హైలైట్స్
- లాంచ్ కి ముందు బయటకు వచ్చిన Realme 10 4G ధర, స్పెసిఫికేషన్స్
- మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్, 50ఎంపి డ్యూయల్ కెమెరా సెటప్ తో రానున్న Realme 10 4G
- నవంబర్ నెలలో లాంచ్ కానున్న Realme 10 4G స్మార్ట్ ఫోన్
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు Realme త్వరలోనే Realme 10 సిరీస్ ని లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. లాంచ్ తేదీ ప్రకటించని కంపెనీ, లాంచ్ ఈవెంట్ మాత్రం నవంబర్ నెలలో ఉంటుందని వెల్లడించింది. రాబోవు 10 సిరీస్ ఫోన్లు పెర్ఫామెన్స్, డిస్ప్లే, డిజైన్ విభాగాల్లో అప్‌గ్రేడ్ అయి వస్తాయని ఇటీవలె కంపెనీ తెలిపింది. ఈ లైనప్ లో పలు మోడల్స్ ని లాంచ్ చేయబోతోంది రియల్మీ. అవి: Realme 10 4G మరియు 5G, Realme 10 Pro 5G, Realme 10 Pro+ 5G.
Realme 10 సిరీస్ డివైజెస్ గ్లోబల్ గా నవంబర్ 5 న లాంచ్ అవుతాయని రూమర్ల ద్వారా తెలుస్తోంది. భారతదేశంలో జరగబోవు లాంచ్ ఈవెంట్ నవంబర్ మధ్యలో ఉండే అవకాశం ఉంది. అధికార ప్రకటన కోసం ఎదురు చూస్తున్న తరుణంలో, Realme 10 4G యొక్క స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ బయటకు వచ్చాయి. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.
Realme 10 4G స్పెసిఫికేషన్స్ (లీక్డ్)
నవంబర్ లో లాంచ్ కానున్న Realme 10 బడ్జెట్ సిరీస్ లో Realme 10 4G మొదటి ఫోన్. లాంచ్ తేదీ ఇంకా ఖరారు కాలేదు కానీ ఈలోపు రూమర్లైతే వస్తూనే ఉన్నాయి. ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ లేటెస్ట్ లీక్స్ ద్వారా బయటకు వచ్చాయి. ఇకపోతే ఈ ఫోన్ రియల్మీ 10 ప్రో, రియల్మీ 10ప్రో+ 5జీ మోడల్స్ తో పాటు లాంచ్ కానుంది.
ప్రముఖ టిప్‌స్టర్ పారస్ గుగ్లాని ప్రకారం, Realme 10 4G స్మార్ట్ ఫోన్ 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 60 లేదా 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో రానున్నట్లు తెలుస్తోంది. అలాగే స్క్రాచెస్ పడకుండా ఉండేందుకు డిస్ప్లే పై పాండ గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుందట.
Realme 10 4G మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్ తో వస్తోంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో సెన్సర్ ఉండనున్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండనుంది. గుగ్లాని ఈ ఫోన్ యొక్క బ్యాటరీ వివరాలను కూడా వెలికితీశాడు. Realme 10 4G లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. కచ్చితమైన ర్యామ్, స్టోరేజీ వివరాలు ఇంకా తెలియలేదు. అయితే టిప్‌స్టర్ చెబుతున్న దాన్ని బట్టి, ఈ ఫోన్ LPDDR4x ర్యామ్, UFS 2.2 స్టోరేజీ తో వస్తోంది. అలాగే 5జిబి వరకు వర్చువల్ ర్యామ్ సపోర్ట్ కూడా ఉంటుందని తెలుస్తోంది.
గతంలో Realme 10 4G యొక్క డిజైన్ రెండర్స్ బయటకు వచ్చాయి. ఈ ఫోన్ ఫ్లాట్ ఫ్రేమ్ డిజైన్ కలిగి పింక్ మరియు గ్రే కలర్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంటుంది. డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కోసం రెండు భారీ సర్క్యులర్ కటౌట్స్ ఉంటాయి. బ్యాక్ ప్యానెల్ పై రాయబడిన టెక్ట్స్ ద్వారా 50ఎంపి మెయిన్ కెమెరా ఉంటుందని తెలుస్తోంది. Realme 10 4G డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ని కలిగి ఉంది.
భారత్ లో Realme 10 4G ఫోన్ ధర రూ.17,000 నుంచి రూ.19,000 మధ్య ఉంటుందని సమాచారం. అన్ని ఆఫర్లు కలుపుకుని ఈ ఫోన్ రూ.15,000 ధరలో వచ్చే అవకాశం ఉంది. ఈ ధరల్లో మార్పు కూడా ఉండవచ్చు.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.












