Realme 10 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 11 Nov 2022 09:27:23 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 MediaTek Dimensity 700 చిప్, 90Hz డిస్ప్లే తో లాంచ్ అయిన Realme 10 5G https://www.91mobiles.com/telugu/realme-10-5g-launched-china-price-specs/ Fri, 11 Nov 2022 09:27:23 +0000 https://www.91mobiles.com/telugu/?p=3388 హైలైట్స్ లాంచ్ అయిన Realme 10 5G స్మార్ట్ ఫోన్ Realme 9 5G స్మార్ట్ ఫోన్ కి సక్సెసర్ గా వస్తోన్న Realme 10 5G 90 హెర్ట్జ్ వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లే, 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్ ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్ Realme 10 5G చైనాలో లాంచ్ అయ్యింది. ఈ డివైజ్ స్పెసిఫికేషన్స్, ధరను మెల్లగా అనౌన్స్ చేసింది రియల్మీ కంపెనీ. ఇక […]

The post MediaTek Dimensity 700 చిప్, 90Hz డిస్ప్లే తో లాంచ్ అయిన Realme 10 5G first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • లాంచ్ అయిన Realme 10 5G స్మార్ట్ ఫోన్
  • Realme 9 5G స్మార్ట్ ఫోన్ కి సక్సెసర్ గా వస్తోన్న Realme 10 5G
  • 90 హెర్ట్జ్ వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లే, 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్ ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్

Realme 10 5G చైనాలో లాంచ్ అయ్యింది. ఈ డివైజ్ స్పెసిఫికేషన్స్, ధరను మెల్లగా అనౌన్స్ చేసింది రియల్మీ కంపెనీ. ఇక Realme 10 Pro సిరీస్ నవంబర్ 17 న చైనాలో లాంచ్ అవ్వబోతోంది. Realme 10 5G రియల్మీ చైనా అధికార వెబ్‌సైట్ లో కొనుగోలుకి సిద్ధంగా ఉంది. మరి Realme 10 5G యొక్క ధర, స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Realme 10 5G ధర, లభ్యత

Realme 10 5G స్మార్ట్ ఫోన్ 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర CNY 1299 (సుమారు రూ.15,000) గా నిర్ణయించారు. మరోవైపు 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ మోడల్ ధర CNY 1599 (సుమరాు రూ.18,000) గా ఉంది. చైనా లో ఈ డివైజ్ గోల్డ్, స్టోన్ క్రిస్టల్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది. ఇప్పటి వరకు రియల్మీ నుంచి ఈ ఫోన్ కి యొక్క గ్లోబల్ మరియు ఇండియా లాంచ్ కి సంబంధించిన ఎటువంటి ప్రకటన రాలేదు.

Realme 10 5G స్పెసిఫికేషన్స్

Realme 10 5G స్మార్ట్ ఫోన్ లో 6.6-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 20.06:9 యాస్పెక్ట్ రేషియో, 401 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 400 నిట్స్ బ్రైట్నెస్, 90.4% స్క్రీన్-టు-బాడీ రేషియో, వాటర్ డ్రాప్ నాచ్ ఉన్నాయి. Realme 10 5G లో 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగా పిక్సెల్ మ్యాక్రో లెన్స్, ఏఐ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

Realme 10 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 ఆక్టాకోర్ ప్రాసెసర్ వాడారు. ఇందులో 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జిబి/256జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఉన్నాయి. Realme 10 5G ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 3.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ డివైజ్ 164.4 మిల్లీ మీటర్ల పొడవు, 75.1 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.1 మిల్లీ మీటర్ల మందం, 191 గ్రాముల బరువు ఉంటుంది.

Realme 10 5G లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ద్వారా చార్జింగ్ పెట్టుకోవచ్చు. భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. ఇంకా ఈ ఫోన్ లో 3.5 ఎంఎం ఆడియో జాక్, డ్యూయల్ సిమ్ సపోర్ట్, 5జీ, వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్ 5.2 వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. భారత మార్కెట్ లో రియల్మీ 10 5జీ యొక్క లాంచ్ తేదీ త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post MediaTek Dimensity 700 చిప్, 90Hz డిస్ప్లే తో లాంచ్ అయిన Realme 10 5G first appeared on 91Mobiles Telugu.

