ఫోన్ 2023 జనవరి 9 న మధ్యాహ్నం 12.30 గంటలకు లాంచ్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇది ఫ్లిప్ కార్ట్ యూనిక్ ప్రొడక్ట్ గా పరిగణించబడనుంది. ఫ్లిప్ కార్ట్ లో దర్శనమిస్తోన్న ల్యాండింగ్ పేజీ ద్వారా Realme 10 4G యొక్క ప్రధాన స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ వివరాలు బయటకు వచ్చాయి. అవేంటో తెలుసుకుందాం పదండి.

Realme 10 4G స్పెసిఫికేషన్స్

Realme 10 4G స్మార్ట్ ఫోన్ 6.4-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తోంది. ఈ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్ వాడారు. ఈ ఫోన్ లో 8జిబి వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్ మరియు 256జిబి వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ అందించారు.

ఇప్పుడు Realme 10 4G యొక్క కెమెరా విభాగం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ స్మార్ట్ ఫోన్ లో 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగా పిక్సెల్ బ్లాక్ అండ్ వైట్ కెమెరా ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

భద్రత కోసం Realme 10 4G లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. ఇంకా ఈ ఫోన్ లో హై-రెస్ ఆడియో ఫీచర్ ఉంది. పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 33 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం ఈ ఫోన్ లో యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఇచ్చారు. Realme 10 4G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 3.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post జనవరి 9 న భారత్ లో లాంచ్ అవుతోన్న Realme 10 4G first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన Realme 10 4G ఇండియన్ వేరియంట్ ర్యామ్, స్టోరేజీ వివరాలు https://www.91mobiles.com/telugu/realme-10-4g-india-ram-storage-price-details-leaked/ Mon, 21 Nov 2022 07:45:47 +0000 https://www.91mobiles.com/telugu/?p=3553 హైలైట్స్ రీసెంట్ గా గ్లోబల్ మార్కెట్ లో లాంచ్ అయిన Realme 10 4G త్వరలో భారత్ లో లాంచ్ కానున్న Realme 10 4G, తాజాగా లీకైన ర్యామ్, స్టోరేజీ వేరియంట్స్ 6.4-ఇంచ్ డిస్ప్లే, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్ ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్ Realme కంపెనీ ఇటీవలె Realme 10 4G స్మార్ట్ ఫోన్ ని గ్లోబల్ మార్కెట్ లో లాంచ్ చేసింది. ఓవైపు రియల్మీ 10 ప్రో సిరీస్ […]

The post లీకైన Realme 10 4G ఇండియన్ వేరియంట్ ర్యామ్, స్టోరేజీ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • రీసెంట్ గా గ్లోబల్ మార్కెట్ లో లాంచ్ అయిన Realme 10 4G
  • త్వరలో భారత్ లో లాంచ్ కానున్న Realme 10 4G, తాజాగా లీకైన ర్యామ్, స్టోరేజీ వేరియంట్స్
  • 6.4-ఇంచ్ డిస్ప్లే, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్ ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్

Realme కంపెనీ ఇటీవలె Realme 10 4G స్మార్ట్ ఫోన్ ని గ్లోబల్ మార్కెట్ లో లాంచ్ చేసింది. ఓవైపు రియల్మీ 10 ప్రో సిరీస్ భారత లాంచ్ కోసం ఎదురు చూస్తోన్న క్రమంలో, Realme 10 4G తొలుత లాంచ్ కానుందని ఓ వార్త బయటకు వచ్చింది. ప్రముఖ టిప్‌స్టర్ సుదాన్శు అంబోరే ద్వారా ఈ విషయం 91మొబైల్స్ కి తెలిసింది. అలాగే Realme 10 4G యొక్క ఏయే వేరియంట్స్ భారత్ లో అందుబాటులోకి రానున్నాయో తెలుసుకుందాం. పదండి.

