హైలైట్స్
- లాంచ్ అయిన Realme 10 5G స్మార్ట్ ఫోన్
- Realme 9 5G స్మార్ట్ ఫోన్ కి సక్సెసర్ గా వస్తోన్న Realme 10 5G
- 90 హెర్ట్జ్ వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లే, 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్ ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్
Realme 10 5G చైనాలో లాంచ్ అయ్యింది. ఈ డివైజ్ స్పెసిఫికేషన్స్, ధరను మెల్లగా అనౌన్స్ చేసింది రియల్మీ కంపెనీ. ఇక Realme 10 Pro సిరీస్ నవంబర్ 17 న చైనాలో లాంచ్ అవ్వబోతోంది. Realme 10 5G రియల్మీ చైనా అధికార వెబ్‌సైట్ లో కొనుగోలుకి సిద్ధంగా ఉంది. మరి Realme 10 5G యొక్క ధర, స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
Realme 10 5G ధర, లభ్యత
Realme 10 5G స్మార్ట్ ఫోన్ 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర CNY 1299 (సుమారు రూ.15,000) గా నిర్ణయించారు. మరోవైపు 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ మోడల్ ధర CNY 1599 (సుమరాు రూ.18,000) గా ఉంది. చైనా లో ఈ డివైజ్ గోల్డ్, స్టోన్ క్రిస్టల్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది. ఇప్పటి వరకు రియల్మీ నుంచి ఈ ఫోన్ కి యొక్క గ్లోబల్ మరియు ఇండియా లాంచ్ కి సంబంధించిన ఎటువంటి ప్రకటన రాలేదు.
Realme 10 5G స్పెసిఫికేషన్స్
Realme 10 5G స్మార్ట్ ఫోన్ లో 6.6-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 20.06:9 యాస్పెక్ట్ రేషియో, 401 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 400 నిట్స్ బ్రైట్నెస్, 90.4% స్క్రీన్-టు-బాడీ రేషియో, వాటర్ డ్రాప్ నాచ్ ఉన్నాయి. Realme 10 5G లో 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగా పిక్సెల్ మ్యాక్రో లెన్స్, ఏఐ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
Realme 10 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 ఆక్టాకోర్ ప్రాసెసర్ వాడారు. ఇందులో 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జిబి/256జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఉన్నాయి. Realme 10 5G ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 3.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ డివైజ్ 164.4 మిల్లీ మీటర్ల పొడవు, 75.1 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.1 మిల్లీ మీటర్ల మందం, 191 గ్రాముల బరువు ఉంటుంది.
Realme 10 5G లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ద్వారా చార్జింగ్ పెట్టుకోవచ్చు. భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. ఇంకా ఈ ఫోన్ లో 3.5 ఎంఎం ఆడియో జాక్, డ్యూయల్ సిమ్ సపోర్ట్, 5జీ, వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్ 5.2 వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. భారత మార్కెట్ లో రియల్మీ 10 5జీ యొక్క లాంచ్ తేదీ త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.