]]>
చైనా టెలీకామ్ ద్వారా రివీల్ అయిన Realme 10 5G, Realme 10 Pro 5G స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/realme-10-5g-10-pro-5g-specs-revealed-via-china-telecom/ Thu, 10 Nov 2022 05:48:08 +0000 https://www.91mobiles.com/telugu/?p=3344 హైలైట్స్ నవంబర్ 17 న చైనాలో లాంచ్ అవుతోన్న Realme 10 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ లైనప్ లో భాగంగా లాంచ్ కానున్న Realme 10, Realme 10 Pro, Realme 10 Pro+ 5G లాంచ్ కి ముందు చైనా టెలీకామ్ వెబ్‌సైట్ లో కనిపించిన Realme 10 5G, Realme 10 Pro 5G స్పెసిఫికేషన్స్ చైనా టెలీకామ్ వెబ్ సైట్ ద్వారా Realme 10 5G, Realme 10 Pro 5G స్పెసిఫికేషన్స్ […]

The post చైనా టెలీకామ్ ద్వారా రివీల్ అయిన Realme 10 5G, Realme 10 Pro 5G స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • నవంబర్ 17 న చైనాలో లాంచ్ అవుతోన్న Realme 10 సిరీస్ స్మార్ట్ ఫోన్స్
  • లైనప్ లో భాగంగా లాంచ్ కానున్న Realme 10, Realme 10 Pro, Realme 10 Pro+ 5G
  • లాంచ్ కి ముందు చైనా టెలీకామ్ వెబ్‌సైట్ లో కనిపించిన Realme 10 5G, Realme 10 Pro 5G స్పెసిఫికేషన్స్

చైనా టెలీకామ్ వెబ్ సైట్ ద్వారా Realme 10 5G, Realme 10 Pro 5G స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. నవంబర్ 17 న రియల్మీ 10 సిరీస్ చైనాలో లాంచ్ అవుతోంది. బుధవారం నాడు Realme 10 4G డివైజ్ గ్లోబల్ గా లాంచ్ అయ్యింది. ఇప్పుడు రియల్మీ చైనాలో Realme 10 సిరీస్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Realme 10 లైనప్ లో Realme 10 5G, Realme 10 Pro 5G, Realme 10 Pro+ 5G మోడల్స్ ఉంటాయి. ఇప్పుడు లాంచ్ కి ముందు Realme 10 5G, Realme 10 Pro 5G డివైజెస్ యొక్క స్పెసిఫికేషన్స్ చైనా టెలీకామ్ ద్వారా బయటకు వచ్చాయి. మరి ఆ వివరాలేంటో చూద్దాం పదండి.

Realme 10 5G స్పెసిఫికేషన్స్, డిజైన్

 

పైన ఇమేజెస్ లో కనిపిస్తోన్న విధంగా Realme 10 5G లుక్ ఉంటుంది. ఈ డివైజ్ ఎంట్రీ-లెవెల్ 5జీ స్మార్ట్ ఫోన్ గా మార్కెట్ లోకి వస్తోంది. ఇది వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లే కలిగి ఉంది. పవర్ బటన్ లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ నిక్షిప్తమై ఉంటుంది. డివైజ్ కి కుడివైపున వాల్యూమ్ రాకర్ ఉంది.

Realme 10 5G కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ డివైజ్ లో 50ఎంపి + 2ఎంపి + 2ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 8ఎంపి సెల్ఫీ కెమెరా ఉంటాయి. Realme 10 5G 6.58-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్ తో రానుందని అంచనా. Realme 10 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్ ఉంటుంది. ఈ ఫోన్ 8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ తో వస్తోంది.

Realme 10 5G లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. చైనా టెలీకామ్ లిస్టింగ్ ద్వారా Realme 10 5G ధర CNY 1,599 (సుమారు రూ.18,000) అని రివీల్ అయ్యింది.

Realme 10 Pro 5G స్పెసిఫికేషన్స్

 

Realme 10 Pro 5G స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే, ఇది 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే తో రానుంది. ఇందులో స్నాప్ డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్ వాడారు. ఈ డివైజ్ 8జిబి/12జిబి ర్యామ్ మరియు 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభ్యమవుతుంది. Realme 10 Pro 5G స్మార్ట్ ఫోన్ 163.69 మిల్లీ మీటర్లు పొడవు, 74.18 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.12 మిల్లీ మీటర్ల మందం ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది. రియల్మీ యూఐ 3.0 కస్టమ్ స్కిన్ ని ఇందులో వాడే అవకాశం ఉంది.

Realme 10 Pro 5G లో 64ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, 2 ఎంపి మ్యాక్రో లెన్స్ తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. 64ఎంపి మెయిన్ కెమెరా పిక్సెల్ బైనింగ్ తర్వాత 16ఎంపి రెజుల్యూషన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అందుకే స్పెసిఫికేషన్స్ లిస్ట్ లో రియర్ కెమెరా 16ఎంపి గా చెప్పబడింది. అయితే అది పిక్సెల్ బైనింగ్ రెజుల్యూషన్ అని గమనించాలి. ఇకపోతే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు. పవర్ బ్యాకప్ కోసం ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post చైనా టెలీకామ్ ద్వారా రివీల్ అయిన Realme 10 5G, Realme 10 Pro 5G స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>