Realme 10 4G భారత వేరియంట్ మెమొరీ ఆప్షన్స్

సుదాన్శు తెలిపిన దాన్ని బట్టి, Realme 10 4G మూడు మెమొరీ వేరియంట్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి: 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ బేస్ వేరియంట్, 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మిడ్-వేరియంట్, 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ టాప్ వేరియంట్. అంటే భారత్ లో 6జిబి/128జిబి మరియు 8జిబి/128జిబి వేరియంట్లను రియల్మీ తీసుకురావడంలేదని తెలుస్తోంది. గ్లోబల్ మార్కెట్ లో Realme 10 4G 5 మెమొరీ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యింది.

Realme 10 4G స్పెసిఫికేషన్స్

Realme 10 4G స్మార్ట్ ఫోన్ లో 6.4-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ బ్రైట్నెస్, 2400*1080 పిక్సెల్ రెజుల్యూషన్, 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉంటాయి. Realme 10 4G లో మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్ వినియోగించారు. 8జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ తో ఈ ఫోన్ లభించనుంది. Realme 10 4G డివైజ్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 3.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

Realme 10 4G యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Realme 10 4G లో 50 ఎంపి కెమెరా, 2 ఎంపి డెప్త్ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు. Realme 10 4G లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఇచ్చారు.

భారత్ లో Realme 10 4G ధర (అంచనా)

Realme 10 4G స్మార్ట్ ఫోన్ 4జిబి + 64జిబి వేరియంట్ ధర రూ.15,000 గా ఉండే అవకాశం ఉంది. 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ యూనిట్ ధర రూ.17000 గా ఉండనుంది. ఇక టాప్ వేరియంట్ అయిన 8జిబి ర్యామ్ + 256జిబి వేరియంట్ ధర రూ.20,000 గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక గ్లోబల్ వేరియంట్స్ ధర 229 డాలర్లు (సుమారు రూ.18,700) తో మొదలై 299 డాలర్లు (సుమారు రూ.24,400) వరకు ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post లీకైన Realme 10 4G ఇండియన్ వేరియంట్ ర్యామ్, స్టోరేజీ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
నవంబర్ 9 న లాంచ్ అవుతోన్న Realme 10, రివీల్ అయిన ఫుల్ డిజైన్ స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/realme-10-4g-launch-date-specifications-benchmark-scores/ Mon, 07 Nov 2022 05:46:22 +0000 https://www.91mobiles.com/telugu/?p=3264 హైలైట్స్ నవంబర్ 9 న ఇండోనేషియాలో లాంచ్ కానున్న Realme 10 విడతలుగా ఫోన్ వివరాలను రివీల్ చేస్తోన్న కంపెనీ లాంచ్ కి ముందు రివీల్ అయిన రియల్మీ 10 స్పెసిఫికేషన్స్, బెంచ్ మార్క్ స్కోర్స్, పూర్తి డిజైన్ ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ Realme త్వరలో Realme 10 ఫోన్ ని ఇండోనేషియాలో నవంబర్ 9 న లాంచ్ చేయబోతోంది. రియల్మీ గత కొన్ని రోజుల నుంచి ఈ ఫోన్ కి సంబంధించిన వివరాలను లాంచ్ […]

The post నవంబర్ 9 న లాంచ్ అవుతోన్న Realme 10, రివీల్ అయిన ఫుల్ డిజైన్ స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • నవంబర్ 9 న ఇండోనేషియాలో లాంచ్ కానున్న Realme 10
  • విడతలుగా ఫోన్ వివరాలను రివీల్ చేస్తోన్న కంపెనీ
  • లాంచ్ కి ముందు రివీల్ అయిన రియల్మీ 10 స్పెసిఫికేషన్స్, బెంచ్ మార్క్ స్కోర్స్, పూర్తి డిజైన్
Courtesy: Youtube/TechBroll

ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ Realme త్వరలో Realme 10 ఫోన్ ని ఇండోనేషియాలో నవంబర్ 9 న లాంచ్ చేయబోతోంది. రియల్మీ గత కొన్ని రోజుల నుంచి ఈ ఫోన్ కి సంబంధించిన వివరాలను లాంచ్ టీజర్ల రూపంలో రివీల్ చేస్తూ వస్తోంది. అయితే, లాంచ్ కి ముందు అన్‌బాక్సింగ్ వీడియోలు, ఇమేజెస్ ని ఎంతోమంది టిప్‌స్టర్స్ పబ్లిష్ చేయడం జరిగింది. దీంతో Realme 10 కి సంబంధించిన స్పెసిఫికేషన్స్, బెంచ్ మార్క్ స్కోర్స్, పూర్తి డిజైన్ బయటకు వచ్చాయి.

లీకైన ఇమేజెస్ ని బట్టి Realme 10 లో బాక్స్ తో పాటు చార్జర్ కూడా వస్తున్నట్లు స్పష్టమైంది. ఇదొక మంచి పరిణామమని చెప్పొచ్చు. ఇటీవలె కొన్ని నార్జో డివైజెస్ కి రియల్మీ చార్జర్స్ ని బాక్స్ లో ప్రొవైడ్ చేయలేదు. ఓసారి Realme 10 యొక్క అన్‌బాక్సింగ్ ఇమేజెస్ కి సంబంధించిన లుక్, రియల్-లైఫ్ బెంచ్ మార్క్ స్కోర్స్, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

Realme 10 4G డిజైన్

 

అన్ బాక్సింగ్ ఇమేజెస్ ని బట్టి Realme 10 4G కార్నర్ పంచ్ హోల్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ డిస్ప్లే తో వస్తున్నట్లు తెలుస్తోంది. రియల్ ప్యానెల్ పై డ్యూయల్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ కనిపిస్తున్నాయి. Realme 10 4G ఫ్లాట్ ఎడ్జ్ డిజైన్, షైనీ క్లాష్ వైట్ కలర్ తో వస్తోంది. ఇతర కలర్ ఆప్షన్స్ కూడా ఉండే అవకాశం ఉంది.

ఫోన్ ఎడమవైపున సిమ్ కార్డ్ ట్రే ఉంది. టాప్ ఎడ్జ్ పై సెకండరీ మైక్రోఫోన్ ఉంది. బాటమ్ లో 3.5 ఎంఎం ఆడియో జాక్, స్పీకర్ గ్రిల్, టైప్-సీ పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్ ఉన్నాయి. ఫోన్ కి కుడివైపున వాల్యూమ్ రాకర్స్, పవర్ బటన్ ఉన్నాయి. అలాగే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంది.

Realme 10 4G మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్ తో వస్తున్నట్లు కన్ఫర్మ్ అయ్యింది. Antutu బెంచ్ మార్క్ టెస్ట్ లో Realme 10 4G 4,00,086 పాయింట్స్ స్కోర్ ని సాధించినట్లు ఇదివరకు ఓ ఇమేజ్ ద్వారా కంపెనీ వెల్లడించింది. అయితే TechBroll రన్ చేసిన Antutu బెంచ్ మార్క్ టెస్ట్ లో Realme 10 4G 3,96,429 పాయింట్ల స్కోర్ ని నమోదు చేసింది. ఈ స్కోరు కంపెనీ చెప్పిన స్కోర్ కి దగ్గరగా ఉంది.

Realme 10 4G స్పెసిఫికేషన్స్

Realme 10 4G 6.4-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, డ్యూయల్-రియర్ కెమెరా సెటప్, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ తో వస్తోంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు. పవర్ బ్యాకప్ కోసం Realme 10 4G లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Realme 10 4G 8జిబి ర్యామ్ + 256జిబి వేరియంట్ లో కూడా రానుంది. అయితే, కంపెనీ ఈ వేరియంట్ ని అన్ని మార్కెట్స్ లో లాంచ్ చేసే అవకాశం లేదు. Realme 10 4G ఆండ్రాయిడ్ 12 ఆధారిత రియల్మీ యూఐ 3.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. అల్ట్రా వాల్యూమ్ మోడ్ అనే ఫీచర్ ని రియల్మీ ఈ ఫోన్ లో అందిస్తోంది. ఈ ఫీచర్ ద్వారా ఫోన్ వాల్యూమ్ ని 200 శాతం వరకు పెంచుకోవచ్చు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post నవంబర్ 9 న లాంచ్ అవుతోన్న Realme 10, రివీల్ అయిన ఫుల్ డిజైన్ స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
ఖరారైన Realme 10 4G లాంచ్ తేదీ; స్పెసిఫికేషన్స్, ర్యామ్, స్టోరేజీ ఆప్షన్స్ https://www.91mobiles.com/telugu/realme-10-4g-launch-date-confirmed-indonesia-price-specs/ Mon, 31 Oct 2022 14:56:21 +0000 https://www.91mobiles.com/telugu/?p=3156 హైలైట్స్ నవంబర్ 9 న లాంచ్ అవుతోన్న Realme 10 4G, ప్రకటించిన కంపెనీ నవంబర్ 11 నుంచి ఇండోనేషియాలో సేల్ కి అందుబాటులోకి రానున్న డివైజ్ మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్ తో వస్తున్న Realme 10 4G Realme 10 4G లాంచ్ తేదీ ఖరారైంది. రియల్మీ కంపెనీ ఈ ఫోన్ ని నవంబర్ 9 న లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. ఇండోనేషియాలో నవంబర్ 11 నుంచి Realme 10 4G అమ్మకానికి వస్తోంది. […]

The post ఖరారైన Realme 10 4G లాంచ్ తేదీ; స్పెసిఫికేషన్స్, ర్యామ్, స్టోరేజీ ఆప్షన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • నవంబర్ 9 న లాంచ్ అవుతోన్న Realme 10 4G, ప్రకటించిన కంపెనీ
  • నవంబర్ 11 నుంచి ఇండోనేషియాలో సేల్ కి అందుబాటులోకి రానున్న డివైజ్
  • మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్ తో వస్తున్న Realme 10 4G

Realme 10 4G లాంచ్ తేదీ ఖరారైంది. రియల్మీ కంపెనీ ఈ ఫోన్ ని నవంబర్ 9 న లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. ఇండోనేషియాలో నవంబర్ 11 నుంచి Realme 10 4G అమ్మకానికి వస్తోంది. త్వరలోనే ఈ డివైజ్ భారత మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. అయితే కంపెనీ భారత లాంచ్ కి సంబంధించిన వివరాలను ఇంకా వెల్లడించాల్సి ఉంది. ఈలోపు రియల్మీ అధికార వెబ్ సైట్ లో Realme 10 4G కి సంబంధించిన స్పెసిఫికేషన్స్, డిజైన్ వివరాలు రివీల్ అయ్యాయి.

Realme 10 4G డివైజ్ ఇండోనేషియాలో రెండు కలర్ ఆప్షన్స్ లో లభించనుంది. మూడు విభిన్న స్టోరేజీ ఆప్షన్స్ లో ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. Realme 10 4G మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్ తో వస్తోంది. Realme 10 4G యొక్క స్పెసిఫికేషన్స్, ఫీచర్లు, ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకుందాం పదండి.

Realme 10 4G స్పెసిఫికేషన్స్

నవంబర్ 11 నుంచి అధికారికంగా Realme 10 4G డివైజ్ ని కొనుగోలు చేయవచ్చు. ఇండోనేషియాలో మూడు వేరియంట్లలో ఈ ఫోన్ లాంచ్ అవుతోంది. బేస్ వేరియంట్ 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీతో వస్తోంది. ఇంకా 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. రష్ వైట్, క్లాష్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో ఈ డివైజ్ లభించనుంది.

ప్రస్తుతానికి ధర వివరాలు రహస్యంగా ఉన్నాయి. నవంబర్ 9 న రియల్మీ సంస్థ Realme 10 4G యొక్క ధరను రివీల్ చేయనుంది. Realme 10 4G 4జిబి ర్యామ్ మోడల్ ధర 190-210 డాలర్లు (రూ.15,700-రూ.17,200) మధ్య ఉంటుందని ఇదివరకు మేం రివీల్ చేశాం.

రియల్మీ ఇండోనేషియా వెబ్ సైట్ లో Realme 10 4G యొక్క ఇతర వివరాలు ఖరారయ్యాయి. ఈ ఫోన్ 90 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, హోల్-పంచ్ కటౌట్ తో రానుంది. అయితే డిస్ప్లే సైజుకి గురించి ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. Realme 10 4G 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే తో వస్తుందని ఇంతకు ముందు మేం రివీల్ చేశాం. అలాగే 360హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ కూడా ఉంటుందని మేం చెప్పాం.

Realme 10 4G 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తోంది. ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. Realme 10 4G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో సెన్సర్ ఉంటాయి.

Realme 10 4G 8జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ ఫీచర్ తో వస్తోంది. ఈ ఫీచర్ సాయంతో ఇంటర్నల్ మెమొరీని ర్యామ్ గా మార్చుకోవచ్చు. మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్ AnTuTu బెంచ్ మార్కింగ్ ప్లాట్ఫామ్ పై 4 లక్షల స్కోర్ ని నమోదు చేసిందని రియల్మీ కంపెనీ వెల్లడించింది.

Realme 10 4G లో భద్రత కోసం ఫింగర్ ప్రింట్ స్కానర్, ఏఐ ఫేస్ అన్‌లాక్ ని అందించారు. ఈ ఫోన్ లో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16ఎంపి కెమెరాను అందించారు. Realme 10 4G ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 3.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

Realme 10 4G లో ఉన్న హార్డ్‌వేర్ ని బట్టి, భారత్ లో ఈ ఫోన్ బేస్ మోడల్ ధర రూ.17,000 గా ఉండే అవకాశం ఉంది. అన్ని కార్డ్ ఆఫర్లను కలుపుకుని భారత్ లో Realme 10 4G డివైజ్ ని రూ.15,000 కే సొంతం చేసుకునే చాన్స్ ఉంది. త్వరలోనే Realme 10 4G ఇండియా లాంచ్ కి సంబంధించిన ప్రకటను రియల్మీ చేసే అవకాశం ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post ఖరారైన Realme 10 4G లాంచ్ తేదీ; స్పెసిఫికేషన్స్, ర్యామ్, స్టోరేజీ ఆప్షన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన Realme 10 4G ధర, స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/realme-10-4g-specs-tipped-before-launch/ Fri, 28 Oct 2022 05:37:14 +0000 https://www.91mobiles.com/telugu/?p=3116 హైలైట్స్ లాంచ్ కి ముందు బయటకు వచ్చిన Realme 10 4G ధర, స్పెసిఫికేషన్స్ మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్, 50ఎంపి డ్యూయల్ కెమెరా సెటప్ తో రానున్న Realme 10 4G నవంబర్ నెలలో లాంచ్ కానున్న Realme 10 4G స్మార్ట్ ఫోన్ ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు Realme త్వరలోనే Realme 10 సిరీస్ ని లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. లాంచ్ తేదీ ప్రకటించని కంపెనీ, లాంచ్ ఈవెంట్ మాత్రం నవంబర్ […]

The post లీకైన Realme 10 4G ధర, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • లాంచ్ కి ముందు బయటకు వచ్చిన Realme 10 4G ధర, స్పెసిఫికేషన్స్
  • మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్, 50ఎంపి డ్యూయల్ కెమెరా సెటప్ తో రానున్న Realme 10 4G
  • నవంబర్ నెలలో లాంచ్ కానున్న Realme 10 4G స్మార్ట్ ఫోన్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు Realme త్వరలోనే Realme 10 సిరీస్ ని లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. లాంచ్ తేదీ ప్రకటించని కంపెనీ, లాంచ్ ఈవెంట్ మాత్రం నవంబర్ నెలలో ఉంటుందని వెల్లడించింది. రాబోవు 10 సిరీస్ ఫోన్లు పెర్ఫామెన్స్, డిస్ప్లే, డిజైన్ విభాగాల్లో అప్‌గ్రేడ్ అయి వస్తాయని ఇటీవలె కంపెనీ తెలిపింది. ఈ లైనప్ లో పలు మోడల్స్ ని లాంచ్ చేయబోతోంది రియల్మీ. అవి: Realme 10 4G మరియు 5G, Realme 10 Pro 5G, Realme 10 Pro+ 5G.

Realme 10 సిరీస్ డివైజెస్ గ్లోబల్ గా నవంబర్ 5 న లాంచ్ అవుతాయని రూమర్ల ద్వారా తెలుస్తోంది. భారతదేశంలో జరగబోవు లాంచ్ ఈవెంట్ నవంబర్ మధ్యలో ఉండే అవకాశం ఉంది. అధికార ప్రకటన కోసం ఎదురు చూస్తున్న తరుణంలో, Realme 10 4G యొక్క స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ బయటకు వచ్చాయి. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Realme 10 4G స్పెసిఫికేషన్స్ (లీక్డ్)

నవంబర్ లో లాంచ్ కానున్న Realme 10 బడ్జెట్ సిరీస్ లో Realme 10 4G మొదటి ఫోన్. లాంచ్ తేదీ ఇంకా ఖరారు కాలేదు కానీ ఈలోపు రూమర్లైతే వస్తూనే ఉన్నాయి. ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ లేటెస్ట్ లీక్స్ ద్వారా బయటకు వచ్చాయి. ఇకపోతే ఈ ఫోన్ రియల్మీ 10 ప్రో, రియల్మీ 10ప్రో+ 5జీ మోడల్స్ తో పాటు లాంచ్ కానుంది.

ప్రముఖ టిప్‌స్టర్ పారస్ గుగ్లాని ప్రకారం, Realme 10 4G స్మార్ట్ ఫోన్ 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 60 లేదా 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో రానున్నట్లు తెలుస్తోంది. అలాగే స్క్రాచెస్ పడకుండా ఉండేందుకు డిస్ప్లే పై పాండ గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుందట.

Realme 10 4G మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్ తో వస్తోంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో సెన్సర్ ఉండనున్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండనుంది. గుగ్లాని ఈ ఫోన్ యొక్క బ్యాటరీ వివరాలను కూడా వెలికితీశాడు. Realme 10 4G లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. కచ్చితమైన ర్యామ్, స్టోరేజీ వివరాలు ఇంకా తెలియలేదు. అయితే టిప్‌స్టర్ చెబుతున్న దాన్ని బట్టి, ఈ ఫోన్ LPDDR4x ర్యామ్, UFS 2.2 స్టోరేజీ తో వస్తోంది. అలాగే 5జిబి వరకు వర్చువల్ ర్యామ్ సపోర్ట్ కూడా ఉంటుందని తెలుస్తోంది.

గతంలో Realme 10 4G యొక్క డిజైన్ రెండర్స్ బయటకు వచ్చాయి. ఈ ఫోన్ ఫ్లాట్ ఫ్రేమ్ డిజైన్ కలిగి పింక్ మరియు గ్రే కలర్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంటుంది. డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కోసం రెండు భారీ సర్క్యులర్ కటౌట్స్ ఉంటాయి. బ్యాక్ ప్యానెల్ పై రాయబడిన టెక్ట్స్ ద్వారా 50ఎంపి మెయిన్ కెమెరా ఉంటుందని తెలుస్తోంది. Realme 10 4G డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ని కలిగి ఉంది.

భారత్ లో Realme 10 4G ఫోన్ ధర రూ.17,000 నుంచి రూ.19,000 మధ్య ఉంటుందని సమాచారం. అన్ని ఆఫర్లు కలుపుకుని ఈ ఫోన్ రూ.15,000 ధరలో వచ్చే అవకాశం ఉంది. ఈ ధరల్లో మార్పు కూడా ఉండవచ్చు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post లీకైన Realme 10 4G ధర, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>